కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోషే ధర్మశాస్త్రము మీయెడల ఏ భావము కలిగివుంది

మోషే ధర్మశాస్త్రము మీయెడల ఏ భావము కలిగివుంది

అధ్యాయం 19

మోషే ధర్మశాస్త్రము మీయెడల ఏ భావము కలిగివుంది

1. (ఎ) సా.శ. 36 మొదలుకొని సున్నతిపొందని అన్యులు క్రైస్తవులుగా యెహోవాకు అంగీకృతులేనని ఏది సూచిస్తున్నది? (బి) అయితే ఏ అంశంమీద తొలి క్రైస్తవులు కొందరు గట్టి భావాలు కలిగియుండిరి?

మోషే ధర్మశాస్త్ర నియమాల్ని అన్య మతాల్నుండి వచ్చిన క్రైస్తవులు పాటించాలా వద్దా అనే విషయం అపొస్తలుడైన పౌలు దినాల్లో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. నిజమే సా.శ. 36వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ సున్నతిపొందని అన్యులమీదికి వచ్చింది. కాని అంతకుముందు యూదులుగావున్న కొందరు క్రైస్తవులు అన్యమతాల్నుండి వచ్చిన శిష్యులుకూడ సున్నతి పొంది, మోషే ధర్మశాస్త్రం పాటించేలా బోధింపబడాలని గట్టిగా భావించారు. నిజానికి, వారా ధర్మశాస్త్రాన్ని లేదా దానిలోని కొంతభాగాన్ని పాటించాల్సిన అవసరం ఉందా? దాదాపు సా.శ. 49 నాటికి ఆ వివాదాంశం యెరూషలేమునందలి పరిపాలక సభ దృష్టికి తీసుకురాబడింది.—అపొ. 10:44-48; 15:1, 2, 5.

2. ఈ వివాదాంశం మనకెందుకు శ్రద్ధకల్గించేదై ఉంది?

2 దాని ఫలితం మనకెంతో శ్రద్ధకల్గించేదై ఉంది. ఎందుకు? ఎందుకంటే, విశ్రాంతిదిన ఆచరణవంటి, ధర్మశాస్త్ర నియమాల్ని కొన్నింటిని క్రైస్తవులు పాటించాలని వాదించే ప్రజల్ని మనమప్పుడప్పుడు కలిసికొనుటే కాకుండ, బైబిలుకూడ “ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది” అని చెబుతున్నది. (రోమా. 7:12) ఆ ధర్మశాస్త్రానికి మోషే మధ్యవర్తి గనుక అది మోషే ధర్మశాస్త్రమని సూచింపబడిననూ, నిజానికి ఆ నియమ గ్రంథానికి యెహోవా దేవుడే మూలకర్త.—నిర్గ. 24:3, 8.

ఆ ధర్మశాస్త్రమెందుకు?

3. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది?

3 యెహోవా ఇశ్రాయేలీయులకు ఆ నియమ గ్రంథాన్ని ఎందుకిచ్చాడో మనం అర్థం చేసుకున్నామా లేదా అనేది నేడు ఆ ధర్మశాస్త్రాన్ని మనమెలా దృష్టిస్తున్నామనే దానిపై ప్రభావం చూపుతుంది. లేఖనాలిలా వివరిస్తున్నాయి: “ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి [అబ్రాహాముకు చేయబడిన నిబంధనకు] తరువాత ఇయ్యబడెను. . . . కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.” (గల. 3:19, 24) ధర్మశాస్త్రం దీనినెలా చేసింది?

4. (ఎ) ధర్మశాస్త్రమెట్లు “అతిక్రమములను బయటపెట్టింది”? (బి) ఆలాగే అది విశ్వాసులైన వారిని క్రీస్తునొద్దకు కూడ ఎట్లు నడిపింది?

