దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం
దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం
దేవుని లిఖిత వాక్యమైన బైబిలు, “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” అని చెప్పినప్పుడు మన మనస్సులను నిరీక్షణతో నింపుతుంది.—2 పేతురు 3:13.
“క్రొత్త ఆకాశములు” అంటే ఏమిటి? బైబిలు ఆకాశమును పరిపాలనతో జతచేస్తోంది. (అపొస్తలుల కార్యములు 7:48) “క్రొత్త ఆకాశములు” ఈ భూమిని పరిపాలించే ఒక క్రొత్త ప్రభుత్వం. అది ప్రస్తుత పరిపాలనా వ్యవస్థను నిర్మూలించి దాని స్థానంలో పరిపాలిస్తుంది, అందుకే అది క్రొత్తది అని పిలువబడింది; అంతేకాకుండా అది దేవుని సంకల్ప నెరవేర్పు దిశగా వేయబడుతున్న ఒక క్రొత్త అడుగు. యేసు మనకు ఏ రాజ్యం గురించైతే ప్రార్థించమని బోధించాడో ఆ రాజ్యమే ఈ ప్రభుత్వం. (మత్తయి 6:9, 10) ఆ రాజ్యానికి దేవుడే మూలాధారం కాబట్టి, ఆయన పరలోకంలో ఉంటాడు కాబట్టి, అది “పరలోకరాజ్యము” అని పిలువబడుతోంది.—మత్తయి 7:21.
“క్రొత్త భూమి” అంటే ఏమిటి? అది ఒక క్రొత్త గ్రహం కాదు ఎందుకంటే భూమిపై మానవులు నిరంతరం నివసిస్తారని బైబిలే స్పష్టంగా చెబుతోంది. “క్రొత్త భూమి” ఒక క్రొత్త మానవ సమాజం. దుష్టులు నాశనం చేయబడి అందులో ఇక ఉండరు కాబట్టి అది క్రొత్తది అని పిలువబడుతోంది. (సామెతలు 2:21, 22) అప్పుడు జీవించేవారందరూ సృష్టికర్తను గౌరవిస్తూ ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన కట్టడలకు అనుగుణంగా జీవిస్తారు. (కీర్తన 22:27) ఆ కట్టడల గురించి నేర్చుకోమని, వాటికి అనుగుణంగా ఇప్పుడు తమ జీవితాలను మార్చుకోమని అన్ని దేశాల ప్రజలు ఆహ్వానించబడుతున్నారు. మీరు దేవుని కట్టడలను నేర్చుకొని వాటికి అనుగుణంగా మీ జీవితాలను మార్చుకుంటున్నారా?
దేవుని నూతనలోకంలో, అందరూ ఆయన పరిపాలనను గౌరవిస్తారు. దేవునిపట్ల మీకున్న ప్రేమ మీరు ఆయనకు విధేయత చూపించేందుకు మిమ్మల్ని పురికొల్పుతోందా? (1 యోహాను 5:3) మీరు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నారనే విషయం మీ ఇంట్లో, మీ ఉద్యోగంలో, మీ స్కూల్లో, మీ జీవన శైలిలో స్పష్టంగా కనిపిస్తోందా?
ఆ నూతనలోకంలో మానవులందరూ సత్య దేవుణ్ణి ఆరాధించడంలో ఐక్యమవుతారు. మీరు భూమ్యాకాశాల సృష్టికర్తను ఆరాధిస్తున్నారా? మీ ఆరాధన మిమ్మల్ని అన్ని దేశాలకు, అన్ని తెగలకు, అన్ని భాషలకు చెందిన తోటి ఆరాధకులతో నిజంగానే ఐక్యపరుస్తోందా?—కీర్తన 86:9, 10; యెషయా 2:2-4; జెఫన్యా 3:9.
[17వ పేజీలోని బాక్సు]
వీటిని వాగ్దానం చేసిన దేవుడు
భూమ్యాకాశాలను సృష్టించింది ఆయనే. “అద్వితీయ సత్యదేవుడు” అని యేసుక్రీస్తు గుర్తించింది ఆయన్నే.—యోహాను 17:3.
