కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన కాలంలో ఐక్యారాధన—దాని భావమేమిటి?

మన కాలంలో ఐక్యారాధన—దాని భావమేమిటి?

అధ్యాయం ఒకటి

మన కాలంలో ఐక్యారాధన​—⁠దాని భావమేమిటి?

1, 2. (ఎ) మన కాలంలో ఎలాంటి ఉత్తేజకరమైన ఉద్యమం ముందుకు సాగుతోంది? (బి) యథార్థ హృదయులకు ఎలాంటి అద్భుతమైన నిరీక్షణ ఉంది?

 భూవ్యాప్తంగా ఐక్యారాధనవైపు ఉత్తేజకరమైన ఉద్యమం ముందుకు సాగుతోంది. అన్ని దేశాలకు, తెగలకు, భాషలకు చెందిన లక్షలాది మందిని అది ఐక్యపరుస్తోంది. ప్రతి సంవత్సరం అంతకంతకు ఎక్కువమంది సమకూర్చబడుతున్నారు. వీరు బైబిల్లో యెహోవాకు “సాక్షులు”గా గుర్తించబడి, “గొప్పసమూహము” అని పిలువబడుతున్నారు. వారు దేవునికి ‘రాత్రింబగళ్లు సేవచేస్తున్నారు.’ (యెషయా 43:​10-12; ప్రకటన 7:​9-15) వారెందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే యెహోవాయే అద్వితీయ సత్య దేవుడని వారు తెలుసుకున్నారు. ఆయన నీతియుక్త ప్రమాణాల ప్రకారం తమ జీవితాలను మలచుకోవడానికి అది వారిని ప్రేరేపిస్తుంది. అంతేకాక, మనం ప్రస్తుత దుష్ట విధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నామని, దేవుడు త్వరలోనే దానిని నాశనం చేస్తాడని, దాని స్థానంలో పరదైసు పరిస్థితులతో నూతనలోకం స్థాపిస్తాడని వారు తెలుసుకున్నారు.​—⁠2 తిమోతి 3:​1-5, 13; 2 పేతురు 3:​10-13.

2 దేవుని వాక్యం ఇలా వాగ్దానం చేస్తోంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:​10, 11) “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) ‘దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’​—⁠ప్రకటన 21:​4.

3. నిజమైన ఐక్యారాధన ఎలా సాధ్యమవుతోంది?

3 ఇప్పుడు సత్యారాధనలో ఐక్యపరచబడుతున్నవారు ఆ నూతనలోకంలో తొలి నివాసులవుతారు. వారు దేవుని చిత్తమేమిటో తెలుసుకొని దానిని తమ శాయశక్తులా నెరవేరుస్తున్నారు. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17: 3) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:​17.

దాని నిజమైన భావమేమిటి?

4. (ఎ) మన కాలంలో అనేకమంది ఇలా ఐక్యారాధనకు సమకూర్చబడడంలోని నిజమైన భావమేమిటి? (బి) ఈ సమకూర్పును బైబిలు ఎలా వర్ణిస్తోంది?

4 మన కాలంలో అనేకమంది ఇలా ఐక్యారాధనకు సమకూర్చబడడంలోని నిజమైన భావమేమిటి? మనం ఈ దుష్ట లోకాంతానికి చాలా సమీపంలో ఉన్నామని, ఆ వెంటనే దేవుని నూతనలోకం ఆరంభమవుతుందని చెప్పడానికి అది స్పష్టమైన రుజువునిస్తోంది. ఈ మహోజ్వల సమకూర్పు గురించి ముందే తెలియజేసిన బైబిలు ప్రవచనాల నెరవేర్పుకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాము. ఆ ప్రవచనాల్లో ఒకటి ఇలా చెబుతోంది: “అంత్యదినములలో [ఈ అంత్యదినాల్లో] యెహోవా మందిరపర్వతము [ఉన్నతపరచబడిన ఆయన సత్యారాధన] పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా [ఏ ఇతర ఆరాధనకన్నా ఎత్తుగా] ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి. . .యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.”​—⁠మీకా 4:​1, 2; కీర్తన 37:​34.

5, 6. (ఎ) నేడు మీకా 4:​1, 2 వచనాలు ఎలా నెరవేరుతున్నాయి? (బి) మనమేమని ప్రశ్నించుకోవాలి?