4 జీవితమందలి వివిధ ఆకృతుల్ని చేర్చుతూ ఒక పరిపూర్ణ మాదిరినుంచుట ద్వారా, అది యూదులను పాపులని చూపింది. వారికెట్టి మంచి ఉద్దేశాలున్నా, వారెంత పట్టుదలతో కృషిచేసినా, అందలి నియమాల్ని వారు పాటించలేరని స్పష్టంచేసింది. అసంపూర్ణ మానవ కుటుంబానికి యూదులను ఒక నమూనాగా ఉపయోగిస్తూ, ఆ ధర్మశాస్త్రం దేవునియెదుట మనలో ప్రతి ఒక్కరితోసహా, యావత్‌ ప్రపంచం శిక్షార్హమైనదని బహిర్గతం చేసింది. (రోమా. 3:19, 20) ఆ విధంగా అది మానవజాతికొక రక్షకుడు అవసరమనే విషయాన్ని నొక్కితెల్పి, ఆ రక్షకుడైన యేసుక్రీస్తునొద్దకు విశ్వాసులైన వారిని నడిపింది. ఏ విధముగా? ఆయన మాత్రమే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించినవాడని, అలా ఆయన మాత్రమే పాపరహితుడైన మానవుడని ఆయననది గుర్తించినది. ధర్మశాస్త్రం క్రిందగల జంతు బలులు కేవలం పరిమితమైన విలువగలవై ఉండెను గాని, పరిపూర్ణ మానవునిగా యేసు, పాపాన్ని నిజంగా తొలగించి, విశ్వాసముంచు వారందరు నిత్యజీవంపొందే మార్గాన్ని తెరచే బలిగా తన ప్రాణాన్ని అర్పించగలవాడై ఉండెను.—యోహా. 1:29; 3:16; 1 పేతు. 1:18, 19.

5. ఇవ్వబడిన లేఖనాల్ని ఉపయోగిస్తూ, ఈ పేరాతోబాటు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

5 ఈ విషయాలను మనస్సునందుంచుకొని, ఈ క్రింది ప్రశ్నలకు మీరెలా సమాధానం చెబుతారు?

మానవజాతియంతటికి వర్తించుననే భావాన్ని మోషే ధర్మశాస్త్రము ఎప్పుడైనా ఇచ్చిందా? (కీర్త. 147:19, 20; నిర్గ. 31:12, 13)

ఏదోక రోజున ధర్మశాస్త్రము ముగియుననే ఎట్టి సూచనైనా యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చాడా? (యిర్మీ. 31:31-33; హెబ్రీ. 8:13)

మిగతా ధర్మశాస్త్రమంతయూ కొట్టివేయబడిన తర్వాత, వారానికొకసారి ఆచరించాల్సిన విశ్రాంతి దినముతోపాటు పది ఆజ్ఞలు ఇంకనూ అమల్లో ఉంటాయా? (కొలొ. 2:13, 14, 16; 2 కొరిం. 3:7-11 [నిర్గమకాండము 34:28-30 స్పష్టం చేసినట్లుగా]; రోమా. 7:6, 7)

దేని మూలముగా యెహోవా ధర్మశాస్త్రమును కొట్టివేశాడు? (కొలొ. 2:13-17; మత్త. 5:17, 18; రోమా. 10:4)

6. మోషే ధర్మశాస్త్రమింకనూ ఆచరించాలనే వాదముల భావమేమిటి?

6 దీని వెలుగులో, మోషే ధర్మశాస్త్రమింకా అమల్లో ఉందనేవాదనయొక్క భావమేమిటి? నిజానికది, యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని ధిక్కరించే లెక్కలోకి వస్తుంది. అలా ఎందుకు? ఎందుకనగా ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ముగించేలా మార్గం సుగమం చేయుటకు యేసు దానిని నెరవేర్చాడనే వాస్తవాన్ని అట్టి దృక్కోణం తిరస్కరిస్తుంది. క్రైస్తవులమని చెప్పుకుంటూ, అదే సమయంలో ధర్మశాస్త్రాన్ని లేదా దానిలో కొంతభాగాన్ని పాటించాలనే వాదాలతో ఊగిసలాడే వ్యక్తులకు అపొస్తలుడైన పౌలు గట్టిగా ఇలా వ్రాశాడు: “మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు.”—గల. 5:4; రోమీయులు 10:2-4 కూడ చూడండి.

7. (ఎ) ధర్మశాస్త్రమందలి కొన్ని విషయాల్ని ఇంకనూ కొనసాగించాలని వాదించువారు దేనిని పూర్తిగా గుణగ్రహించుట లేదు? (బి) క్రైస్తవ క్రియలెంత ప్రాముఖ్యం, మనం నిత్యజీవం పొందటానికీ వీటికీ ఎలాంటి సంబంధము కలిగివున్నవి?

