20వ పాఠం
క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
యెహోవా అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు. (1 కొరింథీయులు 14:33) కాబట్టి, ఆయన ప్రజలు కూడా అన్నీ పద్ధతి ప్రకారం చేస్తారు. క్రైస్తవ సంఘం ఎలా పని చేస్తుంది? అది క్రమపద్ధతిగా పని చేయడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు?
1. సంఘానికి శిరస్సు ఎవరు?
‘సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు.’ (ఎఫెసీయులు 5:23) ఆయన పరలోకం నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజల పనిని చూసుకుంటున్నాడు. యేసు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ అంటే పరిపాలక సభను నియమించాడు. పరిపాలక సభలో అనుభవం గల కొంతమంది పెద్దలు ఉంటారు. (మత్తయి 24:45-47 చదవండి.) మొదటి శతాబ్దంలో యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు సంఘాలన్నిటికీ నిర్దేశం ఇచ్చారు. అలాగే నేడు పరిపాలక సభలోని సహోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు నిర్దేశం ఇస్తారు. (అపొస్తలుల కార్యాలు 15:2) అయితే, వాళ్లు మా సంస్థకు నాయకులు కాదు. వాళ్లు ఎప్పుడూ యెహోవా మీద, ఆయన వాక్యం మీద ఆధారపడుతూ సంఘానికి శిరస్సు అయిన యేసుకు లోబడతారు.
2. పెద్దలు అంటే ఎవరు? వాళ్లు ఏం చేస్తారు?
పెద్దలు అంటే సంఘంలో అనుభవం గల క్రైస్తవ సహోదరులు. సంఘ పెద్దలు బైబిలు నుండి బోధిస్తారు, యెహోవా ప్రజలకు సహాయం చేస్తారు, వాళ్లను ప్రోత్సహిస్తారు, ఒక కాపరిలా వాళ్లను చూసుకుంటారు. పెద్దలు డబ్బులకు పని చేయరు. కానీ, ‘దేవుని ముందు ఇష్టపూర్వకంగా పని చేస్తారు; అక్రమ లాభం మీద ప్రేమతో కాకుండా, ఉత్సాహంతో చేస్తారు.’ (1 పేతురు 5:1, 2) సంఘ పరిచారకులు పెద్దలకు సహాయం చేస్తారు, కొంతకాలం తర్వాత వాళ్లు కూడా పెద్దలుగా సేవ చేయడానికి అర్హులు అవ్వవచ్చు.
పరిపాలక సభ కొంతమంది పెద్దల్ని ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమిస్తుంది. వాళ్లు వేర్వేరు సంఘాలకు వెళ్లి బైబిలు నుండి సలహాలు ఇస్తారు, సహోదర సహోదరీలను ప్రోత్సహిస్తారు. అంతేకాదు, బైబిల్లో ఉన్న అర్హతలు సంపాదించిన సహోదరుల్ని సంఘ పెద్దలుగా లేదా సంఘ పరిచారకులుగా నియమిస్తారు.—1 తిమోతి 3:1-10, 12; తీతు 1:5-9.
3. ప్రతీ యెహోవాసాక్షి ఏం చేస్తారు?
సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరు ‘యెహోవా పేరును స్తుతిస్తారు.’ మీటింగ్స్‌లో ప్రశ్నలకు జవాబు చెప్పడం, ప్రసంగాలు ఇవ్వడం, ప్రదర్శనలు చేయడం, పాటలు పాడడం ద్వారా, అలాగే వీలైనంత ఎక్కువగా ప్రకటించడం ద్వారా యెహోవాను స్తుతిస్తారు.—కీర్తన 148:12, 13 చదవండి.
ఎక్కువ తెలుసుకోండి
యేసు ఎలాంటి నాయకుడో, పెద్దలు ఆయనలా ఉండడానికి ఎలా కృషి చేస్తారో, మనం యేసుకు లోబడుతూ పెద్దల మాట ఎలా వినవచ్చో తెలుసుకోండి.
