‘ఎన్నటికీ నాశనముకాని’ రాజ్యము
అధ్యాయం 10
‘ఎన్నటికీ నాశనముకాని’ రాజ్యము
1, 2. (ఎ) ప్రపంచ సంఘటనల ద్వారా ప్రతిదినం ఏ వాస్తవం నొక్కిచెప్పబడుతోంది, ఎలా? (బి) ఉన్న ఒకే ఒక పరిష్కారమేమిటి?
యెహోవా సర్వాధిపత్యాన్ని విసర్జించి, తమనుతాము పరిపాలించుకోవడానికి ప్రయత్నించుట ద్వారా మానవులు సంతోషాన్ని కనుగొనలేదనే వాస్తవాన్ని ప్రతిదినం జరిగే ప్రపంచ సంఘటనలు రూఢిపరుస్తున్నాయి. మానవుని ఏ ప్రభుత్వ విధానం కూడ మానవజాతికి నిష్పక్షపాతంగా ప్రయోజనాల్ని తీసుకురాలేదు. సాటిలేని రీతిలో మానవులు తమ విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని వృద్ధిచేసుకున్ననూ, పాపాన్ని సమూలంగా తీసివేయలేకపోయారు తమ ప్రజల్లో ఏ ఒక్కరికీ రోగం రాకుండాచేసి మరణాన్ని జయించలేకపోయారు. దీనికి భిన్నంగా, దేశాలు క్రొత్తవైన, మరింత భయంకరమైన ఆయుధాల్ని వృద్ధిచేయుటకు కొనసాగుతున్నాయి. హింసాత్మక నేరాలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పేరాశ, అజ్ఞానం వెరసి భూమిని, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరగడం అనేకులు తమ జీవితావసరాలు తీర్చుకోవడాన్ని మరీ దుర్భరం చేస్తున్నాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.—ప్రసం. 8:9.
2 దీనికి పరిష్కారం? ప్రార్థించుడని యేసు తన అనుచరులకు బోధించిన దేవుని రాజ్యమే. (మత్త. 6:9, 10) అది తీసుకొచ్చే విడుదల ఇప్పుడు అతి సమీపంగా ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలి!
3. (ఎ) ఈ రాజ్యానికి సంబంధించి సా.శ. 1914 లో పరలోకమందు ఏమి సంభవించింది? (బి) అది మనకెందుకు ప్రాముఖ్యము?
3 ఇప్పటికే, అనగా సా.శ. 1914 నుండి యేసుక్రీస్తు అధికారమందలి దేవుని * ప్రవచనార్థక దర్శనమందు దానియేలు చూసిన సంఘటనలు నిజానికి ఆ సంవత్సరమందే పరలోకమందు సంభవించాయి. “మహావృద్ధుడగు” యెహోవా దేవుడు మనుష్యకుమారుడగు యేసుక్రీస్తుకు “సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” అనుగ్రహించాడు. ఆ దర్శనాన్ని నివేదిస్తూ దానియేలు ఇలా వ్రాశాడు: “ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దాని. 7:13, 14) ఈ రాజ్యము ద్వారానే దేవుడు మన మొదటి మానవ తలిదండ్రులను పరదైసులో ఉంచినప్పుడు సంకల్పించిన అసంఖ్యాకమైన దీవెనలను నీతిని ప్రేమించేవారు అనుభవించేలా వీలుకల్గిస్తాడు.
రాజ్యం పనిచేస్తూనేవుంది.4. ఆ రాజ్యాన్ని గూర్చిన ఏ వివరాలు మనకు మిక్కిలి శ్రద్ధకల్గిస్తాయి, ఎందుకు?
4 యథార్థపరులైన ఆ రాజ్య ప్రజలు ఈ ప్రభుత్వ నిర్మాణం, పరిపాలనాతీరు విషయంలో మిక్కిలి శ్రద్ధ కలిగివున్నారు. అది ప్రస్తుతం ఏమిచేస్తోంది, భవిష్యత్తులో ఏమిచేయనైయుంది మరియు అది వారినుండి ఏమి కోరుతుందని వారు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు. దానిని వారు నిశితంగా పరీక్షిస్తారు మరియు వారాలాగు చేస్తుండగా దానికొరకైన వారి ప్రశంస మరింత వృద్ధౌతుంది మరియు వారు దానినిగూర్చి ఇతరులకు చెప్పడానికి సంసిద్ధులౌతారు.—కీర్త. 48:12, 13.
