జీవము, రక్తము—మీరు వాటిని పవిత్రముగా చూస్తారా?
అధ్యాయం 20
జీవము, రక్తము—మీరు వాటిని పవిత్రముగా చూస్తారా?
1. (ఎ) జీవాన్ని దేవుడెట్లు దృష్టిస్తున్నాడు? (బి) దేవుని జీవవరాన్ని గుణగ్రహిస్తున్నామని మనమెట్లు ప్రదర్శించగలం?
జీవముయెడల దేవుని దృక్కోణం లోక దృక్కోణానికి బహు భిన్నంగా ఉన్నదనుట మనల్ని ఆశ్చర్యపర్చకూడదు. దేవునికి మానవ జీవం పవిత్రం. మీరూ దానినదే విధంగా చూస్తారా? మనం పూర్తిగా “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు” దేవునిపై ఆధారపడివున్నాము. (అపొ. 17:25-28; కీర్త. 36:9) మనం దేవుని దృక్కోణాన్ని పంచుకుంటే, మనం మన జీవాన్ని సంరక్షిస్తాము. అయితే మన ప్రస్తుత జీవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం దైవ నియమాన్ని ఉల్లంఘించము. తన కుమారునియందు నిజంగా విశ్వసించువారికి నిత్యజీవమిస్తాననే దేవుని వాగ్దానాన్ని మనం గాఢంగా నమ్ముతాం—మత్త. 16:25, 26; యోహా. 6:40; యూదా 21.
2. జీవం విషయంలో లోకం ఎవరి దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నది, ఇది కొన్నిసార్లు ఎటువంటి తర్కాలకు దారితీస్తుంది?
2 దీనికి భిన్నంగా, ఈ లోక పరిపాలకుడైన అపవాదియగు సాతాను “ఆదినుండి . . . నరహంతకుడై” ఉన్నాడని యేసు చెప్పాడు. (యోహా. 8:44; 12:31) తన తిరుగుబాటు ధోరణివల్ల ఆరంభంనుండే అతడు మానవజాతికి మరణం తెచ్చాడు. లోకపు హింసాయుత చరిత్ర అతని స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నది. అయితే అందుకు భిన్న రూపాన్నికూడ సాతాను చూపెట్టగలడు. ఆ విధంగా అతని ఆలోచనా సరళిచే ప్రభావానికి లోనైన ప్రజలు, మతపరంగా ఉండుట మంచిదేగాని ప్రాణాపాయ స్థితిలో బైబిలుకు బదులు “నిపుణుల” సలహా పాటించుట ప్రయోజనకరమౌతుందని వాదిస్తారు. (2 కొరింథీయులు 11:14, 15 పోల్చండి.) జీవన్మరణ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఎటువైపు మీ హృదయం మొగ్గుచూపుతుంది? నిస్సందేహంగా, యెహోవాను ప్రీతిపర్చుటే మన కోరికైయుండాలి.
3. (ఎ) రక్తాన్నిగూర్చి బైబిలుచెప్పే విషయమందు మనమెందుకు ప్రత్యేకంగా శ్రద్ధకలిగివుండాలి? (బి) ఆదికాండము 9:3-6, అపొస్తలుల కార్యములు 15:28, 29 చదివి పైనున్న ప్రశ్నలకు ఈ వచనాలతో జవాబులివ్వండి.
3 జీవానికి, రక్తానికివున్న అవినాభావ సంబంధాన్ని బయలుపరస్తూ దేవుని వాక్యమిలా చెబుతున్నది: “రక్తము దేహమునకు ప్రాణము.” జీవమెంత పవిత్రమో దేవుడు రక్తాన్నికూడ అంతే పవిత్రంగా చేశాడు. అది ఆయనకే చెందినది, ఆయన అంగీకరించు రీతిలోనే దాన్ని ఉపయోగించాలి. (లేవీ. 17:3, 4, 11; ద్వితీ. 12:23) కాబట్టి రక్తం విషయంలో ఆయన కోరే విషయాల్ని మనం జాగ్రత్తగా విచారించుట మంచిది.
