కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సలహా విని, శిక్షణను అంగీకరించండి

సలహా విని, శిక్షణను అంగీకరించండి

అధ్యాయం 16

సలహా విని, శిక్షణను అంగీకరించండి

1. (ఎ) సలహా, శిక్షణ అవసరం లేని వారైవరైనా మనలో ఉన్నారా? (బి) అయితే మనమే ప్రశ్నలు విచారించడం యుక్తం?

“అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని చెప్పే లేఖనంతో మనలో అనేకమందిమి వెంటనే అంగీకరిస్తాము. (యాకో. 3:2) దేవుని వాక్యం ఉద్బోధించే మరి మనం కోరుకునే వ్యక్తిగా ఉండడంలో మనం తప్పిపోయిన సందర్భాల్ని తలచుకోవడం ఏమంత కష్టమైన విషయంకాదు. కాబట్టి బైబిలు మనకు, “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము” అని చెప్పినప్పుడు అది సరియేనని మనం ఒప్పుకుంటాము. (సామె. 19:20) అట్టి సహాయం మనకు అవసరమని మనకు తెలుసు. బైబిలునుండి నేర్చుకున్న ప్రకారం మనం నిస్సందేహంగా మన జీవితాల్లో సర్దుబాట్లు చేసుకున్నాం. అయితే మనం అవివేకంగా ప్రవర్తించిన ఒకానొక విషయంలో తోటి క్రైస్తవుడొకరు మనకు వ్యక్తిగత సలహాయిస్తే, లేదా ఏదైనా ఒక పనిలో మనమెలా పురోగతి సాధించవచ్చో సూచిస్తే మనమెలా ప్రతిస్పందిస్తాము?

2. (ఎ) వ్యక్తిగత సలహాయెడల మనమెందుకు ప్రశంస చూపాలి? (బి) మనమెలా ప్రతిస్పందించకూడదు?

2 మానవ అసంపూర్ణ నైజాన్నిబట్టి వెంటనే కలుగు మన అంతరంగ ప్రతిస్పందనలెలా ఉన్నా, ఇవ్వబడిన సలహాయెడల మనమెప్పును యథార్థంగా వ్యక్తపరచి, దానిని అన్వయించుటకు పనిచేయాలి. మనమలా చేయుటవల్ల కలిగే ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. (హెబ్రీ. 12:11) అయితే, మనకు సలహా ఇవ్వబడినప్పుడు, మనల్ని సమర్థించుకోవడానికి, పరిస్థితి గంభీరతను తక్కువచేయడానికి లేదా ఆ నిందను మరొకరిపై నెట్టడానికి బహుశ ప్రయత్నించియుండవచ్చు. మీరెప్పుడైనా ఆ విధంగా ప్రతిస్పందించారా? ఆ సందర్భాన్ని మరలా మనం గుర్తుతెచ్చుకొనుచుండగా, మనకా సలహాయిచ్చిన వ్యక్తియెడల పగ పెంచుకుంటామా? ఏదోకరీతిలో మన స్వంత బలహీనతను ఇది క్షమార్హం చేస్తుందని మనకు సలహాయిచ్చిన వ్యక్తి తప్పుల్ని లేదా అతడు ఇచ్చిన సలహా విధానాన్ని ఎత్తిచూపుటకు ప్రయత్నిస్తామా? అట్టి భావాల్ని అధిగమించడానికి ఒక వ్యక్తికి బైబిలు సహాయపడగలదా?

మన ఉపదేశార్థమై వ్రాయబడిన ఉదాహరణలు

3. (ఎ) సలహా, శిక్షణ విషయంలో సరియైన దృష్టిని వృద్ధిచేసుకోవడానికి మనకు సహాయపడగల వేటిని బైబిలు కలిగియున్నది? (బి) ఇవ్వబడిన సలహాకు సౌలు, ఉజ్జియాల ప్రతిస్పందనను విశ్లేషించడానికి పైన ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి.

