కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది

యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది

అధ్యాయం 24

యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది

1, 2. (ఎ) తన తెలివిగల ప్రాణులయెడల యెహోవా సంకల్పమేమిటి? (బి) దేవుని ఐక్య ఆరాధికుల కుటుంబంలో ఎవరెవరు చేర్చబడ్డారు? (సి) దీనిని గూర్చి, ఏ వ్యక్తిగత ప్రశ్న ఆలోచనా యోగ్యమైనది?

తెలివిగల యావత్‌సృష్టి సత్యారాధనలో ఐక్యమై, వారందరు దేవుని పిల్లల మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని అనుభవించుటే యెహోవాయొక్క జ్ఞానయుక్తమైన ప్రేమగల సంకల్పము. ఇది నీతిని ప్రేమించే వారందరు చిత్తశుద్ధితో ఇచ్ఛయించే సంగతి కూడ.

2 యెహోవా తన సృష్టికార్యాలు మొదలుపెట్టినప్పుడే ఈ దివ్య సంకల్పాన్ని నెరవేర్చనారంభించాడు. ఆయన మొట్టమొదట ఓ కుమారుణ్ణి సృష్టించాడు, కాగా ఈయన “దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” ఉన్నట్లు నిరూపించుకున్నాడు. (హెబ్రీ. 1:1-3) ఈయన ఉన్నతుడైయుండి, దేవుని స్వహస్తాలతో సూటిగా సృష్టింపబడ్డాడు. ఈయన ద్వారా ఇతర పిల్లలను, అనగా మొదట పరలోకమందలి దేవదూతలు, ఆ తర్వాత ఈ భూమ్మీది మనుష్యుడు ఉనికిలోకి తేబడ్డారు. (యోబు 38:7; లూకా 3:38) ఈ పిల్లలందరు కలిసి ఒకే విశ్వ కుటుంబంగా తయారయ్యారు. వారందరికి యెహోవాయే దేవుడు, ఆయన మాత్రమే ఆరాధింపబడాలి. ఆయన విశ్వ సర్వాధిపతి. ఆయన వారి ప్రేమగల తండ్రి కూడ. అదేవిధంగా ఆయన మీ తండ్రిగా, మీరాయన పిల్లల్లో ఒకరిగా ఉన్నారా? అదెంత అమూల్యమైన సంబంధమై ఉండగలదో గదా!

3. (ఎ) పుట్టుకతోనే మనలో ఎవరూ ఎందుకు దేవుని పిల్లలు కారు? (బి) అయితే ఆదాము సంతానానికి యెహోవా ఎట్టి ప్రేమగల ఏర్పాటు చేశాడు?

3 అయినప్పటికిని, మన మొదటి మానవ తలిదండ్రులు ఉద్దేశపూర్వకంగా పాపులై మరణశిక్షకు పాత్రులయ్యారని, దేవునిచే ఉపేక్షించబడి ఏదెనునుండి వెళ్లగొట్టబడ్డారనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. వారు యెహోవా విశ్వ కుటుంబంలో భాగంగా ఉండటాన్ని మానుకున్నారు. (ఆది. 3:22-24; ద్వితీయోపదేశకాండము 32:4, 5 పోల్చండి.) పాపియగు ఆదాము సంతానమైనందున, మనందరము పాప స్వభావాలతో జన్మించాము. మనం దేవుని కుటుంబం నుండి వెళ్లగొట్టబడిన తలిదండ్రుల సంతానం గనుక, మానవులైనంత మాత్రాన మనం దేవుని పిల్లలమని చెప్పుకోలేము. అయితే ఆదాము సంతానమందు నీతిని ప్రేమించువారు కొందరుంటారని యెహోవా ఎరిగినవాడై, దేవుని పిల్లలుపొందే మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని సంపాదించగల్గే ప్రేమగల ఏర్పాటుచేశాడు.—రోమా. 8:20, 21.

ఇశ్రాయేలీయుల అనుగ్రహపూర్వక స్థానం

4. (ఎ) దేని ఆధారముగా ఇశ్రాయేలీయులు దేవుని “బిడ్డలై” ఉండిరి? (బి) అంటే దీని అర్థమేమి కాదు?

