కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు అంశాలు

బైబిలు అంశాలు

బైబిలు అంశాలు

1. అంత్యదినాలు

  ఎ. “లోకాంతము” అంటే అర్థం ఏమిటి

లోక విధానం అంతం అవుతుంది. మత్త 24:3; 2 పేతు 3:5-7; మార్కు 13:4

అంతం భూమికి కాదు, దుష్ట విధానానికి. 1 యోహా 2:17

నాశనానికి ముందు అంత్యదినాలు ఉంటాయి. మత్త 24:14

నీతిమంతులు తప్పించుకొంటారు; నూతనలోకం మొదలవుతుంది. 2 పేతు 2:9-10; ప్రక 7:14-17

 బి. అంత్యదినాల సూచనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

మనకు తెలియడానికి దేవుడు సూచనలు ఇచ్చాడు. 2 తిమో 3:1-5; 1 థెస్స 5:1-4

పరిస్థితి గంభీరతను లోకం గుర్తించడం లేదు. 2 పేతు 3:3, 4, 7; మత్త 24:39

దేవుడు ఆలస్యం చేయడు, కానీ హెచ్చరిస్తున్నాడు. 2 పేతు 3:9

అప్రమత్తంగా, శ్రద్ధగా ఉండేవారు ప్రతిఫలం పొందుతారు. లూకా 21:34-36

2. అపవాది, దయ్యాలు

  ఎ. అపవాది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి

ఒకనిలో ఉండే చెడు స్వభావం కాదు, అతడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. 2 తిమో 2:24-26

అపవాది దేవదూతల్లాంటి ఒక వ్యక్తి. మత్త 4:1, 11; యోబు 1:6

చెడు కోరికతో తనను తాను అపవాదిగా చేసుకొన్నాడు. యాకో 1:13-15

 బి. అపవాది ఈ లోక అదృశ్య పాలకుడు

ఈ లోకపు దేవతగా అతడు ఈ లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. 2 కొరిం 4:4; 1 యోహా 5:19; ప్రక 12:9

వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ఉనికిలో ఉండడానికి అనుమతించబడ్డాడు. నిర్గ 9:16; యోహా 12:31

మొదట అగాధంలో బంధించబడతాడు, తర్వాత నాశనం చేయబడతాడు. ప్రక 20:2, 3, 10

 సి. తిరుగుబాటుదారులైన దేవదూతలే దయ్యాలు

జలప్రళయానికి ముందు అపవాదితో చేతులు కలిపారు. ఆది 6:1, 2; 1 పేతు 3:19, 20

యోగ్యత పోగొట్టుకున్న వారిగా, విశదజ్ఞానానికి దూరం చేయబడ్డారు. 2 పేతు 2:4; యూదా 6

దేవునికి వ్యతిరేకంగా పోరాడతారు, మానవజాతిని క్రుంగదీస్తున్నారు. లూకా 8:27-29; ప్రక 16:13, 14

సాతానుతో పాటు నాశనం చేయబడతారు. మత్త 25:41; లూకా 8:30-31; ప్రక 20:2, 3, 10

3. అబద్ధ ప్రవక్తలు

  ఎ. అబద్ధ ప్రవక్తల గురించి ముందుగానే చెప్పబడింది; అపొస్తలుల కాలంలోనూ ఉన్నారు.

అబద్ధ ప్రవక్తలను గుర్తించే సూత్రం. ద్వితీ 18:20-22; లూకా 6:26

వారి గురించి ముందుగానే చెప్పబడింది; వారి క్రియల బట్టి గుర్తించవచ్చు. మత్త 24:23-26; 7:15-23

4. అభిచారము

  ఎ. అభిచారం దయ్యాల పని కాబట్టి దానిని విసర్జించాలి

దేవుని వాక్యం దానిని నిషేధిస్తుంది. యెష 8:19, 20; లేవీ 19:31; 20:6, 27

భవిష్యత్తు చెప్పడం దయ్యాల సంబంధమైంది; ఖండించబడింది. అపొ 16:16-18

నాశనానికి నడిపిస్తుంది. గల 5:19-21; ప్రక 21:8; 22:15

జ్యోతిష్యం నిషేధించబడింది. ద్వితీ 18:10-12; యిర్మీ 10:2

5. అమర్త్యమైన ఆత్మ

  ఎ. మనిషిలో అమర్త్యమైనది ఏదీ లేదు

మనిషిలో అమర్త్యమైన ఆత్మ అంటూ ఏమీ లేదు. ఆది 2:7; 3:19; యెహె 18:4

మరణించినప్పుడు ఏమీ మిగలదు. కీర్త 146:3, 4; ప్రసం 9:5,10.

