కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆరాధనలో ఐక్యత—మీయెడల దాని భావమేమైయుండాలి?

ఆరాధనలో ఐక్యత—మీయెడల దాని భావమేమైయుండాలి?

అధ్యాయం 1

ఆరాధనలో ఐక్యత—మీయెడల దాని భావమేమైయుండాలి?

1, 2. (ఎ) ఈనాడు దేని ఆధారంగా ఆరాధనలో నిజమైన ఐక్యత తీసుకురాబడుచుంది? (బి) జరుగుతున్న దానిని బైబిలెలా వర్ణిస్తుంది?

భూవ్యాప్తంగా ఆరాధనా ఐక్యతవైపు ఉత్కంఠభరితమైన ఉద్యమమొకటి ముందుకు సాగుచున్నది. అది సమస్త జాతుల, తెగల, భాషలవారిని ఒకటిగా సమకూర్చుతున్నది. వారి ఐక్యత నమ్మకాలతో రాజీపడటం ఫలితంగా రాలేదు. దేవునివాక్య విరుద్ధమైన విమర్శనాత్మక జీవన పద్ధతుల్ని వారు విసర్జించడం ద్వారా ఇది సాధింపబడటం లేదు. మరదెలా సాధింపబడుతోంది? వాస్తవమేమంటే, ప్రతివిధమైన జీవిత విధానాలనుండి వచ్చిన ప్రజలు యెహోవాయే అద్వితీయ సత్యదేవుడని తెలుసుకొని, ఇష్టపూర్వకంగా ఆయన నీతిమార్గాల కనుగుణ్యంగా తమ జీవితాల్ని మార్చుకుంటున్నారు.—ప్రకటన 15:3, 4 పోల్చండి.

2 ఇది దాదాపు 2,700 సంవత్సరాల పూర్వం ప్రవక్తయగు మీకా వ్రాసిన ఒక ప్రవచన నెరవేర్పైయుంది. “అంత్యదినములను” సూచిస్తూ ఆయనిలా వ్రాశాడు: “అన్యజనులనేకులు వచ్చి— . . . యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము.” (మీకా 4:1, 2) * అది నెరవేరడం మీరు చూస్తున్నారా?

3, 4. (ఎ) “అన్యజనులు” యెహోవావైపు తిరుగుట ఎలా నిజం? (బి) ఏ ప్రశ్నల్ని మనకుమనం ప్రశ్నించుకోవాలి?

3 “అన్యజనులు” అందరూ ఆరాధనకొరకు యెహోవా ఆత్మీయ మందిరానికి రావడం లేదు. కాని అట్టి అన్యజనుల్లోని ఆయావ్యక్తులు మాత్రమే అలా వస్తున్నారు. యెహోవా దేవుని ప్రేమగల సంకల్పాన్ని, ప్రీతికరమైన ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి వారు నేర్చుకొనుచుండగా, వారి హృదయాలు బహుగా స్పందిస్తున్నాయి. దేవుడు తమనుండి కోరుదానిని కనుగొనుటకు వారు నమ్రతతో ప్రయత్నిస్తున్నారు. వారి ప్రార్థన విశ్వాసియగు దావీదు చేసినట్లే ఉన్నది, ఆయనిలా ప్రార్థించాడు: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”—కీర్త. 143:10.

4 యెహోవా ఆరాధికులైన ఆ గొప్పగుంపులో మీరూ ఉన్నారా? మీరు పొందిన ఉపదేశానికి మీరిచ్చే ప్రత్యుత్తరం యెహోవాయే దాని మూలకర్త అని మీరు నిజంగా గుణగ్రహిస్తున్నట్లు రుజువుచేస్తోందా? మీరెంత మేరకు ‘ఆయన త్రోవల్లో నడుస్తున్నారు’?

అదెలా సాధించబడుతోంది

5. (ఎ) ఆరాధనలో ఐక్యత చివరకు ఎంతమేరకు సాధించబడుతుంది? (బి) ఇప్పుడే యెహోవా ఆరాధికునిగా తయారుకావడం ఎందుకు అత్యవసరం, దీనిని చేయడానికి ఇతరులకు మనమెలా సహాయపడగలం?