4 ఆదాము సృష్టింపబడిన దాదాపు 2,500 సంవత్సరాల తర్వాత, యెహోవా మరలా తన పిల్లలుగా తనతో సంబంధం కలిగివుండే ఆధిక్యతను కొంతమంది మానవులకు విస్తరింపజేశాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనకనుగుణ్యముగా యెహోవా ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. అందుకే, ఐగుప్తు ఫరోతో ఆయన ఇశ్రాయేలు “నా కుమారుడు” అని చెప్పాడు. (నిర్గ. 4:22, 23; ఆది. 12:1, 2) ఆ తర్వాత ఆయన సీనాయి పర్వతమునొద్ద ఆ ప్రజలకు తన ధర్మశాస్త్రాన్నిచ్చి, వారినొక జనాంగముగాచేసి తన సంకల్పము సంబంధముగా వారినుపయోగించాడు. ఓ జనాంగముగా, వారు యెహోవాకు “ప్రత్యేకమైన సొత్తుగా” ఉన్నందున వారు “బిడ్డలు” అని పిలువబడ్డారు. (ద్వితీ. 14:1, 2; యెష. 43:1) అంతేకాకుండ, ఆ జనాంగమందలి ఆయావ్యక్తులతో ఆయనకున్న ప్రత్యేక వ్యవహారములనుబట్టి, యెహోవా వారిని బిడ్డలుగా సూచించాడు. (1 దిన. 22:9, 10) దేవునితోగల నిబంధనా స్థానంపై ఈ స్థానం ఆధారపడియుండెను. అయితే, దేవునితో ఆదాము కలిగివుండిన మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని వారనుభవించారని దీనర్థం కాదు. వారింకనూ పాపమరణములకు బందీలుగానే ఉండిరి.

5. ఇశ్రాయేలీయులు దేవునియెదుట తమ ప్రత్యేక స్థానాన్ని ఎలా పొగొట్టుకున్నారు?

5 అయినప్పటికిని, పిల్లలుగా వారు దేవునియెదుట అనుగ్రహపూర్వక స్థానాన్ని కలిగివుండిరి. ఆలాగే వారు తమ తండ్రిని గౌరవించి, ఆయన సంకల్పానికనుగుణ్యంగా పనిచేయాల్సిన బాధ్యత వారిమీదుండెను. ఆ బాధ్యతను నెరవేర్చే ప్రాముఖ్యతను అనగా వారు దేవున్ని కేవలం తమ తండ్రిగా చెప్పుకొనుట కాదుగాని, ఆయన పిల్లలుగా ‘తమనుతాము నిరూపించుకోవాలని’ యేసు నొక్కి తెల్పాడు. (మత్త. 5:43-48; మలా. 1:6) అయితే, ఒక జనాంగముగా యూదులు ఈ విషయంలో విఫలులయ్యారు. కాబట్టి, యేసు భూపరిచర్యలోని చివరి సంవత్సరంలో, యేసును చంప వెదకిన యూదులు, “దేవుడొక్కడే మాకు తండ్రి” అని ప్రకటించినప్పుడు, వారి క్రియలు వారు కనబరచిన స్వభావం వారలా చెప్పుకోవడాన్ని అబద్ధం చేస్తున్నదని యేసు స్థిరంగా సూచించాడు. (యోహా. 8:41, 44, 47) సా.శ. 33 లో దేవుడు ధర్మశాస్త్రాన్ని రద్దుచేశాడు, కాగా ఇశ్రాయేలీయులు అనుభవించిన ప్రత్యేక సంబంధపు ఆధారం అంతటితో ముగిసింది. అయినా, తన పిల్లలుగా తాను అంగీకరించిన వారిని మానవజాతి నుండి తీసుకోవడాన్ని యెహోవా మానుకోలేదు.

యెహోవా తన ప్రజల్ని ఐక్యపరస్తున్నాడు

6. ఎఫెసీయులు 1:9, 10నందు ఏ “యేర్పాటును” పౌలు వర్ణిస్తున్నాడు, దాని ఉద్దేశమేమిటి?

