కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 9

వీడియోలతో, చిత్రాలతో బోధించడం

వీడియోలతో, చిత్రాలతో బోధించడం

ఆదికాండం 15:5

ఏమి చేయాలి? మీరు బోధిస్తున్న ప్రాముఖ్యమైన విషయాలను వినేవాళ్లు బాగా అర్థం చేసుకొని, గుర్తుంచుకునేలా చిత్రాలు, వీడియోలు లాంటివాటిని ఉపయోగించండి.

ఎలా చేయాలి?

  • సరైన వీడియోలను, చిత్రాలను ఎంచుకోండి. ప్రసంగం ఇస్తున్నప్పుడు చిన్నచిన్న వివరాలను కాకుండా ముఖ్యమైన విషయాలను నొక్కిచెప్పడానికి చిత్రాలు, చిత్రపటాలు, మ్యాప్‌లు, కాలరేఖలు (సంవత్సరాలను చూపే చార్టులు) వంటివాటిని ఉపయోగించండి. పరిచర్యలో మీరు వీడియోలను కూడా ఉపయోగించవచ్చు. వినేవాళ్లు కేవలం మీరు చూపించే చిత్రాలు, వీడియోలనే కాకుండా మీరు చెప్పే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునేలా సహాయం చేయండి.

  • వీడియోలు, చిత్రాలు చక్కగా కనిపించేలా చూసుకోండి.