‘నేను మీతో ఒక రాజ్య నిబంధన చేస్తున్నాను’
అధ్యాయం 14
‘నేను మీతో ఒక రాజ్య నిబంధన చేస్తున్నాను’
1. మరణించడానికి ముందు రాత్రి యేసు తన అపొస్తలులయెదుట ఎలాంటి ఉత్తరాపేక్షనుంచాడు?
తన మరణానికి ముందు రాత్రి యేసు తన నమ్మకమైన అపొస్తలులకిలా చెప్పాడు: ‘నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.’ ఆయనింకా ఇలా అన్నాడు: “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (యోహా. 14:2, 3; లూకా 22:29) వారియెదుట ఆయన ఎంత అద్భుతకరమైన ఉత్తరాపేక్షను ఉంచాడో గదా!
2. క్రీస్తు పరలోక రాజ్యమందు ఎంతమంది ఆయనతో పాలుపంచుకుంటారు?
2 అయితే ఆ అపొస్తలులు మాత్రమే పరలోక రాజ్యమందు తనతో పరిపాలిస్తారని యేసు భావంకాదు. ఈ భూమినుండి తీసుకోబడిన 1,44,000 మంది ఆ మహాగొప్ప ఆధిక్యతను కలిగివుంటారని ఆ తర్వాత తెల్పబడింది. (ప్రక. 5:9, 10; 14:1, 4) నేడుకూడ కొందరట్టి ఆధిక్యత పొందుటకు అర్హులౌతున్నారా?
రాజ్య వారసులను సమకూర్చుట
3. తన బహిరంగ పరిచర్యలో, ఏ అవకాశంపై యేసు దృష్టి మళ్లించాడు?
3 హేరోదు అంతిప బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో వేయించిన తర్వాత, “పరలోకరాజ్యము” మీద దృష్టి కేంద్రీకరిస్తూ యేసు బహిరంగముగా ప్రకటించు పనిని ముమ్మరం చేశాడు. (మత్త. 4:12, 17) ఆ రాజ్యంలో ప్రవేశించు అవకాశముందని ఆయన ప్రజలకు తెలియజెప్పాడు మరియు ఆయన శిష్యులు ఆ బహుమానం పొందడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు.—మత్త. 5:3, 10, 20; 7:21; 11:12.
4. (ఎ) యేసు శిష్యులు మొదట ఎప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు? (బి) అప్పటినుండి రాజ్యవారసులను సమకూర్చుటపై శ్రద్ధ నిల్పబడిందని ఏది చూపిస్తున్నది?
4 సా.శ. 33 పెంతెకొస్తునాడు వారిలో మొదటివారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. (అపొ. 2:1-4; 2 కొరిం. 1:21, 22) పరలోకంలో అమర్త్యమైన జీవానికి నడిపే దేవుని రక్షణ ఏర్పాటు వెల్లడిచేయబడింది. ఈ జ్ఞానం పొందడానికి పేతురు ఈ “పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులను” మొదట యూదులకు, తర్వాత సమరయులకు ఆ పిమ్మట అన్యజనులకు ఉపయోగించాడు. (మత్త. 16:19) అలా మానవజాతిని 1,000 సంవత్సరములపాటు పరిపాలించే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడింది, అందుకే దాదాపు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ప్రేరేపిత పత్రికలన్నియు ముఖ్యంగా రాజ్యవారసులైన ఈ గుంపునుద్దేశించి అనగా “పరిశుద్ధులు,” “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన” వారికి వ్రాయబడ్డాయి. *
5. తమకంటే ముందుకాలంలో జీవించిన దేవుని సేవకులకంటే మెరుగైన వారైనందున వారు పరలోక జీవానికి పిలువబడుతున్నారా?
