యెహోవా దినాన్ని మనస్సునందుంచుకోండి
అధ్యాయం 23
యెహోవా దినాన్ని మనస్సునందుంచుకోండి
1. (ఎ) ఈ ప్రస్తుత విధానమందలి జీవితపు హృదయవేదనల నుండి విడుదల సమీపంగా ఉందని మీరు మొదట నేర్చుకున్నప్పుడు, మీరెలా ప్రతిస్పందించారు? (బి) దీని విషయమైన ఏ ప్రశ్నల్ని మనం గంభీరంగా విచారించాలి?
నిస్సందేహంగా బైబిలు పఠనాన్నుండి మీరు నేర్చుకున్న సంగతుల్లో ప్రస్తుత విధానమందలి జీవితపు హృదయవేదనల నుండి విడుదల సమీపంగా ఉందనేది ఒకటి. ఈ యావత్ భూమి పరదైసుగా ఉండాలనుటే దేవుని సంకల్పమని మీరు తెలుసుకున్నారు. నేరం, యుద్ధం, రోగం, మరణం గతించిపోతాయి, మృతులైన మన ప్రియులు సహితం జీవానికి వస్తారు. ఎంత హృదయానందకరమైన ఉత్తరాపేక్షయో గదా! పరిపాలించు రాజుగా క్రీస్తు అదృశ్య ప్రత్యక్షత సా.శ. 1914 లో ఆరంభమైందని, అప్పటినుండి మనం ఈ దుష్టవిధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నామనే రుజువు ఇదంతా సమీపమైందని నొక్కిజెబుతోంది. ఆ జ్ఞానం మీ జీవితంలో మార్పుల్ని కలుగజేసిందా? “యెహోవాదినము” సమీపించిందనే ఒప్పుదలను మీ జీవన విధానం నిజంగా ప్రదర్శిస్తోందా?
2. (ఎ) “యెహోవా దినము” ఎప్పుడు వస్తుంది? (బి) యెహోవా ‘ఆ దినమును లేదా ఆ గడియను’ వెల్లడిచేయకపోవుట ప్రయోజనకరమని ఎట్లు నిరూపించబడింది?
2 క్రీస్తు ప్రత్యక్షతాసూచనను చూసిన “తరము” వారు “యెహోవా మహా దినమును” కూడా చూస్తారని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ దినమందు ఆయన దుర్నీతిని అభ్యసించు వారందరికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తాడు. (మత్త. 24:34; జెఫ. 1:14–2:3) అయితే సాతాను భూవిధానమంతటి మీదికి తీర్పుతీర్చు యెహోవా నియమిత న్యాయాధిపతిగా యేసుక్రీస్తువచ్చే కచ్చితమైన తేదీని బైబిలు సూచించుట లేదు. “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు” అని యేసు చెప్పాడు. (మార్కు 13:32) ఇదెంతో ప్రయోజనకరమని నిరూపించబడింది. ఏ విధముగా? ఇది ప్రజల హృదయ పరిస్థితిని చూపుటకు సహాయపడింది. యెహోవాను నిజంగా ప్రేమించనివారు తమ మనస్సుల్లో ఆయన “దినమును” వాయిదా వేయుటకు మొగ్గుచూపి, వారి హృదయేచ్ఛలనుబట్టి లౌకిక విషయాలవైపు తిరుగుతారు. తనను నిజంగా ప్రేమిస్తూ, దుష్ట విధానాంతము ఎప్పుడు వచ్చిననూ తనను పూర్ణప్రాణముతో సేవించుటద్వారా ఆ ప్రేమనుచూపే తన సేవకులను మాత్రమే యెహోవా ఆమోదిస్తాడు. నులివెచ్చగానున్న లేక ద్విమనస్కులైన వారిని దేవుడు, ఆయన కుమారుడు ఆమోదించరు.—ప్రక. 3:16; కీర్త. 37:4; 1 యోహా. 5:3.
3. ఈ విషయమై మనకు హెచ్చరికగా యేసు ఏమి చెప్పాడు?
3 యెహోవాను ప్రేమించు వారిని హెచ్చరిస్తూ యేసు ఇట్లన్నాడు: “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి, ఆ కాలమెప్పుడువచ్చునో మీకు తెలియదు.” (మార్కు 13:33-37) కాల గంభీరతను గుర్తించకుండునట్లు మన అవధానాన్ని పాడుచేసేంతగా తినిత్రాగుటలో “ఐహిక విచారములలో” మునిగిపోవడానికి మనల్నిమనం అనుమతించుకోవద్దని ఆయన ఉద్బోధించాడు.—లూకా 21:34-36; మత్త. 24:37-42.
