8వ అధ్యాయం
దేవుడు అందరికన్నా గొప్పవాడు
మనందరికన్నా గొప్పవాడు, శక్తిమంతుడు అయిన వ్యక్తి ఒకరు ఉన్నారని మీకు తెలుసు. ఆయన ఎవరు?— యెహోవా దేవుడు. మరి ఆయన కుమారుడు, మన గొప్ప బోధకుడు అయిన యేసు విషయం ఏమిటి? ఆయన మనకన్నా గొప్పవాడా?— అవును గొప్పవాడే.
యేసు పరలోకంలో దేవునితో పాటు ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక ఆత్మప్రాణి, అంటే దేవదూత. దేవుడు వేరే దేవదూతల్ని కూడా చేశాడా?— అవును, కోటానుకోట్ల దేవదూతల్ని చేశాడు. ఈ దేవదూతలు కూడా మనకన్నా ఎంతో గొప్పవాళ్లు, శక్తిమంతులు.—కీర్తన 104:4; దానియేలు 7:10.
మరియతో మాట్లాడిన దేవదూత పేరు మీకు గుర్తుందా?— ఆయన పేరు గబ్రియేలు. ఆయన మరియతో, ఆమెకు పుట్టే బిడ్డ దేవుని కుమారుడని చెప్పాడు. దేవుడు పరలోకంలో ఉన్న తన ఆత్మ కుమారుని జీవాన్ని మరియ గర్భంలో పెట్టాడు. అలా యేసు భూమ్మీద ఒక శిశువుగా పుట్టాడు.—లూకా 1:26, 27.
ఆ అద్భుతం జరిగిందని మీరు నమ్ముతున్నారా? యేసు భూమ్మీదకు రాకముందు పరలోకంలో దేవునితోపాటు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా?— తాను పరలోకంలో ఉన్నానని యేసు చెప్పాడు. ఆ విషయం ఆయనకెలా తెలుసు? గబ్రియేలు చెప్పిన విషయాలు మరియ యేసుకు చిన్నప్పుడే చెప్పివుంటుంది. అంతేకాదు, యేసుకు నిజమైన తండ్రి దేవుడే అని యోసేపు కూడా ఆయనకు చెప్పివుంటాడు.
యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు పరలోకం నుండి మాట్లాడుతూ, ‘ఈయన నా కుమారుడు’ అని చెప్పాడు. (మత్తయి 3:17) యేసు తాను చనిపోయే ముందు రాత్రి ‘తండ్రీ, లోకము పుట్టకముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేదో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపర్చు’ అని ప్రార్థించాడు. (యోహాను 17:5) మళ్లీ పరలోకంలో దేవునితోపాటు ఉండడానికి తనను తీసుకువెళ్లమని యేసు అడిగాడు. ఆయన మళ్లీ పరలోకంలో ఎలా ఉండగలడు?— యెహోవా దేవుడు ఆయనను మళ్లీ ఆత్మ ప్రాణిగా, అంటే దేవదూతగా చేస్తేనే అది సాధ్యమౌతుంది.
ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతాను. దేవదూతలు అందరూ మంచివాళ్లేనా? మీకు ఏమనిపిస్తోంది?— ఒకప్పుడు వాళ్లందరూ మంచిగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్లను యెహోవా సృష్టించాడు, ఆయన ఏంచేసినా మంచిగానే చేస్తాడు. అయినా, వాళ్లలో ఒక దేవదూత చెడ్డవాడయ్యాడు. అది ఎలా జరిగింది?
అది తెలుసుకోవాలంటే, దేవుడు మొదటి స్త్రీ పురుషులైన ఆదాముహవ్వలను చేసినప్పుడు ఏమి జరిగిందో చూద్దాం. అదంతా కట్టుకథని కొందరు అంటారు. కానీ అది నిజంగా జరిగిందని మన గొప్ప బోధకునికి తెలుసు.