హృదయాన్ని కదలించే పరిశీలన
5. (ఎ) మెస్సీయ రాజ్యం ఎవరి సర్వాధిపత్యానికి సాదృశ్యంగా ఉందని లేఖనాలు ఎలా చూపెడుతున్నాయి? (బి) కాబట్టి ఆ రాజ్యాన్ని గూర్చి నేర్చుకొనుట మనపై ఎట్టి ప్రభావం చూపుతుంది?
5 అట్టి పరిశీలన బయల్పరచే మొదటి సంగతుల్లో ఈ మెస్సీయ రాజ్యం యెహోవా సర్వాధిపత్యానికి సాదృశ్యంగా ఉందనే సంగతి ఒకటి. ఆయన తన కుమారునికి “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” ఇచ్చాడు. అలా ఈ రాజ్యం పరిపాలనను ఆరంభించిన తర్వాత, పరలోకమందలి స్వరాలు యుక్తంగా ఇలా ప్రకటించాయి: “ఈ లోక రాజ్యము మన ప్రభువు [యెహోవా దేవుని] ప్రక. 11:15) కాబట్టి ఈ రాజ్యాన్నిగూర్చి, ఇది నెరవేర్చే వాటినిగూర్చి మనం గమనించే ప్రతిదీ మనల్ని యెహోవాకు మరి సమీపస్థుల్ని చేస్తాయి. ఆయన సర్వాధిపత్యానికి నిత్యమూ లోబడాలనే కోరికనది మనలో కల్గిస్తుంది.
రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన [యెహోవా] యుగయుగముల వరకు ఏలును.” (6. యెహోవా తర్వాతిస్థాయి పరిపాలకునిగా యేసుక్రీస్తు ఉన్నాడనుట మనకెందుకు ప్రత్యేకంగా శ్రద్ధాకరమైయుంది?
6 యేసుక్రీస్తును తన తర్వాతిస్థాయి పరిపాలకునిగా యెహోవా సింహాసనంపై కూర్చుండబెట్టుట ఎంత శ్రేష్ఠమో గదా! ఈ భూమిని, మానవుని చేయుటలో దేవుడు ఉపయోగించిన ప్రధానశిల్పిగా యేసుకు మనలో ఎవరికంటెను ఎక్కువగా మన అవసరతలేమిటో తెలుసు. అంతేకాకుండ, మానవ చరిత్రారంభము నుండి ఆయన ‘నరులయెడల తనకున్న ఆనందాన్ని’ ప్రదర్శించాడు. (సామె. 8:30, 31; కొలొ. 1:15-17) ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తనే స్వయంగా ఈ భూమికివచ్చి వారికొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ విధంగా ఆయన మనకు పాపమరణముల నుండి విడుదలను, నిత్యజీవానికొక అవకాశాన్ని ఇచ్చాడు.—మత్త. 20:28.
7. (ఎ) సమస్త మానవ పరిపాలనకు భిన్నముగా, ఈ ప్రభుత్వం ఎందుకు స్థిరంగా నిలిచివుంటుంది? (బి) పరలోక ప్రభుత్వంతో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎట్టి సంబంధాన్ని కలిగివున్నాడు?
7 ఇది స్థిరంగా కలకాలముండే ప్రభుత్వము. యెహోవా అమరుడు గనుక అది నిత్యము నిలిచియుంటుందనే అభయం మనకివ్వబడింది. (హబ. 1:12; కీర్త. 146:3-5, 10) మానవ పరిపాలకులకు భిన్నంగా, దేవుడు రాజ్యాధికారం ఇచ్చిన యేసుక్రీస్తు కూడ అమర్త్యుడే. (రోమా. 6:9; 1 తిమో. 6:15, 16) ‘ఆయా భాషలు మాటలాడు వారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి’ వచ్చిన దేవుని యథార్థ సేవకులగు 1,44,000 మంది క్రీస్తుతోపాటు పరలోక సింహాసనాలపై కూర్చుంటారు. వీరికికూడ అమరత్వం ఇవ్వబడుతుంది. (ప్రక. 5:9, 10; 1 కొరిం. 15:42-44, 53) ఇప్పటికే వారిలో అత్యధిక శాతంమంది పరలోకమందున్నారు మరియు ఈ భూమిపైనున్న శేషింపబడినవారు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతిగా ఇక్కడ ఆ రాజ్యాసక్తులను యథార్థంగా విస్తరింపజేస్తున్నారు.—మత్త. 24:45-47.
