కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీడును దేవుడు అనుమతించుట నుండి మనమేమి నేర్చుకొంటాము

కీడును దేవుడు అనుమతించుట నుండి మనమేమి నేర్చుకొంటాము

అధ్యాయం 7

కీడును దేవుడు అనుమతించుట నుండి మనమేమి నేర్చుకొంటాము

1. (ఎ) ఏదెనులో తిరుగుబాటుదారులను యెహోవా వెంటనే నాశనం చేసివుంటే, అది మనపై ఎలాంటి ప్రభావం చూపియుండేది? (బి) బదులుగా, మనకు లభ్యమయ్యే ఎట్టి ప్రేమగల ఏర్పాట్లను యెహోవా చేశాడు?

జీవితంలో మనమెన్ని కష్టాలెదుర్కోవాల్సివచ్చినా, మన జన్మ విషయంలో దేవుడుచేసిన అన్యాయమేమీ లేదు. మొదటి మానవులకు ఆయన పరిపూర్ణతను అనుగ్రహించి వారికి పరదైసు గృహాన్ని దయచేశాడు. తిరుగుబాటు చేసినవెంటనే ఆయన వారిని నాశనం చేసివుంటే, నేడు మనకు తెలిసినట్లు రోగాలతో, దారిద్ర్యంతో, నేరంతో నిండివున్న మానవజాతి అసలు ఉండేదే కాదు. అయితే, ఆదాము, హవ్వలు తమ పిల్లలకు స్వాస్థ్యముగా అసంపూర్ణతను సంక్రమింపజేసిననూ వారు చనిపోకముందే పిల్లలను కని ఓ కుటుంబం కలిగివుండడానికి యెహోవా కృపతో వారిని అనుమతించాడు. ఆదాము, అపరాధంవల్ల అత్యానందభరితమైన జీవితాన్ని సాధ్యపరచే పరిస్థితుల్లో పోగొట్టుకున్న నిత్యజీవపు అవకాశాన్ని, ఆదాము సంతతి విశ్వాసముంచుటద్వారా పొందునట్లు ఆయన క్రీస్తుద్వారా ఒక ఏర్పాటుచేశాడు.—ద్వితీ. 32:4, 5; యోహా. 10:10.

2. ఇదంతా కేవలం మన రక్షణకొరకే చేయబడిందా?

2 దీనివల్ల వ్యక్తిగతంగా మనం పొందే ప్రయోజనం అనిర్వచనీయమైనది. అయితే మన వ్యక్తిగత రక్షణకంటే ఎక్కువ ఇమిడియున్న మరివిశేషమైన మరో విషయాన్ని బైబిలు వ్రాతచరిత్రనుండి మనం నేర్చుకుంటాము.

ఆయన గొప్ప నామము నిమిత్తము

3. ఈ భూమి, మానవజాతి కొరకైన యెహోవా సంకల్పంయొక్క నెరవేర్పుకు సంబంధించి ఏది ప్రమాదంలో ఉండెను?

3 ఈ భూమి, మానవజాతిని గూర్చిన ఆయన సంకల్ప నెరవేర్పులో యెహోవా నామము, విశ్వ సర్వాధిపతిగా, సత్యదేవునిగా ఆయనకున్న ప్రతిష్ఠ ఇమిడియున్నాయి. యెహోవా స్థానాన్నిబట్టి, సమస్త విశ్వంయొక్క సమాధానానికి, క్షేమానికి ఆయన నామానికివ్వాల్సిన సంపూర్ణ గౌరవం ఇవ్వాలి, అందరూ ఆయనకు లోబడాలి.

4. ఆ సంకల్పమందు కచ్చితముగా ఏది ఇమిడియుండెను?

4 ఆదాము హవ్వలను సృజించిన తర్వాత, చేయడానికి ఆయన వారికి పనినిచ్చాడు. పరదైసు హద్దులను విస్తరింపజేస్తూ, కేవలం సమస్త భూమిని లోబరచుకోవడమే కాదుగాని, మొదటి స్త్రీపురుషులైన ఆదాము హవ్వలు తమ సంతానముతో దానిని నింపాలనుటే తన సంకల్పమని ఆయన స్పష్టం చేశాడు. (ఆది. 1:28) దేవుని నామానికి నిందతెచ్చే వారి పాపం కారణంగా మరి ఈ సంకల్పం విఫలంకానైయుండెనా?