మరణం తర్వాత ఏదో జీవించి ఉంటుందని దేవుని సేవకులు నమ్మలేదు. యెహె 37:12-14

 బి. ప్రాణం లేదా జీవశక్తి

జీవానికి మూలాధారం, శ్వాస ద్వారా నిలుస్తుంది. యోబు 27:2, 3

దేవుడే జీవశక్తికి ఆధారం. కీర్త 36:9; అపొ 17:28

6. అర్మగిద్దోను

  ఎ. దుష్టత్వాన్ని అంతమొందించే దేవుని యుద్ధం

జనాంగాలు అర్మగిద్దోనుకు సమకూర్చబడతాయి. ప్రక 16:14-16

దేవుడు తన కుమారుడ్ని, దూతలను ఉపయోగిస్తూ యుద్ధం చేస్తాడు. 2 థెస్స 1:6-9; ప్రక 19:11-16

మనం రక్షించబడే అవకాశం. జెఫ 2:2, 3; ప్రక 7:14

 బి. దేవుని ప్రేమ చెక్కుచెదరలేదు

లోకము ఘోరమైన అవినీతితో నిండిపోయింది. 2 తిమో 3:1-5

దేవుడు దీర్ఘశాంతుడే, అయితే న్యాయం కోసం చర్య అవసరం. 2 పేతు 3:9, 15; లూకా 18:7, 8

నీతిమంతులు వర్ధిల్లాలంటే దుష్టులు నశించాలి. సామె 21:18; ప్రక 11:18

7. కాల వృత్తాంతం

  ఎ. 1914 (సా.శ.)లో అన్యజనుల కాలములు పూర్తయ్యాయి

సా.శ.పూ. 607లో అనువంశిక రాజ్యపాలన అంతమయింది. యెహె 21:25-27

పాలన తిరిగి పునఃస్థాపించడానికి “ఏడుకాలములు” గడవాలి. దాని 4:32, 16, 17

ఏడు = 2 x 3 1/2 కాలములు, లేదా 2 x 1,260 రోజులు. ప్రక. 12:6, 14; 11:2, 3

ఒక రోజుకు ఒక సంవత్సరం. [చొప్పున అవి 2,520 సంవత్సరాలు అవుతాయి] యెహె 4:6; సంఖ్యా 14:34

అవి రాజ్యం స్థాపించబడేంత వరకు కొనసాగుతాయి. లూకా 21:24; దాని 7:13, 14

8. క్రీస్తు తిరిగి రావడం

  ఎ. తిరిగి రావడం మానవులకు కనిపించదు

తనను లోకం ఇక ఎన్నడూ చూడదని యేసు తన శిష్యులకు చెప్పాడు. యోహా 14:18

ఆరోహణం కావడం శిష్యులు మాత్రమే చూశారు; తిరిగి రావడం కూడా అలాగే ఉంటుంది. అపొ 1:6, 10, 11

పరలోకంలో ఒక అదృశ్య ఆత్మగా ఉన్నాడు. 1 తిమో 6:14-16; హెబ్రీ 1:3-4

పరలోక రాజ్యాధికారంతో తిరిగి వస్తాడు. దాని 7:13, 14

 బి. భౌతిక వాస్తవాలను బట్టి గుర్తించవచ్చు

శిష్యులు ఆయన రాకడకు లేదా ప్రత్యక్షతకు సంబంధించిన సూచన కోసం అడిగారు. మత్త 24:3

క్రైస్తవులు ఆయన ప్రత్యక్షతను మనోనేత్రాలతో లేదా అవగాహనా నేత్రాలతో “చూస్తారు.” ఎఫె 1:17-19

అనేక సంఘటనలు ప్రత్యక్షతను రుజువు చేస్తాయి. లూకా 21:10, 11

తమ నాశనాన్ని శత్రువులు కళ్లారా “చూస్తారు”. ప్రక 1:7

9. చర్చి

  ఎ. ఆధ్యాత్మికమైనది, క్రీస్తుపై నిర్మించబడింది

దేవుడు మానవ నిర్మిత ఆలయాలలో నివసించడు. అపొ 17:24, 25; 7:47-50.

