మీ బాప్తిస్మము యొక్క భావం
అధ్యాయం 12
మీ బాప్తిస్మము యొక్క భావం
1, 2. (ఎ) నీటి బాప్తిస్మం మనలో ప్రతి ఒక్కరికి ఎందుకు వ్యక్తిగత శ్రద్ధను కల్గించేదై ఉండాలి? (బి) క్లుప్తంగా, 2వ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలకు మీరెలా సమాధానమిస్తారు?
యేసు సా.శ. 29వ సంవత్సరంలో యొర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. యెహోవా స్వయంగా ఆ సంఘటనచూసి తన ఆమోదం తెల్పాడు. (మత్త. 3:16, 17) మూడున్నర సంవత్సరాల తర్వాత అనగా తాను పునరుత్థానుడైన పిదప, యేసు తన శిష్యులకు ఉపదేశాలిస్తూ వారికిలా చెప్పాడు: ‘పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . వారికి బాప్తిస్మమివ్వండి’. (మత్త. 28:18, 19) అక్కడ యేసు నిర్దేశించిన ప్రకారం మీరును బాప్తిస్మం పొందారా? లేక అలాచేయడానికి మీరు సిద్ధపడుతున్నారా?
2 ఈ రెంటిలో ఏదైననూ, బాప్తిస్మాన్ని గూర్చిన స్పష్టమైన అవగాహన ప్రాముఖ్యం. ఆలోచనకు అర్హమైన ప్రశ్నల్లో ఇవికూడ చేరివున్నాయి: నేటి క్రైస్తవుల బాప్తిస్మానికి యేసు బాప్తిస్మంవంటి భావమేవుందా? బాప్తిస్మాన్ని గూర్చి బైబిలుచెప్పే సమస్తం మీకు అన్వయిస్తుందా? క్రైస్తవ నీటి బాప్తిస్మం సూచించేదానికి పొందికగా జీవించుటలో ఏమి ఇమిడియుంది?
యోహాను ఇచ్చిన బాప్తిస్మం
3. యోహాను బాప్తిస్మం ఎవరికి మాత్రమే పరిమితమై ఉంది?
3 యేసు బాప్తిస్మం పొందడానికి దాదాపు ఆరునెలల ముందు, బాప్తిస్మమిచ్చు యోహాను యూదయ అరణ్యములో, “పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని” ప్రకటించాడు. (మత్త. 3:1, 2) యోహాను చెప్పిన దానిని ఆ ప్రాంతమందలి ప్రజలందరు విని, బాహాటముగా వారి పాపములు ఒప్పుకొని యొర్దాను నదిలో ఆయనచేత బాప్తిస్మం పొందారు. అది యూదుల కొరకైన బాప్తిస్మం.—అపొ. 13:23, 24; లూకా 1:13-16.
4. (ఎ) యూదులెందుకు అత్యవసరంగా మారుమనస్సు పొందవలసియుండిరి? (బి) వారు ‘అగ్ని బాప్తిస్మాన్ని’ తప్పించుకోవాలంటే ఏమి అవసరమైయుండెను?
మలా. 4:4-6; లూకా 1:17; అపొ. 19:4) యోహాను వివరించినట్లుగా, దేవుని కుమారుడు పరిశుద్ధాత్మతో (ఈ బాప్తిస్మాన్ని నమ్మకమైన శిష్యులు తొలిసారి సా.శ. 33 లో పెంతెకొస్తునాడు అనుభవించారు) మరియు అగ్నితో బాప్తిస్మమివ్వనైయుండెను (సా.శ. 70 లో ఇది మారుమనస్సు పొందనివారిపై నాశన రూపంలో వచ్చింది). (లూకా 3:16) ‘అగ్నితోగల ఆ బాప్తిస్మాన్ని’ వ్యక్తిగతంగా అనుభవించకుండా తప్పించుకోవాలంటే, ఆ మొదటి శతాబ్దపు యూదులు వారి మారుమనస్సుకు సూచనగా నీటి బాప్తిస్మం పొంది, అవకాశము తెరువబడినప్పుడు వారు యేసుక్రీస్తు శిష్యులుగా తయారుకావాలి.