ఆదికాండము 9:3-6 చదవండి
మీ ప్రాంతమందలి ఏ అభ్యాసాల్నిబట్టి జంతు రక్తాన్ని తినకుండునట్లు మీరు జాగ్రత్తపడాలి?
జంతు రక్తాన్ని గూర్చి 4వ వచనంలో చెప్పబడినదాని దృష్ట్యా, (రోమన్ గ్లాడిటోరియల్ ఆటల్లో చేయబడినట్లు) మానవ రక్తాన్ని త్రాగే విషయంలో మీరెలా ప్రతిస్పందిస్తారు?
5, 6 వచనాల్లో చూపబడినట్లుగా, మానవ రక్తాన్ని చిందించే విషయంలో ప్రాథమికంగా ఒకడు ఎవరికి జవాబు చెప్పాలి?
అపొస్తలుల కార్యములు 15:28, 29 చదవండి
ఇది కేవలం పరిమిత కాలంవరకే ఆ నియమాలు అన్వయిస్తాయని చెబుతున్నదా? అవి మనకూ అన్వయిస్తాయా?
ఇక్కడ ఉపయోగింపబడిన భాషనుబట్టి మానవ రక్తం మినహాయింపబడిందా?
అత్యవసర పరిస్థితుల్లో తగిన మార్పులు చేసుకోవచ్చని ఆ వచనం సూచిస్తున్నదా?
4. ఇక్కడ చర్చించినట్లుగా, రక్తాపరాధంలో భాగం వహించకుండా ఉండాలంటే ఒక వ్యక్తి ఏమిచేయాల్సి ఉంటుందని లేఖనాలు చూపిస్తున్నాయి?
4 మానవ రక్తం విషయంలో, కేవలం నరహత్య చేయకుంటే చాలు మనం దోషరహితులముగా ఉంటామని తలంచలేము. దేవునియెదుట రక్తాపరాధంగల ప్రక. 18:4, 24; మీకా 4:3) అట్టి చర్య అత్యవసరం.
ఏదైనా సంస్థలో మనమొకవేళ భాగస్థులమైయుంటే, దాని పాపాల్లో పాలివారం కాకుండావుండాలని కోరితే, మనం దానితో తెగతెంపులు చేసుకోవాలని లేఖనాలు చూపిస్తున్నాయి. (5. రక్తాపరాధం లేకుండా ఉండటానికి ప్రాంతీయ పరిచర్యలో పట్టుదలతో సేవచేయుట ఎలా ముడిపడివుంది?
5 మహాశ్రమల్లో రానైయున్న నాశనాన్నిగూర్చి హెచ్చరించాలని ఆజ్ఞాపింపబడిన దేవుని సేవకుల విషయానికొస్తే, రక్తాపరాధం లేకుండా ఉండటానికి వారు నమ్మకంగా ఆ వర్తమానాన్ని ప్రకటించాలి. (యెహెజ్కేలు 3:17-21 పోల్చండి.) తనకప్పగింపబడిన పరిచర్యనుబట్టి సమస్త ప్రజలకు తాను రుణపడివున్నానని అపొస్తలుడైన పౌలు తనను దృష్టించుకున్నాడు. రక్షణ కొరకు దేవుడుచేసిన ఏర్పాటును గూర్చి సంపూర్ణంగా సాక్ష్యమిచ్చిన తర్వాత మాత్రమే వారి రక్తం విషయంలో తనకే బాధ్యతలేనట్లు ఆయన భావించాడు. (రోమా. 1:14, 15; అపొ. 18:5, 6; 20:26, 27) యెహోవాసాక్షులందరి మీదగల బాధ్యతయెడల అదేవిధమైన అప్రమత్తతను ప్రాంతీయ పరిచర్యలోని మీ పట్టుదల ప్రతిబింబిస్తున్నదా?