6 తన ప్రజల్ని ఐక్యపరచే యెహోవా కార్యక్రమాన్ని అనగా విశ్వాసముంచే వారు తన కుటుంబ ప్రియ సభ్యులుగా తయారుకాగల దేవుని ఏర్పాటును గూర్చి వ్రాస్తూ ఎఫెసులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలాచెప్పాడు: “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును [గృహనిర్వాహకత్వాన్ని] బట్టి, ఆయన [దేవుడు] తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.” (ఎఫె. 1:9, 10) ఈ “యేర్పాటు” క్రీస్తును కేంద్రబిందువుగా కలిగివుంది. ఆయన ద్వారా మానవుల్లో కొందరు పరలోకమందుండే ఉత్తరాపేక్షతో, మరితరులు భూమ్మీద ఉండే ఉత్తరాపేక్షతో, యెహోవా ఎడల తమ యథార్థత నిరూపించుకొనిన దేవుని దేవదూతలనే కుమారులతో ఐక్యత కలిగి సేవచేయుటకు దేవుని ఎదుట అంగీకృత స్థితికి తీసుకురాబడతారు.

7. “పరలోకములో ఉన్నవేమిటి,” ఏకముగా సమకూర్చుట వారికే భావాన్నిస్తుంది?

7 మొదట, సా.శ. 33 పెంతెకొస్తు నుండి “పరలోకములో ఉన్నది” అనగా పరలోక రాజ్యమందు క్రీస్తుతోడి వారసులుగా ఉండేవారియెడల శ్రద్ధ ఇవ్వబడింది. యేసు బలి విలువయందలి వారి విశ్వాసం ఆధారంగా, దేవుడు వారిని నీతిమంతులుగా ప్రకటించాడు. (రోమా. 5:1, 2) ఆ పిమ్మట వారు “క్రొత్తగా జన్మించారు” లేక పరలోక జీవ ఉత్తరాపేక్షతో దేవుని పిల్లలుగా వారు తీసుకోబడ్డారు. (యోహా. 3:3; 1:12, 13) ఆత్మీయ జనాంగముగా దేవుడు వీరితో ఒక క్రొత్త నిబంధన చేశాడు. యుక్తకాలంలో, యూదులు, అన్యులు కూడా వారిలో చేర్చబడతారు, అలా వారు మొత్తం 1,44,000 మందిగా ఉంటారు.—గల. 3:26-29; ప్రక. 14:1.

8. రాజ్య వారసులకు తండ్రితోగల సంబంధమెలా మోషే ధర్మశాస్త్రం క్రిందగల యూదులకు పోలివుంది?

8 శరీరరీత్యా వారింకా అసంపూర్ణులుగా ఉన్ననూ, పరలోక రాజ్యం యొక్క అట్టి వారసుల శేషము తండ్రితో అమూల్యమైన, సన్నిహిత సంబంధాన్ని కలిగివుంటారు. దీనినిగూర్చి పౌలు ఇలా వ్రాశాడు: “మీరు కుమారులైయున్నందున—నాయనా (“అబ్బా,” NW) తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.” (గల. 4:6, 7) అరమిక్‌ భాషలో “అబ్బా” అనుమాటకు “నాయనా” అని అర్థం, అయితే అది ప్రేమతో అనగా ఒక పిల్లవాడు తన తండ్రిని పిలిచే పిలుపు. యేసు బలి ఉన్నతత్వం మరియు దేవుని అపారమైన కృప కారణంగా, ధర్మశాస్త్రం క్రింద ఏ అసంపూర్ణ మానవునికి సాధ్యంకాని మరెంతో సన్నిహిత సంబంధాన్ని ఈ ఆత్మాభిషిక్త క్రైస్తవులు కలిగివుంటారు. అయితే వారికి భవిష్యత్తునందు వేచియుండేది మరెంతో అద్భుతకరంగా ఉంటుంది.

9. వారి పుత్రత్వం నిండుగా నిజమౌతుందంటే దాని భావమేమిటి?

