కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వారు లోకసంబంధులు కారు’

‘వారు లోకసంబంధులు కారు’

అధ్యాయం 21

‘వారు లోకసంబంధులు కారు’

1. (ఎ) తాను మరణించడానికి ముందు రాత్రి యేసు తన శిష్యుల పక్షముగా ఏమని ప్రార్థించాడు? (బి) “లోకసంబంధులు” కాకుండా ఉండుట ఎందుకంత ప్రాముఖ్యము?

తను వ్రేలాడదీయబడటానికి ముందు రాత్రి, యేసు తన శిష్యుల విషయమై ఎంతగానో ప్రార్థించాడు. సాతాను వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడని ఎరిగినవాడై, తన తండ్రితో ఆయనిలా అన్నాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహా. 17:15, 16) లోకంనుండి వేరైయుండుట ఎందుకంత ప్రాముఖ్యము? ఎందుకంటే దాని పరిపాలకుడు సాతాను. లోకసంబంధులైన వారు అతని అధీనంలో ఉంటారు. (యోహా. 14:30; 1 యోహా. 5:19) దీని దృష్ట్యా, “లోకసంబంధులు” కాకుండా ఉండుట అంటే ఏమిటో ప్రతి క్రైస్తవుడు అర్థంచేసికొనుట అవశ్యము. అది యేసు విషయంలో ఎలా నిజం?

2. ఏయే విధాలుగా యేసు “లోకసంబంధిగా” లేడు?

2 యేసు నిశ్చయంగా ఇతర ప్రజలనుండి వేరుగా ఉండలేదు. ఆయన “లోకసంబంధి” కాడంటే దానర్థం ఆయనకు ఇతరులపై ప్రేమలేదని కాదు. దానికి భిన్నంగా, ఆయన దేవుని రాజ్యసువార్త ప్రకటిస్తూ పట్టణ పట్టణానికి వెళ్లాడు. ఆయన రోగుల్ని బాగుచేశాడు, గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, మృతుల్ని లేపాడు, చివరకు మానవజాతి కొరకు తన జీవాన్నే అర్పించాడు. అయితే ఈ లోక స్వభావంతో నిండిన ప్రజల భక్తిహీన దృక్పథాల్ని, దుష్టక్రియల్ని ఆయన ప్రేమించలేదు. అనైతిక కోరికలు, ఐశ్వర్యాసక్తిగల జీవన విధానం, స్వార్థంతో ప్రముఖ స్థానాలకొరకు ప్రాకులాడటం వంటివాటికి వ్యతిరేకంగా ఆయన హెచ్చరించాడు. (మత్త. 5:27, 28; 6:19-21; లూకా 12:15-21; 20:46, 47) దేవునినుండి వేరైన ప్రజల జీవన విధానాన్ని అనుకరించడానికి బదులు, యేసు యెహోవా మార్గాల్లో నడిచాడు. (యోహా. 8:28, 29) రోమ్‌, యూదుల రాజకీయ వైరుధ్యాల విషయానికొస్తే, యేసు యూదుడైననూ ఎవరి పక్షమూ వహించలేదు.

“నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు”

3. (ఎ) యేసు విషయంలో యూదా మతనాయకులు పిలాతుకు ఏ నేరారోపణ చేశారు, ఎందుకు? (బి) మానవరాజు కావాలనే ఆసక్తి యేసుకెంత మాత్రంలేదని ఏది చూపిస్తున్నది?

3 అయితే, యూదుల మతనాయకులు జాతీయ శ్రద్ధాసక్తుల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. వారాయనను బంధింపజేసి రోమా ప్రభుత్వ రాజపాలకుడైన పొంతిపిలాతు నొద్దకు తీసుకెళ్లారు. వారి వేషధారణను యేసు బయటపెట్టడమే నిజానికి వారిని కలచివేసింది. అయితే ఆ రాజపాలకుడు చర్య గైకొనడానికి వీలుగా వారిలా ఆరోపించారు: “ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి.” (లూకా 23:2) వాస్తవానికి, ఒక ఏడాది క్రితం ప్రజలాయనను రాజుగా చేయాలని కోరినప్పుడు, యేసు దానిని తిరస్కరించాడు. (యోహా. 6:15) తాను పరలోకపు రాజౌతాడని, అలా రాజు కావలసిన సమయమింకా రాలేదని, ప్రజాస్వామిక లేదా ప్రజా ఉద్యమం ద్వారా కాదుగాని యెహోవా దేవునిచే సింహాసనమధిరోహిస్తాడని ఆయనకు తెలుసు.