5. (ఎ) ఆదికాండము 2:17 ప్రకారం, మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినువారు ఎప్పుడు మరణిస్తారు? (బి) ఈ భూమిని మనుష్యులతో నింపాలనే తన సంకల్పాన్ని జరుగనిస్తూనే, యెహోవా దానినెలా నెరవేర్చాడు?

5 మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని అవిధేయతతో ఆదాము తింటే అతడు ఆ “దినమున” నిశ్చయంగా మరణిస్తాడని యెహోవా అతన్ని హెచ్చరించాడు. (ఆది. 2:17) దేవుడు చెప్పినట్లే, ఆదాము పాపముచేసిన దినమునే యెహోవా ఆ దోషుల్ని జవాబుదారుల్ని చేసి వారికి మరణశిక్ష విధించాడు. ఆ శిక్ష వారు తప్పించుకోలేనిది. న్యాయబద్ధముగా, దేవుని దృష్టిలో ఆదాము హవ్వలు ఆ దినముననే చనిపోయారు. (లూకా 20:37, 38 పోల్చండి.) కాని తాను సెలవిచ్చినట్లు ఈ భూమిని మానవులతో నింపే తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, వారు అక్షరార్థముగా చనిపోకముందు పిల్లల్ని కనడానికి యెహోవా వారిని అనుమతించాడు. అయితే, దేవుని దృష్టిలో ఒక దినమనగా 1,000 సంవత్సరాలు, కాబట్టి ఆదాము జీవితం 930 సంవత్సరాలకే ముగిసిందంటే, అతడు ఆ “దినము”లోనే చనిపోయాడు. (ఆది. 5:3-5; కీర్తన 90:4; 2 పేతురు 3:8 పోల్చండి.) ఆ విధంగా, వారు శిక్ష అనుభవించే సమయానికి యెహోవా సత్యత్వం నిరూపింపబడింది, ఆలాగే ఆదాము సంతానంతో ఈ భూమిని నింపాలనే ఆయన సంకల్పమూ అడ్డగింపబడలేదు. అయితే, ఇది పాపులైన మనుష్యులు మాత్రం కొద్దికాలం జీవించడానికి అనుమతింపబడేటట్లు చేసింది.

6, 7. (ఎ) కొద్దికాలంపాటు యెహోవా దుష్టులను ఎందుకు అనుమతిస్తున్నాడనే విషయమై నిర్గమకాండము 9:15, 16 ఏమి సూచిస్తున్నది? (బి) ఫరో విషయంలో, యెహోవా శక్తి ఎలా చూపబడింది, ఎట్లు ఆయన నామము తెలియజేయబడింది? (సి) కాబట్టి ఈ ప్రస్తుత దుష్ట విధానాంతపు ఫలితమేమైయుంటుంది?

6 కొంతకాలం వరకు దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడో, మోషే జీవించిన కాలంలో ఐగుప్తు పరిపాలకునికి యెహోవా చెప్పిన మాటలు ఇంకా విశదం చేస్తున్నాయి. ఇశ్రాయేలు కుమారులు ఐగుప్తు విడిచివెళ్లకుండా ఫరో నిషేధించినప్పుడు, యెహోవా వెంటనే అతన్ని మొత్తలేదు. మహాద్భుతంగా, విభిన్నరీతుల్లో యెహోవా శక్తిని ప్రదర్శించే పది తెగుళ్లు ఆ దేశంలో సంభవించాయి. ఏడవ హెచ్చరిక చేసినప్పుడు, ఫరోను అతని ప్రజల్ని భూమ్మీద ఉండకుండా తాను అతి సులభంగా నాశనంచేయగలనని యెహోవా అతనితో చెప్పాడు. అయితే, “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” అని యెహోవా సెలవిచ్చాడు.—నిర్గ. 9:15, 16.

7 యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు, ఆయన నామము నిజంగా దిశదిశలా తెలియబడింది. నేటికి అనగా దాదాపు 3,500 సంవత్సరాల తర్వాతకూడ ఆయన చేసింది మరువబడలేదు. దేవుని వ్యక్తిగత నామము మాత్రమే కాదుగాని, ఆ నామము ధరించిన వ్యక్తిని గూర్చిన సత్యము కూడ ప్రకటింపబడింది. నిబంధనలు నెరవేర్చి తన సేవకుల పక్షముగా చర్య గైకొను దేవుడని ఇది యెహోవా ప్రతిష్ఠను స్థిరపర్చింది. ఆయనకున్న సర్వశక్తినిబట్టి ఏదియు ఆయన సంకల్పాన్ని అడ్డగించలేదని అది ప్రదర్శించింది. ఈ సమస్త దృశ్య, అదృశ్య దుష్ట విధానమంతటికి సమీపిస్తున్న నాశనం మరింత గట్టి రుజువునిస్తుంది. ఆ సర్వశక్తి ప్రదర్శన, అట్లే దానివల్ల యెహోవా నామమునకు కలిగే మహిమ విశ్వ చరిత్రలో ఇక ఎన్నటికిని మరువబడదు. దాని ప్రయోజనాలు అనంతములు!—యెహె. 38:23; ప్రక. 19:1, 2.