4. పేతురు వివరించినట్లుగా, “యెహోవా దినము” ఏమి తెస్తుంది?
4 ఆ తర్వాత, అపొస్తలుడైన పేతురు, ‘ఆకాశములు రవులుకొని లయమై, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయే యెహోవా దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుడు’ అని నిజమైన విశ్వాసంగల వారందరిని హెచ్చరించాడు. “యెహోవా దినము” సమీపమైనదనే వాస్తవాన్ని మనలో ఎవ్వరూ ఎప్పుడు అల్పమైన విషయంగా చేయకూడదు. 2 పేతు. 3:10-13) ప్రపంచాన్ని కుదిపివేసే ఈ సంఘటనలు ఏ క్షణంలోనైనా ఆరంభమౌతాయని ఎరిగి మనం సదా అప్రమత్తంగా ఉండాలి.—మత్త. 24:44.
త్వరలోనే దృశ్య ప్రభుత్వాలుగానున్న ఆకాశముల, దుష్ట మానవ సమాజము స్థానే దేవుడేర్పరచిన “క్రొత్త ఆకాశములు . . . క్రొత్త భూమి” స్థాపించబడతాయి, కాగా ప్రస్తుత లోక విధానముతో పాటు పంచభూతములు అనగా దాని స్వేచ్ఛా దృక్పథము, దాని లైంగిక, ఐశ్వర్యాసక్తిగల జీవన విధానం “యెహోవా దినపు” నాశనకరమైన జ్వాలచే అంతమొందించబడతాయి. (సూచనను నెరవేర్చే సంఘటనల విషయమై అప్రమత్తంగా ఉండండి
5. (ఎ) మత్తయి 24:3 నందు వ్రాయబడిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు ఎంతమేరకు యూదా విధానాంతమునకు అన్వయించబడెను? (బి) ఆయనిచ్చిన జవాబులోని ఏ భాగాలు సా.శ. 1914 తర్వాతి కాలంపై దృష్టినిల్పినవి?
5 ప్రత్యేకంగా మనం జీవించే కాలాల దృష్ట్యా, “అంత్యదినములను” లేదా “యుగసమాప్తిని” గుర్తించే సంయుక్త సూచనయొక్క వివరాలను మనం బాగుగా ఎరిగియుండాలి. ఆ సూచనను సరిగా చదువుటకు, మత్తయి 24:3 లో వ్రాయబడినట్లు శిష్యుల ప్రశ్నకు యేసుయిచ్చిన జవాబులో కొంతభాగం మొదటి శతాబ్దమందలి యూదా విధానాంతమునకు అనువర్తింపగా, దాని ముఖ్య అన్వయింపు ఆ తర్వాతి కాలానికికూడా విస్తరించిందని మనం మనస్సునందుంచుకోవాలి. ఆయన 4 నుండి 22 వచనాల్లో వివరించినది కొద్ది పరిణామమందు సా.శ. 33 నుండి 70 వరకున్న మధ్యకాలంలో నెరవేరింది. అయితే ఆ ప్రవచనపు అధిక నెరవేర్పు మనకాలానికి సంబంధించినదై, సా.శ. 1914 నుండి క్రీస్తు ‘ప్రత్యక్షత, యుగసమాప్తి’ జరిగే కాలమని గుర్తిస్తున్నది. (మార్కు 13:5-20 మరియు లూకా 21:8-24 కూడా) సా.శ. 70 నుండి క్రీస్తు ప్రత్యక్షతా కాలంవరకు జరిగే విషయాల్ని మత్తయి 24:23-28 తెలియజేస్తున్నది.—మార్కు 13:21-23.
6. (ఎ) “సూచనను” నెరవేర్చే ప్రస్తుత సంఘటనలయెడల మనమెందుకు వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలి? (బి) ఆ “సూచన” 1914 నుండి ఎట్లు నెరవేరుచున్నదో చూపించుటకు ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబివ్వండి.
యెష. 61:1, 2) ఈ ఉద్దేశాల్ని మనస్సులో ఉంచుకొని, ఆ “సూచన” యొక్క ఈ క్రింది ఆకృతుల్ని పునఃసమీక్షించండి.