6. ప్రమాదం జరక్కుండా చూడటానికి జీవ పవిత్రతయెడల గౌరవం చూపడానికి ఏమి సంబంధం?
6 మరణకరమగు ప్రమాదాలుకూడ మనకు గంభీరమైన విషయాలుగా ఉండాలి. మోషే ధర్మశాస్త్రం క్రింద ప్రమాదవశాత్తు తోటి మానవునికి ప్రాణాపాయం కల్గించే వ్యక్తులు నిర్దోషులుగా దృష్టించబడేవారు కాదు. వారికి తగిన శిక్షలు వేయబడేవి. (నిర్గ. 21:29, 30; ద్వితీ. 22:8; సంఖ్యా. 35:22-25) అందు ఇమిడియున్న సూత్రాన్ని మనం మనస్సుకు తీసుకుంటే, వాహనాన్ని నడిపే పద్ధతి ద్వారా, మన గృహమందు లేదా వ్యాపార స్థలమందు మన అవివేక చర్యద్వారా లేదా అభద్రతా పరిస్థితులను అనుమతించుట ద్వారా మరణకరమగు ప్రమాదాలకు తావివ్వకుండా మనం జాగ్రత్తగా ఉంటాము. ఈ విషయాల ఎడలగల మీ దృక్పథం జీవ పవిత్రత కొరకైన మీ నిండు మెప్పును ప్రతిబింబిస్తుందా?
వైద్యపరంగా రక్తాన్ని ఉపయోగించుట విషయమేమిటి?
7. (ఎ) ఒకరి రక్తాన్ని మరో మానవునికి ఎక్కించడం రక్తంయొక్క పవిత్రతకు అనుగుణ్యంగా ఉంటుందా? (బి) ‘రక్తమును విసర్జించుడి’ అనే ఆజ్ఞను మొదటి శతాబ్ద అభ్యాసాలకు మాత్రమే పరిమితం చేయడం ఎందుకు అసమంజసం?
7 ఈ అభ్యాసం క్రొత్తది కాకపోయిననూ, జీవం కాపాడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ 20వ శతాబ్దంలో రక్తమార్పిడిలు విస్తారంగా చేయబడుతున్నవి. రక్తము, రక్తమందలి ప్రాథమిక ధాతువులు ఈ విధంగా ఉపయోగింపబడుతున్నాయి. అట్టి వైద్య విధానాలు రోగి మరణించడన్న అభయాన్నివ్వవు. నిజానికి కొన్నిసార్లు, అలా రక్తం ఉపయోగించడంవల్ల ఏకంగా మరణమే సంభవిస్తుంది. అయితే మరి ప్రాముఖ్యమైన విషయమేమంటే, ‘రక్తమును విసర్జించుడనే’ బైబిలు నియమం ఈ వైద్య అభ్యాసానికి అన్వయిస్తుందా? అవును! మరే ఇతర ప్రాణి అనగా మానవుని లేదా జంతు రక్తాన్ని ఒకడు తన శరీరంలోనికి ఎక్కించుకొనుట దైవిక నియమాన్ని ఉల్లంఘిస్తుంది. అది రక్తపు పవిత్రతను అగౌరవపర్చడాన్ని చూపిస్తుంది. (అపొ. 15:19, 20) ‘రక్తమును విసర్జించుడనే’ ఆజ్ఞను కేవలం మొదటి శతాబ్దపు అభ్యాసాలకే పరిమితంచేసి ఆధునిక వైద్య సాంకేతిక పద్ధతుల్ని అందు చేర్చకుండుటకెట్టి ఆధారములేదు. విషయాన్నిలా తర్కించండి: నరహత్యకు వ్యతిరేకంగా ఇవ్వబడిన ఆజ్ఞయందు, ఎంతో కాలం తర్వాతే తుపాకీలను కనిపెట్టారు గనుక తుపాకితో అక్రమంగా మానవ జీవాన్ని తీయుట చేర్చబడలేదని ఎవరంటారు? త్రాగుబోతుతనాన్ని నిషేధించుట కేవలం మొదటి శతాబ్దమందు తెలియబడిన పానీయాలకేగాని, ఆధునిక దిన సారా పానీయాలకు అన్వయించదని వాదించుట సమంజసమా? దేవుని ప్రీతిపర్చాలని నిజంగా కోరుకునే వ్యక్తులకు, ‘రక్తమును విసర్జించుడనే’ ఆజ్ఞచే అందజేయబడిన సందేశం విస్పష్టం.