నిజమైన చర్చి సజీవమైన రాళ్ళతో నిర్మించబడిన ఆధ్యాత్మిక ఆలయం. 1 పేతు 2:5, 6

క్రీస్తు మూలరాయి, అపొస్తలులు ద్వితీయ శ్రేణి రాళ్ళు. ఎఫె 2:20

దేవుణ్ణి ఆత్మతోను, సత్యముతో ఆరాధించాలి. యోహా 4:24

 బి. పేతురు మీద నిర్మించబడలేదు

పేతురు మీద చర్చి నిర్మించబడుతుందని యేసు చెప్పలేదు. మత్త 16:18

యేసు “బండ”గా గుర్తించబడ్డాడు. 1 కొరిం 10:4

యేసును పునాది రాయిగా, పేతురు గుర్తించాడు. 1 పేతు 2:4, 6-8; అపొ 4:8-12

10. జీవము

  ఎ. విధేయత చూపించే మానవజాతికి నిత్యజీవపు హామీ ఇవ్వబడింది

అబద్ధ మాడనేరని దేవుడు, జీవమును వాగ్దానం చేశాడు. తీతు 1:1-4; యోహా 10:27, 28

విశ్వసించే వారికి నిత్యజీవపు హామీ ఇవ్వబడింది. యోహా 11:25, 26

మరణం లేకుండా చేయబడుతుంది. 1 కొరిం 15:26; ప్రక 21:4; 20:14; యెష 25:8

 బి. క్రీస్తుతోడి వారసులకే పరలోక జీవితం లభిస్తుంది

దేవుడే తన చిత్తాన్ని బట్టి ఆ సభ్యులను ఎంపిక చేస్తాడు. మత్త 20:23; 1 కొరిం 12:18

1,44,000 మంది మాత్రమే భూమి నుండి తీసుకోబడతారు. ప్రక 14:1, 4; 7:2-4; 5:9, 10

బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా పరలోకరాజ్యంలో ఉండడు. మత్త 11:11

 సి. అసంఖ్యాకులైన వేరేగొఱ్ఱెలకు భూజీవితం వాగ్దానం చేయబడింది

పరలోకంలో యేసుతో కొద్దిమందే ఉంటారు. ప్రక 14:1, 4; 7:2-4

“వేరేగొఱ్ఱెలు” క్రీస్తు సహోదరులు కాదు. యోహా 10:16; మత్త 25:32, 40

భూమ్మీద రక్షించబడేందుకు ఇప్పుడు అనేకమంది సమకూర్చబడుతున్నారు. ప్రక 7:9, 15-17

భూమ్మీద జీవించడానికి ఇతరులు లేపబడతారు. ప్రక 20:12; 21:4.

11. జ్ఞాపకార్థ దినము, మాస్‌

  ఎ. ప్రభువు రాత్రి భోజనం జ్ఞాపకం చేసుకోవడం

సంవత్సరానికి ఒక్కసారి పస్కా దినమున ఆచరించాలి. లూకా 22:1, 17-20; నిర్గ 12:14

క్రీస్తు బలిమరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరిం 11:26; మత్త 26:28

పరలోక నిరీక్షణ ఉన్నవారు పాలుపంచుకుంటారు. లూకా 22:29-30; 12:32, 37

తనకు అలాంటి నిరీక్షణ ఉందని ఒక వ్యక్తి తెలుసుకోగల విధానం. రోమా 8:15-17

 బి. మాస్‌ లేఖన విరుద్ధమైనది

పాపక్షమాపణకు రక్తం చిందించబడాలి. హెబ్రీ 9:22

నూతన నిబంధనకు క్రీస్తు ఏకైక మధ్యవర్తి. 1 తిమో 2:5, 6; యోహా 14:6

క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, ప్రీస్టు ఆయనను కిందికి తీసుకురాలేడు. అపొ 3:20, 21

క్రీస్తు మళ్ళీ బలి అర్పించాల్సిన అవసరం లేదు. హెబ్రీ 9:24-26; 10:11-14

12. త్రిత్వం

  ఎ. తండ్రియైన దేవుడు అద్వితీయుడు, ఆయనే విశ్వంలో సర్వోన్నతుడు

దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు. ద్వితీ 6:4; మలా 2:10; మార్కు 10:18; రోమా 3:29, 30

కుమారుడు సృష్టించబడ్డాడు; దేవుడు అంతకుపూర్వం ఒక్కడే ఉన్నాడు. ప్రక 3:14; కొలొ 1:15; యెష 44:6

