ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు
ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు
కొన్ని ప్రశ్నలు వేరే ప్రశ్నలకంటే ఎక్కువ తరచుగా వస్తాయి. అలాంటివి కొన్ని ఇక్కడ చర్చించబడ్డాయి.
దేవుడు ప్రేమా స్వరూపి అయితే, ఆయన దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తాడు?
దేవుడు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడు, ఆలాగే భూమిపై లక్షలాదిమంది దాన్ని కావాలనే అభ్యసిస్తున్నారు. ఉదాహరణకు, వారు యుద్ధాలను ప్రకటిస్తారు, పిల్లలపై బాంబులు వేస్తారు, భూమిని కాలుస్తారు, కరువులను సృష్టిస్తారు. లక్షలాదిమంది పొగత్రాగి ఊపిరితిత్తుల క్యాన్సరుకు గురౌతారు, వ్యభిచారంచేసి సుఖవ్యాధులు తెచ్చుకుంటారు, మద్యం అతిగా త్రాగి కాలేయజబ్బులకు, ఇతర ఎన్నో వ్యాధులకు గురౌతారు. అలాంటి వ్యక్తులు నిజంగా దుష్టత్వం అంతమొందాలని ఆశించరు. వారు కేవలం వాటికి విధించే జరిమానాలు తీసివేయాలని కోరతారు. వారు చేసినదానికి శిక్ష పడితే, “నాకే ఎందుకు?” అంటూ గగ్గోలుపెడతారు. మరి వారు సామెతలు 19:3లో చెప్పినట్లు దేవుని నిందిస్తారు: “ఒక మనుష్యుని చెడునడతే అతని జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ తర్వాత అట్టివాడు ప్రభువు మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు.” (ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) దేవుడు వారి చెడుపనులను అడ్డగిస్తే, వారు దాన్ని చేయడానికి కోల్పోయిన తమ స్వతంత్రాన్ని ఖండిస్తారు!
సాతాను సవాలుకు సమాధానం చెప్పడానికే యెహోవా దుష్టత్వాన్ని అనుమతించడానికిగల ముఖ్యకారణం. శ్రమలొచ్చినప్పుడు కూడ ఆయనకు యథార్థంగా యోబు 1:6-12; 2:1-10) తన సవాలును నిరూపించుకునే అవకాశం కొరకు యెహోవా సాతానును బ్రతుకనిస్తున్నాడు. (నిర్గమకాండము 9:16 పోల్చండి.) మనుష్యులు దేవునిపై తిరుగుబాటు చేయడానికి, సాతాను ఇంకను ఇప్పుడు శ్రమలను తెచ్చుటలో కొనసాగుతూ, తన సవాలును నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. (ప్రకటన 12:12) అయినను, యోబు యథార్థతను నిలుపుకున్నాడు. అలాగే యేసు కూడా చేశాడు. ప్రస్తుతం నిజక్రైస్తవులు అలా చేస్తున్నారు.—యోబు 27:5; 31:6; మత్తయి 4:1-11; 1 పేతురు 1:6, 7.
ఉండే మనుష్యులను దేవుడు భూమిపై ఉంచలేకపోయాడని అపవాదియగు సాతాను అన్నాడు. (ప్రజలు నిరంతరమూ జీవించే భూపరదైసునందు విశ్వాసముంచుటకు నేను ఇష్టపడతాను, కాని అది నమ్మశక్యం కాదుకదా?
బైబిలు ప్రకారం అలా కాదు. అది నమ్మశక్యంకానట్లే ఉంటుంది ఎందుకంటే మానవజాతి అనేక శతాబ్దాలుగా చెడును ఎరిగియున్నారు. యెహోవా భూమిని సృష్టించి, దానిలోని వృక్షాలను, జంతువులను నాశనం చేసేందుకు బదులుగా దాని సౌందర్యాన్ని కాపాడే యథార్థపరులైన స్త్రీపురుషులతో దానిని నిండించాలని మానవజాతితో చెప్పాడు. (పేజీలు 12, 17 చూడండి.) నమ్మశక్యం కానట్లుండే యీ వాగ్దాన పరదైసుకంటే, ప్రస్తుతమున్న విషాదస్థితి కొనసాగలేనంత చెడ్డది. దాని స్థానంలో పరదైసు రాబోతుంది.