5 ప్రవచింపబడినట్లుగా, నేడు అన్ని దేశాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ఆరాధన కోసం యెహోవా ఆధ్యాత్మిక గృహానికి తరలివస్తున్నారు. యెహోవా దేవుని ప్రేమపూర్వక సంకల్పం గురించి, ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గురించి నేర్చుకుంటుండగా వారి హృదయాలు ఎంతగానో ఉప్పొంగుతున్నాయి. దేవుడు తమ నుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకోవడానికి వారు నమ్రతతో ప్రయత్నిస్తున్నారు. వారి ప్రార్థన కీర్తనకర్త ప్రార్థనలాగే ఉంది, ఆయనిలా ప్రార్థించాడు: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”​—⁠కీర్తన 143:​10.

6 యెహోవా నేడు ఐక్యారాధనకు సమకూరుస్తున్న ప్రజల గొప్పసమూహములో మీరు కూడా ఉన్నారా? దేవుని వాక్యం నుండి మీరు పొందిన ఉపదేశానికి మీరు చూపే ప్రతిస్పందన, యెహోవాయే దానికి మూలమని మీరు నిజంగా గ్రహించినట్లు చూపిస్తోందా? మీరు ఎంతమేరకు “ఆయన త్రోవలలో” నడుస్తారు?

అదెలా సాధ్యమవుతోంది?

7. (ఎ) చివరికి ఐక్యారాధన ఎంతమేరకు సాధించబడుతుంది? (బి) ఇప్పుడే యెహోవా ఆరాధకులుగా మారడం ఎందుకు అత్యవసరం, అలా మారడానికి ఇతరులకు మనమెలా సహాయం చేయగలం?

7 బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరూ సత్యారాధనలో ఐక్యం కావాలన్నది యెహోవా సంకల్పం. జీవంతోవున్న వారందరూ అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించే ఆ దినం కోసం మనమెంతగా అపేక్షిస్తున్నామో కదా! (కీర్తన 103:​19-22) అయితే అది జరగడానికి ముందు యెహోవా తన నీతియుక్త చిత్తం చేయడానికి నిరాకరించే వారందరిని నాశనం చేయాలి. తమ మార్గాన్ని మార్చుకునే అవకాశం అన్ని ప్రాంతాల ప్రజలకు లభించేలా, కనికరంతో ఆయన తాను చేయబోయే దానిగురించి ముందుగానే తెలియజేస్తున్నాడు. (యెషయా 55:​6-7) అందుకే మన కాలంలో “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” ఈ అత్యవసర విజ్ఞాపన చేయబడుతోంది: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రకటన 14:​6, 7) మీరు ఆ ఆహ్వానం స్వీకరించారా? అలాగైతే, ఇతరులు కూడా సత్య దేవుని గురించి తెలుసుకొని, ఆయనను ఆరాధించేలా వారిని ఆహ్వానించే ఆధిక్యత మీకుంది.

8. బైబిల్లోని మూలపాఠాలు నేర్చుకున్న తర్వాత, ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధించడానికి మనం మనఃపూర్వకంగా కృషి చేయాలి?

8 యెహోవాను నమ్ముతున్నామని చెప్పుకుంటూ నిర్విరామంగా తమ స్వప్రయోజనాలనే వెంబడించే ప్రజలచేత ఆరాధించబడాలన్నది యెహోవా సంకల్పం కాదు. ప్రజలు తన “చిత్తమును పూర్ణముగా గ్రహించి” దానిని తమ జీవితాల్లో ప్రతిబింబించాలని దేవుడు కోరుతున్నాడు. (కొలొస్సయులు 1:​9, 10) అందుకే బైబిల్లోని మూలపాఠాలు నేర్చుకున్న కృతజ్ఞతగల ప్రజలు క్రైస్తవ పరిణతికి ఎదగాలని కోరుకుంటారు. యెహోవాను మరింత సన్నిహితంగా తెలుసుకోవాలని, ఆయన వాక్యాన్ని మరింత విశదంగా లోతుగా అర్థం చేసుకోవాలని, దానిని తమ జీవితాల్లో మరింత సంపూర్ణంగా అన్వయించుకోవాలని వారు కోరుకుంటారు. వారు మన పరలోక తండ్రి లక్షణాలను ప్రతిబింబించడానికి, విషయాలను ఆయన దృష్టించినట్లే దృష్టించడానికి ప్రయత్నిస్తారు. మన కాలంలో ఆయన ఈ భూమిపై జరిపిస్తున్న ప్రాణరక్షక పనిలో భాగం వహించేందుకు అవకాశాలు వెదికేలా అది వారిని పురికొల్పుతుంది. మీ కోరిక కూడా అదేనా?​—⁠మార్కు 13:​10; హెబ్రీయులు 5:12-6: 3.

