కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌!!!

బెస్ట్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే

బెస్ట్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే

ఎవరికైనా ఇవ్వడానికి ఒక మంచి గిఫ్ట్‌ని వెదికి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ గిఫ్ట్‌కున్న విలువను నిర్ణయించేది దానిని పొందినవాళ్లే. అందులోనూ ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు.

ఉదాహరణకు ఒక టీనేజర్‌కు లేటెస్ట్‌ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ ఇస్తే బాగా నచ్చుతుంది. కానీ పెద్దవాళ్లకు సెంటిమెంట్‌తో కూడుకున్న గిఫ్ట్‌లు అంటే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఏదైన వస్తువును గిఫ్ట్‌గా ఇస్తే చాలా విలువ ఇస్తుండవచ్చు. కొన్ని సంస్కృతుల్లో చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా ఎక్కువగా నచ్చే గిఫ్ట్‌ డబ్బులే. ఎందుకంటే డబ్బులు ఇస్తే వాళ్లకు నచ్చినట్లు వాడుకుంటారు.

ఇష్టమైన వాళ్లకు సరిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి మనసున్న చాలామంది కొంచెం కష్టమే అయినా వాటి కోసం వెదుకుతూనే ఉంటారు. అలాంటి గిఫ్ట్‌ ఇవ్వడానికి, కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటే మంచి గిఫ్ట్‌ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గిఫ్ట్‌ పొందిన వాళ్లకు సంతృప్తి కలిగించే నాలుగు విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

గిఫ్ట్‌ తీసుకునే వాళ్ల కోరికలు. ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న బెల్ఫాస్ట్‌లో ఒకతనికి 10 లేదా 11 సంవత్సరాల వయసులో ఒక రేసింగ్‌ సైకిల్‌ గిఫ్ట్‌గా వచ్చింది. అది అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌ అని అతను అంటున్నాడు. ఎందుకు? “ఎందుకంటే నాకు అది నిజంగా కావాలి” అని అతను వివరిస్తున్నాడు. ఆ మాటలు చూస్తే గిఫ్ట్‌ను తీసుకునే వాళ్ల కోరికలను బట్టి వాళ్లు ఆ గిఫ్ట్‌కు విలువ ఇస్తారో లేదో తెలుస్తుంది. కాబట్టి మీరు ఎవరికైతే గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ల గురించి ఆలోచించండి. వాళ్లు దేనికి విలువిస్తారో తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైనా వేటికి విలువిస్తారో వాటిని బట్టే వాళ్ల కోరికలు ఉంటాయి. ఉదాహరణకు తాతామామ్మలు, కుటుంబంతో కలిసి ఉండడానికి ఎక్కువ విలువ ఇస్తారు. వాళ్ల పిల్లల్ని, మనవళ్లు మనవరాళ్లని ఎక్కువగా కలుస్తూ ఉండడం వాళ్లకు ఇష్టం. కాబట్టి వాళ్లతో కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్తే, వాళ్లకు అంతకన్నా మంచి గిఫ్ట్‌ ఇంకేమి ఉండదు.

ఒకరి కోరికలు తెలుసుకోవాలంటే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. బైబిలు ఇలా ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తుంది: “వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు.” (యాకోబు 1:19) మీరు ప్రతీరోజూ మీ ఫ్రెండ్స్‌తో చుట్టాలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటల్లో ఎవరికి ఏమి ఇష్టమో ఏమీ ఇష్టం లేదో కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. వాటినిబట్టి మీరు వాళ్లకు బాగా నచ్చే గిఫ్ట్‌ని తెచ్చి ఇవ్వగలుగుతారు.

తీసుకునేవాళ్ల అవసరాలు. గిఫ్ట్‌ చిన్నదే అయినా దాన్ని తీసుకునే వాళ్ల అవసరాన్ని అది తీర్చినప్పుడు వాళ్లు దానికి ఎంతో విలువని ఇస్తారు. కానీ వేరేవాళ్లకు ఏమి అవసరమో మీరు ఎలా తెలుసుకోవచ్చు?