3 ఈ విషయమై సూటిగా కావలసినంత ఉపదేశాన్నే కాకుండ, సలహా ఇవ్వబడిన ఆయావ్యక్తుల నిజజీవిత అనుభవాల్ని కూడ బైబిలు పేర్కొంటున్నది. తరచు సలహానే శిక్షగాకూడ ఉండేది, అలా దాన్నిపొందిన వ్యక్తి తన దృక్పథాన్ని లేదా తన ప్రవర్తనను మార్చుకోవల్సియుండెను. ఈ ఉదాహరణల్లో కొన్నింటిని పరీక్షించడానికి ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నల్ని మీరు విచారిస్తుండగా, మనందరం ప్రయోజనం పొందగలదెంతో వీటిలో ఉందని మీరు కనుగొంటారు:

కీషు కుమారుడైన, సౌలు: యెహోవాకు పూర్తిగా లోబడటంలో ఎంతగా విఫలుడయ్యాడంటే, అమాలేకీయులతో యుద్ధము చేసేటప్పుడు అతడు రాజును, శ్రేష్ఠమైన జంతువులను హతము చేయకుండా తప్పించాడు. (1 సమూ. 15:1-11)

సమూయేలు ఇచ్చిన గద్దింపుతోకూడిన సలహాకు సౌలు చూపిన ప్రతిస్పందనలో, తానుచేసిన తప్పిదాన్ని తక్కువచేయడానికి అతడు ప్రయత్నించాడని ఏది చూపిస్తున్నది? (20వ వచ.) నిందను ఎవరిపై నెట్టడానికి అతడు ప్రయత్నించాడు? (21వ వచ.) చివరికి తప్పునంగీకరించినప్పుడు, అతడు ఏ సాకుచెప్పాడు? (24వ వచ.) ఈ స్థితిలోకూడ అతడు దేనియెడల అత్యంత శ్రద్ధతోవున్నట్లు కన్పిస్తున్నది? (25, 30 వచనాలు)

ఉజ్జియా: ధూపంవేసే అధికారం కేవలం యాజకులకే ఉన్నా, అతడు ధూపం వేయడానికి యెహోవా దేవాలయంలోనికి వెళ్లాడు. (2 దిన. 26:16-20)

రాజైన ఉజ్జియాను ప్రధానయాజకుడు ఆపుజేయ ప్రయత్నించినప్పుడు, ఆ రాజెందుకు కోపంతో ప్రతిస్పందించాడు? (16వ వచనం పోల్చండి.) దాని ఫలితమేమిటి? (19-21 వచనాలు)

4. (ఎ) సౌలు, ఉజ్జియాలకు సలహా అంగీకరించుట ఎందుకు కష్టముగా ఉండెను? (బి) అది నేడుకూడ ఎందుకు గంభీరమైన సమస్యగా ఉన్నది?

4 ఇక్కడ చెప్పబడిన వారిలో ప్రతివారికి తమకవసరమగు సలహానంగీకరించుట ఎందుకు కష్టముగా ఉండెను? అసలు విషయం అహంకారమే, తమనుగూర్చే వారు బహు ఉన్నతంగా తలంచారు. ఈ లక్షణం కారణంగానే నేడనేకమంది తమకై తామే ఎంతో దుఃఖం కల్గించుకుంటున్నారు. వయస్సు లేదా స్థానాన్నిబట్టి ఇది హోదా అని తాము పరిగణించే స్థానాన్ని సంపాదించిన పిదప వారిక వ్యక్తిగత సలహాను అంగీకరించరు. అది తమ లోపాన్ని చూపుతుందని లేదా తమ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నట్లుగా కన్పిస్తున్నది. కాని నిజానికి వారి అహంకారమే వారి బలహీనతగా సూచింపబడుతోంది. ఈ తప్పు సామాన్యమే గనుక తప్పించుకోవడానికి ఒకడు దీనినొక సాకుగా చెప్పకూడదు. యెహోవా తన వాక్యముద్వారా, తన దృశ్య సంస్థద్వారా అందిస్తున్న దయగల సహాయాన్ని ఒకడు తిరస్కరించేలా అతని ఆలోచన మసకబారునట్లు చేయడానికి సాతాను దీనినొక ఉరిగా ఉపయోగిస్తున్నాడు. యెహోవా ఇలా హెచ్చరిస్తున్నాడు: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”—సామె. 16:18; రోమీయులు 12:3; సామెతలు 16:5 కూడ చూడండి.

5. మోషే, దావీదు వృత్తాంతాలనుండి నేర్చుకోగల పాఠాలను స్థిరపర్చడానికి ఈ పేరాలో భాగమైయున్న ప్రశ్నల్ని ఉపయోగించండి.

