కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకమంతా బాధలతో నిండిపోయి ఉంది. దేవుడే దీని వెనుక ఉన్నాడా?

బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఏం చెప్తుంది?

దేవుడు మన బాధలకు కారణమా?

మీరేమంటారు?

  • అవును

  • కాదు

  • చెప్పలేం

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) ఈ లోకంలో చూస్తున్న చెడుకు, బాధలకు దేవుడు కారణం కానేకాదు.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • “లోకాధికారి” అయిన సాతానే బాధలకు ముఖ్యమైన కారణం.—యోహాను 14:30.

  • ప్రజలు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల ఎక్కువగా కష్టాలు, బాధలు వస్తాయి.—యాకోబు 1:14, 15.

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?

కొందరి నమ్మకాలు

మనుషులంతా కలసి కృషి చేస్తే బాధలు తీసివేయవచ్చని కొంతమంది నమ్ముతారు.ఇంకొంతమంది లోక పరిస్థితులు వెంటనే మంచిగా మారతాయని అనుకోవట్లేదు. మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

దేవుడు బాధలను పూర్తిగా తీసివేస్తాడు. “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:3, 4.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • సాతాను వల్ల వచ్చిన బాధలను యేసు ద్వారా దేవుడు తీసివేయబోతున్నాడు.—1 యోహాను 3:8.

  • మంచివాళ్లు ఈ భూమి మీద శాంతితో నిత్యం జీవిస్తారు.—కీర్తన 37:9-11, 29.