9 మరణాంతము వరకు వారు తమ విశ్వాస్యతను నిరూపించుకుంటే, పరలోకమందలి అమర్త్యమైన జీవానికి పునరుత్థానం చేయబడుట ద్వారా వారు కుమారులుగా పరిపూర్ణతను పొందుతారు. అక్కడ యెహోవా దేవుని సమక్షమందే ఐక్యతతో సేవించే ఆధిక్యత వారికివ్వబడుతుంది. దేవుని ఈ పిల్లల్లో కొద్దిమంది మాత్రమే ఈ భూమిపై ఇంకనూ ఉన్నారు.—రోమా. 8:14, 23; 1 యోహా. 3:1, 2.

‘భూమిమీద ఉన్న’ వాటిని సమకూర్చుట

10. (ఎ) “భూమిమీది” సంగతులేమిటి, వారెప్పటినుండి ఆరాధనలో ఐక్యమగుటకు సమకూర్చబడుతున్నారు? (బి) యెహోవాతో వారి సంబంధమేమిటి?

10 పరలోక జీవ దృష్టితో మానవులు దేవుని గృహానికి సమకూర్చబడటాన్ని సాధ్యపరచిన ఆ “యేర్పాటే” ఈ “భూమిమీద ఉన్న” వాటిపై శ్రద్ధనిల్పేటట్లు చేస్తుంది. ప్రత్యేకంగా సా.శ. 1935 నుండి క్రీస్తునందు విశ్వసించే, భూమిపై నిత్యజీవ ఉత్తరాపేక్షగల వ్యక్తులు సమకూర్చబడుతున్నారు. మిగిలిన అభిషిక్తులతో తమ భుజాలుకలిపి వీరు యెహోవా నామాన్ని మహిమపరస్తూ ఆయనను ఉన్నతంగా ఆరాధిస్తున్నారు. (జెఫ. 3:9; యెష. 2:2, 3) వీరుకూడా, యెహోవాను జీవదాతగా గుర్తిస్తూ ప్రగాఢమైన గౌరవంతో ఆయనను “తండ్రీ” అని సంబోధిస్తున్నారు, తన పిల్లలనుండి ఆయన అపేక్షించే లక్షణాల్ని ప్రతిబింబించుటకు వారు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. యేసు చిందించిన రక్తమందలి విశ్వాసం ఆధారంగా వారాయన ఎదుట అంగీకృత స్థానాన్ని కలిగివున్నారు. (మత్త. 6:9; ప్రక. 7:9, 14) అయితే దేవుడు తన పిల్లలుగా వారిని సంపూర్ణంగా అంగీకరించే ఆనందం భవిష్యత్తులో ఉందని వారికి తెలుసు.

11. (ఎ) మానవజాతి కొరకు రోమీయులు 8:19-21 ఏ వాగ్దానాన్ని కలిగివున్నది? (బి) వారు ఆసక్తితో ఎదురుచూసే “దేవుని కుమారుల ప్రత్యక్షత” ఏమిటి?

11రోమీయులు 8:19-21 లో చూపబడినట్లు, “దేవుని కుమారుల ప్రత్యక్షత” కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే అప్పుడే మానవ సృష్టిలోని వీరికి “నాశనమునకు లోనైన దాస్యములోనుండి విడిపింపబడే” సమయం వస్తుంది. తమ పరలోక బహుమానం పొందిన దేవుని ఆత్మాభిషిక్త కుమారులు మహిమపర్చబడిన ప్రభువగు యేసుక్రీస్తు సహవాసులుగా చర్యగైకొనుటకు వెళ్లారనే రుజువును భూమ్మీది మానవులు చూసినప్పుడే ఈ “ప్రత్యక్షత” వెల్లడౌతుంది. ఈ సమస్త దుష్ట విధానం నాశనం చేయబడి, ఆ తర్వాత “దేవుని కుమారులు” రాజులుగా, యాజకులుగా భాగం వహించే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా దీవెనలు లభించునప్పుడు ఇది కనబర్చబడుతుంది.—ప్రక. 2:26, 27; 20:6.