5 అబద్ధంచేత మోసగింపబడకుండా, వాస్తవమైన జీవితార్థాన్ని కనుగొనడానికి విఫలమైనందున తడవులాడకుండా, తెలివిగల సమస్త సృష్టిప్రాణులు ఆరాధనలో ఐక్యము కావాలనే యెహోవా సంకల్పము. జీవించు వారందరు అద్వితీయ సత్యదేవున్ని స్తుతించే దినంకొరకు మనమెంతగా ఆశిస్తున్నామో గదా! (కీర్త. 103:19-22) కాని దానికిముందు, తన ప్రేమపూర్వక రాజరికాన్ని త్రోసిపుచ్చుతూ, ఇతరుల జీవితాల్ని బలవంతంగా పాడుచేసే వారినుండి యెహోవా తన సృష్టిని శుద్ధిచేయాలి. కనికరముతో ఆయన తాను చేయబోయే కార్యాన్నిగూర్చి ముందే తెల్పుతున్నాడు. అలా ప్రతిచోటా ప్రజలు తమ విధానాన్ని మార్చుకొను అవకాశాన్ని కలిగివున్నారు. అలా మనకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అత్యవసర విన్నపం చేయబడుతోంది: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రక. 14:6, 7) ఆయాహ్వానాన్ని మీరంగీకరించారా? అట్లయిన, ఇతరులును అలాచేయడానికి వారికి సహాయపడులాగున యెహోవా సంస్థతో కలిసి పనిచేయుట ఇప్పుడు మీ ఆధిక్యతైయున్నది.

6. బైబిలు ప్రాథమిక బోధలు నేర్చుకున్న తర్వాత, చిత్తశుద్ధితో మనమింకా ఎట్టి అభివృద్ధిని సాధించడానికి కృషిచెయ్యాలి?

6 యెహోవాను నమ్ముదుమని, పరదైసులో జీవించ గోరుదుమని ఊరకనే చెబుతూ, అదే సమయంలో ఎడతెగక తమ స్వార్థ ప్రయోజనాల్ని వెంబడించే ప్రజలను తన సంస్థలోనికి తెచ్చుట దేవుని సంకల్పము కాదు. ప్రజలు “ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై” ఉండాలని, అది వారి జీవితాల్లో ప్రతిబింబించాలని ఆయన కోరుతున్నాడు. (కొలొ. 1:9, 10) మెప్పుగల వ్యక్తులు బైబిలు మూల బోధలను గూర్చి నేర్చుకున్న తర్వాత, తాము క్రైస్తవ పరిపక్వతకు ఎదగాలని కోరుకుంటారు. యెహోవాను సన్నిహితంగా తెల్సుకోవాలని, ఆయన వాక్యాన్ని విశదంగా, లోతుగా అర్థం చేసుకోవాలని, తమ జీవితాల్లో దాన్ని మరియెక్కువగా అన్వయించాలని వారు కోరుకుంటారు. ఆయన లక్షణాల్ని ప్రతిబింబిస్తూ, విషయాల్ని ఆయన దృష్టించినట్లే దృష్టిస్తూ, తమ పరలోకపు తండ్రివలెనే ఉండుటకు వారు ప్రయత్నిస్తారు. ఆయన మనకాలమందు జరిగిస్తున్న సేవలో సాధ్యమైనంత సంపూర్ణంగా భాగంవహించే మార్గాల్ని వెదకడానికి ఇది వారిని ప్రేరేపిస్తుంది. మీరదే చేస్తున్నారా?—ఎఫె. 5:1; హెబ్రీ. 5:12–6:3; 1 తిమో. 4:15.

7. ఏయే విధాలుగా ఇప్పుడు నిజమైన ఐక్యత సాధ్యమౌతుంది, అదెలా సాధించబడుతోంది?

7 యెహోవాను సేవించువారు ఐక్య ప్రజలుగా ఉండాలని బైబిలు చూపిస్తున్నది. (ఎఫె. 4:1-3) మనమీ విభాగింపబడిన లోకంలో జీవిస్తూ, మన అసంపూర్ణతలతో పోరాడుతున్ననూ ఈ ఐక్యత ఇప్పుడుండాలి. నిజమైన ఐక్యతకలిగి, తన శిష్యులందరూ ఏకమైయుండాలని యేసు మనఃపూర్వకంగా ప్రార్థించాడు. దీని భావమేమి? అంటే మొదట వారు యెహోవాతోను, ఆయన కుమారునితోను మంచి సంబంధం కలిగివుంటారు. ఆలాగే వారు ఒకరితోనొకరు ఐకమత్యం కలిగివుంటారు. (యోహా. 17:20, 21) యెహోవా “మందిరము”నందు పొందే ఉపదేశమును వారు అన్వయిస్తుండగా ఇప్పుడది సాధించబడుతోంది.

