పత్రిక ముఖ్యాంశం
ప్రభుత్వంలో అవినీతి విషం
ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, శక్తిని సొంత లాభం కోసం దుర్వినియోగం చేయడమే ప్రభుత్వ అవినీతి. అయితే ఈ అవినీతి కొత్త విషయమేమీ కాదు. లంచం తీసుకుని తీర్పు చెప్పవద్దనే నియమం ఒక పురాతన గ్రంథంలో 3500 సంవత్సరాల క్రితమే ఉంది. అంటే అవినీతి, లంచగొండితనం అప్పటికే ఉన్నట్లు మనకు అర్థమౌతుంది. (నిర్గమకాండము 23:8) అవినీతి అంటే కేవలం లంచాలు తీసుకోవడమే కాదు. అవినీతిపరులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు వాళ్లకు చెందని వస్తువులు తీసుకుంటారు, అధికారం అడ్డం పెట్టుకుని వేరేవాళ్లతో పనులు చేయించుకుంటారు, అంతే కాకుండా ప్రజల డబ్బును కూడా దొంగిలిస్తారు. స్నేహితులకు, బంధువులకు సేవలు చేయించుకోవడానికి వాళ్ల స్థానాలను వాడుకుంటారు.
అవినీతి ఏ సంస్థలో అయినా ఉండే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వ సంస్థల్లో మాత్రం అన్ని చోట్లా ఉంది. రాజకీయ పార్టీలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, శాసన సభ, న్యాయశాఖల్లో అవినీతి విపరీతంగా ఉందని అన్ని దేశాల ప్రజలు అనుకుంటున్నారని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రాసిన 2013 గ్లోబల్ కరప్షన్ బారోమీటర్‌లోఉంది. ఈ సమస్య తీవ్రతను చూపించే కొన్ని రిపోర్టులు చూద్దాం.
-
ఆఫ్రికా: 2013లో దక్షిణ ఆఫ్రికాలోని 22,000 మంది ప్రభుత్వ అధికారులపై అవినీతికి సంబంధించిన నేరారోపణ జరిగింది.
-
దక్షిణ అమెరికా: 2012లో రాజకీయ మద్దతు సంపాదించుకోవడం కోసం ప్రజల డబ్బును వాడుకున్నారని బ్రెజిల్‌లో 25 మందిపై నేరం రుజువైంది. వాళ్లలో మాజీ దేశాధ్యక్షుని తర్వాత స్థానంలో అంటే, దేశంలోనే రెండవ హోదాలో ఉన్న అధికారి కూడా ఉన్నాడు.
-
ఆసియా: 1995లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ కూలిపోయి 502 మంది చనిపోయారు. కారణాలు పరిశీలించినప్పుడు, కాంట్రాక్టర్లు నగర అధికారులకు లంచం ఇచ్చి ఆ భవన నిర్మాణంలో తక్కువ రకం వస్తువులు వాడారు, భద్రతా నియమాలు కూడా పాటించలేదు అని తేలింది.
-
యూరప్: యూరప్ దేశాల్లో అవినీతి సమస్య “ఊహించలేనంతగా పెరిగిపోయింది” అని యూరోపియన్ హోమ్ శాఖ కమీషనర్ సిసీల్యా మాల్మస్ట్రోమ్ అంటుంది. “అవినీతిని వేర్లతో సహా తీసివేయాలన్న ఆలోచన ప్రభుత్వాల్లో కనిపించడం లేదు” అని కూడా చెప్పింది.
ప్రభుత్వాల్లో అవినీతి బాగా పాతుకుపోయింది. కాబట్టి, పెద్దపెద్ద మార్పులు జరిగితేనే గానీ ప్రభుత్వాల్లో అవినీతి తగ్గదని ప్రభుత్వ అవినీతి నిరోధక అంశ నిపుణురాలు, ప్రొఫెసర్ సూసన్ రోస్-ఆకర్‌మాన్ అంటుంది. ఇలా జరిగే అవకాశమే లేదని అనిపించినా ఎన్నో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. (w15-E 01/01)