6 ఆ “సూచనను” నెరవేర్చే ప్రస్తుత సంఘటనల్ని మనం వ్యక్తిగతంగా గమనిస్తూవుండాలి. ఈ సంఘటనల్ని బైబిలు ప్రవచనంతో పోల్చి చూచుట యెహోవా దినాన్ని “కనిపెట్టుకొని” ఉండుటకు మనకు సహాయం చేస్తుంది. “మన దేవుని ప్రతిదండన దినపు” సమీపరాకడను గూర్చి ఇతరులను హెచ్చరించేటప్పుడు మనం పట్టుదలగలవారమై ఉండుటకు కూడ అది మనల్ని బలపరస్తుంది. (‘జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును’ లేచుననే ప్రవచనం సా.శ. 1914 ఆరంభం నుండి ఎలా అసాధారణ రీతిలో నెరవేరింది? ఆ నెరవేర్పుకు మరింత అర్థాన్ని చేకూర్చేదేది ఇటీవలి నెలల్లో జరిగింది?
ఈ 20వ శతాబ్ద విజ్ఞానశాస్త్ర జ్ఞానమెంతున్నా ఎంతమేరకు ఆహారకొరత ఈ భూమిపై తన ప్రభావాన్ని చూపింది?
సా.శ. 1914 నుండి అక్కడక్కడ తరచు సంభవించే భూకంపాల్లో నిజంగా భేదమేమైనా ఉందా?
ప్రపంచ యుద్ధంకంటే 1918 లో ప్రబలిన ఏ తెగులు ఎక్కువ జీవాల్ని బలిగొన్నది? వైద్య పరిజ్ఞానమున్నా ఏ రోగాలింకా అంటువ్యాధుల్లా ప్రబలుతున్నాయి?
లూకా 21:26 లో ప్రవచింపబడినట్లు, మనుష్యులు నిజంగా ధైర్యం చెడికూలుతున్నారనేందుకు ఏ రుజువును మీరు చూస్తున్నారు?
రెండవ తిమోతి 3:1-5 లో వర్ణింపబడిన పరిస్థితులు కేవలం జీవితంలో ఎప్పుడూవుండే విధానం కాదుగాని మనం అంత్యదినాల ముగింపుకు చేరువయ్యే కొలది అవి గగుర్పాటుకల్గించే స్థాయికి చేరుతున్నవని ఏది మిమ్మల్ని ఒప్పిస్తున్నది?
ప్రజల్ని వేరుపరచుట
7. (ఎ) మత్తయి 13:36-43 నందు వర్ణింపబడిన మరే ఇతర సంఘటనను యేసు యుగసమాప్తితో ముడిపెట్టాడు? (బి) ఆ ఉపమాన భావమేమిటి?
7 యుగసమాప్తితో యేసు ముడిపెట్టిన విశేషమైన ఇతర సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిలో “దుష్టుని సంబంధుల” నుండి “రాజ్య సంబంధులను” వేరుచేయుట ఒకటి. శత్రువు గురుగులు విత్తిన గోధుమ పొలాన్ని గూర్చి తన ఉపమానంలో యేసు దీనిని చెప్పాడు. ఆయన ఉపమానమందలి “గోధుమలు” నిజమైన అభిషిక్త క్రైస్తవులకు ప్రాతినిధ్యమై ఉన్నవి. “గురుగులు” అనుకరణ క్రైస్తవులైయున్నారు. యుగసమాప్తిలో “గురుగులు” అనగా క్రైస్తవులమని చెప్పుకుంటూ, అపవాది పరిపాలించే ఈ లోకానికి హత్తుకొన్నందున “దుష్టుని సంబంధులుగా” తమను నిరూపించుకొనిన వారు “[దేవుని] రాజ్య సంబంధుల” నుండి వేరుచేయబడి, నాశనమునకు గుర్తింపబడతారు. (మత్త. 13:36-43) ఇది నిజంగా జరిగిందా?
8. (ఎ) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, క్రైస్తవులమని చెప్పుకొనెడి వారందరిని వేరుపరచే ఏ గొప్ప పని జరిగింది? (బి) నిజమైన అభిషిక్త క్రైస్తవులు తాము నిజంగా “రాజ్యసంబంధులని” ఎలా రుజువుచేశారు?