ఎవరికి ఏమి అవసరమో లేదా వాళ్లకు ఏమి ఇష్టమో తెలుసుకోవడానికి సులువైన మార్గం వాళ్లను అడిగేయడమే అని చాలామందికి అనిపిస్తుంది. కానీ ఇది గిఫ్ట్‌లు ఇచ్చే చాలామందికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని తీసేస్తుంది. ఎందుకంటే అడగకుండానే ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినదాన్ని ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని మీరు చూడలేరు. కొంతమంది వాళ్ల ఇష్టాయిష్టాల గురించి ఫ్రీగా మాట్లాడినా, వాళ్ల అవసరాల గురించి మాత్రం ఎవరికీ చెప్పకపోవచ్చు.

కాబట్టి బాగా గమనించి వాళ్ల పరిస్థితులను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి. అతను లేదా ఆమె పెద్దవాళ్లా, చిన్నవాళ్లా, పెళ్లి అయిందా కాలేదా, విడాకులు తీసుకున్నారా, భర్త లేదా భార్య చనిపోయినవాళ్లా, ఉద్యోగం చేస్తున్నవాళ్లా, లేదా రిటైర్‌ అయినవాళ్లా. వాళ్లకున్న అవసరాలను తీర్చే గిఫ్ట్‌ ఏంటో ఆలోచించండి.

మీరు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్న వాళ్ల అవసరాల విషయంలో అవగాహన చూపించాలంటే, వాళ్లలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లను అడిగి తెలుసుకోవడం మంచిది. అందరికీ తెలియని కొన్ని ప్రత్యేక అవసరాల గురించి వాళ్లు మీకు చెప్పగలుగుతారు. వాళ్లు చెప్పిన విషయాలను బట్టి, మీరు ఇప్పుడు ఇతరులు ఆలోచించలేని అవసరాల గురించి ఆలోచించి తగిన గిఫ్ట్‌ని ఇవ్వగలుగుతారు.

సరైన సమయం. బైబిలు ఇలా చెప్తుంది: “సమయోచితమైన మాట యెంత మనోహరము!” (సామెతలు 15:23) మనం సమయానికి చెప్పే మాటలు చాలా ప్రభావం చూపించగలవు అని ఈ వచనం చూపిస్తుంది. మనం చేసే పనులు విషయంలో కూడా అంతే. సరైన సమయంలో చెప్పిన మాటలు వినేవాళ్లకు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, సరైన సమయంలో లేదా సరైన సందర్భంలో ఇచ్చిన గిఫ్ట్‌ కూడా తీసుకునేవాళ్లకు అంతే సంతోషాన్ని తీసుకురాగలదు.

ఒక స్నేహితుడికి పెళ్లి కాబోతుంది. ఒక అబ్బాయి స్కూల్లో చదువు పూర్తి చేసుకోబోతున్నాడు. పెళ్లైన ఒక జంటకి పిల్లలు పుట్టబోతున్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా గిఫ్ట్స్‌ ఇస్తారు. రాబోయే సంవత్సరంలో వచ్చే ఇలాంటి ప్రత్యేక సందర్భాల గురించి చాలామంది ముందే లిస్టు తయారు చేసుకుని పెట్టుకుంటారు. అలా వాళ్లు ఒక మంచి గిఫ్ట్‌ ఇవ్వడానికి ముందే ప్లాన్‌ చేసుకుంటారు. a

నిజమే, మనం గిఫ్ట్స్‌ ఇవ్వడానికి ఇలాంటి సందర్భాలనే ఉపయోగించుకోవాలని లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనం ఎప్పుడైనా రుచి చూడవచ్చు. కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు ఒకతను ఏ సందర్భం లేకుండా ఒక ఆమెకు గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటే, ఆమెతో పరిచయం పెంచుకోవాలనే ఇష్టంతోనే ఇస్తున్నాడని ఆమె అనుకోవచ్చు. కానీ నిజంగా అలాంటి ఉద్దేశాలు లేకపోతే, మీరిచ్చే గిఫ్ట్‌ అపార్థాలకు, సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఈ విషయం మరో ముఖ్యమైన విషయాన్ని బయటకు తెస్తుంది. అదే ఇచ్చేవాళ్ల ఉద్దేశాలు.

