34వ పాఠం
మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పటి కన్నా, ఇప్పుడు మీరు దేవునికి ఇంకా దగ్గరైనట్టు అనిపిస్తుందా? దేవునితో మీ స్నేహాన్ని ఇలాగే పెంచుకోవాలని అనుకుంటున్నారా? మీరు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో యెహోవా చూస్తాడని గుర్తుంచుకోండి. మీరు తనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే యెహోవా మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తాడు, పట్టించుకుంటాడు. మరి, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?
1. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?
మనం యెహోవాకు లోబడడం ద్వారా ఆయన్ని ప్రేమిస్తున్నామని చూపిస్తాం. (1 యోహాను 5:3 చదవండి.) తనకు లోబడమని ఆయన ఎవర్నీ బలవంతపెట్టడు. బదులుగా తనకు లోబడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయన ప్రతీ ఒక్కరికి ఇస్తాడు. ఎందుకంటే, మనం తనకు ‘మనస్ఫూర్తిగా లోబడాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (రోమీయులు 6:17) ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు ఏదో తప్పదన్నట్టు కాదుగానీ ప్రేమతోనే తనకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు యెహోవాకు నచ్చేవి చేస్తూ, ఆయనకు నచ్చనివాటికి దూరంగా ఉండడం ద్వారా ఆయన మీద ప్రేమ చూపించవచ్చు. అదెలాగో ఈ పుస్తకంలోని 3, 4 సెక్షన్‌లు వివరిస్తాయి.
2. యెహోవాకు లోబడడం ఎందుకు కష్టంగా ఉండవచ్చు?
“నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి.” (కీర్తన 34:19) ఉదాహరణకు, మనందరం మన సొంత బలహీనతలతో పోరాడుతున్నాం. అంతేకాదు ఆర్థిక సమస్యలు, అన్యాయం, ఇతర కష్టాలు మనకు ఎదురవ్వవచ్చు. అలాంటి పరిస్థితుల్లో యెహోవాకు లోబడడం కన్నా, తప్పుడు దారిలో వెళ్లడమే తేలిగ్గా అనిపించవచ్చు. కానీ మీరు యెహోవా చెప్పేది నమ్మకంగా చేసినప్పుడు, అన్నిటికన్నా ఎక్కువగా ఆయన్నే ప్రేమిస్తున్నారని చూపిస్తారు. అంతేకాదు, అన్ని పరిస్థితుల్లో ఆయనకు విశ్వసనీయంగా ఉన్నారని చూపిస్తారు. అలా చేస్తే యెహోవా కూడా మీకు విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు.—కీర్తన 4:3 చదవండి.
ఎక్కువ తెలుసుకోండి
మీరు తనకు లోబడినప్పుడు యెహోవా ఎందుకు సంతోషిస్తాడో, ఆయనకు విశ్వసనీయంగా ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుందో తెలుసుకోండి.
3. సాతాను మిమ్మల్ని నిందిస్తున్నాడు
బైబిల్లోని యోబు పుస్తకం చెప్తున్నట్లు, సాతాను యోబు ఒక్కడినే కాదు యెహోవాను ఆరాధించాలని కోరుకునే వాళ్లందర్నీ నిందిస్తున్నాడు. యోబు 1:1, 6–2:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
యోబు యెహోవాకు ఎందుకు లోబడుతున్నాడని సాతాను అన్నాడు?—యోబు 1:9-11 చూడండి.
-
సాతాను మిమ్మల్ని, అలాగే మనుషులందర్నీ ఏమని నిందిస్తున్నాడు?—యోబు 2:4 చూడండి.
యోబు 27:5బి చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని యోబు ఎలా చూపించాడు?
4. యెహోవా హృదయాన్ని సంతోషపెట్టండి
సామెతలు 27:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
మీరు తెలివిని సంపాదించి, తనకు లోబడినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు?
5. మీరు యెహోవాకు విశ్వసనీయంగా ఉండగలరు
మనం యెహోవాను ప్రేమిస్తే, ఆయన గురించి వేరేవాళ్లకు చెప్పాలనుకుంటాం. మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే, కష్టమైన పరిస్థితుల్లో కూడా అలా చెప్పాలనుకుంటాం. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
-
యెహోవా గురించి వేరేవాళ్లకు చెప్పడం మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా?
-
వీడియోలో చూపించినట్లుగా, గ్రేసన్‌కు ఏది సహాయం చేసింది?
యెహోవా ప్రేమించేవాటిని ప్రేమిస్తూ, ఆయన అసహ్యించుకునే వాటిని అసహ్యించుకున్నప్పుడు ఆయనకు విశ్వసనీయంగా ఉండడం తేలిక అవుతుంది. కీర్తన 97:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
మీరు ఇప్పటివరకు నేర్చుకున్నదాని ప్రకారం, యెహోవా వేటిని ప్రేమిస్తాడు? వేటిని అసహ్యించుకుంటాడు?
-
మంచిని ప్రేమిస్తూ చెడును అసహ్యించుకోవడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
6. యెహోవాకు లోబడితే ప్రయోజనం పొందుతాం
యెహోవాకు లోబడడం ఎప్పుడూ మనకే మంచిది. యెషయా 48:17, 18 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
యెహోవా ఏది చెప్పినా, అది మీ ప్రయోజనం కోసమే అని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?
-
స్టడీలో బైబిలు గురించి, సత్యదేవుడైన యెహోవా గురించి నేర్చుకోవడం వల్ల మీరు ఇప్పటివరకు ఎలా ప్రయోజనం పొందారు?
కొంతమంది ఇలా అంటారు: “నా పనులు దేవుణ్ణి సంతోషపెట్టగలవా?”
-
మన పనులు యెహోవాను సంతోషపెట్టగలవు అనడానికి మీరు ఏ లేఖనం చూపిస్తారు?
ఒక్కమాటలో
యెహోవాకు లోబడడం ద్వారా, కష్టాలు వచ్చినా ఆయనకు విశ్వసనీయంగా ఉండడం ద్వారా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారని చూపించవచ్చు.
మీరేం నేర్చుకున్నారు?
-
యోబు ఉదాహరణ నుండి మీరేం నేర్చుకున్నారు?
-
యెహోవాను ప్రేమిస్తున్నారని మీరు ఎలా చూపిస్తారు?
-
యెహోవాకు విశ్వసనీయంగా ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
ఇవి కూడా చూడండి
యెహోవాకు, సంఘానికి మీరు ఎలా విశ్వసనీయంగా ఉండవచ్చో తెలుసుకోండి.
“విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు” (16:49)
సాతాను మనుషులపై వేసిన నిందల గురించి ఎక్కువ తెలుసుకోండి.
“కష్టాలొచ్చినా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు” (బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, భాగం 6)
యెహోవాను ప్రేమిస్తున్నామని చిన్నపిల్లలు కూడా ఎలా చూపించవచ్చో తెలుసుకోండి.
తోటివాళ్ల నుండి ఒత్తిడి ఎదురైనప్పుడు యౌవనులు దేవునికి ఎలా విశ్వసనీయంగా ఉండవచ్చు?