ఈ వాగ్దానాలయందు విశ్వాసమంటే వట్టి నమ్మకమని కాదు. “వినుట వలన విశ్వాసము కలుగును.” దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దాని జ్ఞానం విశదమౌతుంది, విశ్వాసం వృద్ధవుతుంది.—రోమీయులు 10:17; హెబ్రీయులు 11:1.
బైబిలు ఒక కల్పితమని, వైజ్ఞానికమైంది కాదని అంటూ, ఎగతాళి చేసే ప్రజలకు నేనెలా సమాధానమివ్వగలను?
బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్రం బైబిలు యొక్క చారిత్రాత్మక ప్రామాణికతను చాలామట్టుకు దృవీకరిస్తుంది. నిజమైన విజ్ఞానశాస్త్రం బైబిలుతో పొందికకల్గి ఉంటుంది. ఈ క్రింది వాస్తవాలు లోక విద్వాంసులద్వారా కనుగొనబడక పూర్వమే అవి బైబిలులో ఉన్నాయి: అవేమనగా భూమి వృద్ధయిన దశల క్రమము, భూమి గుండ్రంగా ఉండటం, శూన్యంలో వ్రేలాడటం, పక్షుల వలస మొదలైనవి.—ఆదికాండము 1వ అధ్యాయం; యెషయా 40:22; యోబు 26:7; యిర్మీయా 8:7.
బైబిలు ప్రేరేపించబడి వ్రాయబడిందని దాని ప్రవచనాల నెరవేర్పుద్వారా చూపెట్టబడింది. ప్రపంచాధిపత్యాల ఉద్భవం, పతనం, ఆలాగే మెస్సీయ రావడాన్ని, చంపబడే సమయాన్ని గూర్చి కూడ దానియేలు ముందుగానే ప్రవచించాడు. (దానియేలు, 2, 8 అధ్యాయాలు; 9:24-27) ఈనాడు, మన కాలాన్ని “అంత్యదినములుగా” గుర్తిస్తూ, యింకా ఇతర ప్రవచనాలు నెరవేరుతున్నాయి. (2 తిమోతి 3:1-5; మత్తయి 24వ అధ్యాయం) అలాంటి భవిష్యత్ జ్ఞానం మానవ సామర్థ్యానికి అతీతమైంది. (యెషయా 41:23) మరెక్కువ దృవీకరణకు, దయచేసి వాచ్‌టవర్ పుస్తకాలైన ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్?, లైఫ్—హవ్ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అనే వాటిని చూడండి.
బైబిలు ప్రశ్నలకు సమాధానం చెప్పగల్గేలా నేనెలా తయారవ్వగలను?
మీరు కచ్చితంగా బైబిలును చదివి దానిని ధ్యానించాలి, దానితోపాటు మిమ్మల్ని నడిపించడానికి దేవుని ఆత్మ కొరకు అడగాలి. (సామెతలు 15:28; లూకా 11:9-13) బైబిలు చెప్పేదేమంటే, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:5) ఆలాగే, సంప్రదించదగిన బైబిలు పఠన సహాయకాలు కూడ ఉన్నాయి. ఫిలిప్పు ఐతియోపీయునితో పఠనం చేసినప్పటివలెనే, సాధారణంగా దీనికి ఇతరుల సహాయం అవసరం. (అపొస్తలుల కార్యములు 8:26-35) ఆసక్తిగల వ్యక్తుల గృహాల్లో యెహోవాసాక్షులు ఉచితంగానే బైబిలు పఠనాలను నిర్వహిస్తారు. ఈ సేవను అడగడానికి మీరు నిర్మొహమాటపడకండి.
యెహోవాసాక్షులను చాలామంది ఎందుకు తిరస్కరిస్తారు, వారితో పఠించవద్దని నాతో ఎందుకు చెబుతారు?
యేసు సువార్త ప్రకటనకు వ్యతిరేకత ఉండేది, మరి ఆయన అనుచరులు కూడ వ్యతిరేకతను ఎదుర్కొంటారని ఆయన చెప్పాడు. యేసు బోధలు కొందరి మనస్సులో నాటుకొనగా, మత విరోధులు యిలా నిందించారు: “మీరు కూడ మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా?” (యోహాను 7:46-48; 15:20) సాక్షులతో పఠనం చేయవద్దని మీకు సలహాయిచ్చే అనేకమంది సరిగ్గా తెలియని వారు కావచ్చు, లేదా ద్వేషమున్నవారేకావచ్చు. సాక్షులతో పఠనం చేసి మీకు బైబిలు జ్ఞానం అభివృద్ధి అవుతుందా లేదాయని మీకై మీరే గమనించండి.—మత్తయి 7:17-20.