4 ఆ యూదులకు అత్యవసరముగా మారుమనస్సు అవసరముండెను. సీనాయి పర్వతమునొద్ద సా.శ.పూ. 1513 లో వారి పితరులు యెహోవా దేవునితో ఒక జాతీయ నిబంధన చేసుకున్నారు. అయితే వారు ఆ నిబంధన ప్రకారము తమ బాధ్యతల మేరకు జీవించలేదు, అందువల్ల దానిచే వారు పాపులుగా తీర్చబడ్డారు. వారి పరిస్థితి ప్రమాదమందున్నది. మలాకీ ప్రవచించినట్లు “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము” సమీపమాయెను మరియు అది సా.శ. 70 లో యెరూషలేము మీదికి వేగంగా నాశనం రూపంలో వచ్చింది. ఆ నాశనానికి ముందు, “ప్రభువు [“యెహోవా,” NW] కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై” ఏలీయావలనే సత్యారాధన కొరకు నిజమైన ఆసక్తిగల బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడ్డాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తాముచేసిన పాపముల విషయమై వారు మారుమనస్సు పొంది, హృదయమందును, మనస్సునందును యెహోవా వారికొరకు పంపనైయున్న దేవుని కుమారుని అంగీకరించేందుకు సిద్ధపడాలి. (5. (ఎ) యేసు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, యోహాను దానినెందుకు ప్రశ్నించాడు? (బి) యేసు నీటి బాప్తిస్మం దేనిని సూచించినది? (సి) తనయెడలగల దేవుని చిత్తాన్ని నెరవేర్చుటను యేసు ఎంత గంభీరంగా పరిగణించాడు?
5 అలా బాప్తిస్మం పొందడానికి వచ్చినవారిలో యేసుకూడ ఉండెను. కాని ఎందుకు? ఒప్పుకునేందుకు యేసు ఏ పాపాలూ చేయలేదని యోహానుకు తెలుసు, అందుకే ఆయనిలా అన్నాడు: “నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై మత్త. 3:13-15) యేసు బాప్తిస్మం పాపము విషయమైన మారుమనస్సును సూచించలేదు లేదా తాను దేవునికి ప్రత్యేకంగా సమర్పించుకోవాల్సిన పనీలేదు, ఎందుకంటే ఆయన అప్పటికే యెహోవాకు సమర్పించుకున్న ఓ జనాంగపు సభ్యుడైయున్నాడు. బదులుగా ఆయన బాప్తిస్మం, 30 సంవత్సరాల వయస్సుకువచ్చిన యూదునిగా, మరింకనూవున్న తన పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తననుతాను ఆయనకు సమర్పించుకొనుటను సూచించినది. “క్రీస్తుయేసను నరుని” విషయంలో దేవుని చిత్తమందు రాజ్య సంబంధమగు కార్యక్రమం, ఆలాగే తన పరిపూర్ణ మానవ జీవమును విమోచన క్రయధనముగా ఒక క్రొత్త నిబంధనకు ఆధారాన్ని కలుగజేస్తూ బలియిచ్చుటయు ఇమిడియుండెను. (లూకా 8:1; 17:20, 21; హెబ్రీ. 10:5-10; మత్త. 20:28; 26:28; 1 తిమో. 2:5, 6) తన నీటి బాప్తిస్మం సూచించిన విషయాన్ని యేసు చాలా గంభీరంగా తీసుకున్నాడు. తన ఆసక్తి ఇతరత్రా మరలుటకు ఆయన తననుతాను అనుమతించుకోలేదు. తన భూజీవితాంతము వరకు ఆయన దేవుని చిత్తం చేయడానికే అంకితమయ్యాడు.—యోహా. 4:34.
యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?” అయితే యేసు బాప్తిస్మం మరోసంగతిని సూచించనైయుండెను. అందువల్ల ఆయనిలా జవాబిచ్చాడు: “ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.” (మరణములోనికి బాప్తిస్మము
6. మరింకే బాప్తిస్మాన్ని యేసు పొందాడు, ఎంత కాలపరిధిలో?
6 యేసు నీటి బాప్తిస్మం సూచించిన దానికి పొందికగా, ఆయన మరో బాప్తిస్మంకూడ పొందాడు. దేవుడు తనయెదుట ఉంచిన కార్యం బలిగా తన మానవజీవాన్ని అర్పించుటకు నడిపించునని, అయితే మూడవ రోజున తాను ఆత్మీయ జీవానికి లేపబడునని ఆయనకు తెలుసు. ఆయన దీనినొక బాప్తిస్మముగా మాట్లాడాడు. ఈ “బాప్తిస్మం” సా.శ. 29 లో ఆరంభమైంది, అయితే ఆయన నిజంగా మరణించి పునరుత్థానమయ్యేవరకు అది పూర్తికాలేదు. కాబట్టి తన నీటి బాప్తిస్మం తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు యుక్తముగా ఆయనిలా చెప్పగల్గాడు: “నేను పొందవలసిన బాప్తిస్మమున్నది; అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.”—లూకా 12:50.
