కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు


బైబిలు స్టడీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి . . .

బైబిలు స్టడీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి . . .

ముందుగా ఈ పరిచయ పేజీల్ని పరిశీలించండి, తర్వాత వీడియో చూడండి.

పాఠం మొదటి భాగం

ప్రతీ పాఠానికి సిద్ధపడుతున్నప్పుడు, ముందుగా పాఠం మొదటి భాగం చదవండి. ముద్దక్షరాల్లో ఉన్న ప్రశ్నలు (1), బైబిలు వచనాలు (2) ముఖ్యమైన విషయాల్ని నొక్కి చెప్తాయి. కొన్ని వచనాల దగ్గర “చదవండి” అని రాసి ఉంటుందని గమనించండి.

పాఠం మధ్య భాగం

ఎక్కువ తెలుసుకోండి కింద ఉన్న పరిచయ మాటలు (3), తర్వాత ఏం చర్చిస్తామో చెప్తాయి. ఉపశీర్షికలు లేదా సబ్‌ హెడింగ్‌లు (4) పాఠంలోని ముఖ్యమైన విషయాల్ని చెప్తాయి. మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి బైబిలు వచనాల్ని చదవండి, ప్రశ్నలకు జవాబు చెప్పండి, వీడియోల్ని చూడండి.

వీడియో బాక్సులు మరింత సమాచారాన్ని తెలియజేసే వీడియోల్ని చూడడానికి, ఆడియోల్ని వినడానికి సహాయం చేస్తాయి. కొన్ని వీడియోలు నిజంగా జరిగిన సంఘటనల్ని చూపిస్తాయి. ఇంకొన్ని వీడియోలు నిజమైన సంఘటనల్ని లేదా వ్యక్తుల్ని చూపించవు కానీ, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాల్ని చూపిస్తాయి.

చిత్రాలు, చిత్రాల కింద ఉన్న మాటలు (5) గమనించండి. కొంతమంది ఇలా అంటారు (6) కింద ఇచ్చిన ప్రశ్నకు మీరు ఎలా జవాబు చెప్పవచ్చో ఆలోచించండి.

పాఠం చివరి భాగం

ఒక్కమాటలో, అలాగే మీరేం నేర్చుకున్నారు (7) అనేవి పాఠంలో నేర్చుకున్న వాటిని గుర్తుచేస్తాయి. పాఠం పూర్తయిన తేదీ రాసుకోండి. ఇలా చేసి చూడండి (8) కింద మీరు చేయాల్సిన పనులు ఉంటాయి. ఇవి కూడా చూడండి (9) కింద ఉన్న ఆర్టికల్స్‌ని, వీడియోల్ని మీరు కావాలనుకుంటే చూడవచ్చు.

బైబిలు వచనాలు ఎలా తెరవాలి?

బైబిల్లో 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. అవి రెండు భాగాల కింద ఉంటాయి: హీబ్రూ-అరామిక్‌ లేఖనాలు (“పాత నిబంధన”), అలాగే క్రైస్తవ గ్రీకు లేఖనాలు (“కొత్త నిబంధన”).

ఈ పుస్తకంలో ఏదైనా లేఖనం ఇచ్చినప్పుడు బైబిలు పుస్తకం పేరు (ఎ), దానితోపాటు అధ్యాయం (బి), తర్వాత వచనం లేదా వచనాలు (సి) ఇస్తారు.

ఉదాహరణకు, యోహాను 17:3 అన్నప్పుడు యోహాను అనే పుస్తకంలో, 17వ అధ్యాయం, 3వ వచనం తెరవాలని అర్థం.