కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 16

ప్రోత్సహించేలా మాట్లాడడం

ప్రోత్సహించేలా మాట్లాడడం

యోబు 16:5

ఏమి చేయాలి? సమస్యల గురించి కాకుండా పరిష్కారాల గురించే, ప్రేక్షకులను పురికొల్పేవాటి గురించే మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • మీ ప్రేక్షకుల మీద మంచి అభిప్రాయం పెంచుకోండి. మీ తోటి విశ్వాసులకు యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక ఉందని నమ్మండి. ఒకవేళ వాళ్లకు సలహా ఇవ్వాల్సి వచ్చినా, వీలైతే ముందు వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకోండి.

  • ప్రతికూల విషయాలు ఎక్కువగా చెప్పకండి. ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్ప ప్రతికూల విషయాలు చెప్పకండి. మొదటి నుండి చివరి వరకు ప్రోత్సాహకరంగానే మాట్లాడండి.

  • దేవుని వాక్యాన్ని చక్కగా ఉపయోగించండి. మనుషుల కోసం యెహోవా ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేస్తాడో బైబిలు నుండి చూపించండి. భవిష్యత్తు మీద ఆశ కలిగించి, వాళ్లలో ధైర్యం నింపండి.