కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

55వ పాఠం

మీ సంఘానికి మద్దతు ఇవ్వండి

మీ సంఘానికి మద్దతు ఇవ్వండి

ప్రపంచవ్యాప్తంగా, లక్షలమంది యెహోవా ప్రజలు వాళ్లవాళ్ల సంఘాల్లో ఆయన్ని సంతోషంగా ఆరాధిస్తున్నారు. అక్కడ ఇచ్చే ఉపదేశానికి, నిర్దేశానికి వాళ్లు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు, అలాగే వాళ్లు ఎన్నో విధాలుగా తమ సంఘానికి ఉత్సాహంగా మద్దతు ఇస్తున్నారు. మీ సంఘం గురించి మీకూ వాళ్లలాగే అనిపిస్తుందా?

1. సంఘానికి మద్దతు ఇవ్వడానికి మీ సమయాన్ని, శక్తిని ఎలా ఉపయోగించవచ్చు?

ప్రతీ ఒక్కరు సంఘానికి మద్దతు ఇవ్వడానికి ఏదోకటి చేయవచ్చు. ఉదాహరణకు మీ సంఘంలో వృద్ధులు, వైకల్యంతో ఇబ్బందిపడుతున్న వాళ్లు ఉన్నారా? అయితే మీరు వాళ్లను మీటింగ్స్‌కి తీసుకెళ్లి, తీసుకురావచ్చు. లేదా వాళ్లకు సరుకులు కొనడంలో, ఇంటి పనుల్లో సహాయం చేయవచ్చు. (యాకోబు 1:27 చదవండి.) అంతేకాదు మన రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి, దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మనం సహాయం చేయవచ్చు. ఇవన్నీ చేయమని ఎవరూ మనల్ని బలవంతపెట్టరు. మనమే దేవుని మీద, సహోదరుల మీద ఉన్న ప్రేమతో ‘ఇష్టపూర్వకంగా ముందుకొస్తాం.’కీర్తన 110:3.

బాప్తిస్మం తీసుకున్నవాళ్లు ఇంకొన్ని విధాలుగా సంఘానికి మద్దతు ఇవ్వవచ్చు. లేఖన అర్హతలు సాధించిన సహోదరులు సంఘ పరిచారకులుగా లేదా సంఘ పెద్దలుగా సేవ చేయవచ్చు. అయితే సహోదరులు, సహోదరీలు ఇద్దరూ పయినీరు సేవ చేయడం ద్వారా ప్రకటనా పనికి ఉత్సాహంగా మద్దతు ఇవ్వవచ్చు. కొంతమంది సాక్షులు ఆరాధనా స్థలాల్ని కట్టడంలో సహాయం చేయవచ్చు, లేదా అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి సంఘానికి మద్దతు ఇవ్వవచ్చు.

2. సంఘానికి మద్దతు ఇవ్వడానికి మన డబ్బును, వస్తువుల్ని ఎలా ఉపయోగించవచ్చు?

‘మనకున్న విలువైన వాటితో యెహోవాను ఘనపర్చవచ్చు.’ (సామెతలు 3:9) మన సంఘానికి, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మద్దతుగా మన డబ్బును, ఇతర విలువైన వాటిని మనం సంతోషంగా ఇస్తాం. (2 కొరింథీయులు 9:7 చదవండి.) మనం ఇచ్చే విరాళాల్ని విపత్తు సహాయక పనుల కోసం కూడా ఉపయోగిస్తారు. చాలామంది, విరాళం ఇవ్వడం కోసం క్రమంగా వాళ్ల సంపాదనలో ‘కొంత తీసి పక్కన పెడతారు.’ (1 కొరింథీయులు 16:2 చదవండి.) మన ఆరాధనా స్థలాల్లో ఉన్న విరాళాల పెట్టెల్లో మనం విరాళం వేయవచ్చు, లేదా donate.pr418.com ఉపయోగించి ఆన్‌లైన్‌లో విరాళం ఇవ్వవచ్చు. మన డబ్బును, వస్తువుల్ని ఉపయోగించి సంఘానికి మద్దతు ఇవ్వడం ద్వారా యెహోవా మీద ప్రేమ ఉందని చూపించవచ్చు.

ఎక్కువ తెలుసుకోండి

సంఘానికి మద్దతు ఇవ్వడానికి మీరు ఏమేం చేయవచ్చో వివరంగా తెలుసుకోండి.