5 మరోవైపున, సలహాను అంగీకరించిన చక్కని ఉదాహరణల్ని లేఖనాలు కలిగివున్నవి. వీటినుండి కూడ విలువైన పాఠాల్ని నేర్చుకోవచ్చు. విచారించండి:

మోషే: ఆరోగ్యం పాడుచేసుకోకుండ తన పనిభారాన్ని నిర్వహించడానికి ఆయన మామ ఆచరణయోగ్యమగు సలహా ఆయనకిచ్చాడు. మోషే ఆ సలహా విని, వెంటనే దానిని అన్వయించాడు. (నిర్గ. 18:13-24)

మోషేకు గొప్ప అధికారమున్ననూ, సరియైన సలహాను ఆయనంతగా ఎందుకు అంగీకరించాడు? (సంఖ్యాకాండము 12:3 పోల్చండి.) ఆ లక్షణం మనకెంత ప్రాముఖ్యము? (జెఫ. 2:3)

దావీదు: ఒక స్త్రీతో వ్యభిచరించి, ఆ వ్యభిచార దోషాన్ని కప్పివేయడానికి, ఆమెను వివాహామాడగల్గునట్లు ఆ స్త్రీ భర్తను హత్యచేయించిన దోషం దావీదు మీదుంది. దావీదును గద్దించడానికి యెహోవా నాతానును పంపించడానికి ముందు అనేక నెలలు గడిచిపోయాయి. (2 సమూ. 11:2–12:12)

గద్దించబడినప్పుడు దావీదు కోపం తెచ్చుకొని, తప్పిదాన్ని తక్కువ చేయడానికి లేదా నిందను మరొకరిపై నెట్టడానికి ప్రయత్నించాడా? (2 సమూ. 12:13; కీర్త. 51: పైవిలాసం మరియు 1-3 వచనాలు) దావీదు పశ్చాత్తాపమును దేవుడు అంగీకరించాడనే వాస్తవం, దావీదు దుష్ప్రవర్తన వలన కలిగిన చెడు ఫలితాలనుండి ఆయన, ఆయన కుటుంబం విడిపింపబడిందనే భావాన్నిచ్చిందా? (2 సమూ. 12:10, 11, 14; నిర్గ. 34:6, 7)

6. (ఎ) తనకు యోగ్యమైన సలహాయిచ్చిన వారి విషయంలో దావీదు ఎలా భావించాడు? (బి) సిద్ధమనస్సుతో అట్టి సలహాను అంగీకరిస్తే మనమెలా ప్రయోజనం పొందగలము? (సి) తీవ్రంగా శిక్షింపబడినా మనం దేనిని మర్చిపోకూడదు?

6 యోగ్యమైన సలహా వినడంవల్ల కలిగే ప్రయోజనమేమిటో రాజైన దావీదుకు తెలుసు, ఆలాగే ఆ సందర్భమందే ఆ సలహాయిచ్చిన వ్యక్తి విషయమై ఆయన దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు. (1 సమూ. 25:32-35; సామెతలు 9:8ని కూడ చూడండి.) మనమలా ఉన్నామా? అట్లయిన, వ్యధకు కారణంకాగల అనేక సంగతులు చెప్పకుండా, చేయకుండా మనం సంరక్షింపబడిన వారమౌతాము. అయితే బత్షెబతో పాపము చేసినందున దావీదువలెనే తీవ్రంగా శిక్షింపబడే పరిస్థితుల్లోకి మనంవస్తే, మన నిత్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యెహోవాచూపే ప్రేమకు ఆ శిక్ష రుజువనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు.—సామె. 3:11, 12; 4:13.

పెంచుకోవాల్సిన అమూల్యమైన లక్షణాలు

7. రాజ్యంలో ప్రవేశించడానికి ప్రజలు కలిగివుండాల్సిన ఏ లక్షణాన్ని యేసు చూపాడు?

7 యెహోవాతో, మన క్రైస్తవ సహోదరులతో మనం మంచి సంబంధం కలిగివుండాలంటే, మనం కొన్ని వ్యక్తిగత లక్షణాల్ని వృద్ధిచేసుకోవాలి. శిష్యుల మధ్య ఒక పసివాణ్ణి నిలబెట్టి మాట్లాడినప్పుడు యేసు ఆ లక్షణాల్లో ఒకదానిని నొక్కితెల్పుతూ ఇట్లన్నాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్త. 18:3, 4) ఆ శిష్యులు మార్పులు చేసుకోవాలి. అహంకారంవదలి వారు వినయాన్ని అలవర్చుకోవాలి.

