కంటెంట్‌కు వెళ్లు

ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతోందా?

ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతోందా?

ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతోందా?

పై రెండు ప్రశ్నలకూ మీరేమని జవాబిస్తారు? బహుశా మీరా విషయాన్ని గురించి ఎన్నడూ ఆలోచించి ఉండకపోవచ్చనుకోండి. లేదా, ‘మనం చేసే వాటికి ఖుదా (దేవుడు) మనల్నే బాధ్యులనుగా ఎంచుతాడనీ, మన తక్దీర్‌ (తలరాత) లేక కిస్మత్‌ ఎలావుంటే అలాగే జరుగుతుందనీ’ చెబుతూ, పైన ప్రస్తావించబడిన ప్రశ్నలలో ఒకదానితో మరోదానికి పొత్తేమైనా ఉందా అని మీరు బహుశా ఆలోచిస్తుండవచ్చు.

అదే గనుక మీ అభిప్రాయమైతే, ఒక్క క్షణమాగి ఆలోచించండి!

మనల్ని లెక్క అడుగుతున్నదెవరు? ఖుదా. మరైతే, మన తక్దీర్‌ను నిర్ణయిస్తున్నదెవరు? “ఖుదాయే”నని అనేకమంది జవాబిస్తారు. అయితే అది సహేతుకమైనదేనా? మీరొక వ్యక్తిని ఫలానా పనిని చేయమని బలవంతంచేసి, మీరు చెప్పిన ఆ పనిని చేసినందుకు అటు తర్వాత ఆ వ్యక్తిని తప్పుపడతారా? తన కొడుకును బయటకు వెళ్లకుండా ఆపాలని, అతడ్ని ఇంట్లోపెట్టి నిర్బంధించి ఉదయం తలుపుకు తాళం వేసుకొని వెళ్లిపోయే ఒక తండ్రి విషయమే తీసుకోండి. అతడు ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి, కొడుకు రోజంతా గదిలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ తండ్రి, బయటకు ఎందుకు వెళ్లలేదని తన కొడుకును అడిగి, బహుశా సోమరిగా ఉన్నందుకు శిక్షిస్తే అప్పుడేమిటి? అది న్యాయసమ్మతంగా ఉంటుందంటారా? అలాంటి తండ్రి గురించి మీరేమనుకుంటారు?

‘అలా ఎన్నటికీ జరుగదు’ అని మీరంటారు. అయినప్పటికీ, కొంతమంది చెబుతున్నదాని ప్రకారంగానైతే, ఖుదా చేస్తున్నదదే. మంచి చెడులు రెండూ ఖుదానుంచే వస్తే, మరి ఆయన మన నుదిటిపై సమస్తాన్ని రాస్తే, చెడును చేస్తున్నందుకు ఆయన మనల్ని ఎందుకు బాధ్యులనుగా ఎంచుతాడు? మనం చేసేదేదైనా సరే, దాన్ని ఖుదా ముందుగానే నిర్ణయిస్తే, మన చర్యల్నిబట్టి మనమెందుకు లెక్కనప్పగించాల్సినవారంగా పరిగణించబడతాం? మనకు ఎంపికచేసుకొనే అవకాశంలేనిదాని విషయమై ఖుదాకు మనమెందుకు జవాబుదారులమౌతాం?

చర్చ ఈ స్థాయికొచ్చేటప్పటికి, ‘ఇది ఎంతో గంభీరమైన అంశం. ఖుదా మార్గాల్ని అర్థం చేసుకోవడానికి మనమేపాటి వారం? దాన్ని గురించి మత గురువులనే వాదించుకోనివ్వండి’ అని బహుశా మీరు అనుకొంటూ ఉండవచ్చు.

