వారెవరు?
వారెవరు?
మీరు వారితో బాగా పరిచయం కావాలనే యెహోవాసాక్షుల అభిలాష. బహుశ వారు మీ పొరుగువారు, తోటి ఉద్యోగులై యుండవచ్చు లేదా అనుదిన జీవితంలో వారిని మీరు కలిసే ఉండవచ్చు. వారు ఏదైనా వీధిలో వచ్చి పోయే వారికి తమ పత్రికలందించడం మీరు చూచియుండవచ్చు. లేదా వారు మీ యింటికి వచ్చినప్పుడు వారితో మీరు మాట్లాడి యుండవచ్చు.
వాస్తవంగా, యెహోవాసాక్షులు మీయందు శ్రద్ధకల్గి, మీ క్షేమాన్ని కోరతారు. వారు మీ స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడుతూ, మీకు వారినిగూర్చి, వారి విశ్వాసాలను, తమ సంస్థనుగూర్చి మరియు మనమంతా జీవిస్తున్న లోకాన్ని, ప్రజలనుగూర్చి ఎక్కువగా చెప్పుటకు కోరుకుంటారు. ఈ ఉద్దేశంతోనే, వారు ఈ బ్రోషూర్‌ను మీ కొరకు తయారు చేశారు.
అనేక విధాలుగా యెహోవాసాక్షులు ఇతరులవంటివారే. వారికి కూడా ఆర్థిక, భౌతిక, మానసిక సమస్యలున్నాయి. వారు కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు, ఎందుకంటే వారు పరిపూర్ణులు, ప్రేరేపించబడినవారు లేదా పొరపాట్లు చేయనివారేమీ కాదు. కాని వారు తమ అనుభవాలనుండి పాఠం నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు, అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి బైబిలు పఠనం బాగా చేస్తారు. వారు దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకున్నారు, ఈ సమర్పణకు తగినట్లుగా వారు నడుచుకుంటారు. వారి కార్యాలన్నింటిలోను నడిపింపుకొరకు దేవుని వాక్యమైన బైబిలు, ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తారు.
వారి నమ్మకాలు కేవలం మానవ కల్పితాలపైన లేదా మతసంబంధమైన మూఢనమ్మకాలపైన ఆధారపడినవిగాక బైబిలుపై ఆధారపడి ఉండడమనేది వారికి చాలా ప్రాముఖ్యం. అపొస్తలుడైన పౌలు ప్రేరేపితుడై తనకుతాను వ్యక్తం చేసినట్లుగానే వారు భావిస్తారు: “ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.” (రోమీయులు 3:4) బైబిలు సత్యాలుగా అందజేయబడిన బోధల విషయానికొస్తే, అపొస్తలుడైన పౌలునుండి సువార్త విన్నప్పుడు బెరయలోనివారు అనుసరించిన పద్ధతిని వారు దృఢంగా బలపరుస్తారు: “ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 17:11) మత బోధలన్నియు అవి తాము చెప్పినవైనా లేదా వేరేవారు చెప్పినవైనా, ఈలాంటి పరీక్షలో లేఖనాలతో పొందిక కలిగి ఉండాలని యెహోవాసాక్షులు విశ్వసిస్తారు. మీరు వారితో చేసే చర్చలలో ఈవిధంగా చేయాలని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు—ఉద్బోధిస్తున్నారు.
దీన్నుండి విశదమయ్యేదేమంటే, యెహోవాసాక్షులు బైబిలును దేవుని వాక్యమని నమ్ముతారు. దీనిలోని 66 పుస్తకాలూ ప్రేరేపితమైనవని, చారిత్రాత్మకంగా సరియైనవని వారు ఒప్పుకుంటారు. సాధారణంగా క్రొత్త నిబంధన అని పిలువబడేదాన్ని వారు క్రైస్తవ గ్రీకు లేఖనాలని, పాత నిబంధనను హెబ్రీ లేఖనాలని పిలుస్తారు. వారు గ్రీకు, హెబ్రీ లేఖనాలు రెండింటిపైన ఆధారపడతారు, అందులోని లేఖనాలు లేదా సన్నివేశాలు స్పష్టంగా సూచనార్థకమైనవి లేదా అలంకారికమైనవని సూచిస్తుంటే తప్ప, మిగతా వాటిని అక్షరార్థంగానే తీసుకుంటారు. అనేకమైన బైబిలు ప్రవచనాలు నెరవేరాయని, మిగిలినవి నెరవేరుతున్నాయని, ఇంకా కొన్ని నెరవేరబోతున్నాయని వారు అర్థం చేసుకుంటారు.
