కంటెంట్‌కు వెళ్లు

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి

కుటుంబాలు నిజంగా సంతోషంగా ఉండగలవా?

అదెలా సాధ్యం?

ఈ కరపత్రంలో ఉన్నట్లే కలిసికట్టుగా, సంతోషంగా ఉన్న కుటుంబాలేవైనా మీకు తెలుసా? ప్రతిచోట కుటుంబాలు విచ్ఛిన్నమౌతున్నాయి. విడాకులు, ఉద్యోగం నిలుస్తుందన్న ధీమాలేకపోవడం, ఒంటరి తలిదండ్రుల సందిగ్దావస్థ, నిరాశానిస్పృహ ఇవన్నీ సంకటానికి దోహదపడతాయి. “ఇప్పటికల్లా, కుటుంబ నాశనానికి సూచన అందరికీ తెలిసిపోయుంటుందని” ఒక కుటుంబ జీవిత నిపుణుడు విలపించాడు.

ఈనాడు కుటుంబాలెందుకు ఇలాంటి సమస్యలతో సతమతమౌతున్నాయి? కుటుంబ జీవితాన్ని మనం ఎలా ఆనందించవచ్చు?

కుటుంబం ఎలా ఉద్భవించింది

ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే వివాహం, కుటుంబ ప్రారంభాన్ని గూర్చి మనం తెలుసుకోవలసిన అవసరముంది. ఒకవేళ దీనికొక కర్త—సృష్టికర్తవుంటే—కుటుంబ సభ్యులు నడిపింపుకొరకు ఆయనవైపు చూడాలి, ఎందుకంటే కుటుంబ జీవితాన్ని మనం పూర్తిగా ఎలా ఆనందించగలమనే విషయం నిశ్చయంగా ఆయనకే బాగా తెలుసు.

కుటుంబ ఏర్పాటుకు కారకుడేలేడని అనేకులు నమ్ముతారు. “మానవునికన్నా తక్కువైన జంతువులు కూడే పద్ధతిని ఆధారం చేసుకొని మానవుని వివాహ ప్రారంభాన్ని తెలుసుకోవాలని కొందరు విధ్వాంసులు ప్రయత్నిస్తున్నారు,” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా అంటోంది. అయినా స్త్రీ పురుషుల సృష్టిని గూర్చి యేసు మాట్లాడాడు. దీనికి అధికారమూలంగా యేసు తొలి బైబిలు రికార్డును ఎత్తిచూపుతూ, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.”—మత్తయి 19:4-6.

కాబట్టి యేసుక్రీస్తు నిజమే పలికాడు. జ్ఞానంగల దేవుడు మొదటి మానవులను సృష్టించి సంతోషభరిత కుటుంబ జీవితాన్ని ఏర్పర్చాడు. దేవుడు మొదటి జతను వివాహం ద్వారా జతపర్చి, “తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని పురుషునితో అన్నాడు. (ఆదికాండము 2:22-24) దేవుని వాక్యమైన బైబిలులో సృష్టికర్త నియమించిన ప్రమాణాలను అతిక్రమిస్తున్న, జీవిత విధానాల అనుసరణలే ఈనాటి కుటుంబ సమస్యలకు కారణములౌతున్నాయా?

విజయ పథమేది?

నిశ్చయంగా మీకు తెలిసినట్లుగానే, ఆధునిక లోకం స్వార్థం, స్వాభిలాష వృద్ధిచేస్తోంది. “దురాశమంచిదే” అని ఒక ఆర్ధిక సహాయదారుడు, అమెరికాలోని ఒక పోస్టుగ్రాడ్యుయేట్‌ తరగతిలో అన్నాడు. “నీవు దురాశాపరుడివైనా మంచివాడవని భావించుకోవచ్చు.” కానీ వస్తుసంబంధిత ఆస్తులు సంపాదించాలనుకోవడం విజయానికి నడిపించదు. వాస్తవానికి ధనాశ, కుటుంబ జీవితాన్ని నాశనంచేసే వాటిలోగొప్ప వినాశకారిణి, ఎందుకంటే అది మానవుల పరస్పర సంబంధాలమధ్య జొరబడి ప్రజల సమయాన్ని, ధనాన్ని కాజేస్తోంది. దీనికి బదులు, మన ఆనందానికి కీలకమైనదేదో తెలుసుకోవటానికి ఎలా రెండేరెండు బైబిలు సామెతలు సహాయపడగలవో గమనించండి.

“ద్వేషించే వారితో శ్రేష్ఠమైన మాంసము తినటంకన్నా, నిన్ను ప్రేమించేవారితో కాయగూరలు తినడం మేలు.”

“సమస్యలతో నిండివున్న ఇంట్లో విందుభోజనం ఆరగించేకన్నా, మనశ్శాంతితో ఎండిన రొట్టె ముక్కలుతినడం మేలు.”

సామెతలు 15:17; 17:1. “టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.”

ఎంత శక్తివంతమైన మాటలో కదా? ప్రతి కుటుంబమూ ఈ ముఖ్య సూత్రాలకు కట్టుబడివుంటే, ఈ లోకం ఎంత భిన్నంగా ఉండేదో ఆలోచించండి! కుటుంబసభ్యులు ఒకరినొకరు ఎలా ఆదరించాలన్న విషయానికి కూడా దేవుని వాక్యం విలువైన నడిపింపునిస్తోంది. అది ఇచ్చే కొన్ని సూచనలను పరిశీలించండి.