5 వారు పరలోక జీవానికి పిలువబడుతున్నారంటే దానర్థం వారు సా.శ. 33 పెంతెకొస్తుకు ముందు మరణించిన దేవుని సేవకులందరికంటే ఏదోకవిధంగా మెరుగైన వారని కాదు. (మత్త. 11:11) బదులుగా, యేసుక్రీస్తుతోవుండే సహపాలకులను యెహోవా ఇప్పుడు ఎంపిక చేయడానికి ఆరంభించాడు. దీనితర్వాత దాదాపు 19 శతాబ్దాలపాటు ఒకే పిలుపు అనగా పరలోక పిలుపు మాత్రమే ఉండెను. జ్ఞానసంపన్నమైన, ప్రేమగల తన సంకల్పాలను మరింత వృద్ధిచేయుటకే ఒక పరిమిత సంఖ్యపై దేవుడు తన అపారమైన కృపనుంచాడు.—ఎఫె. 2:8-10.
6. (ఎ) పరలోక పిలుపు ముగించబడు సమయమెందుకు రావాలి? (బి) “గొప్పసమూహమును” గూర్చిన ప్రవచనం కూడ నెరవేరునట్లు విషయాల్ని ఎవరు నడిపిస్తారు, నిజానికి ఏమి జరిగింది?
ప్రక. 7:1-8) అప్పుడు యెహోవా తన ఆత్మద్వారా, తన దృశ్య సంస్థకు సాధ్యపరచిన తన వాక్యపు అవగాహన ద్వారా ప్రకటన 7:9-17 లో వర్ణింపబడిన తన సంకల్పమందలి మరోభాగం నెరవేరునట్లు విషయాల్ని నడిపిస్తాడు. మహాశ్రమలు తప్పించుకొని పరదైసు భూమిపై పరిపూర్ణతతో నిత్యం జీవించే ఉత్కంఠభరితమైన ఉత్తరాపేక్షతో ప్రతి జనమునుండి వచ్చిన ఒక “గొప్పసమూహము” సమకూర్చబడుతుంది. వాస్తవంగా జరిగినదానిని మనమాలోచిస్తే సుమారు సా.శ. 1935 నాటికి సాధారణ పరలోక పిలుపు పూర్తయినట్లుగా రుజువౌతుంది. ఆ సంవత్సరంలోనే “గొప్పసమూహపు” భూనిరీక్షణ మరి స్పష్టంగా గ్రహించబడింది. అప్పటినుండి ఈ భూమిపై నిత్యం జీవించడానికి మనఃపూర్వకంగా నిరీక్షించే లక్షలాదిమంది యెహోవా ఆరాధికులు మిగిలియున్న ఈ పరలోక పిలుపుగల కొద్దివేలమంది సహవాసంలోనికి తీసుకురాబడ్డారు.
6 యుక్తకాలమున పరిమితమైననూ నిర్ణయింపబడిన ఆ 1,44,000 సంఖ్య పూర్తవుతుంది. ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయులను యోగ్యులని ముద్రించే ఆఖరుపని దగ్గరపడుతుంది. (7. నేడు కూడ కొందరు పరలోక పిలుపు పొందుట సాధ్యమేనా, మీరెందుకలా సమాధానమిస్తారు?
7 అంటే ఇప్పుడు ఎవర్నీ దేవుడు పరలోక జీవానికి పిలువడం లేదని దీని భావమా? ముద్రింపబడేపని ఆఖరుసారి జరిగేలోపు, ఆ నిరీక్షణగల కొందరు అపనమ్మకస్థులయ్యే సాధ్యత ఉన్నందున వారి స్థానంలో మరొకరిని ఎంపికచేయాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా అరుదుగా సంభవిస్తుందనేది కారణసహితమే.
ఆత్మీయ కుమారులని—వారికెలా తెలుస్తుంది?
8. పరిశుద్ధాత్మచే జన్మింపబడినవారు ఆ సంగతిని తెలుసుకోవడాన్ని చూపించే ఏ వివరణను పౌలు ఇచ్చాడు?
8 పరలోక పిలుపునందుకున్న బాప్తిస్మం పొందిన క్రైస్తవులు ఆత్మీయ కుమారులుగా స్వీకరించబడ్డారని దేవుని ఆత్మ నిశ్చయమైన హామినిస్తుంది. ఆనాటి నిజ క్రైస్తవులందరి స్థితిని వర్ణిస్తూ, అపొస్తలుడైన పౌలు రోమాలోనున్న రోమా. 1:7; 8:14-17.
