కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు విశ్వసించేదేమిటి?

వారు విశ్వసించేదేమిటి?

వారు విశ్వసించేదేమిటి?

భూమ్యాకాశములను సృజించిన, సర్వశక్తిగల దేవుడైన యెహోవాను, యెహోవాసాక్షులు విశ్వసిస్తారు. మనచుట్టూవున్న విశ్వంలో సంక్లిష్ట నిర్మాణంగల అద్భుతాలు సహేతుకంగా నిరూపించేదేమంటే గొప్ప మేధావియు, సామర్థ్యంగల సృష్టికర్తయునైనవాడే వీటన్నింటినీ ఉత్పత్తి చేశాడు. స్త్రీపురుషుల పనులు ఏవిధంగా తమ లక్షణాలను ప్రతిబింబిస్తాయో, ఆలాగే యెహోవా లక్షణాలు కూడా ప్రతిబింబిస్తాయి. బైబిలు మనకు చెప్పేదేమంటే, “ఆయన అదృశ్యలక్షణములు, . . . జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” అంతేకాకుండా, స్వరము లేదా మాటలు లేకున్నను, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి.”—రోమీయులు 1:20; కీర్తన 19:1-4.

ప్రజలు ఉద్దేశమేమీ లేకుండా మట్టితో కుండలను చేయడం లేదా టెలివిజన్‌లు, కంప్యూటర్లు తయారుచేయడం జరుగదు. భూమి, దానిలోని వృక్షాలు, జంతువుల సృష్టి వాటికంటే మహాద్భుతమైనవి. మానవుని శరీరం, దానిలోని కోట్లాది కణాల అమరిక మన అవగాహనకు అందనిది—మనం ఆలోచించడానికి ఉపయోగించే మెదడు కూడ ఊహకందనంత అద్భుతమైంది! సరియైన ప్రాముఖ్యతలేని తమ అన్వేషణలను బయటకు తీసుకురావడంలో మానవులే ఒక ఉద్దేశాన్ని కల్గివుంటే, నిశ్చయంగా యెహోవా దేవుడు విస్మయంగొల్పే తన సృష్టిని గూర్చి ఒక ఉద్దేశాన్ని కల్గివున్నాడు! సామెతలు 16:4 ఆయన యిలా చేస్తాడని చెబుతుంది: “యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను.”

యెహోవా మొదటి మానవజతకు తెలియజేసినట్లుగా ఆయన భూమిని ఓ ఉద్దేశం కొరకు చేశాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి . . . , సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” (ఆదికాండము 1:28) వారు అవిధేయులైన కారణంగా, భూమిని దానిలోని వృక్షాలను జంతువులను ప్రేమపూర్వకంగా సంరక్షించే నీతిగల కుటుంబాలతో ఈ భూమిని నింపుటలో ఈ జంట విఫలమయ్యారు. కాని వారి విఫలత యెహోవా ఉద్దేశం విఫలమయ్యేటట్లు చేయదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈవిధంగా వ్రాయబడింది: “ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” అది నాశనం చేయబడదుగాని, “భూమి ఎల్లప్పుడూ ఉంటుంది.” (యెషయా 45:18; ప్రసంగి 1:4, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) భూమియెడల యెహోవాకుగల ఉద్దేశం నెరవేరుతుంది: “నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను.”—యెషయా 46:10.

కాబట్టి, భూమి నిరంతరము నిలుస్తుందనీ, ఆలాగే జీవిస్తున్న, చనిపోయిన ప్రజలంతా ఎవరైతే యెహోవా ఉద్దేశాలకు సరితూగుతారో వారు, సుందరమైన నివాసయోగ్యమైన భూమిపై నిరంతరమూ జీవించగలరని యెహోవాసాక్షులు నమ్ముతారు. మానవజాతికంతటికి ఆదాము, హవ్వలనుండి అసంపూర్ణత సంప్రాప్తమైనందువల్ల అంతా పాపులే. (రోమీయులు 5:12) బైబిలు మనకిలా చెబుతుంది: “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.” “బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” “పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును.” (రోమీయులు 6:23; ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4, 20) అయితే భూసంబంధ ఆశీర్వాదాలను పంచుకోవడానికి వారెలా తిరిగి బ్రతుకుతారు? కేవలం యేసుక్రీస్తు యొక్క విమోచనా క్రయధనం ద్వారానే, ఎందుకంటే ఆయనిలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” ‘సమాధులలో నున్నవారందరు ఆయన శబ్ధము విని బయటికి వచ్చెదరు.’—యోహాను 11:25; 5:28, 29; మత్తయి 20:28.

