కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 18

ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం

ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం

1 కొరింథీయులు 9:19-23

ఏమి చేయాలి? ప్రేక్షకులను ఆలోచింపజేసి, పనికొచ్చే ఒక విషయం నేర్చుకున్నామని వాళ్లకు అనిపించేలా బోధించండి.

ఎలా చేయాలి?

  • మీ ప్రేక్షకులకు ఇప్పటికే ఏమి తెలుసో ఆలోచించండి. కేవలం వాళ్లకు తెలిసిందే మళ్లీ చెప్పకుండా, విషయాన్ని కొత్త కోణంలో చూడడానికి సహాయం చేయండి.

  • పరిశోధన చేసి, ధ్యానించండి. వీలైతే, ముఖ్యమైన విషయాలు వివరించడానికి ప్రేక్షకులు వినని వాస్తవాలను లేదా తాజా వార్తలను ఉపయోగించండి. అవి మీరు చెప్తున్న సమాచారానికి ఎలా సరిపోతాయో బాగా ఆలోచించండి.

  • మీ సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చూపించండి. లేఖనంలోని విషయాలు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ప్రేక్షకులకు వివరించండి. ప్రత్యేకించి ఏ రంగంలో, ఏ పరిస్థితిలో అవి వాళ్లకు ఉపయోగపడతాయో చెప్పండి.