అన్ని కాలాల్లోను దేవుడే ఈ విశ్వానికి పాలకునిగా ఉన్నాడు. ఫిలి 2:5, 6; దాని 4:35

దేవుడు మహోన్నతునిగా ఘనపరచబడాలి. ఫిలి 2:9-11

 బి. కుమారుడు భూమికి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తండ్రికంటే తక్కువవాడు

కుమారుడు పరలోకమందు లోబడి ఉన్నాడు, ఆయన తండ్రి ద్వారా పంపించబడ్డాడు. యోహా 8:42; 12:49

భూమిపై విధేయునిగా ఉన్నాడు, తండ్రి గొప్పవాడు. యోహా 14:28; 5:19; హెబ్రీ 5:8

పరలోకంలో హెచ్చింపబడ్డాడు, అయినా లోబడి ఉన్నాడు. ఫిలి 2:9, 10; 1 కొరిం 15:28; మత్త 20:23

యెహోవా క్రీస్తుకు శిరస్సు మరియు దేవుడు. 1 కొరిం 11:3; యోహా 20:17; ప్రక 1:6

 సి. దేవుని మరియు క్రీస్తుల ఐక్యత

అన్నివేళలా సంపూర్ణ సామరస్యంతో ఉంటారు. యోహా 8:28, 29; 14:10

భార్యా భర్తల మధ్య ఉండేటువంటి ఐక్యత. యోహా 10:30; మత్త 19:4-6

విశ్వాసులందరు అలాంటి ఐక్యతతో ఉండాలి. యోహా 17:20-22; 1 కొరిం 1:10

క్రీస్తు ద్వారా చేసే యెహోవా ఆరాధనే నిరంతరం ఉంటుంది. యోహా 4:23, 24

 డి. దేవుని పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి

ఒక వ్యక్తి కాదు, శక్తి. మత్త 3:16; యోహా 20:22; అపొ 2:4, 17, 33

పరలోకంలో దేవుడు మరియు క్రీస్తులతోపాటు ఉండే వ్యక్తి కాదు. అపొ 7:55, 56; ప్రక 7:10

దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి ఆయనచేత నిర్దేశించబడుతుంది. కీర్త 104:30; 1 కొరిం 12:4-11

దేవుణ్ణి సేవించేవారు దీనిని పొందుతారు, నడిపించబడతారు. 1 కొరిం 2:12, 13; గల 5:16

13. దుష్టత్వం, లోక దుస్ధితి

  ఎ. లోక దుస్ధితికి ఎవరు బాధ్యులు

ఈ కాలంలోని చెడు పరిస్ధితులకు దుష్టపరిపాలనే కారణం. సామె 29:2; 28:28

లోకపాలకుడు దేవుని విరోధి. 2 కొరిం 4:4; 1 యోహా 5:19; యోహా 12:31

కష్టాలను అపవాది తెస్తాడు, అతనికి ఇక కొద్ది కాలమే మిగిలి ఉంది. ప్రక 12:9, 12

అపవాది బంధింపబడతాడు, దాని తర్వాత మహిమాన్వితమైన సమాధానం వస్తుంది. ప్రక 20:1-3; 21:3, 4

 బి. దుష్టత్వం ఎందుకు అనుమతించబడింది

దేవుని పట్ల మానవులు చూపించే యథార్థతను అపవాది సవాలు చేశాడు. యోబు 1:11, 12

యథార్థతను నిరూపించుకొనే అవకాశం విశ్వాసులైనవారికి ఇవ్వబడింది. రోమా 9:17; సామె 27:11