‘ఆహా దేవుని బుద్ధి బాహుళ్యము ఎంతో గంభీరము!’

8. అదనంగా మరింకే వాస్తవాల్ని విచారించుమని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు?

8 రోమీయులకు తాను వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ ప్రశ్న లేవదీస్తున్నాడు: “దేవునియందు అన్యాయము కలదా?” ఆ పిమ్మట ఫరోకు యెహోవా చెప్పిన దానిని సూచించుట ద్వారా దేవుని కనికరాన్ని నొక్కితెల్పుతూ ఆయనిలా జవాబిస్తున్నాడు. మానవులమైన మనం కుమ్మరి చేతిలోని మంటిముద్దవలె ఉన్నామనే వాస్తవాన్ని కూడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తానెందుకిలా రూపింపబడితినని మంటిముద్ద ఫిర్యాదు చేయునా? పౌలు ఇంకను ఇలా అంటున్నాడు: “దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?”—రోమా. 9:14-24.

9. (ఎ) ‘నాశనానికి సిద్ధంచేయబడిన ఉగ్రతా పాత్రమైన ఘటములుగా’ ఎవరున్నారు? (బి) వారి వ్యతిరేకతవున్ననూ యెహోవా ఎందుకు బహు దీర్ఘశాంతము చూపించాడు, తుది ఫలితం ఎలా ఆయనను ప్రేమించు వారికి మేలుగా పరిణమిస్తుంది?

9ఆదికాండము 3:15 లో వ్రాయబడిన ప్రవచనార్థక మాటల్ని యెహోవా సెలవిచ్చిన దగ్గరనుండి, సాతాను అతని సంతానము ‘నాశనానికి సిద్ధంచేయబడిన ఉగ్రతా పాత్రమైన ఘటములుగా’ ఉన్నారు. ఆ కాలమంతటిలో యెహోవా దీర్ఘశాంతం చూపాడు. దుష్టులు ఆయన మార్గాల్ని అపహసించారు; వారాయన సేవకుల్ని హింసించారు, ఆయన కుమారున్ని సహితం హత్యచేశారు. అయితే యెహోవా తన సేవకుల ప్రయోజనార్థం ఎంతో ఆశానిగ్రహాన్ని ప్రదర్శించాడు. దేవునికి వ్యతిరేకంగా చేయబడిన తిరుగుబాటుయొక్క వినాశనకర ఫలితాల్ని యావత్‌ సృష్టి చూసే అవకాశం కలిగింది. అదే సమయంలో, యేసు మరణం ‘అపవాది క్రియల్ని లయపరచునట్లును,’ విధేయతచూపు మానవజాతికి విడుదలను సుగమంచేసింది.—1 యోహా. 3:8; హెబ్రీ. 2:14, 15.

10. గత 1,900 సంవత్సరాలుగా యెహోవా ఎందుకు దుష్టులను సహిస్తూవచ్చాడు?

10 యేసు పునరుత్థానుడైన దగ్గరనుండి అనగా దాదాపు 1,900 సంవత్సరాలకు పైగా యెహోవా ఆ “ఉగ్రతా పాత్రమైన ఘటములను” నాశనం చేయకుండా మరెంతగానో సహించాడు. ఎందుకు? ఎందుకనగా ఆయన పరలోక రాజ్యమందు యేసుక్రీస్తుతో సహవసించు వారిని అనగా స్త్రీ సంతానమందలి రెండవ భాగాన్ని సిద్ధం చేస్తూవచ్చాడు. (గల. 3:29) సంఖ్యకు 1,44,000 మందిగావున్న వీరే అపొస్తలుడైన పౌలు చెప్పిన “కరుణాపాత్ర ఘటములు.” ఈ తరగతి వారగుటకు మొదట యూదులనుండి ఆయావ్యక్తులు ఆహ్వానింపబడ్డారు. ఆ పిమ్మట సున్నతిపొందిన సమరయులు, ఆలాగే చివరకు అన్య జనాంగముల ప్రజలు అందులో చేర్చబడ్డారు. తనను సేవించుమని ఎవరినీ బలవంతపెట్టక యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చాడు, అయితే తన ప్రేమపూర్వక ఏర్పాట్లకు మెప్పుతో ప్రతిస్పందించిన వారిపై దివ్యాశీర్వాదాలు కుమ్మరిస్తూవచ్చాడు. ఇప్పుడా పరలోక తరగతి వారిని సిద్ధంచేయుట దాదాపు పూర్తికావచ్చింది.