8, 9. విచ్ఛిన్నకరమగు, అవినీతికరమైన ఎట్టి ప్రభావాల్ని ఆ రాజ్యం తొలగిస్తుంది? (బి) కాబట్టి, దేవునిరాజ్య శత్రువులుగా ఉండకుండా మనం తప్పించుకోవాలంటే, మనం ఎలాంటి సంస్థల్లో, కార్యకలాపాల్లో చిక్కుకొనకుండా ఉండాలి?
8 అనతికాలంలోనే, యెహోవా నిర్ణయకాలమందు ఆయన తీర్పును అమలుచేసే సైన్యాలు ఈ భూమిని పరిశుభ్రంచేసే పనిని చేపడతాయి. ఉద్దేశపూర్వకంగా దేవుని ఎరుగని, ఆయన సర్వాధిపత్యాన్ని గుర్తింపని మరియు యేసుక్రీస్తు ద్వారా ఆయన చేస్తున్న ప్రేమగల ఏర్పాట్లను ధిక్కరించు మానవులను ఆ సైన్యాలు శాశ్వతంగా నాశనం చేస్తాయి. (2 థెస్స. 1:6-9) ఇది యెహోవాను విశ్వ సర్వాధిపతిగా నిరూపించడానికి దీర్ఘకాలంగా వేచియున్న ఆయన దినమైయుంటుంది.
9 అబద్ధమతం యావత్తు, ఆలాగే ఈ లోక అదృశ్య దుష్ట పరిపాలకునిచే నడిపింపబడిన సమస్త మానవ ప్రభుత్వాలు, వాటి సైన్యాలు శాశ్వతంగా నిర్మూలింపబడతాయి. స్వార్థం, మోసంతోకూడిన అవినీతికరమైన జీవితాన్ని వెంబడిస్తూ ఈ లోక సంబంధులుగానున్న వారందరు హతమార్చబడతారు. ఈ భూనివాసులతో ఇక ఏమాత్రం సంబంధం లేకుండ సాతాను అతని దయ్యాలు తొలగింపబడి, భద్రంగా వెయ్యి సంవత్సరాలపాటు బంధింపబడతారు. నీతిని ప్రేమించు వారందరికిది ఎంతచక్కని విడుదలో గదా!—ప్రక. 18:21, 24; 19:11-16, 19-21; 20:1, 2.
దాని ఆశయాలు—ఎలా సాధింపబడతాయి
10. (ఎ) ఈ భూమియెడలగల యెహోవా సంకల్పాన్ని మెస్సీయ రాజ్యం ఎలా నెరవేరుస్తుంది? (బి) అప్పుడు ఈ భూమిపై నివసించే ప్రజలకిది ఎటువంటి భావమైయుంటుంది?
10 భూమియెడల దేవునికిగల ఆది సంకల్పాన్ని ఈ మెస్సీయ రాజ్యం పూర్తిగా నెరవేరుస్తుంది. (ఆది. 2:8, 9, 15; 1:28) ఈనాటికీ, మానవుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో తప్పిపోయాడు. అయితే, మనుష్యకుమారుడగు యేసుక్రీస్తుకు “ఆ రాబోవు లోకము” లోపరచబడింది. ఈ పాత విధానం మీదకువచ్చు యెహోవా తీర్పును తప్పించుకొను వారందరు, ఈ భూమియావత్తు పరదైసుగా మార్చబడు పర్యంతము క్రీస్తు నడిపింపుకు సంతోషముగా లోబడుతూ, రాజుగా ఆయన అధికారము క్రింద ఐకమత్యముతో పనిచేస్తారు. (హెబ్రీ. 2:5-9) సమస్త మానవులు తమ పనులయందు ఆనందిస్తూ, సమృద్ధిగా భూమియిచ్చు ఫలమునుండి పూర్తి ప్రయోజనం పొందుతారు.—కీర్త. 72:1, 7, 8, 16-19; యెషయా 65:21, 22 పోల్చండి.
11. (ఎ) ఆ రాజ్య ప్రజలకు భౌతిక, మానసిక పరిపూర్ణత ఎలా తీసుకురాబడుతుంది? (బి) దీనిలో ఏమి ఇమిడియుంది?