8. (ఎ) ఒకానొక వైద్య విధానం క్రైస్తవునికి సరిపోతుందా లేదాయని మీరెలా తీర్మానించుకోగలరు? (బి) మీ రక్తాన్నే కొంత నిలువచేసి, శస్త్రచికిత్సా సమయంలో దాన్ని మరలా మీకే ఎక్కించాలని వైద్యుడు ఒకవేళ కోరితే, సరియైన నిర్ణయం చేయడానికి బైబిలునందలి ఏ సూత్రాలు మీకు సహాయపడగలవు? (సి) చికిత్సకు శరీరం వెలుపల మరోపరికరం ద్వారా రక్తప్రసరణ జరగాల్సి ఉండటాన్ని ఒక వ్యక్తి ఎలా తర్కించవచ్చు?
8 అయినప్పటికి, కొన్ని వైద్య విధానాల సంశ్లిష్టత ఆయా ప్రశ్నల్ని లేవదీయవచ్చు. ఇవెలా పరిష్కరింపబడాలి? మొదట, ప్రతిపాదింపబడిన వైద్య విధానాన్ని గూర్చిన స్పష్టమైన వివరణ ఇవ్వమని మీ వైద్యుణ్ణి అడగండి. ఆ తర్వాత దాన్ని ద్వితీ. 12:24) మనమీనాడు ఆ ధర్మశాస్త్ర నియమాల క్రింద లేము, అయితే అందు అంతర్లీనంగానున్న సందేశమేమంటే రక్తం పవిత్రం గనుక, దానినొక ప్రాణినుండి తీసినప్పుడు దేవుని పాదపీఠమగు నేలపై పారబోయుట ద్వారా ఆయనకే దానిని తిరిగి ఇవ్వాలి. (మత్తయి 5:34, 35 పోల్చండి.) కాబట్టి మీ రక్తాన్ని (కొద్ది సమయమే అయినా) నిలువవుంచి మరలా మీ శరీరంలో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం? కాని వైద్యుడు శస్త్రచికిత్సప్పుడు లేదా మరో చికిత్సా సమయంలో మీ రక్తమే మీ శరీరం వెలుపలగల మరో పరికరం ద్వారా స్రవించి తిరిగి మీ శరీరంలోనికి ప్రవేశించే ఏర్పాటుచేస్తానని చెప్పినట్లయిన అప్పుడేమిటి? దానికి మీరంగీకరిస్తారా? ఆ పరికరం రక్తరహిత ద్రావకంచే సిద్ధంచేయబడితే, దీనిని అనుమతించవచ్చునని కొందరు మంచి మనస్సాక్షితో భావించారు. ఆ బయటి పరికరాన్ని వారు తమ ప్రసరణ విధానంయొక్క ప్రసారకంగా అదనపు దృష్టించారు. పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి, కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అయితే మీ నిర్ణయం దేవునియెదుట మిమ్మల్ని నిర్మలమైన మనస్సాక్షిగలవారిగా నిలబెట్టాలి.—1 పేతు. 3:16; 1 తిమో. 1:19.