7. (ఎ) ఇంకెవరు కూడ మరణములోనికి బాప్తిస్మం పొందారు? (బి) ఈ బాప్తిస్మం ఎవరు ఇస్తారు?
మార్కు 10:37-40; కొలొ. 2:12) యేసు చేసినట్లే, మరణించినప్పుడు వారుకూడా శాశ్వతంగా తమ మానవ జీవాల్ని తృణప్రాయంగా ఎంచారు. వారి పునరుత్థానమందు వారు ఆయనతోపాటు పరలోక పరిపాలనలో భాగంవహిస్తారు. ఏ మానవుడు కాదుగాని, తన పరలోక కుమారుని ద్వారా దేవుడే ఈ బాప్తిస్మం ఇస్తాడు.
7 క్రీస్తుతోపాటు పరలోక రాజ్యమందు పరిపాలించువారు కూడ అదేరీతిలో మరణములోనికి బాప్తిస్మం పొందాలి. (8. వారు ‘క్రీస్తు యేసులోనికి కూడ బాప్తిస్మము’ పొందారనుటలో దాని భావమేమి?
8 యేసు మరణంలోనికి బాప్తిస్మం పొందువారు “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము” పొందాలనికూడా చెప్పబడ్డారు. క్రీస్తు మూలముగా అందజేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా వారు తమ యజమానితో ఏకమౌతారు, ఆయన ఆత్మాభిషక్త సంఘపు సభ్యులుగా వారాయన ‘శరీరమౌతారు.’ ఆ యాత్మ వారిని క్రీస్తుయొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిచేలా చేస్తుంది గనుక, వారందరు “యేసుక్రీస్తునందు . . . ఏకముగా ఉన్నారని” చెప్పవచ్చును.—రోమా. 6:3-5; 1 కొరిం. 12:13; గల. 3:27, 28; అపొ. 2:32, 33.
క్రైస్తవ శిష్యుల నీటి బాప్తిస్మము
9. (ఎ) మత్తయి 28:19 లో నిర్దేశించబడిన విధంగా మొదట ఎప్పుడా బాప్తిస్మం జరిగింది? (బి) ఈ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలను, లేఖనాలను ఉపయోగిస్తూ, బాప్తిస్మపు సభ్యులు గుర్తించాలని యేసు సూచించిన విషయాన్ని విశ్లేషించండి.
9 యేసు మొదటి శిష్యులు యోహానుద్వారా నీటి బాప్తిస్మం పొందినపిమ్మట, యేసుయొక్క ఆత్మీయ పెండ్లికుమార్తె బావిసభ్యులుగా ఆయనయొద్దకు నడిపించబడ్డారు. (యోహా. 3:25-30) యేసు నడిపింపు క్రింద వారుకూడ బాప్తిస్మమిచ్చారు, అయితే ఇదికూడ యోహానిచ్చిన బాప్తిస్మపు విశేషతనే కలిగివుండెను. (యోహా. 4:1-3) అయితే సా.శ. 33 పెంతెకొస్తునుండి వారు “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మమివ్వాలన్న ఆజ్ఞను నెరవేర్చనారంభించారు. (మత్త. 28:19) ఈ క్రింది ప్రశ్నలతోపాటు ఇవ్వబడిన లేఖనాల వెలుగులో, దాని భావాన్ని పునఃసమీక్షించుట ఎంతో ప్రయోజనకరమని మీరు కనుగొంటారు:
2 రాజు. 19:15; కీర్త. 3:8; 73:28; యెష. 6:3; రోమా. 15:6; హెబ్రీ. 12:9; యాకో. 1:17)
‘తండ్రి నామమందు’ బాప్తిస్మం పొందుటకు, తండ్రి విషయంలో ఒక వ్యక్తి దేనిని గుర్తించాలి? (“కుమారుని” నామమందు బాప్తిస్మం అంటే దేనిని గుర్తించాల్సి ఉంటుంది? (మత్త. 16:16, 24; ఫిలి. 2:9-11; హెబ్రీ. 5:9, 10)
“పరిశుద్ధాత్మ” నామమందు బాప్తిస్మం పొందడానికి ఒక వ్యక్తి ఏమి నమ్మాలి? (లూకా 11:13; యోహా. 14:16, 17; అపొ. 1:8; 10:38; గల. 5:22, 23; 2 పేతు. 1:21)
10. (ఎ) నేడు క్రైస్తవ నీటి బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది? (బి) యేసు తీసుకున్న బాప్తిస్మానికి ఇదెట్లు భిన్నమైయుంది? (సి) లేఖనానుసారంగా అర్హతపొందిన వ్యక్తులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వారు ఎవరౌతారు?
