కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?

ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?

ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?

ప్రపంచవ్యాప్తంగా గంభీరమైన సమస్యలు, దిగ్భ్రాంతికరమైన సంఘటనలు సర్వసాధారణమైపోయాయి! దాని భావమేమిటి?

వ్యక్తిగత భద్రత: మార్కెట్లలో బాంబు విస్ఫోటనాలు. స్కూల్లో ఉపాధ్యాయులపై విద్యార్థులపై కాల్పులు. తల్లిదండ్రుల కళ్ళుకప్పి పసిపిల్లల అపహరణ. పట్టపగలే స్త్రీలను, వృద్ధులను దోచుకోవడం.

మతం: యుద్ధంలో ప్రత్యర్థి వర్గాలకు చర్చీల మద్దతు. మతనాయకులపై జాతినిర్మూలనా ఆరోపణలు. యువతపై మతనాయకుల లైంగిక అత్యాచారం; మరుగు చేస్తున్న చర్చీలు. చర్చీకి వెళ్ళేవారి సంఖ్యలో తగ్గుదల; చర్చీ భవనాల అమ్మకం.

పర్యావరణం: వాణిజ్యం కోసం అడవుల నరికివేత. పేదవాళ్ళు వంటచెరుకు కోసం చెట్లను నరికివేయడం. కలుషితమైన భూగర్భ జలాలు, త్రాగడానికి సురక్షితం కాదు. పారిశ్రామిక వ్యర్థపదార్థాలవల్లా ఆధునిక పద్ధతులవల్లా నాశనమైన మత్స్య పరిశ్రమ. ఊపిరాడనివ్వని వాయుకాలుష్యం.

జీవనోపాధి సంపాదించుకోవడం: అనేక ఆసియా దేశాల్లోనివారి తలసరి ఆదాయం చాలా తక్కువ. వివిధ సంస్థల్లోని అధికారుల అత్యాశవల్ల కుప్పకూలిపోయిన వ్యాపారం, దానితో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవడం. మోసంవల్ల, పెట్టుబడిదార్లు తాము జీవితాంతం కూడబెట్టుకున్నదంతా పోగొట్టుకోవడం.

ఆహార కొరతలు: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80,00,00,000 మంది ఆకలితో అలమటిస్తున్నారు.

యుద్ధాలు: 20వ శతాబ్దంలో 1,00,00,000 కంటే ఎక్కువమంది ప్రాణాలను బలిగొన్న యుద్ధాలు. సర్వ మానవాళిని అనేకసార్లు నాశనం చేయడానికి సరిపడా అణ్వస్త్రాలు. అంతర్యుద్ధాలు. భూగోళాన్ని కబళిస్తున్న ఉగ్రవాదం.

తెగుళ్ళు, ఇతర వ్యాధులు: 1918 మొదలుకొని 2,10,00,000 మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ఫ్లూ. “మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”గా మారిన ఎయిడ్స్‌. ప్రపంచాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తుతున్న క్యాన్సర్‌, హృద్రోగం.

ఈ వార్తలను ఒక్కొక్కటిగా చూడకండి. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా జరుగుతున్న సంఘటనలా? లేక ఇవి ఎంతో ప్రాముఖ్యతగల భూగోళవ్యాప్త సంయుక్త సూచనలో ఒక భాగమా?

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవునికి మనమంటే నిజంగా పట్టింపు ఉందా?

దిగ్భ్రాంతికరమైన సంఘటనలవల్ల లేదా ప్రియమైనవారినో ఆస్తులనో కోల్పోయినందువల్ల దుఃఖాక్రాంతులైన అనేకులు, ఇలాంటివి జరగకుండా దేవుడు ఎందుకు ఆపడంలేదని ఆశ్చర్యపోతుంటారు.

దేవునికి మనమంటే పట్టింపు ఉంది. ప్రస్తుతం ఆయన మనకు జ్ఞానయుక్తమైన మార్గనిర్దేశాన్ని, నిజమైన ఉపశమనాన్ని ఇస్తున్నాడు. (మత్తయి 11:28-30; 2 తిమోతి 3:​16, 17) దౌర్జన్యాన్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆయన ఇప్పటికే ఏర్పాట్లు చేశాడు. ఆయన చేసిన ఏర్పాట్లు, ఆయనకు కేవలం ఒకే దేశానికి చెందిన ప్రజలంటేనే కాక అన్ని దేశాలకు, తెగలకు, భాషలకు చెందిన ప్రజలంటే పట్టింపు ఉందని నిరూపిస్తున్నాయి.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

మనకు దేవుడంటే ఎంత పట్టింపు ఉంది? భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరో మీకు తెలుసా? ఆయన పేరేమిటి? ఆయన సంకల్పమేమిటి? ఆయన ఈ ప్రశ్నలకు బైబిలు ద్వారా సమాధానాలు చెబుతున్నాడు. దౌర్జన్యాన్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి తాను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో ఆయన బైబిలులో వివరించాడు. ఆయన చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయాలి? మనం ఆయన గురించి, ఆయన సంకల్పం గురించి తెలుసుకోవాలి. మనకు ఆయనపై విశ్వాసం ఉందని చూపించకపోతే ఆయన చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందాలని ఎలా ఆశించగలం? (యోహాను 3:​16; హెబ్రీయులు 11:⁠6) ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం కూడా ప్రాముఖ్యమే. (1 యోహాను 5:⁠3) అలా విధేయత చూపించడానికి కావలసినంత పట్టింపు మీకు ఉందా?

దేవుడు ప్రస్తుత పరిస్థితులను ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని అర్థం చేసుకోవాలి. బైబిలు దానిని వివరిస్తోంది. ఈ ప్రచురణలోని 15వ పేజీలో ఆ వివాదాంశం గురించి చర్చించబడింది.