బైబిలు సూత్రాల వెలుగులో విశ్లేషించండి. మీ రక్తమే కొంత నిలువజేసి, అవసరమైతే ఆ తర్వాత శస్త్రచికిత్సా సమయంలో తిరిగి మీకు ఎక్కించబడుతుందని వైద్యుడు సూచించవచ్చు. మీరంగీకరిస్తారా? మోషే ద్వారా ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఒక ప్రాణినుండి తీసిన రక్తాన్ని నేలమీద పారబోయవలసి ఉండెనని గుర్తుంచుకోండి. (9. (ఎ) ‘రక్తమును విసర్జించుడనే’ మీ నిర్ణయాన్ని గౌరవించడాన్ని రూఢిపర్చుటకు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? (బి) అత్యవసర సమయంలో సహితం, కొన్నిసార్లు అప్రీతికర పరిస్థితులనెలా తప్పించుకోవచ్చు? (సి) ఒక వైద్యుడు లేదా న్యాయస్థానం రక్తమార్పిడికి ఒత్తిడిచేయ ప్రయత్నిస్తే, మీరేం చేస్తారు?
9 ‘రక్తమును విసర్జించుడనే’ మీ నిర్ణయాన్ని మీ వైద్యుడు గౌరవిస్తాడని రూఢిపర్చుకోవడానికి, వైద్యపరంగా ఎటువంటి అత్యవసర పరిస్థితి రాకముందే ఆయనతో మాట్లాడండి. చికిత్స కొరకు ఏదైనా వైద్యశాలకు వెళ్లాల్సివస్తే, ఏ విధంగాను రక్తము ఉపయోగించకూడదను వ్రాతపూర్వక విన్నపం చేయడానికి ముందే జాగ్రత్తపడండి, అంతేకాదు మిమ్మల్ని పరీక్షించే వైద్యునితో ఆ విషయాన్ని గూర్చి వ్యక్తిగతంగా మాట్లాడండి. కాని అనుకోని అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్పుడేమిటి? సామె. 15:1; 16:21, 23) అయితే, నిపుణతగల వైద్య సిబ్బంది రక్తాన్ని తిరస్కరిస్తే అది మీ జీవానికే ముప్పని ఒత్తిడిచేస్తూ, మీరు ఒప్పుకోవడానికి బలవంతపెడితే అప్పుడెలా? యెహోవా మార్గాల సత్యత్వంయెడల మనకున్న విశ్వాసం మనం స్థిరంగా ఉండేలాచెయ్యాలి. మనం మనుష్యులకు కాదు దేవునికే లోబడాలని ఎంచుకున్నందున, యెహోవాయెడల మన యథార్థత అట్టివాటిని తీర్మానపూర్వకంగా తిరస్కరించేలా చెయ్యాలి.—అపొ. 5:29; యోబు 2:4; సామెతలు 27:11 పోల్చండి.
మీ క్రైస్తవ మనస్సాక్షిని గౌరవిస్తూ, మీకు సహాయం చేయడానికి తన నైపుణ్యతను ఉపయోగించవలసిందిగా వైద్యునితో గౌరవంగా, కారణసహితంగా చర్చించుట ద్వారా తరచు అప్రీతికర పరిస్థితులనెదుర్కోవడాన్ని తప్పించుకోవచ్చు. (విషయమెంత గంభీరం?
10. జీవరక్షణకు రక్తమార్పిడి అవసరమని చెప్పుట ఆ విషయమైన మన దృక్పథాన్ని ఎందుకు మార్చదు?
10 యెహోవానింకా ఎరుగని వ్యక్తులకు రక్తమార్పిడుల విషయమై చేసే వాదాలు కొన్నిసార్లు జీవ పవిత్రతను మరీయెక్కువ లక్ష్యపెడుతున్నట్లుగా కన్పించవచ్చు. అయితే ఇలా వాదించు వారనేకులు గర్భస్రావం ద్వారా జీవనాశనాన్ని సహితం సహిస్తారని మనం మర్చిపోకూడదు. ఏ వైద్య “నిపుణుని” కంటే జీవరక్తాల్ని గూర్చి యెహోవాకే ఎక్కువ తెలుసు. మన ప్రస్తుత, భవిష్యత్ ఉత్తరాపేక్షలను కాపాడుతూ మనమేలుకొరకే ఆయన ఆజ్ఞలన్ని ఇవ్వబడ్డాయని నిరూపించబడ్డాయి. (యెష. 48:17; 1 తిమో. 4:8) ‘రక్తమును విసర్జించుడనే’ ఆజ్ఞ దీనికి భిన్నంగా ఉందా?