“పరిశుద్ధులకు” వ్రాసినప్పుడు ఈ విషయం తెల్పాడు. ఆయనిలా అన్నాడు: “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.”—9. నిజంగా దేవుని కుమారులైన వారి ఆత్మతో ఎలా ‘ఆత్మతానే సాక్ష్యమిస్తుంది’?
9 “ఆత్మతానే” అని, “మన ఆత్మ” అని, “ఆత్మ” యొక్క రెండు పద ప్రయోగాలిక్కడ మన దృష్టికి తీసుకురాబడ్డాయి. మొదటిది దేవుని అదృశ్యమైన చురుకైన శక్తి. వారు స్వాతంత్ర్యముగల దేవుని పిల్లలుగా స్వీకరించబడ్డారనే ఒప్పుదలను అది ఆత్మీయ పిల్లల్లో కలిగిస్తుంది. తన ఆత్మీయ పిల్లలకు వ్రాసిన వ్యక్తిగత లేఖవలెనున్న దేవుని ప్రేరేపిత వాక్యమగు బైబిలుద్వారా కూడ ఆ యాత్మ వారికి సాక్ష్యమిస్తుంది. (1 పేతు. 1:10-12) దేవుని ఆత్మీయ కుమారులకు లేఖనాలు చెప్పే విషయాలను పరిశుద్ధాత్మ మూలంగా జన్మించిన వ్యక్తులు చదివినప్పుడు, వారు సరియైన రీతిలో, ‘అవి తమకే అన్వయిస్తాయని’ ప్రతిస్పందిస్తారు. ఆ విధంగా దేవుని చురుకైన శక్తి వివిధ రీతుల్లో వారి ఆత్మతో అనగా తాము దేవుని పిల్లలమని వారి మనస్సును హృదయాన్ని ప్రేరేపించే శక్తితోకూడ సాక్ష్యమిస్తుంది. అలా దేవుని ఆత్మ సూచించిన ప్రకారం, వారి మనస్సులు, హృదయాలు క్రీస్తుతోడి వారసులుగా ఉండే ఉత్తరాపేక్షపై నిలుస్తాయి మరియు వారు దేవుని ఆత్మీయ పిల్లలకుండే బాధ్యతల్ని అంగీకరిస్తారు.—ఫిలి. 3:13, 14.
10. (ఎ) ఒకవ్యక్తి అభిషిక్త క్రైస్తవుడని ఏ వాస్తవిక విషయాలు వాటంతటవే గుర్తించవు? (బి) దేవుని సంకల్పమందలి తమ స్థానాన్ని గూర్చి “వేరే గొఱ్ఱెల” వారు ఏ దృక్కోణం కలిగియుంటారు?
10 మీ విషయంలో అది నిజమేనా? అట్లయిన, మీరు అద్భుతమైన ఆధిక్యతను కలిగివున్నారు. అయితే, ఒక వ్యక్తికి లోతైన ఆత్మీయ సంఖ్యాకాండము 16:1-40 పోల్చండి.) భూమియెడల దేవుని ఆది సంకల్పాన్ని గుర్తించి దానియందు భాగం వహించడానికి వారు ప్రశంసాపూర్వకంగా పనిచేస్తారు.
సంగతులయెడల ప్రగాఢమైన ప్రశంసవుంది, లేదా ప్రాంతీయ పరిచర్యలో ఆసక్తిగావున్నాడు లేదా తన సహోదరులయెడల మిక్కిలి ప్రేమ కలిగివున్నాడు కాబట్టి తాను తప్పక ఆత్మాభిషిక్త క్రైస్తవుడై ఉండాలనే నిర్ణయానికి రావడం తప్పు. అవే లక్షణాలు అనేకమంది “వేరే గొఱ్ఱెల”కు సంబంధించిన వారికి కూడా ఉంటాయి. క్రీస్తుతోడి వారసులను గూర్చి లేఖనాల్లోవున్న వాటిని చదివినప్పుడు వారి హృదయాలు కూడ స్పందిస్తాయి, అయితే దేవుడు వారికొరకు దాచియుంచని దానికొరకు వారు అర్రులుచాచరు. (యోగ్యతకలిగి భాగంవహించుట
11. యేసు మరణ జ్ఞాపకార్థ దినానికి ఎవరు హాజరౌతారు, ఎందుకు?