మీరు ప్రభావితులవుతారు

అయితే, ఆలోచించండి. ఈ ప్రశ్నలు మనల్నందర్నీ ప్రభావితం చేస్తాయి. ఈ లోకంలో, జీవించడానికి మనకున్నది ఒకే ఒక జీవితం, అదీ అతి త్వరగా గతించిపోతుంది. మనం మన జీవితాన్ని జీవించే విధానం, పైన ప్రస్తావించబడిన ప్రశ్నలకు మనమిచ్చే జవాబులనుబట్టి ఎంతగానో ప్రభావితమవుతుంది. ఖుదాయే గనుక మన తక్దీర్‌ను నిర్ణయించినట్లైతే, మనల్ని మనం మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించడం గురించి మనమెందుకు ఆలోచించాలి? ఖుదాను (దేవుని) గురించి తెలుసుకోవాలని కూడా ఎందుకు ఆలోచించాలి? “తప్పు,” “ఒప్పు,” “పాపం,” “పుణ్యం” వంటి పదాలు అర్థరహితమైనవే. మనం తప్పుగా పరిగణించే దేన్నైనా ఒకదాన్ని చేయడమనేది మన తక్దీర్‌ అయితే, దాన్ని మనం ఎలాగైనా చేస్తాం ఎందుకంటే ముందే నిర్ణయించబడినదాన్ని మనం మార్చలేం.

ఒకవేళ అదే నిజమైతే, ఖుదా తన ఆజ్ఞల్ని మనకు ఎందుకు బోధించాడు? ఆయన నబీలను (ప్రవక్తలను) ఎందుకు పంపించాడు? పవిత్ర లేఖనాలు (పాక్‌ కలామ్‌) ఎందుకు రాయబడ్డాయ్‌? తక్దీరే గనుక మన జీవితాల్ని ఏలుతుంటే, ఇవన్నీ అర్థరహితం కాదంటారా? అసంగతంగా ఉండే తర్కాన్ని మానవ మేధ కచ్చితంగా ఒప్పుకోదు. సహేతుకమైన మానవ మేధ దాన్ని అంగీకరించలేదు.

మరోవైపున, మనకే గనుక స్వేచ్ఛాచిత్తం ఉండి, మనం చేసేదాన్నిబట్టి ఖుదా మనల్ని లెక్క అప్పజెప్పమంటే, అప్పుడు మనం ఖుదాను (దేవుని) గూర్చిన, ఆయన సంకల్పాల్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించేందుకూ, ఆయన కోరే రీతిలో మన జీవితాల్ని మనం జీవించడాన్ని నేర్చుకొనేందుకూ మన పరిమిత జీవితాన్ని ఉపయోగించాలి. అది, సజీవుడైన ప్రతీ మానవుని వ్యక్తిగత బాధ్యత అవుతుంది. మన తరపున మరెవ్వరూ ఖుదా (దేవుని) సేవ చెయ్యలేరు. ఇది, “దేని తొడమాంసం దాని కాలుకే వ్రేలాడుతుంది” అనే టర్కిష్‌ సామెతను జ్ఞాపకానికి తెస్తుంది. అంటే, ప్రతీ ఒక్కడూ తన దుష్క్రియలకు తానే జవాబు ఇచ్చుకోవాలి.

ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతుందా? అన్న ప్రశ్నలకు సరియైన జవాబుల్ని మనం తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యమో మీరు గ్రహించారా?

జవాబుల్ని మనమెక్కడ కనుగొనగలం

ఆ ప్రశ్నలకు జవాబుల్ని మనమెక్కడ కనుగొనగలం? ఇస్లామిక్‌ మతంలో తోరా, జబూర్‌, ఇంజీల్‌ అని పిలువబడిన, పాక్‌ కలామ్‌గా (పవిత్ర లేఖనాలుగా) అంగీకరించబడిన బైబిల్లోనే (కితాబే ముకద్దస్‌లోనే). * బైబిల్లో, మనమిలా చదువుతాం: “దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము.” (యెహెజ్కేలు 18:21, 23) దుష్టుడైన ఒక వ్యక్తి తన మార్గాల్ని మార్చుకోవడం సాధ్యమేనన్న విషయం సుస్పష్టం. దుష్టుడు ఇక ఎల్లప్పుడూ దుష్టునిగానే ఉండిపోవాలని నిర్ణయించబడలేదు.