8. (ఎ) ఎవరిముందు మనం వినయస్థులముగా ఉండాలి, ఎందుకు? (బి) మనమట్లుంటే, సలహాకు మనమెలా ప్రతిస్పందిస్తాము?

8 ఆ తర్వాత అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతు. 5:5) దేవునియెదుట దీనులమైయుండాలని మనకు తెలుసు, అయితే ఈ లేఖనం మన తోటి విశ్వాసులతోవుండే సంబంధాల్లోకూడ మనం వినయస్థులమై లేదా దీనులమై ఉండాలని చెబుతోంది. మనమలావుంటే, వారు మనకేదైనా సలహాయిస్తే తెలివితక్కువగా వారిని మనం పగవారిగా చూడము. ఒకరినుండి మరొకరం నేర్చుకోవడానికి ఇచ్ఛయిస్తాము. (సామె. 12:15) మనకు దిద్దుబాటునిచ్చే సలహా ఇవ్వడం అవసరమని మన సహోదరులు కనుగొన్నప్పుడు, మనల్ని తీర్చిదిద్దడానికి యెహోవా ప్రేమతో ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాడని గుర్తిస్తే దానిని మనం తిరస్కరించము.—కీర్త. 141:5.

9. (ఎ) వినయానికి మరే ప్రాముఖ్యమైన లక్షణం దగ్గరి సంబంధం కలిగివున్నది? (బి) ఇతరులపై మన ప్రవర్తనా ప్రభావం విషయమై మనమెందుకు శ్రద్ధ కలిగివుండాలి?

9 ఇతరుల సంక్షేమంయెడల యథార్థమైన శ్రద్ధ కలిగివుండుట, వినయానికి దగ్గరి సంబంధంగల మరో లక్షణం. మనంచేసే పనులు ఇతర ప్రజలపై ప్రభావం చూపుతాయనే వాస్తవాన్ని మనం దాటవేయలేం. ఇతరుల మనస్సాక్షి ఎడల శ్రద్ధచూపాలని కొరింథు, రోమాలోనున్న క్రైస్తవుల్ని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. వారు తమ వ్యక్తిగత ఇష్టాలను ప్రక్కనబెట్టాలని ఆయన చెప్పడం లేదుగాని, ఆత్మీయ వినాశనానికి దారితీసే తన మనస్సాక్షి తప్పని చెప్పిన పనిచేసేటట్లు వేరొక వ్యక్తిని ధైర్యపరచే ఏ పనీ చేయవద్దని ఆయన వారికి ఉద్బోధించాడు. అందుచేరియున్న సూత్రాన్ని స్పష్టంగా వ్యక్తపరస్తూ, పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. . . . కాబట్టి మీరు భోజనము చేసినను పానముచేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.”—1 కొరిం. 10:24-33; 8:4-13; రోమా. 14:13-23.

10. ఆ లేఖన సలహాను మనం అన్వయించే అభ్యాసం చేస్తున్నామా లేదాని ఏది సూచించవచ్చును?

10 వ్యక్తిగత ఇష్టాలకంటే ఇతర ప్రజల సంక్షేమాన్ని ముందుంచే వ్యక్తేనా మీరు? ఇలా చేయడానికిగల మార్గాలు అనేకమున్నాయి, అయితే ఈ ఉదాహరణ విచారించండి: సాధారణంగా మాట్లాడాలంటే, మనం నమ్రతకలిగి, చక్కగా, పరిశుభ్రంగా ఉన్నంతవరకు దుస్తులు, తల దువ్వుకొనుట కేవలం వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయాలే. అయితే మీరున్న సమాజమందలి ప్రజల సంస్కృతి కారణంగా, మీ దుస్తులు, తల దువ్వుకొనే పద్ధతి ఇతరులు రాజ్య వర్తమానం వినకుండా అడ్డుపడుతుంటే, మీరు సర్దుబాట్లు చేసుకుంటారా? స్వప్రీతికంటే వేరొక వ్యక్తి జీవితం మీకు మరి ప్రాముఖ్యంగా ఉందా?

11. మనం క్రైస్తవులుగా ఉండగోరితే ఈ లక్షణాల్ని పెంచుకోవడం ప్రాముఖ్యమని ఏది చూపిస్తున్నది?