11 యేసుక్రీస్తు తన అపొస్తలులకిచ్చిన ఉపదేశాల కనుగుణ్యంగా ప్రతి సంవత్సరం నీసాను 14, సూర్యాస్తమయం తర్వాత భూవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోవున్న ఆయన అభిషిక్త అనుచరులు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. (లూకా 22:19, 20) రొట్టె ద్రాక్షారసాల్లో భాగం వహించువారిగా కాదుగాని గౌరవంతో దానిని ఆచరించే వారిగా “వేరే గొఱ్ఱెలకు” సంబంధించిన వారుకూడ దానికి హాజరౌతారు.
12. ప్రభువు రాత్రి భోజనంయెడల సరియైన ప్రశంస చూపడంలో కొరింథులోని కొంతమంది తొలి క్రైస్తవులు ఎలా తప్పిపోయారు?
12 ఇది భావరహిత మతాచారం కాదు, దీనిలో ఎంతో శక్తివంతమైన భావం ఉంది. ఈ ఆచరణకు సరియైన ప్రశంసచూపని మొదటి శతాబ్దపు కొరింథు, గ్రీసుల్లోని కొంతమంది క్రైస్తవుల్ని అపొస్తలుడైన పౌలు గట్టిగా హెచ్చరిస్తూ ఇలాఅన్నాడు: “యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.” వారినేది ‘అయోగ్యులను’ చేసింది? వారు మనస్సునందు, హృదయమందు సరిగా సిద్ధపడుట 1 కొరిం. 11:17-34.
లేదు. సంఘంలో విభేదాలున్నాయి. ఆలాగే కొందరు ఆ కూటమునకు ముందు అమితంగా తిని త్రాగుచున్నారు. ప్రభువురాత్రి భోజనాన్ని అంత ప్రాముఖ్యమైన దానిగా వారు పరిగణించలేదు. రొట్టె ద్రాక్షారసాలకున్న గంభీరమైన విశేషతను వివేచించే స్థితిలో వారు లేరు.—13. జ్ఞాపకార్థ దినమందు అందింపబడు రొట్టె ద్రాక్షారసం యొక్క విశేషత ఏమిటి?
13 దాని విశేషత ఏమి? రొట్టె ద్రాక్షారసాలు అత్యద్భుతంగా రూపాంతరం పొందుతాయని ఊహించడం కాదది. ప్రతి జ్ఞాపకార్థ దినమందు ఏ భావంలోకూడ క్రీస్తు మరలా బలి అర్పించబడడు. “క్రీస్తు . . . అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెనని” లేఖనాలు చెబుతున్నాయి. (హెబ్రీ. 9:28; 10:10; రోమా. 6:9) పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసము యేసు బలి అర్పించిన అక్షరార్థమైన శరీరమును, ఆయన చిందించిన అక్షరార్థమైన రక్తమును సూచించు చిహ్నములు మాత్రమే. అయితే వీటి నిజరూపాలు ఎంత అమూల్యమైనవో గదా! సమస్త మానవజాతి నిత్యం జీవించే అవకాశం కలిగియుండేలా యేసుయొక్క పాపరహిత మానవ శరీరం అర్పించబడింది. (యోహా. 6:51) ఆయన చిందించిన రక్తము, దానియందు విశ్వాసముంచే మానవుల పాపాన్ని కడిగివేయుటకు మరియు దేవునికి, ఆత్మీయ ఇశ్రాయేలుకు అనగా ఆత్మాభిషిక్త క్రైస్తవులచే సమకూర్చబడిన సంఘమునకు మధ్య ఓ క్రొత్త నిబంధనను ఆరంభించే రెండు సంకల్పాల్ని నెరవేరుస్తుంది. (1 యోహా. 1:7; 1 కొరిం. 11:25; గల. 6:14-16) నిజానికి మానవ పరిపూర్ణత ప్రసాదింపబడిన వారిగా ఈ “చిన్నమంద” సభ్యులను నీతిమంతులని దేవుడు ప్రకటించడానికి ఈ అమూల్య ఏర్పాట్లే సాధ్యంచేస్తాయి. (లూకా 12:32) పరలోక రాజ్యమందు క్రీస్తుతోపాటు పరిపాలించే దృక్కోణంతో వారు దేవుని కుమారులుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడుటకే ఇదిలా చేయబడింది. వారలా ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ చిహ్నములలో భాగం వహిస్తూ, తమ పరలోక నిరీక్షణకు సాక్ష్యమిస్తుండగా, క్రీస్తు మధ్యవర్తిగానున్న “క్రొత్తనిబంధనలో” తామున్నామనే వారి ప్రశంస నూతనపర్చబడి, మరింత ప్రగాఢమౌతుంది.—హెబ్రీ. 8:6-12.
