కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ పాఠం

మనం దేవునికి ఇష్టమైన విధంగా ఎలా ఆరాధించవచ్చు?

మనం దేవునికి ఇష్టమైన విధంగా ఎలా ఆరాధించవచ్చు?

ముందటి పాఠంలో తెలుసుకున్నట్టు దేవుడు అన్ని మతాల్నీ ఇష్టపడడు. అంటే ఇక దేవునికి ఇష్టమైన విధంగా మనం ఆరాధించలేమా? ఆరాధించగలం. ఇంతకీ ఎలాంటి “ఆరాధన [లేదా, మతం]” ఆయనకు నచ్చుతుంది? (యాకోబు 1:27, అధస్సూచి) బైబిలు ఏం చెప్తుందో చూడండి.

1. దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించడం ఎలా తెలుసుకోవచ్చు?

మనం బైబిలు చదివి తెలుసుకోవచ్చు. ఎందుకంటే, దేవునితో యేసు ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యం.” (యోహాను 17:17) బైబిలు దేవుని వాక్యం. కొన్ని మతాలు బైబిల్లోని సత్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల బోధల్ని, ఆచారాల్ని బోధిస్తున్నాయి. కానీ, ‘తన ఆజ్ఞల్ని పక్కన పెట్టేస్తే’ యెహోవా సంతోషించడు. (మార్కు 7:9 చదవండి.) అలా కాకుండా, మనం బైబిలు చెప్తున్నట్టు ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడు.

2. మనం ఎలా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు?

యెహోవా మన సృష్టికర్త కాబట్టి మన సంపూర్ణ భక్తిని పొందడానికి ఆయన అర్హుడు. (ప్రకటన 4:11) అంటే, మనం తనను ప్రేమించాలనీ ఎలాంటి విగ్రహాలు, ఫోటోలు, గుర్తులు ఉపయోగించకుండా తనను మాత్రమే ఆరాధించాలనీ యెహోవా కోరుకుంటున్నాడు.—యెషయా 42:8 చదవండి.

మన ఆరాధన ‘పవిత్రంగా, దేవునికి ఇష్టమైనదిగా’ ఉండాలి. (రోమీయులు 12:1) అలా ఉండాలంటే, మనం ఆయన నియమాలకు తగ్గట్టు జీవించాలి. ఉదాహరణకు, యెహోవాను ప్రేమించేవాళ్లు పెళ్లి విషయంలో ఆయన పెట్టిన నియమాల్ని గౌరవిస్తారు, పాటిస్తారు. అంతేకాదు వాళ్లు సిగరెట్లు, డ్రగ్స్‌, అతిగా మందు తాగడం లాంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటారు. a

3. మనం ఎందుకు తోటి విశ్వాసులతో కలిసి యెహోవాను ఆరాధించాలి?

ప్రతీవారం జరిగే మీటింగ్స్‌, ‘సమాజంలో యెహోవాను స్తుతించే’ అవకాశాన్ని మనకు ఇస్తాయి. (కీర్తన 111:1, 2) ఉదాహరణకు, మీటింగ్స్‌లో మనం దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడతాం. (కీర్తన 104:33 చదవండి.) యెహోవా మన మీద ప్రేమతోనే మీటింగ్స్‌కి రమ్మని చెప్తున్నాడు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి మీటింగ్స్‌ సహాయం చేస్తాయని ఆయనకు తెలుసు. మీటింగ్స్‌లో మనం వేరేవాళ్లను ప్రోత్సహిస్తాం, వాళ్లు మనల్ని ప్రోత్సహిస్తారు.

ఎక్కువ తెలుసుకోండి

ఆరాధనలో విగ్రహాల్ని ఉపయోగిస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుందో, మనం దేవుణ్ణి ఎలా స్తుతించవచ్చో తెలుసుకోండి.

4. ఆరాధనలో విగ్రహాల్ని ఉపయోగిస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

విగ్రహాల్ని ఉపయోగించడం గురించి యెహోవా ఏం అనుకుంటున్నాడో తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • బైబిలు కాలాల్లో, కొంతమంది దేవుని ప్రజలు ఒక విగ్రహాన్ని ఉపయోగించి ఆయన్ని ఆరాధించినప్పుడు ఏం జరిగింది?