11 ఆదాము హవ్వలు సృజింపబడినప్పుడు వారు పరిపూర్ణులుగా ఉన్నారు, ఆలాగే వారి సంతానముతో ఈ భూమిని నింపాలని వారందరు భౌతికంగాను మానసికంగాను పరిపూర్ణత ననుభవించాలని దేవుడు సంకల్పించాడు. రాజ్య పరిపాలన క్రింద ఆ సంకల్పం మహిమాన్వితంగా నిజమౌతుంది. దీనికి సమస్త పాప ప్రభావాల్ని తొలగించాలి, అందుకు క్రీస్తు రాజుగానే కాకుండ ప్రధానయాజకునిగా కూడ సేవచేస్తాడు. తన మానవ జీవ పాపపరిహారార్థ బలి విలువనుండి ప్రయోజనం పొందునట్లు విధేయులైన తన ప్రజలకు ఆయన ఎంతో ఓపికతో సహాయం చేస్తాడు. గ్రుడ్డివారి కన్నులు తెరవబడతాయి. చెవిటివారి చెవులు విప్పబడతాయి. వృద్ధాప్యంచేత, రోగంచేత వికారమైన శరీరం బాలుర శరీరంకంటే ఆరోగ్యంగా తయారౌతుంది. దీర్ఘకాల బలహీనతలుపోయి చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరూ కూడ “నాకు దేహములో బాగులేదని” చెప్పడానికి ఆస్కారంలేని కాలం వస్తుంది, ఎందుకంటే దైవ భయంగల మానవులు పాప భారంనుండి, దాని దుఃఖకర ప్రభావాలనుండి విమోచింపబడతారు.—యెషయా 33:22, 24; 35:5, 6; యోబు 33:25; లూకా 13:11-13 పోల్చండి.
12. (ఎ) మానవ పరిపూర్ణతకు ఇంకా ఏమికూడ అవసరము? (బి) అదెలా సాధింపబడుతుంది, దానివలన వచ్చు ఫలితమేమి?
12 అయితే పరిపూర్ణతను సంపాదించుటలో మంచి శరీరము, మంచి మనస్సు కలిగివుండుటకంటే ఎంతో ఎక్కువ ఇమిడివుంది. మానవుడు ‘దేవుని స్వరూపమందు, ఆయన పోలికచొప్పున’ చేయబడినందున, దానిలో సరియైన రీతిలో యెహోవా లక్షణాల్ని ప్రతిబింబించుట చేరియుంది. (ఆది. 1:26) దానికొరకెంతో విద్యాభ్యాసం అవసరమౌతుంది. ఇది “నీతి నివసించు” నూతన క్రమం గనుక, ప్రవక్తయగు యెషయా ముందుగానే చెప్పినట్లు, “లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.” (2 పేతు. 3:13; యెష. 26:9) ఈ లక్షణం సమస్త జనాంగముల మధ్యను, సన్నిహిత సహవాసుల్లోను, కుటుంబంలోను అన్నింటికంటే మిన్నగా దేవునితోనే సమాధానం కలిగివుండటానికి నడుపుతుంది. (యెష. 32:17; కీర్త. 85:10-13) నీతిని నేర్చుకొనువారు వారికొరకైన దేవుని చిత్తం విషయంలో ప్రగతిదాయక విద్యాభ్యాసం పొందుతారు. యెహోవా మార్గాలయెడల ప్రేమ వారి హృదయాల్లో బలంగా నాటుకొనేకొలది, వారు తమ జీవిత ప్రతి ఆకృతియందు వాటిని అనుసరిస్తారు. పరిపూర్ణ మనిషిగా యేసు ఇలా చెప్పగల్గాడు, ‘నా తండ్రి కిష్టమైన క్రియలే నేనెల్లప్పుడు చేస్తాను.’ (యోహా. 8:29) అది సమస్త మానవజాతి విషయంలో నిజమైనప్పుడు జీవితమెంత మధురంగా ఉంటుందో గదా!
నెరవేర్పులు ఇప్పటికే కనబడుతున్నాయి
13. ఆ రాజ్యం నెరవేర్చే కార్యాలను, కావున మనమేమి చేస్తుండాలనే విషయాన్ని నొక్కిచెప్పుటకు పైనున్న ప్రశ్నలను ఉపయోగించండి.