8 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, నిజానికి క్రైస్తవులని చెప్పుకొనిన వారందరిని రెండు తరగతుల వారిగా వేరుచేసే మహాగొప్ప పని జరిగింది: (1) తమ జాతీయతత్వానికి ఇంకనూ అంటిపెట్టుకుని నానాజాతి సమితికి (ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి) బలమైన మద్దతునిచ్చే క్రైస్తవ మతసామ్రాజ్య మతనాయకులు, వారి అనుచరులు. (2) దేవుని మెస్సీయ రాజ్యానికి తమ సంపూర్ణ మద్దతునిచ్చిన, ఆ యుద్ధానంతర కాలమందలి కొద్దిమంది నిజమైన అభిషిక్త క్రైస్తవులు. శాంతిభద్రతలు సాధించే మార్గాలని లోక ప్రభుత్వాలకు బాహాటంగా మద్దతునిచ్చుట ద్వారా, ఆ మొదటి తరగతి వారు తాము నిజమైన క్రైస్తవులు కాదని స్పష్టంచేశారు. (యోహా. 17:16) దానికి భిన్నంగా, యెహోవా సేవకులు మత్తయి 24:15 లో సూచింపబడినట్లు, నానాజాతి సమితి ఆధునికకాల “నాశనకరమైన హేయవస్తువని” సరిగా గుర్తించారు. తమను నిజమైన “[దేవుని] రాజ్య సంబంధులుగా” చూపించుకొనుచూ వారు “ఈ రాజ్య సువార్త లోకమందంతటను” ప్రకటించే పనిని చేపట్టారు. (మత్త. 24:14) దాని ఫలితమేమిటి?
[This paragraph is not in vernacular]
9. (ఎ) ఓ గొప్ప ప్రకటనాపని ఎలా జరిగించబడింది? (బి) ఈ ప్రవచనాల నెరవేర్పు దేనిని సూచించింది?
9 ఆ పిమ్మట, యేసు ప్రవచించినట్లు అన్ని జనాంగాల ప్రజలకు ప్రకటించే గొప్ప పనిని ఆరంభించాడు. (మార్కు 13:10) పరలోక సింహాసనం నుండి క్రీస్తు నడిపిస్తున్న ఈ పని ఇప్పటికింకా కొనసాగుతుంది, వ్యక్తిగతంగా దాని ప్రభావం మీమీద ఉన్నది. దేవుని రాజ్యాన్ని దాని ఆత్మాభిషిక్త ‘కుమారులను’ తిరస్కరించు అనేకమంది మానవులు మరణమందు “నిత్యశిక్షకు” పాత్రులౌతారు. అయితే, నిత్యజీవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్య భూపరిధిని స్వతంత్రించుకొనుడని ప్రభువు ఇతరులను ఆహ్వానిస్తాడు. అలాంటివారు, క్రూర హింసలకు గురైననూ అభిషిక్త “రాజ్యసంబంధులతో” సహవసించారు. (మత్త. 25:31-46) ఆ రాజ్య అవశ్య వర్తమానాన్ని ఎల్లెడలా ప్రకటించేందుకు వారు యథార్థంగా వారికి సహాయం చేస్తున్నారు. లక్షలసంఖ్యలోగల ఒక గొప్పసమూహం ఈ పనిలో భాగం వహిస్తున్నారు. ఈ రాజ్య వర్తమానం భూదిగంతముల వరకు వినబడుతోంది. ఈ సంఘటనలు దేనిని సూచిస్తున్నాయి? మనం “అంత్యదినముల” ముగింపుకు అతి చేరువలో ఉన్నామని, “యెహోవా దినము” అతి సమీపంలో ఉందని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి.
ముందేమున్నది?
10. “యెహోవా దినము” రాకముందు మరింత ప్రకటన పనిచేయాల్సి ఉందా?
10 భయంకరమైన యెహోవా మహాదినారంభానికి ముందు నెరవేరవలసిన ప్రవచనాలింకేమైనా ఉన్నాయా? ఉన్నాయి! రాజ్య వివాదం సంబంధముగా ప్రజల్ని వేరుచేయడం ఇంకా పూర్తికాలేదు. గడచిన సంవత్సరాల్లో తీవ్ర వ్యతిరేకతననుభవించిన కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు క్రొత్త శిష్యుల కోత విస్తారంగా ఉంది. సువార్తను ప్రజలు తిరస్కరించే ప్రాంతాల్లో మత్త. 24:14.
సహితం, మనం సాక్ష్యమివ్వడం ద్వారా యెహోవా న్యాయము, కనికరము సమర్థింపబడుతోంది. ఆలాగే సేవ కూడా! అది సంపూర్తి చేయబడినప్పుడు “అంతము వచ్చునని” యేసు అభయమిస్తున్నాడు.—11. (ఎ) మొదటి థెస్సలొనీకయులు 5:2, 3 లో చూపబడినట్లు, గమనార్హమైన ఏ సంఘటన ఇంకనూ జరగాలి? (బి) మనకు దానర్థమేమై ఉంటుంది?