4. “కైసరునకు పన్ను ఇచ్చుట” విషయంలో యేసు దృక్పథాన్ని గూర్చి వాస్తవాలేమి వెల్లడిచేస్తున్నాయి?

4 పన్నులు చెల్లించే మాటకొస్తే, ఆయన బంధింపబడటానికి కేవలం మూడురోజుల ముందే పరిసయ్యులు ఈ విషయంలో యేసునందు తప్పుపట్టడానికి ప్రయత్నించారు. అయితే వారు కుయుక్తితో వేసిన ప్రశ్నకు జవాబిస్తూ యేసు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “ఒక దేనారము [రోమా ప్రభుత్వ నాణెము] నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివి?” వారు “కైసరువి” అని చెప్పినప్పుడు, ఆయన వారికిలా జవాబిచ్చాడు: “ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.”—లూకా 20:20-25.

5 యేసు బంధింపబడినప్పుడు జరిగిన సంఘటనలు ఆయన రోమాప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించలేదని, తన శిష్యులును అలా చేయాలని తానిచ్ఛయించుట లేదని ప్రదర్శించినవి. యేసును పట్టుకోవడానికి రోమా సైనికులు యూదులతోకలిసి కత్తులు గుదియలతోను బయలుదేరివచ్చారు. (యోహా. 18:3, 12; మార్కు 14:43) ఇది చూసి అపొస్తలుడైన పేతురు కత్తిదూసి ఆ మనుష్యుల్లో ఒకని కుడిచెవి తెగనరికాడు. అయితే యేసు పేతురును గద్దించి ఇట్లన్నాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్త. 26:51, 52) ఆ మరుసటి ఉదయం పిలాతు సమక్షంలో యేసు తన చర్యకు కారణం వివరిస్తూ ఇట్లన్నాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.”—యోహా. 18:36.

6. ఆ న్యాయవిచారణ ఫలితమేమిటి?

6 సాక్ష్యాధారాల్ని పరిశీలించిన తర్వాత, యేసుమీద “మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదని” పిలాతు ప్రకటించాడు. అయినప్పటికిని, అతడు ప్రజల కోరికకు తలవొగ్గి యేసును వ్రేలాడదీయుటకు అప్పగించాడు.—లూకా 23:13-15; యోహా. 19:12-16.

యజమాని నడిపింపును శిష్యులు అనుకరించారు

7. లోకస్వభావాన్ని విసర్జించాం అయితే తాము ప్రజల్ని ప్రేమించామని తొలి క్రైస్తవులెలా చూపించారు?

7 “లోకసంబంధులు” కాకుండుట తమనుండి ఏమికోరిందో యేసు శిష్యులు అర్థం చేసుకున్నారని ఇటు బైబిలునందు అటు చరిత్ర గ్రంథాలందు వ్రాయబడిన క్రైస్తవత్వపు తొలిచరిత్ర చూపిస్తున్నది. వారు లోక స్వభావాన్ని త్యజించడానికి కృషిచేశారు. వారు రోమా ప్రభుత్వ సర్కస్‌ మరియు రంగస్థలాల్లో ప్రదర్శించబడు హింస, లైంగిక దుర్నీతిగల వినోదాన్ని విసర్జించినందున, మానవ విద్వేషకులుగా వారు ఎగతాళి చేయబడ్డారు. అయితే, తోటి మానవుల్ని ద్వేషించడానికి బదులు, రక్షణకొరకు దేవుడు ప్రేమతోచేసిన ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందునట్లు ఇతరులకు సహాయపడులాగున వారు శ్రమించారు.