7 ధర్మశాస్త్రమందలి కొన్ని అంశాలు ఇంకావుండాలని వాదించే వారు దేవునియెదుట నీతిమంతులుగా ఉండుట ధర్మశాస్త్రసంబంధ క్రియలపై కాదుగాని, యేసు బలివిలువపై ఆధారపడివుందనే విషయాన్ని పూర్తిగా గుణగ్రహించుట లేదు. (గల. 3:11, 12) పాపులైన మానవులకు అసాధ్యమైనట్టి క్రియల ద్వారా ఒకడు తాను నీతిమంతుడని నిరూపించుకోవాలని వారు భావిస్తారు. దేవుడు మరియు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడుటలో క్రైస్తవులకు అన్వయించు క్రియలు చేయుట నిజానికి ప్రాముఖ్యం. (యాకో. 2:15-17; మత్త. 28:19, 20) అవి మన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించే మార్గాలైయున్నవి, అలా చేయకపోవుట మన విశ్వాసం మృతమని సూచిస్తుంది. అయితే మనమెంత కష్టపడి పనిచేసినా రక్షణ సంపాదించుట అసాధ్యం. యేసుక్రీస్తు బలి లేకుండా పాపమరణముల నుండి రక్షణ సాధ్యపడదు. ఆ విధముగా నిత్యజీవము, మన క్రియల జీతము కాదుగాని అసాధారణమైన కృపకు సూచకంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చు బహుమానమే.ఎఫె. 2:8, 9; రోమా. 3:23, 24; 6:23.

8. మోషే ధర్మశాస్త్రాన్ని అన్యమతాల్నుండి వచ్చిన క్రైస్తవులకు అన్వయించుటను గూర్చిన వివాదాంశం విషయంలో మొదటి శతాబ్దపు పరిపాలక సభ ఏమి తీర్మానించింది?

8 మొదటి శతాబ్దంలో, అన్య క్రైస్తవులకు మోషే ధర్మశాస్త్రం అన్వయించాలనే వివాదాంశం యెరూషలేమునందలి పరిపాలక సభదృష్టికి తీసుకురాబడినప్పుడు, వారి తీర్మానం ఈ వాస్తవాలకు పొందికగావుండెను. పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడకముందు అన్యమతాల్నుండి వచ్చిన విశ్వాసులు మోషే ధర్మశాస్త్రసంబంధ క్రియలు చేయాలని యెహోవా కోరుటలేదని గుర్తించారు. ధర్మశాస్త్రంతో పొందికగల “అవశ్యమైన వాటిని” ఆ పరిపాలక సభ తీర్మానం పేర్కొంది, అయితే ఇవి ధర్మశాస్త్రానికి ముందే జరిగిన సంఘటనల్ని గూర్చి బైబిలు వ్రాసిన విషయాలపై ఆధారపడియుండెను. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని లేదా దానిలోని కొన్నిభాగాల్ని పాటించడం కాదుగాని మోషేకంటే ముందే గుర్తించబడిన నియమాలకు వారు కట్టుబడియుండాలనే బాధ్యత అన్యమతాల్నుండి వచ్చిన క్రైస్తవులపై ఉంచబడింది.—అపొ. 15:28, 29; ఆదికాండము 9:3, 4; 34:2-7; 35:2-5 పోల్చండి.

9. (ఎ) యూదులు మోషే ధర్మశాస్త్రమునకు లోబడాలని దేవుడింకనూ కోరుచున్నాడా? (బి) క్రీస్తు మరణ విధానంద్వారా వారికొరకెట్టి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడింది?

9 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత మోషే ధర్మశాస్త్ర నియమాల్ని పాటించాలని దేవుడెంత మాత్రం యూదులను కోరలేదు. విశ్వాసముంచిన యూదులు దీనియందలి ప్రత్యేక కారణాన్ని చూసి ఎంతో ఆనందించారు. ఎందుకు? అన్యులు సహితం పాపులై మరణిస్తున్ననూ, యూదులు మాత్రమే ధర్మశాస్త్ర నిబంధనను ఉల్లంఘించిన కారణంగా దేవునివలన శాపగ్రస్తులయ్యారు. కాని క్రీస్తు మరణ విధానం అనగా ఆయనొక శాపగ్రస్తమైన నేరస్థుడన్నట్లు కొయ్యపై వ్రేలాడదీయబడుట ద్వారా, ఆయన తనయందు విశ్వాసముంచు ఆ యూదుల స్థానం వహించి, ధర్మశాస్త్రానికి అవిధేయులైనందున వారిపైకివచ్చు శిక్షనుండి వారిని తప్పించాడు. (గల. 3:10-13) ఆ విధంగా, మోషే ధర్మశాస్త్రం క్రింద వారెన్నటికీ పొందలేని క్షమాపణను ఆయన అందజేశాడు.—అపొ. 13:38, 39.