11. (ఎ) రక్తం విషయంలో ఏమిచేయుటకు మాత్రమే యెహోవా ఇశ్రాయేలీయులును అనుమతించాడు? (బి) క్రైస్తవులుగా ఇది మనకెందుకు చాలా ప్రాముఖ్యం?
11 రక్తాన్ని దేనికొరకు మాత్రమే ఉపయోగించాలని యెహోవా సెలవిచ్చాడో దానిద్వారా రక్త పవిత్రతను గౌరవించే గంభీరత నొక్కిచెప్పబడింది. “రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తముచేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని . . . నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.” (లేవీ. 17:11, 12) ఆ నియమానికనుగుణ్యంగా యెహోవా బలిపీఠంనొద్ద పోయబడిన జంతు రక్తమంతయు యేసుక్రీస్తు అమూల్య రక్తానికి ఛాయగా ఉండెను. (హెబ్రీ. 9:11, 12; 1 పేతు. 1:18, 19) ఆ విధంగా యేసు రక్తంయొక్క పవిత్రత రక్తాన్ని మరే విధంగా ఉపయోగించడాన్ని నిషేధించిన దేవుని నియమం ద్వారా నొక్కిచెప్పబడింది. రక్తాన్ని ఏ విధంగా దుర్వినియోగంచేసినా అది రక్షణకు తన కుమారునిద్వారా యెహోవాచేసిన ఏర్పాటుకు ఘోరమైన అగౌరవాన్ని చూపుటేనని దీనినుండి గమనించవచ్చు.
12. మరణమెదురైననూ, బ్రతికియుండాలనే ప్రయత్నంలో ఒక నిజ క్రైస్తవుడెందుకు రక్తాన్ని దుర్వినియోగపర్చడానికి ఎంచుకోడు?
12 జీవన్మరణ పరిస్థితినెదుర్కొన్నప్పుడు, దేవునికి వెన్నుజూపుట ఎంత మందదృష్టియో గదా! విషయమెరిగిన వైద్యుల సేవల్ని మనమభినందించినా, ఈ జీవితమే సమస్తమన్నట్లుగా దేవుని నియమాన్ని ఉల్లంఘించుట ద్వారా మనల్ని లేదా మనం ప్రేమించినవారిని మరికొన్ని దినాలు లేదా సంవత్సరాలు బ్రతికివుండటానికి విఫలయత్నం చేయము. యేసు చిందించిన విలువైన రక్తమందు, అది సాధ్యపరచే నిత్యజీవమందు మనకు విశ్వాసమున్నది. దేవుని నమ్మకమైన సేవకులందరు—ఒకవేళ వారు చనిపోయినా—నిత్యజీవమను బహుమానం పొందుతారని మనం హృదయపూర్వకంగా నమ్ముతాము.—యోహా. 11:25; 1 తిమో. 4:10.
పునఃసమీక్షా చర్చ
• జీవమును, రక్తమును ఏది పవిత్రపరుస్తుంది? లోకమెందుకు ఒక భిన్న దృక్కోణం కొరకు వాదిస్తుంది?
• జంతువుల విషయంలో, రక్త పవిత్రతయెడల మనమెలా గౌరవం చూపిస్తాం?
• మానవ జీవం పవిత్రమని ఏ వివిధ రీతుల్లో మనందరం చూపిస్తాము? అలా చేయుట ఎంత ప్రాముఖ్యము?
[అధ్యయన ప్రశ్నలు]