బైబిల్లోని మరొక ప్రకరణం నుంచి అదే విధమైన ముగింపుకు రావచ్చు: “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, . . . నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారికి హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గునిగూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవునుగాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.”—యెహెజ్కేలు 3:17, 18.

అవును, తక్దీర్‌ మానవుని జీవితాన్ని ఏలడంలేదని పవిత్ర లేఖనాలు (పాక్‌ కలామ్‌) స్పష్టంగా చెబుతున్నాయి. మానవుడు ఎంపికచేసుకోగలడు. అతడు మంచినైనా, చెడునైనా చేయగలడు. అజ్ఞానాన్నిబట్టి అతడు చెడునుచేస్తే, అతడు సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, మంచిని చేసేలా మారి, ఆ విధంగా జీవాన్ని సంపాదించుకోగలడు. సరళంగా చెప్పాలంటే, మన చర్యలకు మనమే బాధ్యులం.

మీరెలా ఎంపికచేసుకోగలరు?

మన సృష్టికర్త దుష్టత్వం ఎంతమాత్రమూలేని ప్రేమగల ఖుదా (దేవుడు) అని బైబిలు చెబుతోంది. ఆ ప్రేమగల ఖుదా (దేవుడు) ఇలా చెబుతున్నాడు: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.” (ద్వితీయోపదేశకాండము 30:19) ఖుదా (దేవుడు) మానవుడ్ని స్వేచ్ఛాచిత్తంతో సృష్టించాడు. ఖుదా (దేవుని) సంకల్పాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదని మానవులు ఎంపికచేసుకున్నప్పుడు, మరణానికి లోనయ్యారు. అయినా, మీరు జీవాన్ని ఎంపికచేసుకోవచ్చు. కానీ మీరే స్వయంగా ఎంపికచేసుకోవాలి. మీకోసం ఎవ్వరూ ఆ ఎంపికను చేయలేరు.

జీవాన్ని మీరెలా ఎంపికచేసుకోగలరు? మొదటిగా, బైబిలు ఖుదా (దేవుని) ప్రేరేపిత వాక్యమని మీకై మీరు నిశ్చయపర్చుకోవాలి. అందుకోసం, ఆ గ్రంథాన్ని ఆసక్తితోనూ, నిష్పక్షపాతంగానూ అధ్యయనం చేయడం అవసరం. ఆపై, ఖుదా (దేవుడు) మానవుడ్ని ఎందుకు సృష్టించాడు, మనమెందుకు మరణిస్తున్నాం, మరణానంతరం ఏమౌతుంది, ఖుదాను (దేవుడ్ని) మీరెలా ప్రీతిపర్చగలరు వంటి వాటిని మీరు బైబిల్నుండి నేర్చుకోవాలి.

‘అదెంతో కష్టమైన పని; నేను దాన్ని చేయలేను’ అని అనకండి. ఖుదా (దేవుడు) జీవాన్ని వాగ్దానంచేసి, దాన్ని కనుగొనడాన్ని కొంతమంది వ్యక్తులకు అసాధ్యమైందిగా చేస్తాడంటారా? మనకు కావాల్సిన సమాచారం గనుక బైబిల్లోనే ఉంటే, ఆ గ్రంథాన్ని గూర్చిన మన పరిశోధనలో ఖుదా (దేవుడు) మనకు సహాయం చేయడంటారా? యథార్థంగా ప్రయత్నించండి. మీరు చేయగల్గే వాటిలో ఇది అత్యంత యోగ్యమైన పని.