భర్తలు: ‘మీ సొంతశరీరమువలె మీ భార్యలను ప్రేమింప బద్ధులైన్నారు.’—ఎఫెసీయులు 5:28-30.

ఇది సులభమే అయినా చాలా అభ్యాససిద్ధమైందే! ‘భార్యను సన్మానించుడి’ అని కూడా బైబిలు భర్తలకు సూచిస్తోంది. (1 పేతురు 3:7) అతడు ఆమెను అర్థంచేసుకుని, మృదుత్వం చూపుతూ, సర్దుకొనిపోతూ ఆమెయెడల ప్రత్యేక అవధానాన్నివ్వడం ద్వారా దేనిని చేస్తాడు. ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చి, ఆమె చెప్పేది వింటాడు. (ఆదికాండము 21:12 పోల్చండి.) తనతో ఎలా వ్యవహరించాలని అతను కోరుతున్నాడో అదేవిధంగా భర్త తన భార్యయెడల శ్రద్ధకల్గి వ్యవహరించడంవల్ల ఏ కుటుంబానికైనా ప్రయోజనాలుంటాయని మీరు ఒప్పుకోరా?—మత్తయి 7:12.

భార్యలు: “భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.”—ఎఫెసీయులు 5:33.

పెద్దపెద్ద బాధ్యతలు నిర్వహించడంలో తన భర్తకు సహాయకారిణిగా ఉండటంవల్ల కుటుంబ సంతోషానికి ఆమె దోహదపడుతుంది. దేవుడు భార్యను “సాటియైన సహాయమును వానికొరకు” అనుగ్రహించినందుకు ఆమెనుండి ఆయన అదే కోరుతున్నాడు. (ఆదికాండము 2:18) భార్య తన భర్త నిర్ణయాలకు మద్దతునిచ్చి, కుటుంబం ఏర్పర్చుకున్న గమ్యాలను చేరడంలో సహకరించడం మూలంగా ఆమె తన భర్తను గౌరవించినప్పుడు కుటుంబ జీవితంలో వచ్చే ఆశీర్వాదాలను మీరు గుణగ్రహిస్తారా?

వివాహ దంపతులు: “భార్యా భర్తలు ఒకరియెడల ఒకరు విశ్వాసపాత్రులుగా ఉండాలి.”—హెబ్రీయులు 13:4. టిఇవి.

వారలా ఉంటే, కుటుంబ జీవితం తప్పకుండా ప్రయోజనం పొందుతుంది. జారత్వం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. (సామెతలు 6:27-29, 32) అందుకనే బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా ఉద్బోధిస్తోంది: “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. . . . పరస్త్రీనెందుకు మోహించెదవు?”—సామెతలు 5:18-20, టిఇవి.

తలిదండ్రులు: “[మీ పిల్లలు] నడువవలసిన త్రోవను వారికి నేర్పుము.”సామెతలు 22:6.

తలిదండ్రులు తమ పిల్లలయెడల అవధానమిస్తే, కుటుంబ జీవితం తప్పకుండా మెరుగుపడుతుంది. కాబట్టి, “యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు,’ సరైన బైబిలు సూత్రాలను పిల్లలకు నేర్పించమని బైబిలు ప్రబోధిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 11:19) తలిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం మూలంగా తాము వారిని ప్రేమిస్తున్నామని కనపర్చాలి.—ఎఫెసీయులు 6:4.

పిల్లలు: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.”—ఎఫెసీయులు 6:1.

నిజమే, ఈ అవినీతికర లోకంలో అన్నిసార్లు మీ తలిదండ్రులకు విధేయులవడం అంత సులభం కాదు. అయినా, కుటుంబ వ్యవస్థాపకుడు మనకు చెప్పింది చేయడం జ్ఞానయుక్తమని నీవనుకోవా? మన కుటుంబ జీవితాన్ని మరింత ఆనందభరితంగా చేసుకోగలిగే శ్రేష్ఠమైన విషయాలు ఆయనకు తెలుసు. అందుకని, మీ తలిదండ్రులకు విధేయత చూపించడానికి గట్టి ప్రయత్నంచేయండి. చెడు చేయడానికి పూనుకునే ఈ లోక శోధనలనుండి దూరంగా పోవడానికి తీర్మానించుకోండి.—సామెతలు 1:10-19.

కుటుంబంలోని ప్రతి సభ్యులూ బైబిలు సలహాను అన్వయించేదాన్ని బట్టి కుటుంబ జీవితం ప్రయోజనం పొందుతుంది. ఇప్పుడు కుటుంబం ఒక మంచి జీవితాన్ని అనుభవించడమేకాకుండా, మునుముందు దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో కూడ అద్భుతమైన మంచి జీవితాన్ని అనుభవిస్తుంది. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) కాబట్టి కుటుంబమంతా కలిసి బైబిలును పఠించడం అలవాటు చేసుకోండి. మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు అనే చక్కని ఉపమానాలతో మంచి నడిపింపునందించే పుస్తకం ద్వారా లోకమంతటా లక్షలాదిమంది ప్రజలు ప్రయోజనం పొందారు.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

Picture Credit: Cubs: Courtesy Hartebeespoortdam Snake and Animal Park.