ఐక్యతకు ఏ వాస్తవిక విషయాలు దోహదపడతాయి?

8. (ఎ) మనపై ప్రభావం చూపగల ప్రశ్నలకు సమంజసమైన జవాబులకై వ్యక్తిగతంగా బైబిలు ఉపయోగించినప్పుడు మనమేమి వృద్ధిపరచుకుంటాము? (బి) పైన పేర్కొనబడిన ప్రశ్నలకు జవాబులిచ్చుట ద్వారా క్రైస్తవ ఐక్యతకు దోహదపడే వాస్తవిక విషయాల్ని విశ్లేషించండి.

8 ఈ ఐక్యతకు దోహదపడే కొన్ని కీలకమైన వాస్తవిక విషయాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి. వీటి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు మీరు సమాధానమిస్తుండగా, యెహోవాతోను తోటి క్రైస్తవులతోను మీ సంబంధాలపై వాటిలో ప్రతిదీ ఎలా ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. ఇవ్వబడిన లేఖనాల వెలుగులో ఈ అంశాలను తర్కించుట, మనలో ప్రతివారికి అవసరమైన లక్షణాలగు దైవాలోచనా సామర్థ్యమును, వివేచనను వృద్ధిచేసుకొనుటకు దోహదపడుతుంది. (సామె. 5:1, 2; ఫిలి. 1:9-11) కాబట్టి ఒక్కొక్కటిగా ఈ వాస్తవిక విషయాల్ని విచారించండి:

(1మనందరము యెహోవాను ఆరాధిస్తాము, మంచిచెడుల విషయమై కట్టడ నియమించే ఆయన హక్కును గుర్తిస్తాము.

మనకు చిన్నదిగా కన్పించే ఒకానొక విషయమై ఆయనిచ్చిన సలహాను మనం ఉద్దేశపూర్వకంగా పెడచెవినబెడితే యెహోవా దానినెలా దృష్టిస్తాడు? (లూకా 16:10; మలాకీ 1:6-8 పోల్చండి.)

అన్నిసమయాల్లో మనం యెహోవా ఆజ్ఞలకు లోబడకపోతే అది ఇతరులపై ప్రభావం చూపుతుందా? (రోమీయులు 5:12; యెహోషువ 7:20-26; 1 రాజులు 14:16 పోల్చండి.)

(2లోకమందు మనమెక్కడున్నా, మనల్ని నడిపించడానికి మనం దేవుని వాక్యాన్ని కలిగివున్నాము.

మనం తీర్మానాలు చేసేటప్పుడు, మనం “సరియని” భావించే దానిని మాత్రమే చేయటంలో ఏ ప్రమాదమున్నది? (యిర్మీ. 17:9; సామె. 14:12)

ఏదైనా ఒక విషయంపై బైబిలు ఏ సలహానిస్తుందో మనకు తెలియకపోతే మనమేం చేయాలి? (సామె. 2:3-5)

(3మనందరము ఒకే విధమైన ఆత్మీయాహార కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతున్నాము.

ఆత్మీయాహారం కొరకైన యెహోవా ఏర్పాట్లను గుణగ్రహించని వారిమధ్య ఎట్టి పరిస్థితులున్నవి? (యెషయా 1:3; 9:16; 65:14 పోల్చండి.)

(4మరే మానవుడు కాదుగాని యేసుక్రీస్తే మన నాయకుడు, ఆయన ద్వారానే మనందరము యెహోవాను ఆరాధిస్తున్నాము.

ఆయావ్యక్తులుగా మనం ఇతరులకంటే ఉన్నతులమని నమ్ముటకు మనలో ఎవరికైనా విలువైన కారణమున్నదా? (రోమా. 3:23, 24; 12:3; మత్త. 23:8-10)

(5మనమెక్కడ జీవించినా, మానవజాతికిగల ఒకేఒక నిరీక్షణగా మనం దేవుని రాజ్యాన్నే చూస్తాము.