అపవాది అబద్ధికుడని నిరూపించబడుతుంది, వివాదం పరిష్కరించబడుతుంది. యోహా 12:31

విశ్వాసులకు నిత్యజీవం బహుమానంగా ఇవ్వబడుతుంది. రోమా 2:6, 7; ప్రక 21:3-5

 సి. అంతానికి ముందు ఈ దీర్ఘకాల వ్యవధి కనికరంతో కూడిన ఒక ఏర్పాటు

నోవహు దినాల్లోలాగే హెచ్చరించడానికి సమయం పడుతుంది. మత్త 24:14, 37-39

దేవుడు ఆలస్యం చేయడు, ఆయన దయగలవాడు. 2 పేతు 3:9; యెష 30:18

మనం అప్రమత్తంగా ఉండడానికి బైబిలు సహాయం చేస్తుంది. లూకా 21:36; 1 థెస్స 5:4

రక్షణ కోసం దేవుని ఏర్పాటును ఇప్పుడే వెదకండి. యెష 2:2-4; జెఫ 2:3

 డి. లోక దుస్థితికి మనుష్యులు పరిష్కారం తీసుకురాలేరు

మనుష్యులు భయకంపితులు, సందిగ్ధంలో చిక్కుకున్నారు. లూకా 21:10, 11; 2 తిమో 3:1-5

మానవులు కాదు గాని దేవుని రాజ్యమే సఫలీకృతం అవుతుంది. దాని 2:44; మత్త 6:9, 10

జీవించడానికి ఇప్పుడే రాజుతో సమాధానపడండి. కీర్త 2:9, 11, 12

14. నరకం (హేడిస్‌, షియోల్‌)

  ఎ. అగ్నితో హింసించే నిజమైన స్థలం కాదు

బాధను అనుభవిస్తున్న యోబు అక్కడికి వెళ్ళడానికి ప్రార్థించాడు. యోబు 14:13

నిష్క్రియావస్థలో ఉండే ప్రదేశం. కీర్త 6:5; ప్రసం 9:10; యెష 38:18, 19

యేసు పాతాళం లేదా నరకం అనబడిన సమాధి నుండి లేపబడ్డాడు. అపొ 2:27, 31, 32; కీర్త 16:10

పాతాళం లేదా నరకం తన వశములోని మృతులను అప్పగిస్తుంది, తర్వాత అది నిర్మూలించబడుతుంది. ప్రక 20:13, 14

 బి. అగ్ని సర్వనాశనానికి సూచన

మరణ శిక్ష అగ్ని చేత సూచించబడింది. మత్త 25:41, 46; 13:30

పశ్చాత్తాపము చూపని దుష్టులు, అగ్నిచేత నాశనం చేయబడినట్లుగా, నిత్య నాశనం అనుభవిస్తారు. హెబ్రీ 10:26, 27

సాతాను అగ్నిలో ‘బాధించబడడం’ అతని నిత్య నాశనానికి సూచన. ప్రక 20:10, 14, 15

 సి. ధనవంతుడు, లాజరుల వృత్తాంతం నిత్యబాధకు రుజువు కాదు

అబ్రాహాము రొమ్ము లాగే, అగ్నికూడా నిజమైనది కాదు. లూకా 16:22-24

అబ్రాహాము అనుగ్రహ స్థితికి విరుద్ధంగా అంధకారం ఉన్నట్లు కూడా చెప్పబడింది. మత్త 8:11, 12

బబులోను సర్వనాశనం అగ్నిమయ బాధగా వర్ణించబడింది. ప్రక 18:8-10, 21

15. పరలోకము

  ఎ. కేవలము 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు

వారి సంఖ్య పరిమితం; వారు మాత్రమే క్రీస్తుతోపాటు రాజులుగా ఉంటారు. ప్రక 5:9, 10; 20:4

యేసు ప్రథమంగా ఎంచుకోబడ్డాడు; ఆ తర్వాత ఇతరులు ఎంపిక చేసుకోబడ్డారు. కొలొ 1:18; 1 పేతు 2:21

ఇతరులు అనేకమంది ఆయన రాజ్యపాలనలో భూమిపై జీవిస్తారు. కీర్త 72:8; ప్రక 21:3, 4

ఇతరులెవ్వరూ లేని ప్రత్యేక స్థానంలో 1,44,000 మంది ఉన్నారు. ప్రక 14:1, 3; 7:4, 9

16. పరిచారకుడు

  ఎ. క్రైస్తవులందరూ పరిచారకులుగా ఉండాలి

యేసు దేవుని పరిచారకునిగా ఉన్నాడు. రోమా15:8-9; మత్త 20:28

క్రైస్తవులు ఆయన మాదిరిని అనుసరిస్తారు. 1 పేతు 2:21; 1 కొరిం 11:1

పరచర్యను నెరవేర్చడానికి ప్రకటించాలి. 2 తిమో 4:2, 5; 1 కొరిం 9:16

 బి. పరిచర్యకు కావలసిన అర్హతలు

దేవుని ఆత్మ మరియు ఆయన వాక్య పరిజ్ఞానం. 2 తిమో 2:15; యెష 61:1-3

ప్రకటించేటప్పుడు క్రీస్తు మాదిరిని అనుసరించండి. 1 పేతు 2:21; 2 తిమో 4:2, 5

దేవుడు తన ఆత్మ మరియు సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు. యోహా 14:26; 2 కొరిం 3:1-3

