కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనం 4. ప్రేమ కరువైపోవడం

ప్రవచనం 4. ప్రేమ కరువైపోవడం

ప్రవచనం 4. ప్రేమ కరువైపోవడం

‘మమకారం లేనివాళ్లు ఉంటారు.’—2 తిమోతి 3:1-3

● నార్త్‌ వేల్స్‌లో, క్రిస్‌ అనే స్త్రీ గృహహింస బాధితులకు సహాయం చేసే గుంపుతో పనిచేస్తుంది. క్రిస్‌ ఇలా అంది, “నాకు తెలిసిన ఒకామె ఒంటినిండా దెబ్బలతో నా దగ్గరికి వచ్చింది. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేను ఆమెను కనీసం గుర్తుపట్టలేకపోయాను. ఇంకొంతమంది ఆడవాళ్లు మానసికంగా ఎంత కృంగిపోతారంటే కళ్లెత్తి అవతలి వ్యక్తిని చూసే ధైర్యం కూడా చేయరు.”

కొన్ని వాస్తవాలు: ఆఫ్రికాలోని ఒక దేశంలో, ప్రతీ ముగ్గురు ఆడవాళ్లలో కనీసం ఒకరు చిన్నతనంలో లైంగిక దాడికి గురైయ్యారు. అదే దేశంలో చేసిన ఒక సర్వే ప్రకారం, 33 శాతం కన్నా ఎక్కువమంది మగవాళ్లు తమ భార్యలను కొట్టడం మామూలు విషయమేనని చెప్పారు. అయితే కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్లు కూడా గృహహింసకు గురౌతున్నారు. ఉదాహరణకు కెనడాలో, ప్రతీ పదిమంది మగవాళ్లలో కనీసం ముగ్గురు తమ భార్యల చేతుల్లో వేధింపులకు గురౌతున్నారు.

కొంతమంది ఏమంటారు? గృహహింస కొత్తదేమీ కాదు, అది గతంలోనూ ఉంది. కాకపోతే మనకాలంలో ప్రజలు దాని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు.

అది నిజమేనా? ఈమధ్య ప్రజలు గృహహింస గురించి బహిరంగంగా మాట్లాడుతున్న మాట నిజమే. కానీ ప్రజల్లో అవగాహన పెరిగినంత మాత్రాన గృహహింస కేసులు ఏమైనా తగ్గాయా? లేదు. పైగా రోజురోజుకీ కుటుంబాల్లో ప్రేమ కరువైపోతోంది.

మీరేమంటారు? 2 తిమోతి 3:1-3⁠లో ఉన్న మాటలు నెరవేరుతున్నాయా? కుటుంబ సభ్యుల మధ్య సహజంగా ఉండాల్సిన మమకారం ఈరోజుల్లో కరువైపోతోందా?

బైబిలు ముందే చెప్పిన మరో విషయం మన భూమికి సంబంధించినది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

[7వ పేజీలోని బ్లర్బ్‌]

“గృహహింసకు గురైన బాధితులు ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పరు. వాళ్లు చెప్పే సరికి తమ భర్తల చేతుల్లో సగటున 35 సార్లు వేధింపులకు గురైవుంటారు.”—వేల్స్‌ గృహహింస హెల్ప్‌లైన్‌ ప్రతినిధి.