11. యెహోవా దీర్ఘశాంతము నుండి మరేగుంపు ఇప్పుడు ప్రయోజనం పొందుచున్నది?

11 మరి భూ నివాసుల విషయమేమి? దేవుని నియమిత సమయంలో రాజ్య భూ సంబంధమైన ప్రజలుగా వందలకోట్ల మంది పునరుత్థానులౌతారు. ఆలాగే, ముఖ్యంగా సా.శ. 1935 నుండి యెహోవా దీర్ఘశాంతము, వారి రక్షణ దృష్ట్యా అన్ని జనాంగములనుండి ఒక “గొప్పసమూహము” సమకూర్చబడేలా వీలు కల్గించింది.—ప్రక. 7:9, 10; యోహా. 10:16.

12. (ఎ) తత్ఫలితంగా, మనం యెహోవాను గూర్చి ఏమి నేర్చుకున్నాము? (బి) ఈ విషయాలతో యెహోవా వ్యవహరించిన విధానానికి మీరెలా ప్రతిస్పందిస్తారు?

12 దీనియంతటిలో అన్యాయమేమైనా ఉందా? ఎంతమాత్రం లేదు! ఆయన తన సంకల్పానికనుగుణ్యముగా ఇతరుల ఎడల కరుణ చూపడానికి, ‘ఉగ్రతా పాత్రమైన ఘటములగు’ దుష్టుల నాశనాన్ని దేవుడు జాగుజేస్తే ఇక ఎవరైనా ఎలా ఫిర్యాదు చేయగలరు? బదులుగా, ఆయన సంకల్పం వెల్లడికావడాన్ని గమనిస్తుండగా, మనం యెహోవాను గూర్చి మరింత నేర్చుకుంటాము. వెలుగునకు వచ్చిన ఆయన వ్యక్తిత్వపు ముఖరూపాలు అనగా ఆయన న్యాయము, కరుణ, దీర్ఘశాంతము, జ్ఞాన బాహుళ్యత మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ వివాదాంశముతో యెహోవా జ్ఞానయుక్తముగా వ్యవహరించిన విధానం ఆయన పరిపాలనే శ్రేష్ఠమనే వాస్తవానికి రుజువుగా నిరంతరం నిలుస్తుంది. అపొస్తలుడైన పౌలుతోపాటు మనమూ ఇలా అందాము: “ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు!”—రోమా. 11:33.

మన భక్తినిచూపే అవకాశము

13. (ఎ) మనం వ్యక్తిగతంగా శ్రమననుభవించినప్పుడు మనకెట్టి అవకాశమివ్వబడుతుంది? (బి) జ్ఞానయుక్తముగా ప్రతిస్పందించుటకు మనకేది సహాయం చేస్తుంది?

13 దేవుడు దుష్టులను నాశనం చేయలేదు మరియు ప్రవచింపబడినట్లు మానవజాతిని ఇంకనూ పునరుద్ధరించలేదు గనుక నిజముగా వ్యక్తిగత శ్రమను ఇమిడ్చే పరిస్థితులున్నాయి. అలాంటివాటి విషయంలో మన ప్రతిస్పందన ఏమి? వాటిలో యెహోవా నామముపైగల నిందను తొలగించు అవకాశాలను వెదకి అపవాదిని అబద్ధికుడని మనం నిరూపిస్తామా? ఈ సలహాను మదిలో ఉంచుకొనుట ద్వారా అలాచేయుటకు మనమెంతో బలం పొందగలము: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామె. 27:11) ప్రజలు వస్తుదాయకముగా ఇబ్బందిపడితే లేదా శారీరకంగా బాధలపాలైతే వారు దేవుని దూషిస్తారని, ఆయనను శపిస్తారని యెహోవాను నిందించే సాతాను ఆరోపించాడు. (యోబు 1:9-11; 2:4, 5) ఎన్ని శ్రమలెదుర్కొన్ననూ దేవునియెడల యథార్థంగా ఉండుట ద్వారా మనం యెహోవా హృదయాన్ని సంతోషింపజేస్తాము, అట్టి ఆరోపణలు మన విషయంలో నిజంకాదని ప్రదర్శిస్తాము. యోబు విషయంలో వలెనే యెహోవాకు తన సేవకులయెడల వాత్సల్యపూర్వకమైన అనురాగముందని, నమ్మకమైన వారమని మనం నిరూపించుకుంటే తగిన కాలంలో యెహోవా ఉదారంగా ప్రతిఫలమిస్తాడని మనకు పూర్తి నమ్మకముంది.—యాకో. 5:11; యోబు 42:10-16.