3. మన డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు

సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం. యేసుకు కూడా అంతే. ఉదాహరణకు ఒక పేద విధవరాలి గురించి, ఆమె వేసిన విరాళం గురించి యేసు మెచ్చుకుంటూ మాట్లాడాడు. లూకా 21:1-4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవాను సంతోషపెట్టాలంటే మనం పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలా?

  • మనం మనస్ఫూర్తిగా ఇచ్చే విరాళాల్ని బట్టి యెహోవాకు, యేసుకు ఎలా అనిపిస్తుంది?

మన విరాళాల్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • మన విరాళాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల కోసం ఎలా ఉపయోగిస్తారు?

4. మనం సహాయం చేయడానికి ముందుకు రావచ్చు

బైబిలు కాలాల్లో, యెహోవా ప్రజలు ఆరాధనా స్థలాల్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి ఉత్సాహంగా పని చేశారు. వాళ్లు విరాళం ఇవ్వడం కంటే ఎక్కువే చేశారు. 2 దినవృత్తాంతాలు 34:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ప్రతీ ఇశ్రాయేలీయుడు, యెహోవా మందిరాన్ని లేదా ఆరాధనా స్థలాన్ని మంచి స్థితిలో ఉంచడానికి ఎలా సహాయం చేశాడు?

వాళ్లలాగే యెహోవాసాక్షులు కూడా ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • మన రాజ్యమందిరాన్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

  • అందుకోసం మీరు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

5. సహోదరులు మరిన్ని బాధ్యతల్ని చేపట్టడానికి కృషి చేయవచ్చు

సహోదరులు ముందుకు వచ్చి, సంఘానికి మద్దతు ఇవ్వడానికి చేయగలిగినదంతా చేయాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • వీడియోలోని సహోదరుడు తన సంఘానికి ఇంకా ఎక్కువ మద్దతు ఇవ్వడానికి ఎలా కృషి చేశాడు?

సంఘ పరిచారకులుగా, సంఘ పెద్దలుగా సేవ చేయాలనుకునే సహోదరులకు ఏ అర్హతలు ఉండాలో బైబిలు వివరిస్తుంది. 1 తిమోతి 3:1-13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • సంఘ పరిచారకులుగా, సంఘ పెద్దలుగా సేవ చేయాలనుకునే సహోదరులు ఎలా ఉండాలి?

  • వాళ్ల భార్యాపిల్లలు ఎలా ఉండాలి?—4, 11 వచనాలు చూడండి.

  • సహోదరులు ఆ అర్హతలు చేరుకోవడానికి కృషి చేసినప్పుడు, సంఘంలో ప్రతీ ఒక్కరు ఎలా ప్రయోజనం పొందుతారు?

కొంతమంది ఇలా అడుగుతారు: “యెహోవాసాక్షుల పనికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?”

  • వాళ్లకు మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

మన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉపయోగించి సంఘానికి మద్దతు ఇవ్వవచ్చు. అందుకోసం మనం చేసే కృషిని యెహోవా ఎంతో విలువైనదిగా చూస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • సంఘానికి మద్దతు ఇవ్వడానికి మన సమయాన్ని, శక్తిని ఎలా ఉపయోగించవచ్చు?

  • సంఘానికి మద్దతు ఇవ్వడానికి మన డబ్బును, వస్తువుల్ని ఎలా ఉపయోగించవచ్చు?

  • మీరు ఏయే విధాలుగా సంఘానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

నేడు దేవుని ఆరాధకులు దశమభాగం లేదా పదోవంతు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు లేదో పరిశీలించండి.

“దశమభాగం ఇవ్వడం గురించి బైబిలు ఏం చెప్తుంది?” (jw.org ఆర్టికల్‌)

కొన్ని పనులు బాప్తిస్మం తీసుకున్న సహోదరులు చేయాలని బైబిలు చెప్తుంది. ఒకవేళ ఆ పనుల్ని బాప్తిస్మం తీసుకున్న సహోదరీలు చేయాల్సివస్తే, అప్పుడేంటి?

“సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి” (కావలికోట, ఫిబ్రవరి 2021)

కొంతమంది సహోదరులు తోటి ఆరాధకులకు ప్రచురణలు చేరవేయడానికి ఎంత ధైర్యం చూపించారో, ఎన్ని త్యాగాలు చేశారో చూడండి.

కాంగోలోని వాళ్లకు బైబిలు ప్రచురణలను చేరవేయడం (4:25)

వేరే మత సంస్థలకు భిన్నంగా, మన పనికి ఆర్థిక మద్దతు ఎలా వస్తుందో తెలుసుకోండి.

“యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?” (jw.org ఆర్టికల్‌)