ఆవశ్యక కాలాలు

ఆలస్యం చేయకండి. కాలం సమీపిస్తోంది. ఈ విధానపు అంత్యదినాల్ని గుర్తించే సంయుక్త “సూచన”ను మనం బైబిల్లో చూస్తాం. (మత్తయి 24:3) ఆ సూచనలోని కొన్ని భాగాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” “అక్కడక్కడ కరవులు . . . కలుగును.” (మత్తయి 24:7, 8) “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును.” “[అక్కడక్కడ] తెగుళ్లు . . . తటస్థించును.” (లూకా 21:11) ‘అక్రమము విస్తరించును.’—మత్తయి 24:12.

బైబిలు ప్రకారంగా, అంత్యదినాల్ని గూర్చిన సూచనలోని ఆ భాగాలూ, మరితర భాగాలూ ఒకే తరంలో కలిసి జరుగుతాయి, మరి అంతానికి ముందుగా ఆ సదరు తరం గతించిపోదు. “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింప[దు].” (మత్తయి 24:34) మనదే ఆ తుది తరమని రుజువులన్నీ చూపిస్తున్నాయి.

ఈ కారణాన్నిబట్టి, ఆలస్యంచేయకుండా బైబిల్ని పరిశీలించమని మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాక్‌ కలామ్‌ (పవిత్ర లేఖనాలు) మనకిలా చెబుతున్నాయి: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు (ఖుదాయందు) భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు (ఖుదా) విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.”—ప్రసంగి 12:13, 14.

ఈ క్లిష్టమైన అంత్యదినాల్లో జీవం కోసం మీరు తెలివైన ఎంపికను ఎలా చేసుకోవాలనే విషయాన్ని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకొంటే, దయచేసి ఈ దిగువనున్న చిరునామాల్లో ఒకదానికి రాయండి, మరి మీకు సహాయం చేయటమనేది ఎంతో సంతోషకరమైన విషయం.

[అధస్సూచీలు]

^ పేరా 13 ఖురాన్‌లో, మనమీవిధంగా చదువుతాం: “ఆ ప్రవక్తల (నబీల) తరువాత వారి జాడలననుసరించుచు, తనకు పూర్వముండిన తౌరాతు (తోరా) గ్రంథమును సత్యపఱచునట్టి మర్యమ్‌ కుమారుడగు ఈసాను [యేసును] పంపితిమి. ఆతనికి ఇన్జీలు గ్రంథమొసంగితిమి. అందు సన్మార్గమును జ్యోతియు గలదు. అది తనకు పూర్వమున్న గ్రంథమగు తౌరాతును (తోరాను) సత్యపఱుచునది. సన్మార్గము చూపునది. భయభక్తులు గలవారికి బోధ చేయునది. ఇన్జీలు గ్రంథము గలవారు అందు దేవుడు (ఖుదా) పంపిన యాజ్ఞ ప్రకారము ఆజ్ఞ చేయవలెను. ఎవరు దేవుడు (ఖుదా) పంపిన దాని ప్రకారం ఆజ్ఞాపింపరో వారే అవిధేయులు.” (సురయే మాఇదా [5వ సురా, పేజీలు 298, 299], వచనాలు 46, 47, మౌల్వీ అబ్దుల్‌ గఫూర్‌ మున్షీ ఫాజిల్‌ అనువదించినది) బైబిల్లోని భాగాలైన తోరా, జబూర్‌ (కీర్తనలు), ఇంజీలు (సువార్తలు) కలుషితం చేయబడ్డాయని కొంతమంది చెబుతారు, అయితే అలా చెప్పడమంటే ఖుదా (దేవుడు) తానిచ్చిన ఆ గ్రంథాల్ని కాపాడలేక పోయాడని అర్థం. ఆ విధంగా చెప్పేవాళ్లు ఖుదాను (దేవుడ్ని) బలహీనుడని దూషిస్తున్నారు.

ఇందులోని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తివ్రాయబడ్డాయి.

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫొటో క్రెడిట్‌: కవర్‌పై కారు లోపలి భాగం: హెచ్‌. ఆర్మ్‌స్ట్రాంగ్‌ రాబర్ట్స్‌.