కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను నీ పేరును తెలియజేశాను’

‘నేను నీ పేరును తెలియజేశాను’

‘నేను నీ పేరును తెలియజేశాను’

“లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన ​మనుషులకు నీ పేరు వెల్లడిచేశాను. . . . నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”​—యోహాను 17:6, 26.

ఆ మాటలకు అర్థం ఏంటి? యేసు తన పరిచర్యలో దేవుని పేరు ఉపయోగించడం ద్వారా దాన్ని తెలియజేశాడు. యేసు తరచూ లేఖనాలు చదివేవాడు, అప్పుడు ఆయన దేవుని పేరును పలికే ఉంటాడు. (లూకా 4:16-21) యేసు తన అనుచరులకు ఇలా ప్రార్థించమని చెప్పాడు: “తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”​—లూకా 11:2.

తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారు? అపొస్తలుడైన పేతురు యెరూషలేములోని పెద్దలతో మాట్లాడేటప్పుడు, దేవుడు అన్యజనుల్లో నుండి “తన పేరు కోసం” ప్రజల్ని ఎన్నుకున్నాడని చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 15:14) అపొస్తలులు అలాగే ఇతరులు, “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు” అని ప్రకటించారు. (అపొస్తలుల కార్యాలు 2:21; రోమీయులు 10:13) అంతేకాదు, వాళ్లు తాము రాసిన బైబిలు పుస్తకాల్లో దేవుని పేరు ఉపయోగించారు. దాదాపు సా.శ. 300 నాటికి పూర్తైన ద టోసెఫ్టా, అంటే యూదుల ఆజ్ఞల సంపుటి, వ్యతిరేకులు క్రైస్తవ పుస్తకాల్ని తగలబెట్టడం గురించి ఇలా చెప్తుంది: “సువార్తికుల పుస్తకాల్ని అలాగే మినిమ్‌ [క్రైస్తవులుగా మారిన యూదులు కావచ్చు] పుస్తకాల్ని మంటల్లో కాల్చకుండా వదిలేసేవాళ్లు కాదు. వాటిని ఉన్న చోటే కాలిపోనిచ్చేవాళ్లు, . . . వాటిలో ఉన్న దేవుని పేరుతో సహా వాటిని కాల్చేసేవాళ్లు.”

నేడు దాన్ని ఎవరు పాటిస్తున్నారు? అమెరికాకు చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ద చర్చెస్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ ఆమోదించిన రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ బైబిలు ముందుమాటలో ఇలా ఉంది: “వేరే దేవుళ్లు ఉండి, వాళ్ల నుండి ఒకేఒక్క దేవుణ్ణి ప్రత్యేకంగా చూపించాలి అన్నట్లు, ఆయనకొక పేరును ఉపయోగించడాన్ని క్రైస్తవ శకానికి ముందే యూదామతంలో ఆపేశారు; అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ చర్చీలు దాన్ని ఉపయోగించడం ఏ మాత్రం సరికాదు.” అలా అది దేవుని పేరు ఉండాల్సిన చోట “ప్రభువు” అనే బిరుదును పెట్టింది. ఈ మధ్యకాలంలో వాటికన్‌, దాని బిషప్‌లను ఇలా ఆదేశించింది: “టెట్రగ్రామటన్‌ అయిన YHWH * రూపంలో ఉన్న దేవుని పేరును పాటల్లో, ప్రార్థనల్లో ఉపయోగించకూడదు, పలకకూడదు.”

ఈ రోజుల్లో ఎవరు దేవుని పేరును ఉపయోగిస్తూ దాన్ని ఇతరులకు తెలియజేస్తున్నారు? సెర్గే కిర్గిజ్‌స్థాన్‌లో టీనేజర్‌గా ఉన్నప్పుడు, దేవుని పేరు యెహోవా అని ఒక సినిమాలో చూశాడు. ఆ తర్వాత దాదాపు పదేళ్ల వరకు మళ్లీ ఆ పేరు అతనికి వినిపించలేదు. సెర్గే అమెరికాకు తరలివెళ్లినప్పుడు, ఇద్దరు యెహోవాసాక్షులు అతన్ని కలిసి బైబిల్లో నుండి దేవుని పేరును చూపించారు. యెహోవా పేరును ఉపయోగించే గుంపును కలిసినందుకు సెర్గే చాలా ఆనందపడ్డాడు. ఆసక్తికరంగా, వెబ్‌స్టర్స్‌ థర్డ్‌ న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీలో “Jehovah God” అనే మాటకు ఈ నిర్వచనం ఉంటుంది: “గుర్తించబడిన అత్యంత గొప్ప దేవుడు, యెహోవాసాక్షులు ఆరాధించే ఒకేఒక్క దేవుడు.”

[అధస్సూచీలు]

^ ఇంగ్లీషులో దేవుని పేరును సాధారణంగా “Jehovah” అని రాస్తారు.