కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 2

సహజంగా మాట్లాడడం

సహజంగా మాట్లాడడం

2 కొరింథీయులు 2:17

ఏమి చేయాలి? మీరు చెప్తున్న విషయం గురించి, వినేవాళ్ల గురించి మీకు ఏమి అనిపిస్తుందో తెలిసేలా సహజంగా, నిజాయితీగా మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • ప్రార్థన చేసుకుని, జాగ్రత్తగా సిద్ధపడండి. మీరు మీ మీద కాకుండా మీరు చెప్పే సందేశం మీద మనసుపెట్టేలా సహాయం చేయమని ప్రార్థించండి. మీరు చెప్పాల్సిన ముఖ్యాంశాల (main points) మీద మనసుపెట్టండి. మీరు రాసుకున్న విషయాన్ని ఉన్నదున్నట్లు కాకుండా సొంత మాటల్లో చెప్పండి.

  • హృదయంలో నుండి మాట్లాడండి. ప్రేక్షకులు మీరు చెప్తున్న సందేశం ఎందుకు వినాలో ఆలోచించండి. వాళ్ల మీదే మనసుపెట్టండి. అప్పుడు మీరు నిలబడే-కూర్చునే తీరులో, సంజ్ఞల్లో, ముఖకవళికల్లో మీకున్న నిజమైన ఆప్యాయత, ప్రేమ కనిపిస్తాయి.

  • వినేవాళ్ల వైపు చూడండి. మీ సంస్కృతిలో తప్పు కాకపోతే కళ్లల్లోకి చూసి మాట్లాడండి. మీరు ప్రసంగం ఇస్తున్నప్పుడు, అందరిని ఒకేసారి కాకుండా ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తూ మాట్లాడండి.