14. శ్రమలు అనుభవించేటప్పుడు మనం యెహోవాపై ఆధారపడితే, మనకెటువంటి ఇతర ప్రయోజనాలు రాగలవు?

14 దుఃఖకరమైన శ్రమల్ని అనుభవిస్తున్నప్పుడు మనం నమ్మకముతో యెహోవాపై ఆధారపడితే, మనం అమూల్యమైన లక్షణాల్ని వృద్ధిచేసుకోగలము. యేసు పడిన శ్రమల ఫలితంగా, ఆయన తనకిదివరకు ఎన్నడూ తెలియని “విధేయతను నేర్చుకొనెను.” మనము కూడా దీర్ఘశాంతమును, సహనమును, యెహోవా నీతి మార్గాలయెడల ప్రగాఢమైన మెప్పును వృద్ధిచేసుకోవడాన్ని నేర్చుకోవచ్చును. ఆ శిక్షణను మనం ఓపికతో అంగీకరిస్తామా?—హెబ్రీ. 5:8, 9; 12:11; యాకో. 1:2-4.

15. కష్టాల్ని మనం ఓపికతో సహిస్తుండగా, ఇతరులెలా ప్రయోజనం పొందవచ్చు?

15 మనం చేసే పనుల్ని ఇతరులు గమనిస్తారు. నీతియెడల మనకున్న ప్రేమ కారణంగా మనం అనుభవించే దానినిబట్టి, యుక్తకాలమందు వారిలో కొందరు నేడు క్రీస్తు నిజ “సహోదరులు” ఎవరో గుణగ్రహించవచ్చు మరియు ఆరాధనలో ఆయనయొక్క ఈ ‘సహోదరులతో’ ఏకమగుట ద్వారా వారునూ నిత్యజీవపు ఆశీర్వాదాలు పొందేవారిలో ఉండగలరు. (మత్త. 25:34-36, 40, 46) వారా అవకాశాన్ని కలిగివుండాలని యెహోవా, ఆయన కుమారుడు కోరుతున్నారు. మరి మనమో? మనం దానిని సాధ్యపరచేందుకు కష్టాల్ని ఓర్చుకొన నిష్టపడుతున్నామా?

16. అట్టి వ్యక్తిగత కష్టాల విషయమైన మనదృష్టి ఎలా ఏకతకు సంబంధం కలిగివుంది?

16 ఆ విధంగా, జీవితంలోని కష్ట పరిస్థితులు యెహోవాయెడల యథార్థత చూపుటకు, ఆలాగే ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో భాగం వహించుటకు అవకాశాలిస్తాయని మనం దృష్టించుట ఎంత శ్రేష్ఠమో గదా! మనమలాచేయడమనేది, నిజ క్రైస్తవులందరి పక్షముగా యేసు ప్రార్థించినట్లు దేవునితోను, క్రీస్తుతోను ఏకమగుటవైపు మనం వాస్తవంగా కదలుచున్నామనే రుజువు ఇవ్వగలదు.—యోహా. 17:20, 21.

పునఃసమీక్షా చర్చ

• కీడును అనుమతిస్తూనే, యెహోవా ఎలా తన నామము ఎడల సరియైన రీతిలో గొప్ప గౌరవాన్ని చూపాడు?

• “ఉగ్రతా పాత్రమైన ఘటముల” ఎడల దేవుడు చూపిన సహనం, మనవరకూ ఆయన కరుణ చేరడాన్ని ఎలా సాధ్యపరచింది?

• మనం స్వయంగా అనుభవించే కష్ట పరిస్థితుల్లో ఏమి చూడటానికి మనం కృషిచేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]