విచ్ఛిన్నకర ప్రభావాలకు వ్యతిరేకంగా ఇది మనలనెట్లు సంరక్షిస్తుంది? (మత్త. 6:9, 10; మీకా 4:3)

(6క్రైస్తవ ఐక్యతకు అవశ్యమైన లక్షణాల్ని పరిశుద్ధాత్మ యెహోవా ఆరాధికుల్లో కలుగజేస్తుంది.

మనలో దేవుని ఆత్మ దాని ఫలాల్ని ఫలింపజేయడానికి మనమెలా మార్గం తెరుస్తాము? (కీర్త. 1:2; సామె. 22:4; ప్రక. 3:6; అపొ. 5:32)

మనం ఆత్మఫలాల్ని కలిగియుండుట యెహోవాతోను, మన సహోదరులతోను మనకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? (గల. 5:22, 23)

(7దేవుని రాజ్య సువార్త ప్రకటించే బాధ్యత మనందరికి ఉన్నది.

తోటి క్రైస్తవులతోకలిసి ఈ ప్రకటించు పనిలో నిమగ్నమైయుండుట వారిని గూర్చి మనమెలా భావిస్తున్నామనే దానిపై ఎలా ప్రభావం చూపుతుంది? (కొలొస్సయులు 4:7, 11 పోల్చండి.)

9. మన జీవితాల్లో ఈ సత్యాలను నిజంగా అన్వయించినప్పుడు దాని ప్రభావమేమై ఉంటుంది?

9 ఈ వాస్తవిక విషయాల్ని అంగీకరించడం ఒక ఎత్తు. వాటి కనుగుణ్యంగా జీవించడం మరెంతో అవసరం. అయితే మనమలా చేసినప్పుడు, మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం. తోటి విశ్వాసులతో మన సహవాసం కూడ ఉపశమనానికి ఒక మూలమౌతుంది. కీర్తన 133:1 చెబుతున్నట్లు, “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు! ఎంత మనోహరము!” లోకాన్ని, దాని సమస్త స్వార్థాన్ని విడిచి, యెహోవాను నిజంగా ప్రేమించే వారితో కూటములకు హాజరగుట ఎంత ఉపశమనాన్నిస్తుందో మీరు వ్యక్తిగతంగా అనుభవించలేదా?

విచ్ఛిన్నకర ప్రభావాల్ని విసర్జించండి

10. స్వేచ్ఛా స్వభావాన్ని విసర్జించడానికి మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

10 అట్టి అమూల్యమైన ఐక్యతను కాపాడుటకు, మనం విచ్ఛిన్నకర ప్రభావాల్ని విసర్జించాలి. వీటిలో అతి ముఖ్యమైనది స్వేచ్ఛా స్వభావం. దాని మూలకారకుడైన అపవాదియగు సాతానును బహిర్గతంచేస్తూ యెహోవా దానిని విసర్జించడానికి మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడు చెప్పింది పెడచెవినబెట్టి, స్వంతగా నిర్ణయాలు చేసుకోవడం తనకు లాభదాయకమని హవ్వ ఆలోచించేటట్లు అతడామెను మోసగించాడు. ఆ తిరుగుబాటు విధానంలో ఆదాము ఆమెతో చేతులు కలిపాడు. దాని ఫలితం వారికి, మనకూ వినాశకరమయ్యింది. (ఆది. 2:16, 17; 3:1-6, 17-19) మనం నివసించే ఈ లోకం అట్టి స్వేచ్ఛా స్వభావంతో పూర్తిగా నిండిపోయింది, కాబట్టి మనలోగల ఆ స్వభావాన్ని అణగద్రొక్కాల్సివస్తే దానికి మనం ఆశ్చర్యపడకూడదు. మనమలా చేయడానికి యెహోవా ప్రేమతో తన సంస్థద్వారా సలహానిస్తూ మనకు సహాయం చేస్తున్నాడు.

11. దేవుని నీతియుక్త నూతన క్రమంలో జీవం కొరకు మనం యథార్థంగా సిద్ధపడుచున్నామా లేదాయని ఏది చూపిస్తుంది?

