కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 4

లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం

లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం

మత్తయి 22:41-45

ఏమి చేయాలి? లేఖనం చదివే ముందు వినేవాళ్ల మనసుల్ని సిద్ధం చేయండి.

ఎలా చేయాలి?

  • మీరు ఆ లేఖనం ఎందుకు చదువుతున్నారో ఆలోచించండి. వినేవాళ్లు లేఖనంలో మీరు నొక్కిచెప్పాలనుకుంటున్న విషయాన్ని గుర్తించేలా ప్రతీ లేఖనాన్ని పరిచయం చేయండి.

  • బైబిలు ఆధారంగా బోధించండి. దేవుణ్ణి నమ్మే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు బైబిలు దేవుని వాక్యమని నొక్కిచెప్తూ, మీరు దేవుని ఆలోచనలనే బోధిస్తున్నారని చూపించండి.

  • లేఖనం మీద ఆసక్తి కలిగించండి. ఒక ప్రశ్న వేసి దానికి జవాబిచ్చే లేఖనం చూపించండి, లేదా ఒక సమస్య గురించి ప్రస్తావించి దాన్ని పరిష్కరించే లేఖనం చూపించండి, లేదా ఒక సూత్రం చెప్పి దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసే ఒక బైబిలు భాగాన్ని చూపించండి.