కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 11

ఉత్సాహం

ఉత్సాహం

రోమీయులు 12:11

ఏమి చేయాలి? ఉత్సాహంగా మాట్లాడుతూ వినేవాళ్లను పురికొల్పండి, ప్రోత్సహించండి.

ఎలా చేయాలి?

  • ముందుగా సమాచారం మీ హృదయాన్ని కదిలించనివ్వండి. సిద్ధపడుతున్నప్పుడే మీరు చెప్పే సమాచారం ఎందుకు ప్రాముఖ్యమో లోతుగా ఆలోచించండి. మీ సమాచారాన్ని బాగా అర్థం చేసుకోండి. అప్పుడు హృదయంలో నుండి మాట్లాడగలుగుతారు.

  • వినేవాళ్ల గురించి ఆలోచించండి. మీరు చదివే లేదా బోధించే సమాచారం వల్ల వినేవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారో ధ్యానించండి. మీరు ఎలా మాట్లాడితే వాళ్లు దాని విలువను గ్రహిస్తారో ఆలోచించండి.

  • మీరు చెప్తున్న సమాచారానికి జీవం పోయండి. ఉత్సాహంగా మాట్లాడండి. సహజమైన సంజ్ఞలు, ముఖకవళికల ద్వారా మీ భావాలు తెలియజేయండి.