8. (ఎ) “లోకసంబంధులు” కానందువల్ల ఆ తొలి శిష్యులు ఏమి అనుభవించారు? (బి) కాని రాజకీయ పరిపాలకుల్ని, పన్ను చెల్లించడాన్ని వారెలా దృష్టించారు, ఎందుకు?

8 వారి యజమానివలెనే, వారుకూడ తరచు తప్పుడు సమాచారమందించబడిన ప్రభుత్వాధికారులచే తీవ్రంగా హింసింపబడ్డారు. (యోహా. 15:18-20) అయితే దాదాపు సా.శ. 56 లో యేసుయిచ్చిన సలహానే బలపరస్తూ అపొస్తలుడైన పౌలు రోమ్‌లోనున్న తోటి క్రైస్తవులకు వ్రాశాడు. “దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు” గనుక రాజకీయ పరిపాలకులగు “పై అధికారులకు లోబడియుండవలెనని” పౌలు వారికి ఉద్బోధించాడు. లౌకిక ప్రభుత్వాల్ని యెహోవా స్థాపిస్తున్నాడని కాదుగాని, ఆయన అనుమతి చొప్పుననే అవి పరిపాలిస్తున్నవి. “ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి” ఎందుకంటే అవి అధికారమునకువచ్చే క్రమాన్ని దేవుడు ముందుగానే చూసి, ప్రవచించాడని పౌలు వివరించాడు. కాబట్టి, భూమిని పరిపాలించు ఏకైక ప్రభుత్వమగు యేసుక్రీస్తు అధికారమందలి దేవుని రాజ్యమువచ్చు పర్యంతము ప్రస్తుత కాలమునకు ఈ “పై అధికారులు . . . దేవుని నియమముగా” ఉన్నారు. అందుకే లౌకిక అధికారుల్ని గౌరవించి వారు నియమించే పన్నులు చెల్లించాలని పౌలు క్రైస్తవులకు సలహా ఇచ్చాడు.—రోమా. 13:1-7; తీతు 3:1, 2.

9. (ఎ) “పై అధికారులకు” లోబడియుండేటప్పుడు దేనిని లెక్కలోకి తీసుకోకుండా విడిచిపెట్టకూడదు? (బి) తొలి క్రైస్తవులు యేసు మాదిరిని జాగ్రత్తగా అనుకరించారని చరిత్ర ఎలా చూపిస్తున్నది?

9 దేవున్ని, దేవుని వాక్యాన్ని, క్రైస్తవ మనస్సాక్షిని లెక్కచేయకుండా ఇక పూర్తిగా వారికే లోబడియుండాలని పౌలు వారికి చెప్పలేదు. యేసు యెహోవాను మాత్రమే ఆరాధించాడని, ప్రజలు తనను రాజుగా చేయడాన్ని ఆయన తిరస్కరించాడని, కత్తిని వరలో పెట్టమని ఆయన పేతురుకు చెప్పాడని వారికి తెలుసు. మనఃపూర్వకంగా వారు తమ యజమాని నడిపింపుకు హత్తుకున్నారు. ఆన్‌ ది రోడ్‌ టు సివిలైజేషన్‌—ఎ వరల్డ్‌ హిస్టరీ (హెకెల్‌, సిగ్‌మ్యాన్‌ వ్రాసినది, పుటలు 237, 238) అనే గ్రంథం ఇలా నివేదిస్తున్నది: “రోమ్‌ పౌరులకున్న విధుల్లో కొన్నింటిలో భాగం వహించడానికి క్రైస్తవులు తిరస్కరించారు. సైనిక సేవలో ప్రవేశించుట అనగా తమ విశ్వాసాన్ని ఉల్లంఘించుటేనని ఆ క్రైస్తవులు . . . భావించారు. రాజకీయ పదవుల్ని వారు చేపట్టలేదు. చక్రవర్తిని ఆరాధింపలేదు.”

10. (ఎ) యెరూషలేమునందలి క్రైస్తవులు సా.శ. 66 లో గైకొన్న చర్యనెందుకు తీసుకున్నారు? (బి) ఏ విధముగా అదొక విలువైన మాదిరిని అందజేస్తున్నది?