10. ధర్మశాస్త్రాన్ని తీసివేయుట ఐక్య ఆరాధనకేనని ఏ విధముగా నిరూపించబడింది?

10 వాస్తవానికి, ధర్మశాస్త్రం యూదులకు, అన్యులకు మధ్య కంచెగా నిలిచింది. అన్యులకు అన్వయించని నియమాలు యూదులపై ఉంచబడగా, సున్నతిపొందని అన్యులు యూదులతో వారి ఆరాధనలో పూర్తిగా భాగం వహించకుండా చేయబడ్డారు. (నిర్గమకాండము 12:48; అపొస్తలుల కార్యములు 10:28 పోల్చండి.) అయితే ధర్మశాస్త్రం నెరవేర్చబడి తొలగించబడినప్పుడు, క్రీస్తు ద్వారా అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో సున్నతిపొందని అన్యులు, యూదులు ఐక్యమగుట సాధ్యపడుతుంది.—ఎఫె. 2:11-18.

ధర్మశాస్త్ర జ్ఞానం మనకు ప్రయోజనకరం

11. ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞానము క్రీస్తు బోధల్ని అర్థంచేసుకోవడానికి మనకెలా సహాయపడుతుంది?

11 మనమీనాడు ధర్మశాస్త్రం క్రింద లేకపోయిననూ, దానిగూర్చిన జ్ఞానం మనలో ప్రతివారికి ఎంతో గొప్ప ప్రయోజనాన్నిస్తుంది. ఏ విధముగా? యేసు ఒక యూదురాలి కుమారునిగా జన్మించి మోషే ధర్మశాస్త్రం క్రిందవుండెనని జ్ఞాపకముంచుకోండి. ఆయన చేసిన కొన్ని పనులు కేవలం ఆ ధర్మశాస్త్ర నియమాలను గూర్చిన జ్ఞానం ఆధారంగానే పూర్తిగా అర్థమౌతాయి. (గల. 4:4; లూకా 22:7, 8 చూడండి.) ఆలాగే ఆ ధర్మశాస్త్రం క్రిందగల ప్రజల మధ్యే ఆయన తన పరిచర్య జరిగించాడు. కావున తరచు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన పరిస్థితులపైనే ఆధారపడి బోధించాడు.—మత్తయి 5:23, 24 పోల్చండి.

12. (ఎ) తన జీవితానికి, ధర్మశాస్త్రానికి మధ్యగల ఏ సంబంధాన్ని యేసు సూచించాడు? (బి) ధర్మశాస్త్ర జ్ఞాన విలువను అపొస్తలుడైన పౌలు ఎలా సూచించాడు? (సి) దాని నియమాల ఆత్మీయ ప్రాముఖ్యతను గ్రహించుట నుండి ఏ ఫలితం రాగలదు?

12 తన పునరుత్థానము తర్వాత, ధర్మశాస్త్రమందు, ప్రవక్తల గ్రంథాలందు, కీర్తనలందు తనను గూర్చి వ్రాయబడిన సంగతులను తన మానవ జీవితం నెరవేర్చిందని యేసు తన శిష్యులకు గుర్తుచేశాడు. (లూకా 24:44) అంతేకాకుండ, అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్ర సంబంధిత ఆకృతులు “పరలోకసంబంధమగు వస్తువుల ఛాయారూపకము” అని సూచించుటే గాక, “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ” అని కూడ చెప్పాడు. (హెబ్రీ. 8:4, 5; 10:1) యేసుక్రీస్తు యాజకత్వమందు, ఆయన మానవ జీవాన్ని బలియందు నెరవేరు ఆశ్చర్యకరమగు వివరాలు ధర్మశాస్త్రమందు పొందుపర్చబడ్డాయి. వీటిని అర్థం చేసుకొనుట మనకొరకు చేయబడిన అట్టి ఏర్పాట్ల భావాన్ని ఇనుమడింపజేస్తుంది. అట్టి ప్రవచనార్థక మాదిరుల్లో ఈనాడు మహాగొప్ప ఆత్మీయ ఆలయమందు యెహోవాను అంగీకృతంగా ఆరాధించడాన్ని సూచించే వివరాలున్నాయి. వీటిని గూర్చిన మన అవగాహన పెరిగేకొలది, ఆత్మాభిషిక్త సంఘంయెడల, మన ఆరాధన సంబంధముగా యేసుక్రీస్తు క్రింద దాని పాత్ర ఎడల మన మెప్పుకూడా వృద్ధౌతుంది.