12. మహాశ్రమల తర్వాత, విజేయులగు దేవుని ఆత్మాభిషిక్త కుమారులు ఏ స్తుతిగీతమందు తమ స్వరాలు కలుపుతారు, దానర్థమేమిటి?

12 మహాశ్రమలు గడచిన పిదప, క్రీస్తుతోడి వారసులగు ఆ దేవుని కుమారులు తమ స్వరాలుకలిపి ఆనందముతో దేవుని స్తుతించుట ఎంత మనోహరము! వారిలా ప్రకటిస్తున్నారు: “ప్రభువా, (“యెహోవా,” NW) దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, (“యెహోవా,” NW) నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి.” (ప్రక. 15:3, 4) అవును, పూర్వపు జనాంగముల నుండి వచ్చిన ప్రజలుగల యావత్‌ మానవజాతి, సత్య దేవుని ఆరాధనలో ఐక్యమౌతారు. సమాధుల్లో ఉన్నవారు సహితం పునరుత్థానం చేయబడగా, యెహోవాను స్తుతించుటలో తమ స్వరాల్ని కలిపే అవకాశం వారికివ్వబడుతుంది.

13. మహాశ్రమలు తప్పించుకొనువారు ఆ వెంటనే ఎట్టి అద్భుతకరమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు?

13 సాతానిక ఎంతమాత్రము “ఈ యుగ సంబంధమైన దేవతగా” ఉండడు. యెహోవా ఆరాధికులిక ఈ భూమిపై ఎంతమాత్రం అతడి దుష్టప్రభావాన్ని భరించాల్సిన పనిలేదు. (2 కొరిం. 4:4; ప్రక. 20:1-3) అబద్ధమతం ఇక మన ప్రేమగల దేవునికి తప్పుడు ప్రాతినిధ్యం వహించి, మానవ సమాజంపై విభజించే ప్రభావం చూపదు. సత్యదేవుని ఆరాధికులిక ఎంతమాత్రం ప్రభుత్వాధికారుల అన్యాయాలకు, మోసాలకు గురికారు. మహాశ్రమలు తప్పించుకొను వారికి ఎంతటి మహాద్భుతమైన స్వాతంత్ర్యం లభిస్తుందో గదా!

14. దేనిమూలంగా వారు పాపము, దాని సమస్త ప్రభావముల నుండి విడిపింపబడతారు?

14 “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లగా” యేసుక్రీస్తు, మానవజాతి గత పాపాలన్నింటిని కొట్టివేయుటకు తన బలి విలువను అన్వయిస్తాడు. (యోహా. 1:29) ఈ భూమిపై యేసు ఒకని పాపాలు క్షమించబడ్డాయని ప్రకటించినప్పుడు అందుకు రుజువుగా ఆ క్షమించబడిన వానిని స్వస్థపర్చాడు కూడ. (మత్త. 9:1-7) అదేవిధముగా, ఆయన పరలోకంనుండి ఆశ్చర్యకరమైన విధంగా గ్రుడ్డి, చెవిటి, మూగ వారిని, అంగవైకల్యం గలవారిని, మానసిక రోగులను, ఇతరత్రా రుగ్మతలపాలైన వారిని స్వస్థపరుస్తాడు. క్రమేణి, దేవుని నీతిమార్గాల ప్రకారం నమ్మకంగా తమను మార్చుకొనుటకు ఇష్టపడే విధేయులందరి క్రియలు, వారి తలంపులు, వారి హృదయ కోరికలు ఇటు తమకు అటు దేవునికి ప్రీతిపాత్రమగునట్లు వారిలోని “పాపనియమము” పూర్తిగా అణగార్చబడుతుంది. (రోమా. 7:21-23; యెషయా 25:7, 8; ప్రకటన 21:3, 4 పోల్చండి.) వెయ్యేండ్ల ముగింపుకు ముందే సంపూర్ణ మానవ పరిపూర్ణత పొందునట్లు వారికి సహాయం చేయబడుతుంది. వారు పూర్తిగా పాపమునుండి దాని సమస్త దుఃఖకర ప్రభావాలనుండి విడుదల పొందుతారు. ఈ యావత్‌ గోళాన్ని ఆవరించే భూపరదైసులో వారు సరియైన రీతిలో ‘దేవుని పోలికను, ఆయన స్వరూపాన్ని’ ప్రతిబింబిస్తారు.—ఆది. 1:26.