దేవుడు ఆదాముహవ్వలను చేసి, వాళ్లను ఏదెను అనే అందమైన తోటలో ఉంచాడు. అది ఒక పరదైసులా, అంటే ఒక పార్కులా ఉండేది. వాళ్లు ఎంతోమంది పిల్లలతో సంతోషంగా, ఎప్పుడూ అక్కడే జీవించివుండేవాళ్లు. కానీ వాళ్లు ఒక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. మనం దాని గురించి ఇప్పటికే చదివాము. అది మీకు గుర్తుందో లేదో చూద్దాం.
యెహోవా ఆదాముహవ్వలకు ఏమి చెప్పాడంటే, వాళ్లు ఆ తోటలో తమకు ఆదికాండము 2:17; 3:3) కాబట్టి, ఆదాముహవ్వలు ఏ పాఠం నేర్చుకోవాలి?—
ఇష్టమైన ఏ చెట్టు పండ్లనైనా తినవచ్చు. కానీ ఒక్క చెట్టు పండ్లు మాత్రం తినకూడదు. తింటే ఏమవుతుందో దేవుడు వాళ్లకు చెప్పాడు. ‘మీరు నిశ్చయంగా చచ్చిపోతారు’ అని ఆయన చెప్పాడు. (చెప్పిన మాట వినాలని నేర్చుకోవాలి. అవును, యెహోవా దేవుడు చెప్పింది వింటేనే జీవంతో ఉండగల్గుతాం! ఆదాముహవ్వలు దేవుడు చెప్పిన మాట వింటామని చెప్తే సరిపోదు. దాన్ని వాళ్లు తమ పనుల్లో చూపించాలి. వాళ్లు దేవుని మాట వినివుంటే, ఆయన మీద ప్రేమ ఉందనీ, ఆయనను తమ రాజుగా కోరుకుంటున్నామనీ చూపించి ఉండేవాళ్లు. అప్పుడు వాళ్లు పరదైసులో ఎప్పటికీ జీవించి ఉండేవాళ్లు. కానీ, వాళ్లు ఆ ఒక్క చెట్టు పండ్లు తింటే, ఏమని చూపిస్తారు?—
దేవుడు తమకోసం చేసిన వాటిపట్ల తమకు నిజమైన కృతజ్ఞత లేదని చూపిస్తారు. మీరే అక్కడుంటే యెహోవా చెప్పింది చేసివుండేవాళ్లా?— మొదట్లో ఆదాము, హవ్వ దేవుని మాట విన్నారు. కానీ ఆ తర్వాత, వాళ్లకంటే శక్తిమంతుడైన ఒక వ్యక్తి హవ్వను మోసం చేశాడు. ఆమె యెహోవా మాట వినకుండా చేశాడు. అతనెవరు?—
ఒక సర్పం లేదా పాము హవ్వతో మాట్లాడిందని బైబిలు చెప్తోంది. కానీ పాములు మాట్లాడలేవని మీకు తెలుసు కదా!
మరి అదెలా మాట్లాడగల్గింది?— ఒక దేవదూత అది మాట్లాడుతున్నట్లు అనిపించేలా చేశాడు. నిజానికి పాము వెనుక నుండి ఆ దేవదూతే మాట్లాడాడు. ఆ దేవదూత చెడ్డ విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను, ఆదాముహవ్వలు తనను ఆరాధించాలని కోరుకున్నాడు, వాళ్లు తను చెప్పింది చేయాలనుకున్నాడు, దేవుని స్థానం తను పొందాలనుకున్నాడు.అందుకే ఆ చెడ్డ దేవదూత హవ్వ మనసులో చెడు ఆలోచనలు నాటాడు. అతను పాము వెనుక నుండి హవ్వతో మాట్లాడుతూ, ‘దేవుడు మీకు నిజం చెప్పలేదు. ఆ చెట్టు పండ్లు తింటే మీరేం చనిపోరు. మీరు దేవునిలా జ్ఞానవంతులు అవుతారు’ అని చెప్పాడు. మీరైతే ఆ మాటలు నమ్మేవాళ్లా?—
దేవుడు తనకు ఇవ్వనిదానిని హవ్వ కోరుకోవడం మొదలుపెట్టింది. దేవుడు తినవద్దని చెప్పిన చెట్టు పండ్లు ఆమె తిన్నది. ఆ తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది. పాము చెప్పిన మాటలు ఆదాము నమ్మలేదు. కానీ ఆయనకు దేవుని మీద ప్రేమకన్నా హవ్వతో ఉండాలనే కోరికే ఎక్కువైంది. అందుకే ఆయన కూడా ఆ పండ్లు తిన్నాడు.—ఆదికాండము 3:1-6; 1 తిమోతి 2:14.