10 వారి కాలమందలి రాజకీయ, సైనిక వివాదాల్లో యేసు శిష్యులు సంపూర్ణ తటస్థతను పాటించారు. సా.శ. 66వ సంవత్సరంలో యూదయలోని రోమాప్రాంతపు యూదులు కైసరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ వెంటనే రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టాయి. ఆ నగరమందలి క్రైస్తవులు ఏమిచేశారు? తటస్థంగా ఉండాలని, పోరాడే సైన్యాల మధ్యనుండి వెడలిపోవాలని యేసుయిచ్చిన సలహాను వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. తాత్కాలికంగా రోమా సైన్యం విరమించుకున్నప్పుడు, క్రైస్తవులు ఆ అవకాశాన్ని తీసుకుని యొర్దాను నది దాటి పెల్లా అనే కొండల ప్రాంతానికి పారిపోయారు. (లూకా 21:20-24) తటస్థతయందు వారు ఆ తర్వాతి క్రైస్తవులకు నమ్మకమైన మాదిరిగా పనిచేశారు.

యుగాంతమందు తటస్థత పాటించు క్రైస్తవులు

11. (ఎ) యెహోవాసాక్షులు ఏ పనియందు పనిరద్దీగా ఉన్నారు, ఎందుకు? (బి) ఏ విషయంలో వారు తటస్థంగా ఉన్నారు?

11 సా.శ. 1914 నుండి అనగా ఈ “యుగాంతమందు” ఆ తొలి క్రైస్తవులను అనుకరిస్తూ క్రైస్తవ తటస్థతా విధానాన్ని వెంటాడిన గుంపు ఏదైనా ఉన్నట్లు చరిత్ర చూపిస్తున్నదా? అవును, యెహోవాసాక్షులు ఆ విధంగా చేశారు. భూమియందంతట నీతిని ప్రేమించువారికి శాంతి సౌభాగ్యాల్ని, శాశ్వత సంతోషాన్ని కేవలం దేవుని రాజ్యమే సాధ్యపరస్తుందని భూవ్యాప్తంగా ప్రకటించడంలో వారు నిమగ్నమై ఉన్నారు. (మత్త. 24:14) అయితే ఆయా దేశాల వైరుధ్యాలకు సంబంధించి మాత్రం, వారు సంపూర్ణ తటస్థతను పాటించారు.

12. (ఎ) సాక్షుల తటస్థత ఏ విధంగా మతనాయకుల అభ్యాసాలకు భిన్నంగావుంది? (బి) రాజకీయ తటస్థతయందు యెహోవాసాక్షుల కొరకు ఇంకేమి ఇమిడియుంది?

12 దీనికి బద్ధవిరుద్ధంగా క్రైస్తవ మతసామ్రాజ్య మతనాయకులు ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో బహుగా మునిగిపోయారు. కొన్నిదేశాల్లో వారు అభ్యర్థులకు అనుకూలంగా లేదా వారిని వ్యతిరేకిస్తూ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. కొందరు మతనాయకులైతే ఏకంగా రాజకీయ పదవుల్నే నిర్వహిస్తున్నారు. మరికొందరైతే మతనాయకులు ఆమోదించే కార్యక్రమాల పక్షమే రాజకీయ నాయకులు పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వేరేచోట “స్వదేశీవాద” మతనాయకులు అధికారమందున్న వారికి సన్నిహిత మిత్రులుగా ఉంటే “ప్రగతిశీల” సంఘకాపర్లు, పరిచారకులు వారిని పదవీచ్యుతుల్ని చేయడానికి పనిచేసే రహస్యపోరాట ఉద్యమాలకు మద్దతునిస్తూవుండవచ్చు. అయితే యెహోవాసాక్షులు వారు నివసించే దేశమేదైననూ, రాజకీయాల్లో తలదూర్చరు. రాజకీయ పార్టీలో చేరడం, పదవి నిర్వహించడం లేదా ఎన్నికల్లో ఓటు వేయడంవంటి వాటిలో వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు. అయితే, తన శిష్యులు “లోకసంబంధులు” కారని యేసు చెప్పినందున, యెహోవాసాక్షులు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోరు.