11 పైన చర్చించిన లక్షణాలు మన వ్యక్తిత్వంలో భాగమైనప్పుడు, ఇది మనం క్రీస్తుకున్న మనస్సునే కలిగివుండుటకు ఆరంభిస్తున్నామనే రుజువునిస్తుంది. వినయంగా ఉండుటలో యేసు పరిపూర్ణ మాదిరినుంచాడు. (యోహా. 13:12-15; ఫిలి. 2:5-8) స్వప్రీతికి బదులు ఇతరులయెడల శ్రద్ధచూపించుటలో, మనం అనుసరించగల మాదిరిని ఆయన ఉంచాడు.—రోమా. 15:2, 3.

యెహోవాయిచ్చే శిక్షణను తిరస్కరించకండి

12. (ఎ) దేవుని ప్రీతిపరచే వ్యక్తిత్వాన్ని కలిగివుండటానికి మనందరం ఎట్టి మార్పులు చేసుకోవడం అవసరం? (బి) ఏది మనకు సహాయం చేస్తుంది?

12 మనందరం పాపులము గనుక, మన దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి మన దృక్పథంలో, మన మాటలో, మన ప్రవర్తనలో మార్పులు అవసరం. మనం “నవీన స్వభావమును” ధరించుకోవాలి. (కొలొ. 3:5-14; తీతు 2:11-14) సవరణలు ఎక్కడ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో గుర్తించడానికి సలహా, శిక్షణ మనకు సహాయం చేస్తాయి.

13. (ఎ) మనందరికి యెహోవా దేని మూలంగా సలహాను, శిక్షణను దయచేశాడు? (బి) దానితో మనమేమిచేయాలి?

13 బైబిలే అట్టి ఉపదేశానికి మూలం. (2 తిమో. 3:16, 17) ఆపై బైబిలు సాహిత్యాలద్వారా యెహోవా దృశ్య సంస్థ ఏర్పాటుచేసిన కూటముల ద్వారా దానినెలా అన్వయించాలో చూచుటకు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఇంతకుముందు విన్నా, దానికొరకైన వ్యక్తిగత అవసరతను వినయంతో గుర్తించి, పురోగతి సాధించేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నామా?

14. ఆయా వ్యక్తులుగా మనకు యెహోవా అదనంగా మరింకే సహాయం అందజేస్తున్నాడు?

14 మనకున్న ఒకానొక ప్రత్యేక సమస్యతో ఒంటరిగా పోరాడేందుకు యెహోవా మనల్ని విడిచిపెట్టడు. ప్రేమగల శ్రద్ధతో ఆయన వ్యక్తిగత సహాయంపొందే ఏర్పాటుచేశాడు. గృహబైబిలు పఠనముల ద్వారా లక్షలాదిమంది ప్రజలు అట్టి సహాయంనుండి ప్రయోజనం పొందారు. ఆ తర్వాతి జీవితంలో ఎంతో హృదయవేదనకు కారణమగునట్లు ప్రవర్తించకుండా కాపాడుటకు తలిదండ్రులు తమ పిల్లలకు శిక్షణనిచ్చే ఒక ప్రత్యేక బాధ్యతను కలిగివున్నారు. (సామె. 6:20-35; 15:5) సంఘంలో కూడ ఆత్మీయార్హతగలవారు అవసరమేర్పడినప్పుడు, సాత్వికమైన మనస్సుతో ఇతరులను సరిదిద్దేలా లేఖనాలు ఉపయోగించే బాధ్యతను కలిగివున్నారు. (గల. 6:1, 2) ఐక్యతతో మనం యెహోవాను ఆరాధించునట్లు ఆయన ఈ మార్గాల్లో మనకు సలహాను శిక్షణను దయచేస్తున్నాడు.

పునఃసమీక్షా చర్చ

• వ్యక్తిగతంగా మనమెక్కడ సర్దుబాట్లు చేసుకోవాలో చూసుకొనేందుకు యెహోవా ప్రేమతో ఎలా సహాయం చేస్తున్నాడు?

• అనేకమందికి సలహానంగీకరించుట ఎందుకు కష్టంగా ఉంటుంది? ఇదెంత గంభీరమైన విషయం?

• సలహా వినుటకు ఏ అమూల్యమైన లక్షణాలు మనకు సహాయం చేస్తాయి? వీటి విషయంలో యేసు ఎలా ఒక మాదిరిని ఉంచాడు?

[అధ్యయన ప్రశ్నలు]