13. ధర్మశాస్త్రమందు ప్రతిబింబించబడిన చక్కని సూత్రాల్ని ధ్యానించుట ఎందుకు ప్రయోజనకరం?

13 దైవ ప్రేరేపిత లేఖనాల్లో మోషే ధర్మశాస్త్రం కూడ ఒక భాగమై, “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును . . . ప్రయోజనకరమై యున్నది.” (2 తిమో. 3:16) ధర్మశాస్త్రం వేటిపై ఆధారపడిందో ఆ నిలిచియుండే సూత్రాలను వెదకి వాటిని ధ్యానించుట, దేవునికి ప్రీతిపాత్రమగు పనులను మాత్రమే చేయాలనే హృదయ కోరిక మనలో వృద్ధి కావడానికి సహాయపడగలదు. ధర్మశాస్త్రం సూచించిన స్వభావాన్ని గ్రహించి ఆ స్వభావాన్నే మన జీవితాల్లో ప్రతిబింబిస్తే, అది మనకెంత ప్రయోజనమో కదా!

14. (ఎ) ధర్మశాస్త్ర నియమాలు సూచించిన సారాంశాన్ని అర్థం చేసుకునే విలువను యేసు ఏలా ఉదహరించాడు? (బి) 152వ పేజీలో చూపబడినట్లు, ధర్మశాస్త్రమందు అదనంగా పొందుపర్చబడిన చక్కని సూత్రాల్లో కొన్నింటిపై దృష్టినిల్పండి. (సి) ఈ సంగతుల గుణగ్రహణ దేవునికి మరింత ప్రీతికరమగునట్లు మనకెలా సహాయం చేస్తాయి?

14 యేసు దీనిని తన కొండమీది ప్రసంగంలో ప్రభావితంగా ఉదహరించాడు. ధర్మశాస్త్రం క్రిందనున్న అప్పటి ప్రజలతో మాట్లాడుతూ, వారు కేవలం నరహత్య చేయకుండా ఉండుటేకాదు, కోపం నిలుపుకొనే స్వభావాన్ని పూర్తిగా విసర్జించడం, తమ సహోదరులను అవమానపరచే రీతిలో మాట్లాడకుండా ఉండటం కూడ అవసరమని ఆయన చూపించాడు. వ్యభిచరించలేదని సరిపెట్టుకోవడం కాదుగాని, వారు పరస్త్రీవైపు మోహపు చూపుకూడ చూడకూడదు. వారివలెనే మనం కూడ మన శరీర అవయవాలన్నింటిని యెహోవా నీతిమార్గాలకనుగుణ్యంగా ఉపయోగించుటకు కృషిసల్పాలి. (మత్త. 5:21, 22, 27-30; రోమీయులు 13:8-10 కూడా చూడండి.) మనం దీనినిచేస్తే, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణ ప్రాణముతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [“యెహోవాను,” NW] ప్రేమింపవలెనను” ధర్మశాస్త్రమందలి, మరిగొప్పదైన ఆజ్ఞయొక్క భావాన్ని కూడ అర్థంచేసుకున్నామని చూపిస్తాము. (మత్త. 22:36, 37) నిశ్చయముగా ఇది మనల్ని యెహోవా దేవునికి మరింత సన్నిహితుల్ని చేస్తుంది. మనం మోషే ధర్మశాస్త్రం క్రిందలేకున్ననూ, అది ఆధారపడిన సూత్రాలు, అందలి ప్రవచనార్థక మాదిరుల అనుభవ జ్ఞానంతో మనం నిశ్చయంగా ప్రయోజనం పొందుతాము.

పునఃసమీక్షా చర్చ

• మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని పట్టుబట్టేవారు ఎందుకు క్రీస్తును నిజంగా తిరస్కరించువారై ఉన్నారు?

• ధర్మశాస్త్ర జ్ఞానం యెహోవా సంకల్పమందు యేసు పాత్రను అర్థంచేసుకోవడానికెలా సహాయం చేస్తుంది?