13. యుద్ధంలో పాల్గొనే విషయంలో, యెహోవాసాక్షుల స్థానమేమని వాస్తవాలు చూపిస్తున్నాయి?

13 యేసు ప్రవచించినట్లుగా, ఈ “యుగాంతమందు” దేశాలు పదేపదే యుద్ధాల్లో పాల్గొన్నాయి, ఆయా దేశాల్లోని అసమ్మతివాద గుంపులు సహితం ఒకరికొకరు వ్యతిరేకంగా ఆయుధాలు ధరిస్తున్నారు. (మత్త. 24:3, 6, 7) అయితే వీటన్నింటి మధ్య యెహోవాసాక్షులు ఏ స్థానం వహించారు? అట్టి పోరాటాల్లో వారి తటస్థత జగమెరిగిన సత్యమే. యేసు వహించిన స్థానం, ఆ తర్వాత ఆయన తొలి శిష్యులు ప్రదర్శించిన దానికి పొందికగా, కావలికోట (ఆంగ్లం) నవంబరు 1, 1939 సంచిక ఇలా చెప్పింది: “యుద్ధంచేస్తున్న దేశాలకు సంబంధించి ప్రభువు పక్షపు వారందరు తటస్థంగా, నిండుగా, సంపూర్ణంగా మహాగొప్ప దైవపరిపాలకుడగు [యెహోవా] ఆయన రాజైన [యేసుక్రీస్తు] వైపు ఉంటారు.” దేశాలన్నిటా యెహోవాసాక్షులు అన్ని పరిస్థితుల్లో ఎడతెగక ఈ స్థానమందే ఉన్నారని వాస్తవాలు చూపిస్తున్నాయి. లోక విభాగిత రాజకీయాలు, యుద్ధాలు యెహోవా ఆరాధికులుగా తమ అంతర్జాతీయ సహోదరత్వానికి విఘాతం కల్గించడానికి వారనుమతించలేదు.—యెష. 2:3, 4; 2 కొరింథీయులు 10:3, 4 పోల్చండి.

14. (ఎ) తటస్థంగా ఉన్నందున, మరింకేమి చేయడానికి సాక్షులు తిరస్కరించారు? (బి) దీనికిగల కారణాన్ని వారెలా వివరిస్తారు?

14 యెహోవాసాక్షులు సైనిక దుస్తుల్ని, ఆయుధాల్ని ధరించ నిరాకరించడమే కాదు, గత యాభై అంతకంటే ఎక్కువ సంవత్సరాల్లో వారు పోరాటరహిత వృత్తిని లేదా సైనికసేవకు ప్రత్యామ్నాయమగు ఇతరపనుల్ని చేపట్టడానికి అంగీకరించలేదని చరిత్ర వాస్తవాల పరిశీలన చూపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే వారు దేవుని నియమాల్ని పఠించి, ఆ పిమ్మట వ్యక్తిగతంగా మనఃపూర్వక నిర్ణయం చేసుకున్నారు. వారేమిచేయాలో ఎవరూ వారితో చెప్పరు. లేదా ఇతరులు చేయాలని ఎంపిక చేసికొన్న విషయాల్లో వారు జోక్యం చేసుకోరు. అయితే వారి స్థానాన్ని గూర్చి వివరించుడని పిలువబడినప్పుడు, దేవునికి సమర్పించుకున్న వ్యక్తులుగా వారి శరీరాల్ని ఆయన సేవలో ఉపయోగించే బాధ్యతను తాము కలిగివున్నామని, దేవుని సంకల్పాలకు భిన్నంగా ప్రవర్తించే మానవ యజమానులకు వాటినిప్పుడు అప్పగించలేమని తెలియజేశారు.—రోమా. 6:12-14; 12:1, 2; మీకా 4:3.