9. ఇప్పుడు ఏయే విధాలుగా నిజమైన ఐక్యత సాధ్యమవుతుంది?

9 యెహోవా సేవచేసేవారు ఐక్యతగల ప్రజలుగా ఉండాలని బైబిలు చూపిస్తోంది. (ఎఫెసీయులు 4:​1-3) ఇప్పుడు మనం విభాగించబడిన లోకంలో జీవిస్తున్నా, మన అపరిపూర్ణతలతో ఇంకా పోరాడుతున్నా మనలో ఆ ఐక్యత ఉండాలి. తన శిష్యులందరు ఒక్కటిగా ఉంటూ నిజమైన ఐక్యత అనుభవించాలని యేసు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. దాని భావమేమై ఉంటుంది? మొదటిగా, వారు యెహోవాతో, ఆయన కుమారునితో మంచి సంబంధం కలిగివుంటారు. రెండవదిగా, వారు పరస్పరం ఐక్యంగా ఉంటారు. (యోహాను 17:​20-21) అలా ఉండడానికి, యెహోవా తన ప్రజలకు ఉపదేశించే సంస్థగా క్రైస్తవ సంఘం పనిచేస్తుంది.

ఐక్యతకు ఏ అంశాలు తోడ్పడతాయి?

10. (ఎ) మనపై ప్రభావం చూపే ప్రశ్నలకు తగిన సమాధానాల కోసం మనం బైబిలును వ్యక్తిగతంగా ఉపయోగించినప్పుడు మనమేమి వృద్ధిచేసుకుంటాం? (బి) పేరాలో సూచించబడిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం ద్వారా, క్రైస్తవ ఐక్యతకు దోహదపడే అంశాలను విశ్లేషించండి.

10 ఐక్యారాధనకు తోడ్పడే ఏడు కీలకాంశాలు ఈ క్రింద సూచించబడ్డాయి. వాటితోపాటు ఉన్న ప్రశ్నలకు మీరు సమాధానాలిస్తుండగా, అక్కడ సూచించబడిన ప్రతి అంశం యెహోవాతో, తోటి క్రైస్తవులతో మీకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. ఈ అంశాల గురించి తర్కించడం, ఎత్తి వ్రాయబడకుండా కేవలం సూచించబడిన లేఖనాలను తెరిచి చూడడం, మనందరికి అవసరమైన లక్షణాలను అంటే దైవిక జ్ఞానాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని, వివేచనను మీరు వృద్ధిచేసుకోవడానికి దోహదపడుతుంది. (సామెతలు 5:​1, 2; ఫిలిప్పీయులు 1:9-11) ఈ అంశాలను తడవకు ఒకటిచొప్పున పరిశీలించండి.

(1) మంచి చెడుల ప్రమాణం విధించే హక్కు యెహోవాదేనని మనం అంగీకరిస్తాం. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”​—⁠సామెతలు 3: 5, 6.

నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం యెహోవా ఉపదేశం కోసం, ఆయన మార్గనిర్దేశం కోసం ఎందుకు వెదకాలి? (కీర్తన 146:​3-5; యెషయా 48: 17)

(2) మన మార్గనిర్దేశనానికి దేవుని వాక్యం ఉంది. “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి . . . ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.”​—⁠1 థెస్సలొనీకయులు 2: 13.

మనకు సరైనదని “అనిపించినది” చేయడంలో ఎలాంటి ప్రమాదముంది? (సామెతలు 14:​12; యిర్మీయా 10:​23, 24; 17: 9)

ఒకానొక విషయంపై బైబిలు ఉపదేశమేమిటో తెలియనప్పుడు, మనమేమి చేయాలి? (సామెతలు 2:​3-5; 2 తిమోతి 3:​16, 17)

(3) మనమందరం ఒకే విధమైన ఆధ్యాత్మిక పోషణా కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతున్నాం. “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” (యెషయా 54:13) “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, [నాశనం చేసే] ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”​—⁠హెబ్రీయులు 10:​24, 25.