• మనం ధర్మశాస్త్రము క్రింద లేకున్ననూ, దానిని పఠించుటనుండి మనమెట్టి విలువైన సంగతులు అర్థం చేసుకొనగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[152వ పేజీలోని బాక్సు]

మోషే ధర్మశాస్త్రమందలి కొన్ని ప్రాథమిక సూత్రాలు

దేవునియెడల బాధ్యతలు

యెహోవాను మాత్రమే ఆరాధించాలి నిర్గ. 20:3; 22:20

ఆయన నామాన్ని గౌరవంగా చూడాలి నిర్గ. 20:7; లేవీ. 24:16

ఆయనను ప్రేమించి, పూర్ణ హృదయముతో, ద్వితీ. 6:5; 10:12; 30:16

ప్రాణముతో, శక్తితో సేవించాలి

అవిధేయులగుటకు జంకి, ఆయనకు భయపడాలి ద్వితీ. 5:29; 6:24

ఆయన అంగీకరించు మార్గము ద్వారా మాత్రమే లేవీ. 1:1-5; సంఖ్యా. 16:1-50;

ఆయనను సమీపించాలి ద్వితీ. 12:5-14

నీ శ్రేష్ఠమైనది ఆయనకివ్వాలి; నిర్గ. 23:19; 34:26

అది ఆయనిచ్చినదే

ఆరాధికులు శారీరకంగా నిర్గ. 19:10, 11; 30:20

పరిశుభ్రంగా ఉండాలి

లౌకిక ఆశల నిమిత్తం నిర్గ. 20:8-10; 34:21;

పరిశుద్ధాసక్తుల్ని వెనక్కు నెట్టకూడదు సంఖ్యా. 15:32-36

నిషేధింపబడిన మత అభ్యాసాలు

విగ్రహారాధన నిర్గ. 20:4-6; ద్వితీ. 7:25

మిశ్రమ విశ్వాసము నిర్గ. 23:13; 34:12-15;

ద్వితీ. 6:14, 15; 13:1-5

అభిచారము, చిల్లంగితనము, నిర్గ. 22:18; లేవీ. 20:27;

జ్యోతిష్యము, సోదెచెప్పుట, ద్వితీ. 18:10-12

మంత్ర, తంత్రములు

వివాహము, కుటుంబ జీవితం

వ్యభిచారం నిషేధింపబడింది నిర్గ. 20:14; లేవీ. 20:10

యెహోవాను సేవించని ద్వితీ. 7:1-4

వారిని వివాహమాడకుండుట

రక్తసంబంధ లైంగిక లేవీ. 18:6-16; 20:11

క్రియలు నిషేధింపబడినవి

అదుపుతప్పిన లైంగిక లేవీ. 18:23; 20:13

క్రియల్ని విసర్జించాలి

జన్మించని శిశువుల నిర్గ. 21:22, 23

జీవాన్ని గౌరవించుట

మీ తలిదండ్రులను గౌరవించండి నిర్గ. 20:12; 21:15, 17; ద్వితీ. 21:18-21

మీ పిల్లలకు యెహోవా మార్గాలు నేర్పండి ద్వితీ. 6:4-9; 11:18-21

ఇతర ప్రజలకు సంబంధించిన విధులు

మానవ జీవాన్ని పవిత్రంగా ఎంచండి నిర్గ. 20:13; సంఖ్యా. 35:9-34

పొరుగువాన్ని ప్రేమించండి; పగను విసర్జించండి లేవీ. 19:17, 18

వృద్ధులయెడల శ్రద్ధచూపండి లేవీ. 19:32

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, లేవీ. 25:35-37;

అనాధలను, విధవరాండ్రను ఆదుకోండి ద్వితీ. 15:7-11; 24:19-21

చెవిటి, గ్రుడ్డివారిని నీచంగా చూడొద్దు లేవీ. 19:14; ద్వితీ. 27:18

వ్యాపారమందు యథార్థంగా ఉండండి లేవీ. 19:35, 36; 25:14

పరుల ఆస్తుల్ని గౌరవించండి నిర్గ. 20:15; 22:1, 6; 23:4;

ద్వితీ. 22:1-3

ఇతరులకు చెందినవాటిని ఆశించవద్దు నిర్గ. 20:17

ఘోరమైన తప్పుచేసిన వారి లేవీ. 5:1;

సంగతి బయటపెట్టండి ద్వితీ. 13:6-11

సత్యవంతముగా ఉండండి; అబద్ధ సాక్ష్యం చెప్పకండి నిర్గ. 20:16; 23:1, 2

స్థానాన్నిబట్టి పక్షపాతం చూపొద్దు నిర్గ. 23:3, 6; లేవీ. 19:15