15. (ఎ) లోకమునుండి వేరుగా ఉన్నందున, యెహోవాసాక్షులు ఏమి అనుభవించారు? (బి) ఖైదు చేయబడిననూ, క్రైస్తవ సూత్రాలెలా వారిని నడిపించాయి?

15 దాని ఫలితం యేసు చెప్పినట్లే ఉన్నది: “మీరు లోకసంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” (యోహా. 15:19) అనేకమంది యెహోవాసాక్షులు తమ క్రైస్తవ తటస్థతను ఉల్లఘించనందున ఖైదుచేయబడ్డారు. కొంతమంది మరణమగునంతగా, క్రూరంగా హింసించబడ్డారు. మరితరులు తాము చెరలోనున్న సంవత్సరాల్లో ఎడతెగక తమ తటస్థతను ప్రదర్శించారు. వాల్యూస్‌ అండ్‌ వాయిలెన్స్‌ ఇన్‌ ఆస్క్‌విట్జ్‌ (అన్నా పావెల్‌జిన్స్‌కా వ్రాసినది, పేజీ 89) అనే గ్రంథమిలా నివేదిస్తున్నది: “[కాన్‌సెన్‌ట్రేషన్‌ క్యాంపునందున్న] యెహోవాసాక్షుల్లో ఎవరూ తమమత నమ్మకాలకు, ఒప్పుదలకు భిన్నమైన ఏ ఆజ్ఞకు, లేదా మరొకరికి అనగా అతడు హంతకుడైనా, ఎస్‌.ఎస్‌. అధికారియైనా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేయుమని నిర్దేశించబడిన ఏ పనీ చేసేవారు కారని అందరికీ తెలుసు. మరోవైపున, వారు తమకు నైతికంగా తటస్థమైన మరో పనేదైనా అదెంత అయిష్టమైనదైనాసరే దానిని చేసేవారు.”

16. (ఎ) దేశాలన్నీ ఎటు నడుస్తున్నాయి, కాబట్టి యెహోవాసాక్షులు దేనిని విసర్జించేందుకు జాగ్రత్తగా ఉన్నారు? (బి) కాబట్టి, లోకంనుండి వేరైయుండుట ఎందుకంత గంభీరమైన విషయం?

16 సమస్త జనాంగములు హార్‌మెగిద్దోనులో జరుగు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” నడుపబడుతున్నాయని యెహోవాసాక్షులు గుర్తిస్తున్నారు. ఐక్య ప్రజలుగా, యెహోవా సేవకులు ఆయన మెస్సీయ రాజ్య పక్షమున ఉన్నారు. కావున ఆ రాజ్యానికి తమని విరోధుల్ని చేసే స్థానం విషయంలో వారు జాగ్రత్తగా ఉంటారు. (ప్రక. 16:14, 16; 19:11-21) తన నిజ అనుచరులు “లోకసంబంధులు” కారని యేసు చెప్పిన మాట గంభీరతను వారు గుణగ్రహిస్తారు. ఈ పాతలోకం త్వరలోనే గతిస్తుందని, దేవుని చిత్తం చేయువారు మాత్రమే నిరంతరం నిలుస్తారని వారికి తెలుసు.—1 యోహా. 2:15-17.

పునఃసమీక్షా చర్చ

• “లోకసంబంధులు” కాకుండుటలో చేరియున్న విషయాన్ని యేసు ఎలా చూపాడు?

• (1) లోక స్వభావంయెడల (2) లోక పరిపాలకులు, పన్నులు చెల్లించుటయెడల (3) సైనిక సేవయెడల తొలి క్రైస్తవుల దృక్పథాన్ని ఏది సూచిస్తున్నది?

• ఆధునిక కాలాల్లోని యెహోవాసాక్షులు ఏయే విధాలుగా తమ క్రైస్తవ తటస్థతకు రుజువునిస్తున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

5. (ఎ) తాను బంధింపబడిన సమయంలో యేసు తన శిష్యులకే పాఠం నేర్పాడు? (బి) తాను చేసిన పనికిగల కారణాన్ని యేసు పిలాతుకెలా వివరించాడు?