తమ స్వంత మతమున్న వారిని కూడ సాక్షులు ఎందుకు దర్శిస్తారు?
దీన్ని చేయడంలో వారు యేసు మాదిరిని అనుసరిస్తారు. ఆయన యూదుల వద్దకు వెళ్లాడు. యూదులకు తమ స్వంత మతముంది, కాని చాలా విషయాల్లో ఇది దేవుని వాక్యానికి దూరంగా ఉంది. (మత్తయి 15:1-9) నామకార్థ క్రైస్తవమతమైనా లేదా క్రైస్తవమతం కానివైనా, అన్ని దేశాలకు ఏదో ఒక మతముంది. దేవుని స్వంత వాక్యంతో పొందిక కల్గిన నమ్మకాలను, వారికి సహాయమందించడంలో సాక్షులు చేసే కృషిని అనుసరించడం వ్యక్తులకు చాలా ప్రాముఖ్యం, దానిలో పొరుగువారి యెడల ప్రేమను కనుబర్చడం యిమిడివుంది.
కేవలం తమ మతమే సరైనదని సాక్షులు నమ్ముతారా?
తన మతాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచించే వారెవరైనా అది మంచిదేనా అని ఆలోచించాలి. లేకపోతే, అతడు లేక ఆమె దానిలో తలదూర్చడం ఎందుకు? క్రైస్తవులు ఇలా ఉద్బోధించబడ్డారు: “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుము.” (1 థెస్సలొనీకయులు 5:21) ఒక వ్యక్తి తన నమ్మకాలు లేఖనాలతో బలపర్చబడ్డాయా అని పరీక్షించాలి, ఎందుకంటే కేవలం ఒకే ఒక్క నిజమైన విశ్వాసముంటుంది. “ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” అని చెబుతూ, ఎఫెసీయులు 4:5 దీన్ని దృఢపరుస్తుంది. రక్షణకు నడిపే అనేక మార్గాలు, అనేక మతాలు ఉన్నాయనే ఆధునికమైన, నిర్బంధంలేని దృక్పథాన్ని యేసు అంగీకరించలేదు. బదులుగా ఆయనిలా చెప్పాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” తాము దీన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతారు. లేకపోతే, వారు మరొక మతాన్ని వెదకి ఉండేవారు.—మత్తయి 7:14.
వారు మాత్రమే రక్షింపబడతారని వారు నమ్ముతారా?
లేదు. శతాబ్దాలక్రితం జీవించిన యెహోవాసాక్షులు కాని అనేక లక్షలమంది పునరుత్థానంలో బయటికివచ్చి, మరలా జీవించే అవకాశాన్ని పొందుతారు. ప్రస్తుతం జీవిస్తున్న అనేకమంది “మహాశ్రమలు” రాకముందు నీతి సత్యాలను తెలుసుకుంటారు, తద్వారా వారు రక్షణ పొందుతారు. అంతేకాకుండ, మనం ఒకరినొకరు తీర్పు చేయకూడదని యేసు చెప్పాడు. మనం బాహ్యరూపాన్నే చూస్తాం; దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన కచ్చితంగా చూస్తాడు, దయతో న్యాయం చేస్తాడు. ఆయన తీర్పుచేసే పనిని మనకు కాదుగాని యేసుకు అప్పగించాడు.—మత్తయి 7:1-5; 24:21.
యెహోవాసాక్షుల కూటములకు హాజరయ్యే వారినుండి ఎలాంటి చందాలు వసూలు చేయబడతాయి?