11 మరో అతి విశేషమైన బైబిలు ప్రవచనమిలా చెబుతోంది: “లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” (1 థెస్స. 5:2, 3) “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదు” అనే ప్రకటన ఏ రూపంలో ఉంటుందో ఇంకా చూడవలసి ఉన్నది. అయితే ప్రపంచ నాయకులు మానవజాతి సమస్యల్ని నిజంగా పరిష్కరించారని మాత్రం నిశ్చయంగా దానర్థం కాదు. యెహోవా దినము కొరకు “కనిపెట్టుకొని” ఉండువారు ఆ ప్రకటనచే మోసగింపబడరు. ఆ వెంటనే “ఆకస్మికముగా నాశనము తటస్థించునని” వారికి తెలుసు.
12. “నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదు” అనే ప్రకటన వెనువెంటనే ఏ సంఘటనలు జరుగుతాయి, ఏ క్రమంలో?
12 మొదట లేఖనాలు చూపునట్లు, రాజకీయ నాయకులు భూవ్యాప్తంగా అబద్ధమత సామ్రాజ్యమగు మహాబబులోనుకు వ్యతిరేకంగా తిరిగి దానిని దిక్కులేనిదానిగా చేస్తారు. (ప్రక. 17:15, 16) ప్రత్యేకంగా క్రైస్తవ మతసామ్రాజ్య మతాలయెడల వ్యతిరేక స్వభావాలు ఇప్పుడు కనబర్చబడటం నిజంగా గమనార్హమైన విషయం. మత వ్యతిరేక పథకాలుగల ప్రభుత్వాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో గొప్ప ప్రభావాన్ని చూపుతున్నవి, ఆలాగే సాంప్రదాయ మతదేశాల్లో ప్రజలనేకులు తమ పితరుల మతాల్ని విడిచిపెడుతున్నారు. దీనియంతటి భావమేమిటి? సమస్త అబద్ధమతాన్ని నిర్మూలించే సమయమాసన్నమైనదనే దీని భావం. ఆ పిమ్మట, జనాంగములు బహు క్రోధముతో, గొప్ప శక్తితో యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించే వారి మీదికి తిరిగినప్పుడు, దైవిక ఉగ్రత రాజకీయ ప్రభుత్వాలపై, వారి మద్దతుదార్లపై విరుచుకుపడుతుంది, తత్ఫలితంగా వారందరు సంపూర్ణంగా నాశనం చేయబడతారు. చివరకు, సాతాను అతని దయ్యాలతోసహా అగాధంలో పడవేయబడి, మానవజాతిపై ఇక ఏమాత్రం ప్రభావం చూపకుండా పూర్తిగా అడ్డగింపబడతాడు. ఇది నిజముగా “యెహోవా దినము,” ఆయన నామమును ఉన్నతిచేయు దినము.—యెహె. 38:18, 22, 23; ప్రక. 19:11-20:3.
13. యెహోవా దినము ఇంకా చాలా దూరంలో ఉందని తర్కించుట ఎందుకు అజ్ఞానదాయకమై ఉంటుంది?
13 దేవుని కాలపట్టిక ప్రకారం, అది కచ్చితంగా దాని నిర్ణయకాలమందు వస్తుంది. అది ఆలస్యం చేయదు. (హబ. 2:3) యూదులు అపేక్షించనప్పుడు, అదెంతో దూరంలో ఉందని వారు తలంచినప్పుడు యెరూషలేము నాశనం ఆకస్మికంగా సా.శ. 70 లో సంభవించెనని గుర్తుంచుకోండి. మరి ప్రాచీన బబులోను విషయమేమిటి? అదెంతో శక్తివంతమైన, నిబ్బరమైన, బలమైన మహాగొప్ప ప్రాకారములతో ఉండెను. అయితే అది ఒక్కరాత్రిలోనే కూలిపోయింది. అదే ప్రకారం, ప్రస్తుత దుష్ట విధానంపై “ఆకస్మికముగా నాశనము తటస్థించును.” అది వచ్చినప్పుడు మనం యెహోవా దినాన్ని “కనిపెట్టుచు” సత్యారాధనలో ఐక్యమైన వారిగా ఉందాము.
పునఃసమీక్షా చర్చ
• యెహోవా దినాన్ని “కనిపెట్టుట” ఎందుకు అవశ్యము? దానిని మనమెలా చేయగలం?
• ప్రస్తుతం జరుగుతున్న ప్రజల్ని వేరుచేసే పనిద్వారా వ్యక్తిగతంగా మనమెలా ప్రభావానికి లోనయ్యాము?
• యెహోవా దినారంభానికి ముందింకా ఏమున్నది? కాబట్టి వ్యక్తిగతంగా మనమేమి చేస్తుండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[This question is not in vernacular]