కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 7

ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం

ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం

లూకా 1:3

ఏమి చేయాలి? వినేవాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా నమ్మదగిన రుజువులు చూపించండి.

ఎలా చేయాలి?

  • నమ్మదగిన సమాచారం కోసం వెదకండి. దేవుని వాక్యం ఆధారంగా మాట్లాడండి, వీలైనప్పుడు దానిలో నుండి నేరుగా చదవండి. మీరు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఒక విషయాన్ని గానీ, వార్తను గానీ, అనుభవాన్ని గానీ, మరో రుజువును గానీ చెప్పాలనుకుంటే అది ఖచ్చితమైనదో కాదో ముందే చూసుకోండి.

  • సేకరించిన సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించండి. లేఖనాల్ని వివరిస్తున్నప్పుడు ఆ వివరణ, లేఖన సందర్భానికి, బైబిల్లో ఉన్న సందేశానికి, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ప్రచురణలకు విరుద్ధంగా ఉండకూడదు. (మత్త. 24:45) బయటి ప్రచురణల నుండి ఏదైనా ప్రస్తావిస్తే, ఆ మాటల సందర్భాన్ని, రచయిత ఉద్దేశాన్ని మనసులో ఉంచుకోండి.

  • రుజువుల ఆధారంగా మాట్లాడండి. ఒక లేఖనం గానీ మరో రుజువు గానీ చెప్పిన తర్వాత, వినేవాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా ప్రశ్నలు వేయండి లేదా ఉదాహరణలతో వివరించండి.