ఇచ్చేవాళ్ల ఉద్దేశాలు. ముందు ఉదాహరణ చూపిస్తున్నట్లు గిఫ్ట్‌ తీసుకునేవాళ్లు, ఇచ్చేవాళ్ల ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందా అని ఆలోచించడం మంచిది. అంతేకాకుండా, ఇచ్చేవాళ్లు కూడా గిఫ్ట్‌ ఎందుకు ఇస్తున్నారో వాళ్ల సొంత ఉద్దేశాలను పరిశీలించుకోవడం మంచిది. ఎక్కువమంది వాళ్లు గిఫ్ట్‌ ఇచ్చేటప్పుడు మంచి ఉద్దేశాలతోనే ఇస్తున్నారని అనుకుంటారు. కానీ చాలామంది సంవత్సరంలో వచ్చే కొన్ని సందర్భాల్లో ఇవ్వక తప్పదు అన్నట్లు గిఫ్ట్‌లు ఇస్తారు. ఇంకొంతమంది గిఫ్ట్‌లు ఇవ్వడం వల్ల వాళ్లను ప్రత్యేకంగా చూస్తారనో లేదా వాళ్లకు తిరిగి ఏదైనా ఇస్తారనో ఆశించి గిఫ్ట్‌లు ఇస్తారు.

మీరు మంచి ఉద్దేశాలతో గిఫ్ట్‌ ఇవ్వాలంటే మీరేమి చేయవచ్చు? బైబిలు ఇలా చెప్తుంది: “మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి.” (1 కొరింథీయులు 16:14) మీరు నిజమైన ప్రేమతో, అవతలి వాళ్ల మీదున్న శ్రద్ధతో ఇస్తున్నప్పుడు, సంతోషంగా మీ గిఫ్ట్‌లను తీసుకునే అవకాశం ఉంది. అలా నిజంగా నిస్వార్థంగా ఇవ్వడం వల్ల వచ్చే గొప్ప ఆనందాన్ని మీరు కూడా రుచిచూస్తారు. మీరు హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు మీ పరలోక తండ్రిని కూడా సంతోషించేలా చేస్తారు. యూదాలో ఉన్న తోటి క్రైస్తవులకు అవసరమైన సహాయాన్ని సంతోషంగా, ఉదారంగా చేసినందుకు కొరింథులో ఉన్న క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడు. “సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని పౌలు వాళ్లతో అన్నాడు.—2 కొరింథీయులు 9:7.

ఇప్పటివరకు మనం చూసిన విషయాల మీద శ్రద్ధ పెట్టినప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్‌ల ద్వారా ఆ గిఫ్ట్స్‌ పొందినవాళ్లకు చాలా సంతోషాన్ని తీసుకురావచ్చు. ఈ విషయాలు, ఇంకా ఎన్నో విషయాలు దేవుడు మనుషుల కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప గిఫ్ట్‌లో కనిపిస్తాయి. ఆ అద్భుతమైన గిఫ్ట్‌ గురించి మీరు తర్వాత ఆర్టికల్‌లో చదివి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము.

a చాలామంది భర్త్‌డేలకు లేదా పండుగలకు గిఫ్ట్‌లు ఇస్తారు. కానీ ఇలాంటి వాటిలో బైబిలు నేర్పించే వాటికి విరుద్ధమైన ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పత్రికలో ఉన్న “మా పాఠకుల ప్రశ్న—క్రిస్మస్‌ క్రైస్తవుల పండుగా?” అనే ఆర్టికల్‌ చూడండి.