13 విశ్వాస నేత్రాలుగల వ్యక్తులకు ముచ్చటైన ఆ రాజ్య నెరవేర్పులు తేటగా కనబడుతూనేవున్నాయి. వీటిలో కొన్నింటిని, ఆలాగే ఆ రాజ్య ప్రజలందరు చేయగల, చేయవలసిన సంగతులను ఈ క్రింది ప్రశ్నలు చూపబడిన లేఖనాలు మీకు గుర్తుచేస్తాయి:
రాజు మొదట ఎవరిపై చర్య తీసుకున్నాడు, దాని ఫలితమేమి? (ప్రక. 12:7-10, 12)
[This paragraph is not in vernacular]
తను సింహాసనాసీనుడైన తర్వాత, దుష్టులను నాశనం చేయకముందు తానింకే పనినిచేస్తానని యేసు మత్తయి 24:14 లో ముందుగానే చెప్పాడు?
ఈ పని ఎలా నెరవేర్చబడుతుంది? దానిలో ఎవరు భాగం వహిస్తున్నారు? (కీర్త. 110:3; ప్రక. 14:6, 7)
రాజకీయ, మతసంబంధమైన వ్యతిరేకులు దీనిని ఎందుకు ఆపుజేయలేకపోయారు? (అపొ. 5:38, 39; జెక. 4:6)
జరుగుతున్న విద్యాభ్యాస కార్యక్రమం ఫలితంగా రాజ్య పరిపాలనకు లోబడే వ్యక్తుల జీవితాల్లో ఇప్పటికే ఎటువంటి మార్పులు జరిగాయి? (యెష. 2:4; 1 కొరిం. 6:9-11)
రాజ్యంయొక్క స్థిర లక్షణం
14. (ఎ) క్రీస్తు ఎంతకాలం పరిపాలిస్తాడు? (బి) ఆ కాలంలో ఏమి నెరవేర్చబడుతుంది?
14 సాతానును, అతని దయ్యాలను అగాధంలో పడవేసిన తర్వాత, యేసుక్రీస్తు తనతోడి వారసులగు 1,44,000 మందితోకలిసి వెయ్యేండ్లు పరిపాలన చేస్తాడు. (ప్రక. 20:6) ఆ కాలంలో మానవజాతి పరిపూర్ణతకు తేబడుతుంది. యెహోవాకు వ్యతిరేకంగావున్న సమస్త ప్రభుత్వాలు, ఆధిపత్యాలు, అధికారాలు తొలగింపబడతాయి. ఇవన్నీ నెరవేర్చిన తర్వాత, “దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము” యేసు ఆ రాజ్యాన్ని తిరిగి తన తండ్రికి అప్పగిస్తాడు.—1 కొరిం. 15:24, 28.
15. ఆ రాజ్యము ‘ఎప్పుడును లయము కాదనుట’ ఎలా నిజము?
15 కాబట్టి, ఈ భూమికి సంబంధించినంత వరకు యేసు స్థానం మారుతుంది. అయినప్పటికిని, ఆయన పరిపాలన “శాశ్వతముగా” ఉంటుంది, ఆయన రాజ్యము “ఎప్పుడును లయముకాదు.” (దాని. 7:14) ఏ భావంలో? అంటే ఆ పరిపాలనాధికారము విభిన్న ధ్యేయాలున్న ఇతరులకు అప్పగింపబడదు. ఆ రాజ్యం నెరవేర్చే కార్యాలు ‘ఎప్పుడును లయముకావు.’ యెహోవా నామమును మహిమపరచుటకు, ఈ భూమికి సంబంధించిన ఆయన సంకల్పం విషయంలో ఆ రాజ్యంచేసే యావత్తు నిరంతరము నిలిచియుంటుంది.
[అధస్సూచీలు]
^ పేరా 3 “నీ రాజ్యము వచ్చుగాక,” (ఆంగ్లం) అనే పుస్తకంలో 127-139 పేజీలు చూడండి.
పునఃసమీక్షా చర్చ
• మానవజాతి సమస్యలకు దేవుని రాజ్యం మాత్రమే ఎందుకు పరిష్కారమైయుంది? అదెప్పుడు పరిపాలించుటకారంభించింది?
• దేవుని రాజ్యాన్ని గూర్చియు, అది నెరవేర్చేవాటి విషయంలోను ప్రత్యేకంగా మీకేది నచ్చింది? ఎందుకు?
• మనమిప్పటికే ఆ రాజ్యం నెరవేర్చిన ఏ కార్యాలను చూడగల్గుచున్నాము? వీటిలో మన భాగమేమిటి?
[అధ్యయన ప్రశ్నలు]
[84, 85వ పేజీలోని చిత్రం]
ప్రజలు నీతిని నేర్చుకుంటారు