వారి నామం
వారు యెహోవాసాక్షులా? ఔను, ఆవిధంగానే తమను తాము పిలుచుకుంటారు. వారు యెహోవాను, ఆయన దైవత్వాన్ని, ఆయన ఉద్దేశాలనుగూర్చి సాక్ష్యమిస్తున్నారని సూచించే వర్ణనాత్మకమైన నామమది. “దేవుడు,” “ప్రభువు,” “సృష్టికర్త” అనేవి “అధ్యక్షుడు,” “రాజు,” “దళాధిపతి” వలే బిరుదులే, మరి వాటిని వేర్వేరు వ్యక్తులకు అన్వయించవచ్చు. కాని “యెహోవా” అనేది ఒక వ్యక్తిగత నామం, మరి అది సర్వశక్తిమంతుడగు దేవుడును, విశ్వానికి సృష్టికర్తయైన వానిని సూచిస్తుంది. ఇది కీర్తన 83:18లో ఇలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.”
యెహోవా అనే నామం, (లేదా రోమన్ కాథోలిక్కుల జెరూసలేమ్ బైబిల్, ఆలాగే కొందరు ఆధునిక విద్వాంసులు ఎన్నుకున్నట్లుగా యావె) ప్రాచీన హెబ్రీ లేఖనాల్లో దాదాపు 7,000 సార్లు కన్పిస్తుంది. అనేకమైన బైబిళ్లు దీన్ని ఆ విధంగా కాకుండా దానికి బదులుగా “దేవుడు” లేదా “ప్రభువు” అని చూపెడతాయి. అయినను, హెబ్రీ లేఖనాల్లో యెహోవా అని ఉపయోగించినచోట, దానికి బదులుగా ఈ బైబిళ్లలో దేవుడు, ప్రభువు అని పెద్దక్షరాల్లో వ్రాయబడ్డాయి గనుక, ఒక వ్యక్తి సాధారణంగా వాటిని గుర్తించగలడు. అనేకమైన ఆధునిక అనువాదాలు యెహోవా లేదా యావె అను నామాన్ని ఉపయోగించాయి. అందువల్లనే, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ యెషయా 42:8నందు యిలా చదువబడుతుంది: “యెహోవాను నేనే. అదే నా నామము.”
అనే ఆంగ్ల బైబిలులోయెహోవాసాక్షులు వారి నామాన్ని గూర్చి చూపే లేఖనం యెషయా 43వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఒక న్యాయస్థాన సన్నివేశంగా ప్రపంచ పరిస్థితి దృష్టించబడింది: నీతిని గూర్చి వారు వేసిన దావాను నిరూపించడానికి తమ సాక్షులను తేవలెనని లేదా యెహోవా పక్షాన ఉన్న సాక్షులు చెప్పేదాన్ని విని సత్యాన్ని ఒప్పుకోవాలని జనాంగముల దేవుళ్లు ఆహ్వానించబడ్డారు. అక్కడ యెహోవా ఈ విధంగా తన ప్రజలకు ప్రకటిస్తున్నాడు: “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు, మీరును నేను ఎన్నుకొనిన నా సేవకుడును నాకు సాక్షులని యెహోవా చెబుతున్నాడు; నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.”—యెషయా 43:10, 11, అమెరికన్ స్టాండర్డ్ వర్హన్.
క్రీస్తుకు పూర్వం అనేక వేల సంవత్సరాల క్రితం యెహోవా దేవుడు భూమిపై సాక్షులను కల్గియుండెను. హెబ్రీయులు 11వ అధ్యాయంలో విశ్వాసులైన అలాంటి మనుష్యులను గూర్చి వివరించిన తర్వాత, హెబ్రీయులు 12:1 యిలా చెబుతుంది: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” పొంతిపిలాతు ఎదుట యేసు యిలా చెప్పాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” ఆయన “నమ్మకమైన సత్యసాక్షి” అని పిలువబడ్డాడు. (యోహాను 18:37; ప్రకటన 3:14) “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని,” యేసు తన శిష్యులతో చెప్పెను.—అపొస్తలుల కార్యములు 1:8.
కాబట్టి, ఈనాడు 230 కంటే ఎక్కువ దేశాల్లో యేసుక్రీస్తుద్వారా రాబోయే యెహోవా రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించే 40,00,000 కంటే ఎక్కువమంది తమను తాము యెహోవాసాక్షులని చెప్పుకోవడం తగినదేనని భావిస్తున్నారు.
[4వ పేజీలోని చిత్రం]
మీ యెడల వారు ఆసక్తికల్గి ఉన్నారు
[4వ పేజీలోని చిత్రం]
వారు దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకున్నారు
[5వ పేజీలోని చిత్రం]
బైబిలు దేవుని వాక్యమని వారు నమ్ముతారు
[6వ పేజీలోని చిత్రం]
న్యాయస్థానంలో జరిగే సన్నివేశంతో సంబంధం కల్గియున్న నామం
[6వ పేజీలోని చిత్రం]
230 కంటే ఎక్కువ దేశాల్లో 40,00,000కు పైగా సాక్షులున్నారు
[5వ పేజీలోని చిత్రం]
ప్రాచీన హెబ్రీ భాషలో దేవుని వ్యక్తిగత నామం