డబ్బును చందారూపంలో యిచ్చే విషయాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:7) యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లోను, సమావేశ హాళ్లలోను, చందాలు ఎన్నడూ వసూలు చేయబడవు. అక్కడ పెట్టెలు ఉంచబడతాయి, గనుక చందావేయదలచిన వారెవరికైనా అవి అనుకూలంగా ఉంటాయి. ఇతరులు ఎంత ఇచ్చారనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇతరులకంటే ఎక్కువ ఇవ్వగలరు; కొందరైతే ఏమీ ఇవ్వలేరు. యెరూషలేములోని దేవాలయంవద్దనున్న కానుక పెట్టెను గూర్చి, కానుకలు వేసే వారిని గూర్చి మాట్లాడినప్పుడు యేసు సరైన దృక్పథాన్ని చూపాడు: ఎంత డబ్బు ఇచ్చాడనేది కాదుగాని, ఇచ్చుటలో ఒకనికున్న సామర్థ్యం, ఇచ్చే స్ఫూర్తి అనేవే పరిగణలోకి తీసుకోబడతాయి.—లూకా 21:1-4.
ఒకవేళ నేను ఒక యెహోవాసాక్షిగా మారితే, వారివలెనే నేను కూడా సువార్త ప్రకటించాల్సి వస్తుందా?
ఒకడు క్రీస్తు రాజ్యపరిపాలనలోని వాగ్దానం చేయబడిన భూపరదైసును గూర్చిన జ్ఞానంతో నిండినప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటాడు. మీరు కూడా అంతే. అదే సువార్త!—అపొస్తలుల కార్యములు 5:41, 42.
మీరు యేసుక్రీస్తు శిష్యులని ప్రదర్శించడానికి దీనిని చేయడం ఒక ప్రాముఖ్యమైన పద్ధతి. బైబిలునందు, “నమ్మకమైన సత్యసాక్షి” అని యేసు పిలువబడ్డాడు. ఆయన భూమిపైనున్నప్పుడు, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అని చెబుతూ సువార్త ప్రకటించాడు, ఆలాగే చేయడానికి ఆయన తన శిష్యులను పంపాడు. (ప్రకటన 3:14; మత్తయి 4:17; 10:7) తర్వాత, యేసు తన అనుచరులకు యిలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బోధించుడి.” అంతము రాకమునుపు, “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడు”నని కూడ ఆయన ముందుగా ప్రవచించాడు.—మత్తయి 28:19, 20; 24:14.
ఈ రాజ్యసువార్తను ప్రకటించే పద్ధతులు చాలా ఉన్నాయి. స్నేహితులు, పరిచయమున్న వారితో చేసే సంభాషణ ఆ విధంగా చేయడానికి తరచూ మార్గాన్ని తెరుస్తుంది. కొందరు ఉత్తరాలు వ్రాయడంద్వారా, టెలిఫోన్ చేయడంద్వారా దీన్ని చేస్తారు. మరికొందరు తమకు పరిచయమున్న వారికి ప్రాముఖ్యంగా ఆసక్తిగలదని తలంచిన విషయాలున్న సాహిత్యాన్ని పోస్టు చేస్తారు. ఎవరినీ పోగొట్టుకోకూడదనే కోరికతోనే, సాక్షులు ఈ సువార్తతో ఇంటింటికీ వెళ్తారు.
బైబిలు ఈ ఉత్సాహంగల ఆహ్వానాన్ని కల్గివుంది: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) భూపరదైసును గూర్చి దాని ఆశీర్వాదాలనుగూర్చి ఇతరులకు ఇష్టపూర్వకంగా చెప్పాలి, ఈ సువార్తను పంచుకోవాలనే కోరికతో నిండిన హృదయాలనుండి అది పెల్లుబకాలి.
యెహోవాసాక్షులనుగూర్చి వారి నమ్మకాలనుగూర్చి మీకు వేరే ప్రశ్నలుకూడ ఉంటాయని మేము నమ్ముతున్నాము. బహుశ వాటిలో కొన్ని సహజంగా వివాదాస్పదమైనవి కావచ్చు. మేము వాటికి జవాబు చెప్పాలని కోరుకుంటున్నాము. ఈ బ్రోషూర్‌లో స్థలం మితంగా ఉంది; కాబట్టి మీరు స్థానికంగా వున్న
సాక్షులనుగాని, వారి రాజ్యమందిరాల్లోగాని లేదా వారు మీ ఇంటిని దర్శించినప్పుడుగాని వాటినిగూర్చి అడగాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. లేదా మీకు సమీపంలో వున్న బ్రాంచి కార్యాలయంలోని వాచ్‌టవర్ సొసైటీకి మీరు మీ ప్రశ్నలను పంపవచ్చు; క్రింది పట్టికను చూడండి.