ఇదెలా జరుగుతుంది? ఇది యేసు భూమిపై నున్నప్పుడు తాను ప్రకటించడం మొదలుపెట్టిన “రాజ్యసువార్తలో” వివరించబడింది. (మత్తయి 4:17-23) కాని ఈనాడు యెహోవాసాక్షులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ సువార్తను ప్రకటిస్తున్నారు.

[24వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు విశ్వసించేదేమంటే

విశ్వాసం లేఖనాధార హేతువు

బైబిలు దేవుని వాక్యం, 2 తిమో. 3:16, 17;

అది సత్యమైయుంది 2 పేతు. 1:20, 21; యోహా. 17:17

సాంప్రదాయంకంటే మత్త. 15:3; కొలొ. 2:8

ఎక్కువగా బైబిలే నమ్మదగింది

దేవుని నామం యెహోవా కీర్త. 83:18; యెష. 26:4; 42:8;

నిర్గ. 6:3

క్రీస్తు దేవుని కుమారుడు, మత్త. 3:17; యోహా. 8:42;

ఆయనకంటే తక్కువవాడు 14:28; 20:17; 1 కొరిం. 11:3; 15:28

క్రీస్తు దేవుని సృష్టిలో కొలొ. 1:15; ప్రక. 3:14

ప్రథముడు

క్రీస్తు సిలువపై కాదుగాని, గల. 3:13;

కొయ్యపైనే మరణించాడు అపొ. 5:30

క్రీస్తు మానవ జీవితం విధేయులైన మత్త. 20:28; 1 తిమో. 2:5, 6;

మానవుల నిమిత్తం విమోచన తీతు 2:14; 1 పేతు. 2:24

క్రయధనంగా చెల్లించబడింది

క్రీస్తు బలి అర్పణ రోమా. 6:10; హెబ్రీ. 9:25-28

ఒక్కటే చాలు

క్రీస్తు అమర్త్యమైన 1 పేతు. 3:18; రోమా. 6:9;

ఆత్మీయ వ్యక్తిగా ప్రక. 1:17, 18

మరణం నుండి లేచాడు

క్రీస్తు ప్రత్యక్షత యోహా. 14:19; మత్త. 24:3;

ఆత్మసంబంధమైంది 2 కొరిం. 5:16; కీర్త. 110:1, 2

క్రీస్తు తన రాజ్యాధికారంలో యెష. 9:6, 7; 11:1-5;

భూమిని నీతితోను, శాంతితోను దాని. 7:13, 14; మత్త. 6:10

పరిపాలిస్తాడు

ఆ రాజ్యం భూమిపై ఆదర్శవంతమైన కీర్త. 72:1-4; ప్రక. 7:9, 10, 13-17;

జీవన పరిస్థితులను తెస్తుంది 21:3, 4

భూమి ఎన్నడూ నాశనం కాదు ప్రస. 1:4; యెష. 45:18;

లేదా భూనివాసులు లేకుండ ఉండదు కీర్త. 78:69

ప్రస్తుతమున్న దుష్టవ్యవస్థను ప్రక. 16:14, 16; జెఫ. 3:8;

హార్‌మెగిద్దోను యుద్ధంలో దాని. 2:44; యెష. 34:2

దేవుడు నాశనం చేస్తాడు

దుష్టులు మత్త. 25:41-46; 2 థెస్స. 1:6-9

నిత్యనాశనమౌతారు

దేవుడు అంగీకరించిన యోహా. 3:16; 10:27, 28;

ప్రజలు నిత్యజీవం పొందుతారు 17:3; మార్కు 10:29, 30

జీవానికి నడిపే మార్గం మత్త. 7:13, 14; ఎఫె. 4:4, 5

ఒక్కటే

ప్రస్తుతం మనం ‘అంత్యకాలం’లో మత్త. 24:3-14; 2 తిమో. 3:1-5;

జీవిస్తున్నాము లూకా 17:26-30

ఆదాము చేసిన పాపం కారణంగా రోమా. 5:12; 6:23

మానవునికి మరణం ప్రాప్తించింది

మరణించినప్పుడు మానవుని యెహె. 18:4; ప్రసం. 9:10;

ఆత్మ ఉనికిలో లేకుండా పోతుంది కీర్త. 6:5; 146:4; యోహా. 11:11-14

నరకము అనేది మానవుని యోబు 14:13, డుయే;

సాధారణ సమాధి ప్రక. 20:13, 14, ఎవి (మార్జిన్‌)

మృతుల నిరీక్షణ 1 కొరిం. 15:20-22;