ఆధ్యాత్మిక పోషణ కోసం యెహోవా చేసిన ఏర్పాట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకునేవారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? (యెషయా 65:​13, 14)

(4) మన నాయకుడు యేసుక్రీస్తే కాని ఏ మానవుడూ కాదు. “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు.”​—⁠మత్తయి 23:​8-10.

మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళమని మనలో ఎవరైనా అనుకోవాలా? (రోమీయులు 3:​23, 24; 12: 3)

(5) మానవాళికి ఒకేఒక్క నిరీక్షణ దేవుని రాజ్య ప్రభుత్వమని మనం దృష్టిస్తాం. “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,​—⁠పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. . . . కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.”​—⁠మత్తయి 6:​9, 10, 33.

‘రాజ్యమును మొదట వెదకడం’ మన ఐక్యతను కాపాడుకోవడానికి ఎలా సహాయపడుతుంది? (మీకా 4: 3; 1 యోహాను 3:​10-12)

(6) పరిశుద్ధాత్మ, యెహోవా ఆరాధకుల్లో క్రైస్తవ ఐక్యతకు ఆవశక్యమైన లక్షణాలను పెంపొందింపజేస్తుంది. “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.”​—⁠గలతీయులు 5:​22.

దేవుని ఆత్మ మనలో దాని ఫలాన్ని పెంపొందింపజేసేందుకు మనమేమి చేయాలి? (అపొస్తలుల కార్యములు 5:​32)

దేవుని ఆత్మ కలిగివుండడం, తోటి క్రైస్తవులతో మన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (యోహాను 13:​35; 1 యోహాను 4:​8, 20, 21)

(7) వుని నిజమైన ఆరాధకులందరూ ఆయన రాజ్య సువార్తను ప్రకటించడంలో భాగం వహిస్తారు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”​—⁠మత్తయి 24:​14.

ఈ ప్రకటనా పనిలో మనం పూర్తిగా భాగం వహించాలని కోరుకొనేలా మనలను ఏది పురికొల్పాలి? (మత్తయి 22:​37-39; రోమీయులు 10:​10)

11. మనం మన జీవితాల్లో బైబిలు సత్యాలను అన్వయించుకున్నప్పుడు, దాని ప్రభావం ఎలా ఉంటుంది?

11 యెహోవాను ఐక్యంగా ఆరాధించడం మనల్ని ఆయనకు మరింత సన్నిహితం చేస్తుంది, తోటి విశ్వాసులతో నూతనోత్తేజం కలిగించే సహవాసం ఆనందించేలా చేస్తుంది. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అని కీర్తన 133:1 చెబుతోంది. స్వార్థం, లైంగిక అనైతికత, దౌర్జన్యం నిండిన లోకానికి దూరంగా, యెహోవాను నిజంగా ప్రేమించి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపేవారితో సమకూడడం ఎంత ఆహ్లాదకరమో కదా!

విభాగించే ప్రభావాలకు దూరంగా ఉండండి

12. మనం స్వేచ్ఛా వైఖరికి ఎందుకు దూరంగా ఉండాలి?

12 మన అమూల్యమైన భూవ్యాప్త ఐక్యతను నాశనం చేయకుండా ఉండేందుకు, మనం విభాగించే ప్రభావాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఒకటి, దేవుని నుండి ఆయన నియమాల నుండి వేరై స్వేచ్ఛగా ఉండాలనుకునే వైఖరి. దాని సూత్రధారి అపవాదియైన సాతానును బహిర్గతం చేయడం ద్వారా, మనం ఆ వైఖరికి దూరంగా ఉండేందుకు యెహోవా సహాయం చేస్తున్నాడు. (2 కొరింథీయులు 4: 4; ప్రకటన 12: 9) ఆదాము హవ్వలు దేవుడు చెప్పినదాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రభావితం చేసింది సాతానే. దాని ఫలితం వారికీ మనకూ విపత్తుగా పరిణమించింది. (ఆదికాండము 3:​1-6, 17-19) దేవుని నుండి, ఆయన నియమాల నుండి వేరై స్వేచ్ఛగా ఉండాలనుకునే వైఖరితో ఈ ప్రపంచమంతా నిండివుంది. కాబట్టి ఆ వైఖరి మనలో పెంపొందకుండా మనం నిరోధించాలి.

