మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మక విలువ
మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మక విలువ
నేటి ప్రపంచంలో మనం యిలా వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని తరచూ వింటాము: “క్రైస్తవత్వానికి సంబంధించిన సూత్రాలు ఆచరణాత్మకమైనవికావు. అవి ఈనాటి సంశ్లిష్ట సమాజంలో పనిచేయవు.” అయినను, హిందూ నాయకుడైన మోహన్‌దాస్ కె. గాంధీకి, ఇండియా మాజీ బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్‌కు మధ్య జరిగిన సంభాషణలో చాలా విరుద్ధ వ్యాఖ్యానం వ్యక్తంచేసినట్లు రిపోర్టు చేయబడింది. ఇండియాకు గ్రేట్ బ్రిటన్‌కు మధ్యగల సమస్యను తీర్చగల్గేదేమిటని మీరు తలుస్తున్నారని లార్డ్ ఇర్విన్ గాంధీని అడిగాడు. గాంధీ బైబిలును తీసుకుని మత్తయి 5వ అధ్యాయానికి తెరచి, యిలా చెప్పాడు: “క్రీస్తు కొండపై యిచ్చిన ఈ ప్రసంగంలోని బోధలను మీ దేశం, మా దేశం పాటిస్తే, కేవలం మన దేశాలవే కాకుండా మొత్తం ప్రపంచంలోని సమస్యలనే పరిష్కరించియుండేవాళ్లము.”
ఆ ప్రసంగం ఆత్మీయతను గూర్చి, దయ, సమాధానం, కనికరం, నీతిని ప్రేమించే వారిగా ఉండడాన్ని గూర్చి మాట్లాడుతుంది. ఇది హత్యను మాత్రమే కాకుండా ఇతరులపై చూపేకోపాన్ని, వ్యభిచారాన్నే కాకుండా మోహపు తలంపులను ఖండిస్తుంది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, దాని మూలంగా పిల్లలు బలైపోయే బాధ్యతారహిత విడాకులకు నడిపే కార్యాలకు వ్యతిరేకంగా అది మాట్లాడుతుంది. అది మనకిలా చెబుతుంది: ‘మిమ్మల్ని అయిష్టపడే వారిని కూడ ప్రేమించండి, అవసరతగలవారికి ఇవ్వండి, ఇతరులకు నిర్దయగా తీర్పుచెప్పవద్దు, ఇతరులెలా మెలగాలని మీరు కోరతారో ఆలాగే మీరు కూడ వారితో మెలగండి.’ ఈ సలహానంతటిని పాటిస్తే, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎంత ఎక్కువమంది మీ సమాజంలో వాటిని పాటిస్తారో, అంత బాగా తయారౌతుంది మీ సమాజం!
ఈ విషయంలో యెహోవాసాక్షులు మంచి ప్రభావం కల్గివుంటారు. వివాహాన్ని గౌరవించాలని బైబిలు వారికి బోధిస్తుంది. వారి పిల్లలు సరైన సూత్రాలద్వారా శిక్షణపొందారు. కుటుంబ ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. ఐక్యతగల కుటుంబాలు మీ సమాజానికి, మీ దేశానికి కూడ వరాలై యున్నవి. కుటుంబ బంధాలు బలహీనమైనప్పుడు, అవినీతి పెచ్చుపెరిగినప్పుడు
ప్రపంచాధిపత్యాలే తునాతునకలైపోయిన ఉదాహరణలతో చరిత్ర నిండిపోయింది. కుటుంబాలు, వ్యక్తులు క్రైస్తవ సూత్రాలపై ఆధారపడి జీవించడానికి యెహోవాసాక్షుల ప్రభావం ఎక్కువగా ఉంటే, మీ సమాజంలో అపరాధము, అవినీతి, నేరము అంత తక్కువగా ఉంటుంది.జాత్యహంకారమనేది సమాజాన్ని, దేశాన్ని పీడించే గంభీర సమస్యల్లో ఒకటి. దానికి విరుద్ధంగా, అపొస్తలుడైన పేతురు యిలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” మరియు పౌలు యిలా వ్రాశాడు: “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.” (అపొస్తలుల కార్యములు 10:34, 35; గలతీయులు 3:28) యెహోవాసాక్షులు దీన్ని అంగీకరిస్తారు. వారి ప్రపంచ ముఖ్యకార్యాలయాల్లో, బ్రాంచీలలో, సంఘాల్లో అన్ని వర్గాలు, వర్ణాలుగల ప్రజలు సహజీవనంతో కలిసి పనిచేస్తున్నారు.
ఆఫ్రికాలోని కొన్ని జాతుల ప్రజలు సంఘర్షణ లేకుండా కలిసి జీవించలేరు. అయినను, అచ్చట యెహోవాసాక్షుల సమావేశాల్లో, వివిధ జాతులకు చెందిన ప్రజలు పూర్తి సమన్వయంతో, మంచి సహవాసం కల్గి కలిసి తింటారు, నిద్రపోతారు, ఆరాధిస్తారు. ప్రభుత్వాధికారులు దీన్ని గమనించినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఐక్యపరచే ప్రభావంగల నిజక్రైస్తవత్వాన్ని గూర్చిన ఒక ఉదాహరణ ఆగష్టు 2, 1958లోని న్యూయార్క్ అమెస్టర్‌డామ్ న్యూస్‌లో వ్యాఖ్యానించబడింది. ఇంతకు క్రితం వివరించిన అంతర్జాతీయ సమావేశాన్ని పరికించడంతో ఈ వ్యాఖ్యానం ప్రేరేపించబడింది, ఈ సమావేశానికి రెండున్నర లక్షలకంటే ఎక్కువమంది సాక్షులు న్యూయార్క్ నగరంలో సమావేశమయ్యారు.
“ప్రతిచోటా నీగ్రోలు, శ్వేతజాతివారూ తూర్పుదేశీయులు, అన్ని రకాల జీవనపద్ధతులుగలవారూ అన్ని ప్రాంతాలనుండి వచ్చినవారు, సంతోషంగాను స్వతంత్రంగాను కలిసిపోయారు. . . . నూట ఇరవై దేశాలనుండి ఆరాధించ వచ్చిన సాక్షులు సమాధానంతో కలిసి జీవించి, ఆరాధించడం ఎంత సులభమో అమెరికా దేశస్థులకు చూపించారు. . . . ప్రజలెలా కలిసి పనిచేయగలరో, ఎలా కలిసి జీవించగలరో చూపడానికి ఈ సమావేశం ఒక తేజోవంతమగు ఉదాహరణ.”
ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవత్వపు సూత్రాలు ఆచరణాత్మకమైనవి కావని అనేకమంది చెప్పవచ్చు. అయితే, వేరేదేమైనా ఆచరణాత్మకమయ్యిందా లేదా ఇక ఆచరణాత్మకం కాబోతుందా? ప్రస్తుతం మీ సమాజంలో క్రైస్తవ సూత్రాలను అన్వయించుకుంటే అవి నిజమైన విలువగలవిగా ఉంటాయి, మరి అవి మానవజాతిని పాలించే దేవుని రాజ్యంలో ప్రతి ‘జనమును, వంశమును, ప్రజలను’ ఐక్యంచేయడానికి ఆధారమైయుంటాయి.—ప్రకటన 7:9, 10.
[35వ పేజీలోని చిత్రం]
అన్ని జాతులు, వర్ణాలు కలిసి పనిచేస్తాయి
[35వ పేజీలోని చిత్రం]
క్రైస్తవత్వం ఆచరణాత్మకమైంది. వేరేదేమైనా ఆచరణాత్మకమయ్యిందా?