కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తారు?

ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తారు?

“నేను విపరీతంగా జూదం ఆడేవాడిని. అందులో బాగా డబ్బు గెల్చుకోవాలని ప్రార్థించేవాడిని. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.”—సామ్యెల్‌, a కెన్యా.

“కొన్ని ప్రార్థనలను స్కూల్లో నేర్పించేవాళ్లు. వాటిని బట్టీ కొట్టి చెప్పేవాళ్లం.”—థేరేసా, ఫిలిప్పీన్స్‌.

“సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నా పాపాలు క్షమించమని, మంచి క్రైస్తవురాలిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను.”—మగ్దాలీన్‌, ఘానా.

సామ్యెల్‌, థేరేసా, మగ్దాలీన్‌, ఈ ముగ్గురూ చెప్పిన మాటలను చూస్తే ప్రజలు రకరకాల ఉద్దేశాలతో ప్రార్థనలు చేస్తారని అర్థమౌతుంది. కొంతమంది ఉద్దేశాలు మిగతా వాళ్లకన్నా గొప్పగా ఉంటాయి. కొంతమంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. ఇంకొందరు చేయాలి కదా అన్నట్లు చేస్తారు. ఏదేమైనా, స్కూల్‌ పరీక్షల్లో పాసవ్వాలని చేసినా, ఆటల్లో వాళ్లకిష్టమైన టీమ్‌ గెలవాలని చేసినా, కుటుంబంలో దేవుని నిర్దేశం కోసం చేసినా, వేరే ఏ కారణం వల్ల చేసినా కోట్లమందికి ప్రార్థించాలి అని మాత్రం తెలుసు. చెప్పాలంటే ఏ మతంతో సంబంధం లేని వాళ్లు కూడా ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటారని కొన్ని సర్వేలు చూపిస్తున్నాయి.

మీరు ప్రార్థన చేస్తారా? అలా అయితే దేని కోసం ప్రార్థన చేస్తారు? మీకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నా లేకపోయినా, మీరిలా అనుకోవచ్చు: ‘ప్రార్థన వల్ల ఉపయోగముందా? ఎవరైనా వింటున్నారా?’ ప్రార్థన “ఒక విధమైన వైద్య ప్రక్రియ ...” అని ఒక రచయిత తన అభిప్రాయం చెప్పాడు. కొన్ని వైద్య అధికార సంఘాలు కూడా ప్రార్థనను “ప్రత్యామ్నాయ వైద్యం  (alternative medicine)” అంటున్నాయి. అంటే ప్రార్థన చేసేవాళ్లు ఊరికే వ్యాయామం కోసమో లేదా వైద్య సంబంధమైన లాభం కోసమో చేస్తున్నారా?

కాదు. బైబిలు ప్రకారం ప్రార్థన కేవలం ఒక విధమైన వైద్యం కాదు. సరైన విషయాల కోసం సరైన విధంగా చేస్తే ప్రార్థనలను వినడానికి ఒకరు ఉన్నారు అని బైబిల్లో ఉంది. ఇది నిజమేనా? ఆధారాలు చూద్దాం. (w15-E 10/01)

a కొన్ని అసలు పేర్లు కావు.