“మేము మీతోకూడ వత్తుము”
14. (ఎ) జ్ఞాపకార్థ చిహ్నాలలో “వేరే గొఱ్ఱెలకు” సంబంధించిన వారు ఎందుకు భాగం వహించరు, అయితే వారు ఆసక్తితో దేనిని ఎదురుచూస్తారు? (బి) రాజ్య వారసుల శేషముతో తమ సహవాసాన్ని వారెలా దృష్టిస్తారు?
14 తన అభిషిక్తులతో యెహోవా వ్యవహరించే విధానాన్ని వివేచించే “వేరే గొఱ్ఱెలు,” “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని” చెబుతూ వారితో ఏకమౌతున్నారు. (జెక. 8:20-23) ఇలా ఏకమగుట మాత్రమేగాక భూమియందంతట రాజ్యసువార్త ప్రకటించుటలో కూడ వీరు వారితో భాగం వహిస్తున్నారు. అయితే, ఈ “వేరే గొఱ్ఱెలు” ఆత్మీయ ఇశ్రాయేలీయులతో పాటు “క్రొత్తనిబంధన” లోనికి తీసుకొనబడలేదు, లేక తనతో పరలోక జీవమందు భాగం వహించడానికి ఎంచుకొన్న వారితో యేసు చేసిన ‘రాజ్య నిబంధనలోనికి’ చేర్చబడలేదు గనుక, యుక్తంగానే జ్ఞాపకార్థ చిహ్నములలో పాలుపంచుకొనరు. (లూకా 22:20, 29) అయితే పరలోక రాజ్యంకొరకు “చిన్నమందకు” చెందిన చివరి సభ్యులను సమకూర్చే పనిని ఆ “క్రొత్తనిబంధన” నెరవేరుస్తుండగా, ఆ రాజ్యంద్వారా ఈ భూమిపై తాము పొందబోవు ఆశీర్వాదాలు సమీపిస్తున్నాయనే విషయాన్నిది సూచిస్తుందని “వేరే గొఱ్ఱెల” వారు గ్రహిస్తారు. ఈ “అంత్యదినములలో” యథార్థపరులైన ఆ రాజ్య వారసుల శేష సభ్యులతో కలిసి సేవచేయుటను వారొక ఆధిక్యతగా భావిస్తారు.
[అధస్సూచీలు]
^ పేరా 4 రోమీయులు, 1 మరియు 2 కొరింథీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలొస్సయులు, తీతు, 1 మరియు 2 పేతురు పత్రికల ప్రారంభ వచనాలను, ఆలాగే గలతీయులు 3:26-29, 1 థెస్సలొనీకయులు 2:12, 2 థెస్సలొనీకయులు 2:14, 2 తిమోతి 4:8, హెబ్రీయులు 3:1, యాకోబు 1:18, 1 యోహాను 3:1, 2, యూదా 1 కూడ చూడండి.
పునఃసమీక్షా చర్చ
• క్రైస్తవ గ్రీకు లేఖనాలెందుకు అంతయెక్కువగా పరలోక నిరీక్షణపై దృష్టి నిల్పుతున్నవి?
• దేవుని కుమారులుగా జన్మింపబడినవారు ఆ సంగతినెలా తెలుసుకుంటారు? వారు పాలుపంచుకొనే జ్ఞాపకార్థ చిహ్నముల భావమేమి?
• “వేరే గొఱ్ఱెలకు” సంబంధించిన వారు తాము నిజంగా “చిన్నమందతో” ఏకమైయున్నామని ఎలా ప్రదర్శిస్తారు?
[అధ్యయన ప్రశ్నలు]