15. వెయ్యేండ్ల ముగింపునందు, క్రీస్తు ఏ చర్య గైకొంటాడు, ఏ ఉద్దేశముతో?

15 మానవజాతిని క్రీస్తు పరిపూర్ణతకు తీసుకొని వచ్చినప్పుడు, ఈ పనిచేయడానికి తనకివ్వబడిన అధికారాన్ని ఆయన తిరిగి తన తండ్రికే అప్పగిస్తాడు. మొదటి కొరింథీయులు 15:28 లో ముందే చెప్పబడినట్లుగా, “సమస్తమును ఆయనకు [కుమారునికి] లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.”

16. ఇప్పుడు పరిపూర్ణ మానవులందరు దేనికి గురిచేయబడతారు, ఎందుకు?

16 సజీవుడగు సత్యదేవుని మాత్రమే నిత్యం ఆరాధిస్తామనే తమ తిరుగులేని ఎంపికను ప్రదర్శించే అవకాశమిప్పుడు పరిపూర్ణ మానవజాతికి ఇవ్వబడుతుంది. కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా వారిని తన పిల్లలుగా స్వీకరించేముందు, ఆ పరిపూర్ణ మానవులను యెహోవా సంపూర్ణమైన, చివరిదైన పరీక్షకు గురిచేస్తాడు. సాతాను, అతని దయ్యాలు అగాధము నుండి విడుదల చేయబడతారు. యెహోవాను నిజంగా ప్రేమించే వారికిది ఎలాంటి హానికరమైన ఫలితాల్ని తీసుకురాదు. అయితే యెహోవాకు అవిధేయులు కావడానికి యథార్థతారహితంగా తమను అనుమతించుకునే ఎవరైనా సరే, ఆది తిరుగుబాటుదారునితో, అతని దయ్యాలతోపాటు నిత్యనాశనం అనుభవిస్తారు.—ప్రక. 20:7-10.

17. యెహోవా సంకల్పంయొక్క నెరవేర్పునందు, ఆయన తెలివిగల యావత్‌ సృష్టిమధ్య మరలా ఒకసారి ఎట్టి పరిస్థితి నెలకొంటుంది?

17 చివరిది, నిర్ణయాత్మకమైనది అయిన ఆ పరీక్షను తట్టుకుని నిలబడే పరిపూర్ణ మానవులందరిని యెహోవా ప్రేమతో క్రీస్తు ద్వారా తన పిల్లలుగా స్వీకరిస్తాడు. అప్పుడు వారు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమందు” సంపూర్ణంగా భాగం వహిస్తారు. (రోమా. 8:21) చివరికి వారు దేవుని ఐక్యపర్చబడిన, విశ్వకుటుంబంలో భాగమౌతారు, కాగా విశ్వసర్వాధిపతిగా, వారి ప్రేమగల తండ్రిగా యెహోవాయే వారందరి దేవుడై ఉంటాడు. అప్పుడు, భూమ్యాకాశములందలి యెహోవాయొక్క తెలివిగల యావత్‌సృష్టి, మరలా ఒకసారి అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమౌతుంది.

పునఃసమీక్షా చర్చ

• ఏదెనులో తిరుగుబాటుకు ముందు, యెహోవా ఆరాధికులందరు ఆయనతో ఎట్టి సంబంధం కలిగివుండిరి?

• దేవుని కుమారులపై ఎట్టి బాధ్యత ఉన్నది?

• నేడు దేవుని కుమారులెవరు? మరింకెవరు కూడ దేవుని పిల్లలౌతారు, ఇది ఐక్య ఆరాధనకు సంబంధించిన యెహోవా సంకల్పానికి ఎలా సంబంధం కలిగివుంది?

[అధ్యయన ప్రశ్నలు]