10 యూదులు (యూదామత ప్రవిష్టులు) యేసు ఇచ్చిన ఆ ఉపదేశాలకు పొందికగా బాప్తిస్మం పొందాల్సిన మొదటివారైయుండిరి. అప్పటికే వారు యెహోవాకు సమర్పించుకున్న జనాంగమైయున్నందున సా.శ. 36 వరకు వారికొక ప్రత్యేక అవకాశం ఇవ్వబడింది. అయితే, క్రైస్తవ శిష్యులయ్యే ఆధిక్యత సమరయులకు అన్యులకు విస్తరింపజేయబడినప్పుడు వ్యక్తిగతంగా వారు తమ బాప్తిస్మానికి ముందు ఆయన కుమారుని శిష్యులుగా సేవచేయుటకు బేషరతుగా యెహోవాకు సమర్పించుకోవాలి. యూదులతోసహా, నేటివరకు అందరికీ క్రైస్తవ నీటి బాప్తిస్మానికి ఉన్న విశేషత ఇదే. ఈ ‘ఒకటే బాప్తిస్మము’ నిజ క్రైస్తవులైన వారందరికి అన్వయిస్తుంది. ఆ విధంగా వారు క్రైస్తవ యెహోవాసాక్షులుగా, దేవుని నియమిత పరిచారకులుగా తయారౌతారు.—ఎఫె. 4:5; 2 కొరిం. 6:3, 4.
11. (ఎ) క్రైస్తవ నీటి బాప్తిస్మం దేనికి సాదృశ్యంగా ఉన్నది? (బి) ఆ విధంగా క్రైస్తవుడు దేనినుండి రక్షింపబడతాడు?
11 దేవుని దృష్టిలో అట్టి బాప్తిస్మానికి ఎంతోగొప్ప విలువ ఉంది. జలప్రళయాన్నుండి తనను, తన కుటుంబాన్ని భద్రపర్చిన ఓడను నోవహు నిర్మించుటను గూర్చి ప్రస్తావించిన తర్వాత, అపొస్తలుడైన పేతురు ఈ విషయంపై దృష్టి మళ్లించాడు. ఆయనిలా వ్రాశాడు: “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు 1 పేతు. 3:21) నోవహు దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకుని, ఆ పిమ్మట దేవుడు తనకప్పగించిన పనిని నమ్మకంగా చేశాడని ఆ ఓడ స్పష్టమైన రుజువునిచ్చింది. అది ఆయన రక్షణకు నడిపింది. దానికి సాదృశ్యంగా, క్రీస్తు పునరుత్థానమందలి విశ్వాసాన్నిబట్టి యెహోవాకు సమర్పించుకుని దానికి సూచనగా బాప్తిస్మం పొంది, మనకాలంలో దేవుని సేవకుల కొరకైన ఆయన చిత్తం చేయడానికి ఉపక్రమించువారు ప్రస్తుత దుష్టలోకం నుండి రక్షింపబడతారు. (గల. 1:3, 4) మిగతా ప్రపంచంతోపాటు వారెంతమాత్రము నాశనానికి నడిపింపబడరు. వారు దీనినుండి రక్షింపబడి, దేవునియెదుట నిర్మలమైన మనస్సాక్షిని పొందినవారై ఉన్నారు.
మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.” (మన బాధ్యతలకు తగినట్లు జీవించుట
12. ఒకడు బాప్తిస్మం పొందుట ఎందుకు దానంతటదే రక్షణకు హామీ ఇవ్వదు?
12 బాప్తిస్మం పొందుటే మన రక్షణకు హామీ అనే నిర్ణయానికి రావడం పొరపాటు. యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి నిజముగా యెహోవాకు సమర్పించుకొని, ఆ పిమ్మట నమ్మకంగా అంతము వరకు దేవుని చిత్తం చేస్తేనే దానికి నిజమైన విలువ ఉంటుంది.—మత్త. 24:13.