మానవాళిలో అధికశాతం ప్రజలు తాము చేసుకున్న దేవుళ్ళను ఘనపరుస్తారు. కోట్లాదిమంది నిర్జీవ విగ్రహాలను ఆరాధిస్తారు. ఇతరులు మానవ సంస్థలకు, భౌతికవాదాలకు, తమ స్వంత కోరికలకు ప్రాముఖ్యతనిస్తారు. తమ ఆరాధనకు బైబిలే ఆధారమని చెప్పుకునే ప్రజల్లో కూడా, బైబిలు “సత్య దేవుడు” అని గుర్తిస్తున్న దేవుని నామాన్ని అందరూ గౌరవించరు.—ద్వితీయోపదేశకాండము 4:35, NW.
సృష్టికర్త తన గురించి ఇలా చెప్పుకుంటున్నాడు: “యెహోవాను నేనే; ఇదే నా నామము.” (యెషయా 42:5, 8) ఈ నామము బైబిలు మూలభాషల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు తన అనుచరులకు, “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని ప్రార్థించమని బోధించాడు.—మత్తయి 6:9, 10.
సత్య దేవుడు ఎలాంటి వ్యక్తి? ఆయన తనను తాను “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడిగాను, తన ఆజ్ఞలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించేవారిని నిర్దోషులుగా ఎంతమాత్రం ఎంచని వ్యక్తిగాను వర్ణించుకుంటున్నాడు. (నిర్గమకాండము 34:6, 7) ఆయన మానవాళితో వ్యవహరించిన విధానానికి సంబంధించిన చరిత్ర, ఆ వర్ణన నిజమేనని ధృవీకరిస్తోంది.
ఆ నామము, ఆ నామము ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడాలి లేదా పవిత్రంగా పరిగణించబడాలి. సృష్టికర్తగా, విశ్వ సర్వాధిపతిగా ఆయన మన విధేయతకూ, మన ఆరాధనంతటికీ అర్హుడు. మీరు ఆయనకు విధేయత చూపిస్తూ ఆయనను ఆరాధిస్తున్నారా?
[18వ పేజీలోని బాక్సు/చిత్రం]
“క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి” ఎలాంటి మార్పులు తెస్తాయి?
భూమి పరదైసుగా అంటే అందమైన లూకా 23:43
ఉద్యానవనంగా మార్చబడుతుంది
అన్ని దేశాలకు, తెగలకు, భాషలకు యోహాను 13:35; ప్రకటన 7:9, 10
చెందిన ప్రజలు ప్రేమతో ఐక్యంగా
ఉండే సమాజం
భూగోళవ్యాప్తంగా శాంతి, అందరికీ కీర్తన 37:10, 11; మీకా 4:3, 4
నిజమైన భద్రత
సంతృప్తికరమైన పని, సమృద్ధియైన యెషయా 25:6; 65:17, 21-23
ఆహారం
అనారోగ్యం, దుఃఖం, మరణం యెషయా 25:8; ప్రకటన 21:1, 4
నిర్మూలించబడతాయి
సత్య దేవుని ఆరాధనలో ఐక్యమైన లోకం ప్రకటన 15:3, 4
[19వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
మీరు ప్రయోజనం పొందుతారా?
దేవుడు అబద్ధమాడనేరడు!—తీతు 1:3.
యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘నా వచనము నిష్ఫలముగా నాయొద్దకు మరలక నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.’—యెషయా 55:11.
యెహోవా ‘క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని’ సృష్టించడం ఇప్పటికే ఆరంభించాడు. పరలోక ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన ప్రారంభించింది. ‘క్రొత్త భూమికి’ ఇప్పటికే పునాది వేయబడింది.
ప్రకటన గ్రంథం, ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ మానవాళి కోసం తీసుకురాబోయే అద్భుతమైన విషయాల్లో కొన్నింటి గురించి చెప్పిన తర్వాత, విశ్వ సర్వాధిపతియైన దేవుడు స్వయంగా ఇలా చెప్పినట్లు తెలియజేస్తోంది: ‘ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుము.’—ప్రకటన 21:1, 5.
అయితే ఇప్పుడు మనం వేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, “క్రొత్త ఆకాశముల” పరిపాలన క్రింద ఉండే “క్రొత్త భూమి”పై జీవించేందుకు అర్హత పొందడానికి అవసరమైన మార్పులను చేసుకుంటున్నామా?