4. యేసు దయగల నాయకుడు
యేసు మనకు ప్రేమతో ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. మత్తయి 11:28-30 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
యేసు ఎలాంటి నాయకుడు? ఆయన కింద ఉండడం ప్రజలకు ఎలా అనిపిస్తుంది?
సంఘ పెద్దలు యేసులా ఉండడానికి ఎలా కృషి చేస్తారో తెలుసుకోవడానికి వీడియో చూడండి.
పెద్దలు తమ పనిని ఎలా చేయాలో బైబిలు స్పష్టంగా చెప్తుంది.
యెషయా 32:2; 1 పేతురు 5:1-3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
పెద్దలు యేసులా దయగా ఉండడానికి ప్రయత్నిస్తారని తెలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది?
-
పెద్దలు ఇంకా ఏయే విధాలుగా యేసులా ఉండడానికి ప్రయత్నిస్తారు?
5. పెద్దలు తమ పనుల ద్వారా మనకు బోధిస్తారు
పెద్దలు తమ బాధ్యత గురించి ఎలా ఆలోచించాలని యేసు కోరుతున్నాడు? వీడియో చూడండి.
సంఘంలో ముందుండి నడిపించేవాళ్లు ఎలా ఉండాలో యేసు చెప్పాడు. మత్తయి 23:8-12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
సంఘ పెద్దల గురించి బైబిలు చెప్పే దానికి, లోకంలోని మత బోధకులకు మధ్య మీరు ఎలాంటి తేడాను గమనించారు?
-
1. పెద్దలు యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉంటారు, తమ కుటుంబం కూడా అలా ఉండేలా సహాయం చేస్తారు
-
2. పెద్దలు సంఘంలో ఉన్న వాళ్లందర్నీ పట్టించుకుంటారు
-
3. పెద్దలు క్రమంగా ప్రకటిస్తారు
-
4. పెద్దలు బోధిస్తారు. అలాగే శుభ్రం చేసే పనిని, ఇతర పనుల్ని చేస్తారు
6. మనం సంఘ పెద్దల మాట వినడం మంచిది
మనం పెద్దల మాట ఎందుకు వినాలో బైబిలు చెప్తుంది. హెబ్రీయులు 13:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
మనం పెద్దలకు ఇష్టంగా లోబడాలని బైబిలు ఎందుకు చెప్తుంది? దాని గురించి మీకు ఏమనిపిస్తుంది?
లూకా 16:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
చాలా చిన్నవి అనిపించే విషయాల్లో కూడా పెద్దల మాట వినడం ఎందుకు ప్రాముఖ్యం?
కొంతమంది ఇలా అంటారు: “సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు.”
-
సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం మంచిదని మీకు ఎందుకు అనిపిస్తుంది?
ఒక్కమాటలో
సంఘానికి శిరస్సు యేసు. ఆయన ఉపయోగించుకుంటున్న పెద్దలకు మనం ఇష్టంగా లోబడతాం. ఎందుకంటే వాళ్లు మనతో దయగా ఉంటారు, తమ పనుల ద్వారా మనకు బోధిస్తారు.
మీరేం నేర్చుకున్నారు?
-
సంఘానికి శిరస్సు ఎవరు?
-
పెద్దలు సంఘానికి ఎలా సహాయం చేస్తారు?
-
యెహోవాను ఆరాధించే ప్రతీ ఒక్కరు ఏం చేస్తారు?
ఇవి కూడా చూడండి
నేడు పరిపాలక సభకు, ఇతర పెద్దలకు క్రైస్తవుల మీద ఎంత శ్రద్ధ ఉందో చూడండి.
ప్రాంతీయ పర్యవేక్షకులు చేసే పని గురించి తెలుసుకోండి.
మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షకుని జీవితం (4:51)
సంఘంలో స్త్రీలకు ఎంత విలువైన స్థానం ఉందో తెలుసుకోండి.
“యెహోవాసాక్షుల్లో స్త్రీలు ప్రకటిస్తారా?” (కావలికోట ఆర్టికల్)
తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించడానికి పెద్దలు ఎంతగా కష్టపడతారో తెలుసుకోండి.
“క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’” (కావలికోట, జనవరి 15, 2013)