17. పరిశుద్ధాత్మ

  ఎ. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి

దేవుని చురుకైన శక్తి, ఒక వ్యక్తి కాదు. అపొ 2:2, 3, 33; యోహా 14:16

లోకాన్ని సృష్టించడం, బైబిలు రచనను ప్రేరేపించడం వంటి పనులకు ఉపయోగించబడింది. ఆది 1:2; యెహె 11:5

క్రీస్తుతోపాటు ఉండే సభ్యులను జన్మింపజేసి, అభిషేకిస్తుంది. యోహా 3:5-8; 2 కొరిం 1:21, 22

నేడు దేవుని ప్రజలను శక్తిమంతులను చేస్తుంది, నడిపిస్తుంది. గల 5:16, 18

18. పాపం

  ఎ. పాపం అంటే ఏమిటి

దేవుని నియమాన్ని, ఆయన పరిపూర్ణ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. 1 యోహా 3:4; 5:17

దేవుని సృష్టిగా మానవుడు ఆయనకు జవాబుదారుడు. రోమా 14:11-12; 2:11-15

ధర్మశాస్త్రం పాపాన్ని నిర్వచించి, మానవులు దానిని తెలుసుకొనేలా చేసింది. గల 3:19; రోమా 3:20

అందరూ పాపం చేసి దేవుని పరిపూర్ణ ప్రమాణాన్ని అందుకోలేకపోయారు. రోమా 3:23; కీర్త 51:5

 బి. ఆదాము పాపం కారణంగా అందరూ బాధ అనుభవించడానికిగల కారణం.

ఆదాము మరణాన్నీ అపరిపూర్ణతనూ అందరికీ సంక్రమింపజేశాడు. రోమా 5:12, 18

మానవజాతిని సహించడంలో దేవుడు కనికరం చూపించాడు. కీర్త 103:8, 10, 14, 17

యేసు బలి పాపాలను పరిహరిస్తుంది. 1 యోహా 2:2

పాపం, అపవాది ఇతర క్రియలన్నీ తుడిచి వేయబడతాయి. 1 యోహా 3:8

 సి. నిషేధించబడిన పండు, అవిధేయతకే గాని లైంగిక క్రియకు సంబంధించినది కాదు

హవ్వను సృష్టించక మునుపే ఆ వృక్షం నిషేధించబడింది. ఆది 2:17, 18

పిల్లలను కనాలని ఆదాము హవ్వలకు చెప్పబడింది. ఆది 1:28

పిల్లలు పాపం ఫలితం కాదుగాని దేవుని ఆశీర్వాదం వల్లనే కలిగారు. కీర్త 127:3-5

భర్త లేనప్పుడు హవ్వ పాపం చేసింది; తనంతటతానే నిర్ణయం తీసుకుంది. ఆది 3:6; 1 తిమో 2:11-14

ఆదాము శిరస్సుగా, దేవుని నియమానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. రోమా 5:12, 19

 డి. పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం (మత్త 12:32; మార్కు 3:28, 29)

వారసత్వంగా సంక్రమించిన పాపం అలాంటిది కాదు. రోమా 5:8, 12, 18; 1 యోహా 5:17

ఒకవేళ ఎవరైనా ఆత్మను దుఃఖపరిచినా, తిరిగి అనుగ్రహం పొందవచ్చు. ఎఫె 4:30; యాకో 5:19, 20

ఉద్దేశపూర్వకంగా పాపాన్ని అభ్యసించడం మరణానికి దారితీస్తుంది. 1 యోహా 3:6-9

దేవుడు అలాంటి వారికి తీర్పు తీర్చి, తన ఆత్మను వారినుండి తీసివేస్తాడు. హెబ్రీ 6:4-8

పశ్చాత్తాపం చూపించని అలాంటి వారి కోసం మనం ప్రార్థించకూడదు. 1 యోహా 5:16, 17

19. పునరుత్థానం

  ఎ. మృతులకు నిరీక్షణ

సమాధులలో ఉన్న వారందరు లేపబడతారు. యోహా 5:28, 29

యేసు పునరుత్థానం ఒక హామీ. 1 కొరిం 15:20-22; అపొ 17:31

పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసిన వారు లేపబడరు. మత్త 12:31, 32