13. దేవుని నీతియుక్త నూతనలోకంలో జీవించడానికి మనం యథార్థంగా సిద్ధపడుతున్నామో లేదో ఏది చూపిస్తుంది?

13 ఉదాహరణకు, ప్రస్తుత దుష్ట విధానం స్థానంలో ‘నీతి నివసించే’ క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్థాపిస్తానని యెహోవా చేసిన అద్భుతమైన వాగ్దానం గురించి ఆలోచించండి. (2 పేతురు 3:​13) నీతి రాజ్యమేలే ఆ కాలంలో జీవించేందుకు సిద్ధపడడం ప్రారంభించేలా ఆ వాగ్దానం మనలను కదిలించదా? దానర్థం బైబిల్లోని ఈ స్పష్టమైన ఉపదేశాన్ని లక్ష్యపెట్టడమే: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.” (1 యోహాను 2:​15) కాబట్టి మనం ఈ లోక వైఖరిని అంటే దాని స్వేచ్ఛా ధోరణిని, మితిమీరిన స్వార్థాన్ని, అనైతికతను, దౌర్జన్యాన్ని త్యజించాలి. అపరిపూర్ణ శరీర కోరికలు విరుద్ధంగా ఉన్నా, మనం యెహోవా చెప్పేది విని ఆయనకు హృదయపూర్వకంగా విధేయత చూపించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు, మన ఆలోచనలు, కోరికలు దేవుని చిత్తం చేయడంవైపే మొగ్గుచూపుతున్నాయని మన జీవన విధానమంతా రుజువుచేస్తుంది.​—⁠కీర్తన 40: 8.

14. (ఎ) యెహోవా మార్గాల గురించి నేర్చుకోవడానికి, వాటిని మన జీవితాల్లో అనుసరించడానికి మనకున్న అవకాశాన్ని ఇప్పుడు చేజిక్కించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) పేరాలో సూచించబడిన లేఖనాలు మనకు వ్యక్తిగతంగా ఎలాంటి భావాన్ని కలిగివున్నాయి?

14 ఈ దుష్ట విధానాన్ని, దాని జీవన పద్ధతులను కోరుకునే వారందరిని నాశనం చేసేందుకు యెహోవా నియమిత సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన జాప్యం చేయడు. అర్థహృదయంతో దేవుని చిత్తం నేర్చుకుంటూ, దాన్ని చేస్తూ అదే సమయంలో ఇంకా ఈ లోకాన్ని అంటిపెట్టుకొని ఉండేందుకు ప్రయత్నిస్తున్న వారి సౌలభ్యం కోసం ఆయన ఆ సమయాన్ని వాయిదా వేయడు లేదా తన ప్రమాణాలను మార్చుకోడు. చర్య తీసుకోవలసిన సమయం ఇదే! (లూకా 13:​23, 24; 17:​32; 21:​34-36) ఆ కారణంగానే ఓ గొప్ప సమూహం ఆ అమూల్య అవకాశాన్ని చేజిక్కించుకొని, తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా యెహోవా అందిస్తున్న ఉపదేశాన్ని అత్యంతాసక్తితో వెదకుతూ నూతనలోకంవైపు ఆయన మార్గాల్లో ఐక్యంగా నడవడాన్ని చూడడం ఎంత మనోహరమో కదా! మనం యెహోవా గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే ఆయనను అంత ఎక్కువగా ప్రేమిస్తాం, అంత ఎక్కువగా ఆయనను సేవించాలని కోరుకుంటాం.

పునఃసమీక్షా చర్చ

• ఆరాధన విషయంలో యెహోవా సంకల్పమేమిటి?

• మనం బైబిల్లోని మూలపాఠాలు నేర్చుకున్న తర్వాత, మనమెలాంటి అభివృద్ధి సాధించడానికి మనఃపూర్వకంగా ప్రయత్నించాలి?

• యెహోవాను ఆరాధించే ఇతరులతో ఐక్యంగా ఉండడానికి మనం వ్యక్తిగతంగా ఏమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[4వ పేజీలోని చిత్రం]

“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు”