కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనం 1. భూకంపాలు

ప్రవచనం 1. భూకంపాలు

ప్రవచనం 1. భూకంపాలు

“తీవ్రమైన భూకంపాలు వస్తాయి.”—లూకా 21:11.

● హయిటీలో, విన్నీ అనే పదహారు నెలల పాపను శిథిలాల మధ్య నుండి కాపాడారు. న్యూస్‌ కోసం వచ్చిన రిపోర్టర్‌కు ఆ పాప ఏడ్పు వినిపించడం వల్ల ఆమెను రక్షించగలిగారు. కానీ ఆ పాప వాళ్ల అమ్మానాన్నలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని వాస్తవాలు: 2010 జనవరిలో 7.0 తీవ్రతతో హయిటీలో ఒక భూకంపం వచ్చినప్పుడు, మూడు లక్షల కన్నా ఎక్కువమంది ప్రజలు చనిపోయారు. అంతేకాదు, 13 లక్షలమంది ఉన్నదంతా క్షణాల్లో కోల్పోయారు. అలాంటి తీవ్రమైన భూకంపం వచ్చింది కేవలం హయిటీలోనే కాదు. ఏప్రిల్‌ 2009 నుండి ఏప్రిల్‌ 2010 మధ్యకాలంలో, ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల దాదాపు 18 తీవ్రమైన భూకంపాలు వచ్చాయి.

కొంతమంది ఏమంటారు? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భూకంపాలు రావట్లేదు. పైగా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల అవి రాకముందే వాటిని పసిగట్టేస్తున్నాం.

అది నిజమేనా? గమనించాల్సిన వాస్తవం ఏంటంటే, చివరి రోజుల్లో ఎక్కువ భూకంపాలు వస్తాయని లేదా తక్కువ భూకంపాలు వస్తాయని బైబిలు చెప్పట్లేదు. బదులుగా, “ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో” “తీవ్రమైన భూకంపాలు” వస్తాయని మాత్రమే బైబిలు చెప్తుంది. మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం అనడానికి ఇంతకన్నా స్పష్టమైన రుజువు ఇంకేం ఉంటుంది!—మార్కు 13:8; లూకా 21:11.

మీరేమంటారు? బైబిలు ముందే చెప్పినట్టు తీవ్రమైన భూకంపాలు వస్తున్నాయా?

అయితే, మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం అనడానికి భూకంపాలు మాత్రమే రుజువు కాదు. బైబిలు ముందే చెప్పినట్టు జరుగుతున్న మరో విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

“భౌగోళిక శాస్త్రజ్ఞులమైన (geophysicists) మేము, వాటిని తీవ్రమైన భూకంపాలు అని పిలుస్తాం. సాధారణ ప్రజలు వాటిని భయంకరమైనవి అంటారు.”​——కెన్‌ హడ్‌నట్‌ యు. ఎస్‌. జియోలాజికల్‌ సర్వే.

[4వ పేజీలోని క్రెడిట్‌ లైను]

© William Daniels/​Panos Pictures