విశ్వాసం చూపించేవారికి దాని హామీ ఇవ్వబడింది. యోహా 11:25

 బి. పరలోకానికి లేక భూమిపైకి పునరుత్థానం

అందరూ ఆదాము వల్ల మరణిస్తున్నారు; అయితే యేసు వల్ల బ్రతికించబడతారు. 1 కొరిం 15:20-22; రోమా 5:19

లేపబడినవారి స్వభావంలో మార్పు ఉంటుంది. 1 కొరిం 15:40, 42, 44

యేసుతో ఉండేవారు ఆయనలాగే ఉంటారు. 1 కొరిం 15:49; ఫిలి 3:20, 21

పరిపాలించని వారు భూమిపై ఉంటారు. ప్రక 20:4, 5, 13; 21:3, 4

20. పూర్వికుల ఆరాధన

  ఎ. పూర్వికులను ఆరాధించడం వ్యర్థం

పూర్వికులు మరణించారు, స్పృహలో ఉండరు. ప్రసం. 9:5, 10

పూర్వికులు ఆరాధనకు అనర్హులు. రోమా 5:12,14; 1 తిమో 2:14

అలాంటి ఆరాధనను దేవుడు నిషేధిస్తున్నాడు. నిర్గ 34:14; మత్త 4:10

 బి. మానవులను గౌరవించవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి

పిల్లలు పెద్దలను గౌరవించాలి. 1 తిమో 5:1, 2, 17; ఎఫె 6:1-3

అయితే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అపొ 10:25, 26; ప్రక 22:8, 9

21. ప్రతిమలు

  ఎ. ప్రతిమలను, విగ్రహాలను ఆరాధనలో ఉపయోగించడం దేవునికి అవమానకరం

దేవుని ప్రతిమను తయారుచేయడం అసాధ్యం. 1 యోహా 4:12; యెష 40:18; 46:5; అపొ 17:29

ప్రతిమలను ఆరాధించకూడదని క్రైస్తవులు హెచ్చరించబడ్డారు. 1 కొరిం 10:14; 1 యోహా 5:21

దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. యోహా 4:24

 బి. విగ్రహారాధన ఇశ్రాయేలు జనాంగానికి మరణకరమని రుజువు చేయబడింది

యూదులకు విగ్రహారాధన నిషేధించబడింది. నిర్గ 20:4, 5

వినలేవు, మాట్లాడలేవు, తయారు చేయువారు వాటిలాగే ఉంటారు. కీర్త 115:4-8

ఉరిని, నాశనాన్ని తెచ్చింది. కీర్త 106:36, 40-42; యిర్మీ 22:8, 9

 సి. దేవుణ్ణి తప్ప వేరొకరిని ఆరాధించడం అంగీకృతం కాదు

తనను తప్ప వేరొకరిని ఆరాధించడాన్ని దేవుడు నిరాకరించాడు. యెష 42:8

దేవుడు మాత్రమే “ప్రార్థన ఆలకించు వాడు.” కీర్త 65:1, 2

22. ప్రార్థన

  ఎ. దేవుడు ఆలకించే ప్రార్థనలు

దేవుడు మనుష్యుల ప్రార్థనలను ఆలకిస్తాడు. కీర్త 145:18; 1 పేతు 3:12

అవినీతిపరులు తమ పద్ధతులను మార్చుకోనట్లయితే ఆయన వారి ప్రార్ధన వినడు. యెష 1:15-17

యేసు నామంలో ప్రార్థించాలి. యోహా 14:13, 14; 2 కొరిం 1:20

దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి. 1 యోహా 5:14, 15

విశ్వాసము ఆవశ్యకం. యాకో 1:6-8

 బి. పదే పదే వల్లించడం వ్యర్థం, మరియకు లేదా “పరిశుద్ధులకు” ప్రార్థించడం ఆమోదయోగ్యం కాదు