దానివల్ల వాళ్లకు ఏమైంది?— ఆదాముహవ్వలు అపరిపూర్ణులై, కొంతకాలానికి ముసలివాళ్లయి చనిపోయారు. వాళ్లు అపరిపూర్ణులు కాబట్టి వాళ్లకు పుట్టిన పిల్లలందరూ అపరిపూర్ణులే. అందుకే వాళ్లు కూడా ముసలివాళ్లయి చనిపోయారు. దేవుడు అబద్ధం చెప్పలేదు! రోమీయులు 5:12) హవ్వతో అబద్ధం చెప్పిన దేవదూతను బైబిలు అపవాదియైన సాతాను అని, చెడ్డగా మారిన వేరే దేవదూతల్ని దయ్యాలు అని పిలుస్తోంది.—యాకోబు 2:19; ప్రకటన 12:9.
నిజంగా, ఆయన చెప్పింది వింటేనే జీవంతో ఉండగలుగుతాం. (దేవుడు చేసిన మంచి దేవదూత ఎందుకు చెడ్డవాడయ్యాడో ఇప్పుడు మీకు అర్థమయ్యిందా?— ఎందుకంటే అతను చెడ్డ విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తానే అందరికన్నా గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నాడు. పిల్లలను కనమని దేవుడు ఆదాముహవ్వలకు చెప్పినట్లు సాతానుకు తెలుసు, వాళ్లందరూ తనను ఆరాధించాలని సాతాను కోరుకున్నాడు. అందరూ యెహోవా మాట వినకుండా చేయాలని అపవాది అనుకున్నాడు. అందుకే మన మనసుల్లో చెడు ఆలోచనలు నాటడానికి ప్రయత్నిస్తుంటాడు.—యాకోబు 1:13-15.
యెహోవాను ఎవరూ నిజంగా ప్రేమించరని అపవాది అంటున్నాడు. మీకూ నాకూ దేవుని మీద ప్రేమ లేదని, దేవుడు చెప్పింది చేయడం మనకు ఇష్టం లేదని అతను అంటున్నాడు. అన్నీ మనం కోరుకున్నట్లు జరిగితేనే యెహోవా మాట వింటామని అతను అంటున్నాడు. మరి అతను అంటున్నది నిజమేనా? మనం అలా చేస్తామా?
అపవాది అబద్ధాలకోరు అని మన గొప్ప బోధకుడు చెప్పాడు! యేసు యెహోవా చెప్పింది చేసి తనకు ఆయనమీద ప్రేమ ఉందని నిరూపించాడు. యేసు తనకు సులభంగా ఉన్నప్పుడే కాదు, ఎప్పుడూ దేవుడు చెప్పిందే చేశాడు. అలా చేయకుండా వేరేవాళ్లు ఆయనను ఆపాలని చూసినప్పుడు కూడా ఆయన అలాగే చేశాడు. ఆయన తను చనిపోయేవరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన ఎప్పటికీ జీవించివుండడానికి దేవుడు ఆయనను మళ్లీ బ్రతికించాడు.
ఇప్పుడు చెప్పండి, మనకు అందరికన్నా పెద్ధ శత్రువు ఎవరు?— అవును, అపవాదియైన సాతానే. మనం అతనిని చూడగలమా?— చూడలేము! కానీ అతను ఉన్నాడనీ, అతను మనకంటే గొప్పవాడనీ మనకు తెలుసు. అయితే, అపవాదికన్నా ఎంతో గొప్పవాడు ఎవరో మీకు తెలుసా?— యెహోవా దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడగలడు.
మనం ఎవరిని ఆరాధించాలన్నది, ద్వితీయోపదేశకాండము 30:19, 20; యెహోషువ 24:14, 15; సామెతలు 27:11; మత్తయి 4:10 వచనాలను చదివి తెలుసుకుందాం.