కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు మా ఆహ్వానం

మీకు మా ఆహ్వానం

మీకు మా ఆహ్వానం

మేము ఈ బ్రోషూర్‌లోని విషయాలద్వారా మీతో మాట్లాడుటకు ఆనందించాం. యెహోవాసాక్షులను గూర్చి అధికంగా తెలుసుకొనుటలో మీరానందించారని మేము ఆశిస్తున్నాం. మా స్థానిక రాజ్యమందిరంలో మమ్మల్ని దర్శించమని చెప్పే మా ఆహ్వానాన్ని దయచేసి అంగీకరించండి. మా కూటాలు ఎలా జరుపబడతాయో చూడండి. క్రీస్తు రాజ్యపరిపాలనలోని పరదైసు భూమిని గూర్చిన సువార్తను ఇతరులతో పంచుకొనుటలో మేమెలా కృషిచేస్తామో చూడండి.

దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) పందొమ్మిది శతాబ్దాలు గడిచిపోయాయి. వేచియుండే కాలం పూర్తికావస్తుంది. దీనిని ప్రపంచ పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి. యేసు చేసిన యీ వాగ్దానం నెరవేరబోతుంది: “ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”—లూకా 21:28.

అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు, “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) మీరు మాతో సమావేశం కావడంద్వారా పౌలు సలహాను వినండని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.