ఆరాధనలో విగ్రహాల్ని ఉపయోగించడం వల్ల దేవునికి దగ్గరైనట్టు అనిపిస్తుందని కొంతమంది అంటారు. నిజానికి, విగ్రహాలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయా, దూరం చేస్తాయా? నిర్గమకాండం 20:4-6; కీర్తన 106:35, 36 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ప్రజలు తమ ఆరాధనలో ఎలాంటి విగ్రహాల్ని, వస్తువుల్ని ఉపయోగించడం మీరు గమనించారు?

  • విగ్రహాల్ని ఉపయోగించడం గురించి యెహోవా ఏం అనుకుంటున్నాడు?

  • విగ్రహాల్ని ఉపయోగించడం గురించి మీరేం అనుకుంటున్నారు?

5. యెహోవాను మాత్రమే ఆరాధిస్తే తప్పుడు నమ్మకాల నుండి బయటపడతాం

యెహోవాను సరైన విధంగా ఆరాధించడం వల్ల మనం తప్పుడు నమ్మకాల నుండి ఎలా బయటపడవచ్చో గమనించండి. వీడియో చూడండి.

కీర్తన 91:14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం యెహోవాను ప్రేమిస్తే ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం. మనం అలా ప్రేమ చూపిస్తే ఏం చేస్తానని ఆయన మాటిస్తున్నాడు?

6. మనం మీటింగ్స్‌లో దేవుణ్ణి ఆరాధిస్తాం

మీటింగ్స్‌లో పాటలు పాడడం ద్వారా, ప్రశ్నలకు జవాబులు చెప్పడం ద్వారా యెహోవాను స్తుతిస్తాం, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. కీర్తన 22:22 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మీటింగ్స్‌లో వేరేవాళ్లు చెప్పే జవాబులు మీకు నచ్చాయా?

  • మీరు కూడా సిద్ధపడి, ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలనుకుంటున్నారా?

7. నేర్చుకుంటున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్పినప్పుడు యెహోవా సంతోషిస్తాడు

బైబిల్లో ఉన్న సత్యాల్ని వేరేవాళ్లకు చెప్పే ఎన్నో అవకాశాలు మనకు దొరుకుతాయి. కీర్తన 9:1; 34:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బైబిల్లో నేర్చుకున్న ఏ విషయాన్ని మీరు వేరేవాళ్లకు చెప్పాలనుకుంటున్నారు?

కొంతమంది ఇలా అంటారు: “దేవుని మీద భక్తి ఉంటే చాలు, ఆయన్ని ఎలా ఆరాధించినా ఫర్వాలేదు.”

  • మీకేం అనిపిస్తుంది?

ఒక్కమాటలో

మనం సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, మీటింగ్స్‌లో ఆయన్ని స్తుతిస్తే, నేర్చుకుంటున్న వాటిని వేరేవాళ్లకు చెప్తే ఆయన సంతోషిస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించడం ఎలా తెలుసుకోవచ్చు?

  • మనం ఎందుకు యెహోవాను మాత్రమే ఆరాధించాలి?

  • మనం ఎందుకు తోటి విశ్వాసులతో కలిసి ఆరాధించాలి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

దేవునికి ఇష్టంలేని ఆరాధనను విడిచిపెట్టిన తర్వాత ఒకామె ఎలా సంతోషంగా ఉందో తెలుసుకోవడానికి, “నేను ఇప్పుడు దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధిస్తున్నాను” అనే ఆర్టికల్‌ చదవండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట ఆర్టికల్‌)

మీటింగ్స్‌లో ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మీకు ఏది సహాయం చేస్తుందో తెలుసుకోండి.

“సంఘంలో యెహోవాను స్తుతించండి” (కావలికోట, జనవరి 2019)

మీటింగ్స్‌కి వెళ్లడం ఒకతనికి కష్టంగా ఉండేది. అయినా అతను మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల ఎలా ప్రయోజనం పొందాడో చూడండి.

యెహోవా నామీద శ్రద్ధ చూపించాడు (3:07)

సిలువ అనేది క్రైస్తవుల గుర్తు అని చాలామంది అనుకుంటారు, మరి మన ఆరాధనలో దాన్ని ఉపయోగించాలా?

“యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?” (jw.org ఆర్టికల్‌)

a ఈ విషయాల గురించి తర్వాత రాబోయే పాఠాల్లో చర్చిస్తాం.