11 ఈ ప్రస్తుత పరిస్థితి స్థానంలో “నీతి నివసించు” క్రొత్త ఆకాశములను, క్రొత్త భూమిని ఏర్పాటు చేస్తాననే యెహోవా దివ్య సంకల్పాన్ని గూర్చి మనం ఆ సంస్థ ద్వారానే నేర్చుకున్నాము. (2 పేతు. 3:13) త్వరలోనే ఈ దుష్టలోకం అంతమై, ఈ భూమి పరదైసుగా మార్చబడుననే ఉత్తరాపేక్షతో మనం పులకిస్తున్నాము. అయితే నీతి ఎల్లప్పుడూ ఆచరణయందుండే ఆ లోకంలోని జీవం కొరకు మనం యథార్థంగా సిద్ధపడుతున్నామని మన జీవన విధానం చూపిస్తుందా? బైబిలు సరళంగా మనకిలా చెబుతున్నది: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.” (1 యోహా. 2:15) ఈ లోకం విషయంలో మనలో ఎవ్వరూ ఇష్టపడని అనేక సంగతులున్నమాట వాస్తవమే. అయితే మనం మన ప్రస్తుత జీవితానందాన్ని పాడుచేసే లోక సంగతులను మాత్రమే ఈసడించుకుంటామా? లేక దాని స్వభావాన్ని అంటే దాని స్వేచ్ఛా దృక్పథాన్ని, దాని మితిమీరిన స్వార్థాన్ని సహితం విసర్జిస్తామా? ఎట్టి విభిన్న శారీరక తలంపులున్ననూ మనం యెహోవా ఆజ్ఞల్ని లక్ష్యపెట్టి, హృదయపూర్వకంగా ఆయనకు లోబడుటను యథార్థంగా అలవాటు చేసుకుంటున్నామా? మనమెక్కడున్నా, మనమేమి చేస్తున్నా మన ఆలోచనాసరళి, మన ఉద్దేశాలు దైవచింతన కల్గివున్నాయని మన యావత్‌ జీవిత విధానం రుజువుచెయ్యాలి.—సామె. 3:5, 6.

12. (ఎ) యెహోవా మార్గాల్ని గూర్చి నేర్చుకొని, మన జీవితాల్లో వాటిని అనుసరించే అవకాశాన్ని ఇప్పుడే చేజిక్కించుకొనుట ఎందుకు ప్రాముఖ్యము? (బి) పేరాలో చూపబడిన లేఖనములు మనకు వ్యక్తిగతంగా ఏ భావాన్ని కలిగివున్నవి?

12 ఈ దుష్ట విధానాన్ని, దాని పద్ధతుల్ని ప్రేమించే వారందరిని నాశనంచేసే యెహోవా నిర్ణయకాలం వచ్చినప్పుడు, ఆయన జాగుచేయడు. ఈ లోకాన్ని ఇంకనూ అంటిపెట్టుకొనుటకు ప్రయత్నించు వారికి, దేవుని చిత్తాన్ని గూర్చి నేర్చుకొని దానిని చేసేందుకు, కేవలం అర్ధహృదయం గలవారికి స్థానం కల్పించడానికి ఆయన ఆ సమయాన్ని వాయిదావేయడు లేదా తన ప్రమాణాల్ని మార్చుకోడు. చర్య తీసుకోవాల్సిన సమయమిదే. (లూకా 13:23, 24; 17:32; 21:34-36) కాబట్టి యెహోవా తన ప్రేమగల సంస్థద్వారా దయచేస్తున్న ఉపదేశాన్ని ఆసక్తితో వెదకుచూ, ఆ పిమ్మట ఆయన మార్గాల్లో నడుస్తూ ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న “గొప్పసమూహపు” ప్రజల్ని చూడటం ఎంత హృదయానందకరమో గదా!

[అధస్సూచీలు]

^ పేరా 2 ప్రత్యేకంగా సూచింపబడని లేఖనములు పరిశుద్ధ గ్రంథమునుండి వ్రాయబడినవి. లేఖనము వ్రాయబడినచోట NW అనివుంటే, అది ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము నుండి తర్జుమా చేయబడిందని దాని భావము.

పునఃసమీక్షా చర్చ

• ఆరాధన విషయమై యెహోవా సంకల్పమేమిటి?

• బైబిలు ప్రాథమిక బోధలు నేర్చుకున్న తర్వాత, చిత్తశుద్ధితో మనమింకా ఎట్టి అభివృద్ధి సాధించడానికి ప్రయత్నించాలి?

• మనం చర్చించిన ఐక్యపరచే వాస్తవిక విషయాలు చూపవలసిన రీతిలో మన జీవితాలపై ప్రభావం చూపడానికి వ్యక్తిగతంగా మనమేమిచేయగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[4వ పేజీలోని చిత్రం]