కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

అపవాది ఎక్కడ నుండి వచ్చాడు?

అపవాదిని దేవుడు సృష్టించలేదు. బదులుగా, దేవుడు చేసిన ఒక దూత తర్వాత్తర్వాత అపవాదిగా లేదా సాతానుగా మారాడు. అపవాది ఒకప్పుడు యథార్థంగా ఉండేవాడని బైబిలు చెబుతోంది. అంటే, మొదట్లో అపవాది నీతిమంతుడైన ఒక దేవదూత అన్నమాట.—యెహెజ్కేలు 28:14, 15 చదవండి.

దేవదూత అపవాదిగా ఎలా మారగలడు?

అపవాదిగా మారిన దూత, దేవునికి వ్యతిరేకంగా తిరిగి మొదటి మానవ దంపతులను కూడా తనతో కలుపుకున్నాడు. అలా అతడు తనకుతానే సాతానుగా మారాడు. సాతాను అంటే “ఎదిరించువాడు” అని అర్థం.—ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9 చదవండి.

మనుష్యులకూ, ఇతర దేవదూతలకూ ఉన్నట్లే అపవాదిగా మారిన దూతకు కూడా తప్పొప్పులు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండేది. కానీ అతడు ఆరాధనను కోరుకున్నాడు. దేవుణ్ణి ప్రీతిపర్చాలనే కోరిక కన్నా తనకు మహిమ తెచ్చుకోవాలనే కోరికే అతడిలో బలంగా ఉండేది.—మత్తయి 4:8, 9; యాకోబు 1:13, 14 చదవండి.

అయితే, అపవాది ఇప్పటివరకు మనుష్యులను ఎలా ప్రభావితం చేస్తున్నాడు? మీరు అతడికి భయపడాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లో దొరుకుతాయి. (w13-E 02/01)