పునరుత్థానమే యెహా. 5:28, 29; 11:25, 26

ఆదాము ద్వారా వచ్చిన 1 కొరిం. 15:26; ప్రక. 21:4;

మరణం ఇక ఉండదు యెష. 25:8; 1 కొరిం. 15:54

చిన్నమందకు చెందినవారు లూకా 12:32; ప్రక. 14:1, 3;

1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్లి, 1 కొరిం. 15:40-53;

క్రీస్తుతోపాటు పరిపాలిస్తారు ప్రక. 5:9, 10

ఈ 1,44,000 మంది దేవుని 1 పేతు. 1:23; యోహా. 3:3;

ఆత్మీయ కుమారులుగా తిరిగి జన్మించారు ప్రక. 7:3, 4

ఆత్మీయ ఇశ్రాయేలీయులతో యిర్మీ. 31:31; హెబ్రీ. 8:10-13

క్రొత్త నిబంధన చేయబడింది

క్రీస్తు సంఘం ఆయనపైనే ఎఫె. 2:20;

నిర్మించబడింది యెష. 28:16; మత్త. 21:42

క్రీస్తుద్వారా యెహోవాకు యోహా. 14:6, 13, 14;

మాత్రమే ప్రార్థించాలి 1 తిమో. 2:5

ఆరాధనలో ప్రతిమలను నిర్గ. 20:4, 5; లేవీ. 26:1;

ఉపయోగించకూడదు 1 కొరిం. 10:14; కీర్త. 115:4-8

అభిచారానికి దూరంగా ద్వితీ. 18:10-12; గల. 5:19-21;

ఉండాలి లేవీ. 19:31

సాతాను ఈ లోక 1 యోహా. 5:19; 2 కొరిం. 4:4;

అదృశ్యపాలకుడు యోహా. 12:31

క్రైస్తవుడు వేర్వేరు 2 కొరిం. 6:14-17; 11:13-15;

మతవిశ్వాసాల్లో భాగం వహించకూడదు గల. 5:9; ద్వితీ. 7:1-5

క్రైస్తవుడు లోకానికి యాకో. 4:4; 1 యోహా. 2:15;

వేరైయుండాలి యోహా. 15:19; 17:16

దేవుని న్యాయసూత్రాలకు మత్త. 22:20, 21;

విరుద్ధంకాని మానవ 1 పేతు. 2:12; 4:15

చట్టాలన్నిటికి లోబడాలి

నోటిద్వారా లేదా రక్తనాళాలద్వారా ఆది. 9:3, 4; లేవీ. 17:14;

శరీరంలోకి రక్తాన్ని తీసుకోవడం అపొ. 15:28, 29

దేవుని నియమాలను ఉల్లంషించడమే

బైబిలు నైతిక సంబంధ సూత్రాలకు 1 కొరిం. 6:9, 10;

తప్పక విధేయత చూపించాలి హెబ్రీ. 13:4; 1 తిమో. 3:2; సామె. 5:1-23

విశ్రాంతి దినాచరణ యూదులకు ద్వితీ. 5:15; నిర్గ. 31:13;

మాత్రమే యివ్వబడింది, అది రోమా. 10:4; గల. 4:9, 10;

మోషే ధర్మశాస్త్రంతోపాటు అంతమైంది కొలొ. 2:16, 17

మతగురువుల తరగతి, మత్త. 23:8-12; 20:25-27;

ప్రత్యేక బిరుదులు అనేవి సరైనవికావు యోబు 32:21, 22

మానవుడు పరిణామం చెందలేదు యెష. 45:12;

గాని సృష్టింపబడ్డాడు ఆది. 1:27

దేవుని సేవించుటలో క్రీస్తు 1 పేతు. 2:21; హెబ్రీ. 10:7;

చూపిన మాదిరిని అనుకరించాలి యోహా. 4:34; 6:38

పూర్తిగా ముంచడంద్వారా మార్కు 1:9, 10; యోహా. 3:23;

ఇచ్చే బాప్తిస్మం సమర్పణను సూచిస్తుంది అపొ. 19:4, 5

క్రైస్తవులు లేఖన సత్యాలను రోమా. 10:10; హెబ్రీ. 13:15;

గూర్చి బహిరంగంగా సాక్ష్యమియ్యాలి యెష. 43:10-12

[23వ పేజీలోని చిత్రం]

భూమి . . . యెహోవాచే సృష్టింపబడింది . . . మానవుడు సంరక్షిస్తున్నాడు . . . నిరంతరము నివాసయోగ్యంగా ఉంటుంది.

[క్రెడిట్‌ లైను]

NASA photo