13. (ఎ) బాప్తిస్మం పొందిన క్రైస్తవులు తమ జీవితాల్నెలా ఉపయోగించాలనుట దేవుని చిత్తమైయుంది? (బి) క్రైస్తవ శిష్యత్వం మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైయుండాలి?
13 మానవునిగా యేసు తన జీవితాన్నెలా ఉపయోగించాడనేది కూడ దేవుని చిత్తమందు ఇమిడియుండెను. మరణమందు ఆయన దానిని బలిగా అర్పించాలి. మన విషయంలోనైతే, స్వయంత్యాగపూరిత జీవితాన్ని గడుపునట్లు మన శరీరాలను మనం దేవునికి అర్పించాలి. కేవలం దేవుని చిత్తం చేయడానికే వాటిని ఉపయోగించాలి. (రోమా. 12:1, 2) మన చుట్టూవున్న లోకం మాదిరి మనం అప్పుడప్పుడు ప్రవర్తించినా లేదా దేవునికి కేవలం నామకార్థంగా సేవచేస్తూ స్వార్థ విషయాలచుట్టే మన జీవితాల్ని నిర్మించుకున్నా మనం నిశ్చయంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నవారిగా ఉండము. (1 పేతు. 4:1-3; 1 యోహా. 2:15-17) నిత్యజీవము పొందుటకు తానేమి చేయవలెనని ఒక యూదుడు అడిగినప్పుడు, అతనికి నైతిక పరిశుభ్రతతో జీవించే ప్రాముఖ్యతను గుర్తుచేసి, ఆ పిమ్మట యేసు అనుచరునిగా క్రైస్తవ శిష్యత్వాన్ని జీవితంలో ప్రథమ సంగతిగావుంచాల్సిన అవసరతను యేసు సూచించాడు. వస్తుదాయక విషయాలనుబట్టి దానికి రెండవ స్థానమివ్వకూడదు.—మత్త. 19:16-21.
14. (ఎ) రాజ్యానికి సంబంధించి క్రైస్తవులందరికి ఏ బాధ్యతవుంది? (బి) పేజీ 101 లో ఉదహరింపబడిన ప్రకారం ఈ సేవ చేయడానికున్న కొన్ని ఫలవంతమైన మార్గాలేవి? (సి) నిజంగా మనమట్టి సేవలో హృదయపూర్వకంగా పాల్గొంటే, అది దేనికి రుజువుగా ఉంటుంది?
14 యేసు కొరకైన దేవుని చిత్తమందు రాజ్యానికి సంబంధించిన అవశ్యమైన పని చేరియుండెనని కూడా గుర్తుచేసుకోవాలి. రాజుగా యేసు అభిషేకించబడ్డాడు. అయితే ఆయన భూమిపైనున్నప్పుడు రాజ్యాన్ని గూర్చి ఆసక్తిగా సాక్ష్యమిచ్చాడు. మనము కూడ అదేవిధమైన సాక్ష్యపు పనిచెయ్యాలి, హృదయపూర్వకంగా దానిలో పాల్గొనడానికి మనకు ప్రతివిధమైన కారణం ఉంది. అలాచేయడం ద్వారా మనం యెహోవా సర్వాధిపత్యం ఎడల మన మెప్పును, తోటిమానవుల ఎడల మన ప్రేమను ప్రదర్శించగలము. అంతేకాకుండ ఆ రాజ్యమందలి నిత్యజీవంవైపు ముందుకుసాగే ప్రపంచవ్యాప్తంగానున్న రాజ్యసాక్షులగు తోటి ఆరాధికులందరితో మనకున్న ఐకమత్యమును చూపిస్తాము.
పునఃసమీక్షా చర్చ
• యేసు బాప్తిస్మానికి నేటి నీటి బాప్తిస్మానికి మధ్య ఎలాంటి పోలికలు, భిన్నత్వాలు ఉన్నాయి?
• యోహాను బాప్తిస్మం ఎవరికి? ఎవరు మరణములోనికి బాప్తిస్మం పొందారు? ఎవరు “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము” పొందుతారు?
• క్రైస్తవ నీటి బాప్తిస్మానికి తగినట్లు జీవించడంలో ఏమి ఇమిడియున్నది?
[అధ్యయన ప్రశ్నలు]
[101వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీరు రాజ్యమును ఏయే విధాలుగా ప్రకటిస్తారు?
ఇంటింట
ఆసక్తిగల వారిని పునర్దర్శించుట ద్వారా
గృహ బైబిలు పఠనములందు
వీధుల్లో
తోటి విద్యార్థులకు
తోటి పనివారికి