యేసు నామమున మాత్రమే దేవుణ్ణి ప్రార్థించాలి. యోహా 14:6, 14; 16:23, 24

పదాలు వల్లించే ప్రార్థనలు ఆలకించబడవు. మత్త 6:7

23. బాప్తిస్మం

  ఎ. ఒక క్రైస్తవ విధి

యేసు మాదిరి ఉంచాడు. మత్త 3:13-15; హెబ్రీ 10:7

ఉపేక్షించుకోవడానికి లేదా సమర్పణకు సూచన. మత్త 16:24; 1 పేతు 3:21

బోధించతగిన వయస్సు గల వారికి మాత్రమే. మత్త 28:19, 20; అపొ 2:41

పూర్తిగా నీటిలో ముంచబడడమే సరైన పద్ధతి. అపొ 8:36-39; యోహా 3:23

 బి. పాపాలను కడిగివేయదు

యేసు పాపాలను కడిగివేసుకోవడానికి బాప్తిస్మం తీసుకోలేదు. 1 పేతు 2:22; 3:18

యేసు రక్తము పాపాలను కడిగివేస్తుంది. 1 యోహా 1:7

24. బైబిలు

  ఎ. దేవుని వాక్యం ప్రేరేపితమైనది

దేవుని ఆత్మచేత మనుష్యులు వ్రాయడానికి ప్రేరేపించబడ్డారు. 2 పేతు 1:20, 21

అందులో ప్రవచనాలు ఉన్నాయి: దాని 8:5, 6, 20-22; లూకా 21:5, 6, 20-22; యెష 45:1-4

బైబిలు మొత్తం ప్రేరేపితమైనది, ప్రయోజనకరమైనది. 2 తిమో 3:16-17; రోమా 15:4

 బి. మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శిని

బైబిలు సూత్రాలను ఉపేక్షించడం మరణకరం. రోమా 1:28-32

మానవ జ్ఞానం ప్రత్యామ్నాయం కాదు. 1 కొరిం 1:21, 25; 1 తిమో 6:20

అధిక బలంగల శత్రువు నుండి కాపాడుతుంది. ఎఫె 6:11, 12, 17

మనిషిని సరైన మార్గంలో నడిపిస్తుంది. కీర్త 119:105; 2 పేతు 1:19; సామె 3:5, 6

 సి. అన్ని దేశాల, జాతుల ప్రజల కోసం వ్రాయబడింది

బైబిలు వ్రాయడం తూర్పుదేశాలలో ప్రారంభమయింది. నిర్గ 17:14; 24:12, 16; 34:27

దేవుని ఏర్పాటు కేవలం యూరోపియన్లకు మాత్రమే కాదు. రోమా 10:11-13; గల 3:28

అన్ని వర్గాల ప్రజలనూ దేవుడు అంగీకరిస్తాడు. అపొ 10:34, 35; రోమా 5:18; ప్రక 7:9, 10

25. భూమి

  ఎ. భూమి పట్ల దేవుని సంకల్పం

పరిపూర్ణ మానవుల కోసం భూమి పరదైసుగా చేయబడుతుంది. ఆది 1:28; 2:8-15

దేవుని సంకల్పం తప్పక నెరవేరుతుంది. యెష 55:11; 46:10, 11

భూమి సమాధానకరమైన, పరిపూర్ణమైన మానవులతో నింపబడుతుంది. కీర్త 72:7; యెష 45:18; 9:6, 7

రాజ్యము ద్వారా పరదైసు పునఃస్థాపించబడుతుంది. మత్త 6:9, 10; ప్రక 21:3-5

 బి. ఎన్నటికీ నాశనం చేయబడదు లేక నిర్మానుష్యం కాదు

ఈ భూమి శాశ్వతకాలం ఉంటుంది. ప్రసం 1:4; కీర్త 104:5

నోవహు కాలంలో మానవులే నాశనం చేయబడ్డారు కానీ, భూమి కాదు. 2 పేతు 3:5-7; ఆది 7:23

ఈ ఉదాహరణ మనకాలంలో ప్రాణాలతో తప్పించుకొనగలమనే నిరీక్షణను ఇస్తోంది. మత్త 24:37-39

దుష్టులు నాశనం చేయబడతారు; “గొప్ప సమూహము” రక్షించబడుతుంది. 2 థెస్స 1:6-10; ప్రక 7:9, 14

26. మతం

  ఎ. సత్యమతం ఒక్కటే

ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. ఎఫె 4:5, 13

శిష్యులను చేయమని ఆజ్ఞాపించబడింది. మత్త 28:19; అపొ 8:12; 14:21

దాని ఫలాలను బట్టి గుర్తించవచ్చు. మత్త 7:19, 20; లూకా 6:43, 44; యోహా 15:8

సభ్యుల మధ్య ప్రేమ, ఏకాభిప్రాయం ఉండాలి. యోహా 13:35; 1 కొరిం 1:10; 1 యోహా 4:20

 బి. అబద్ధ సిద్ధాంతం పూర్తిగా ఖండించబడింది

యేసు అబద్ధ సిద్ధాంతాన్ని ఖండించాడు. మత్త 23:15, 23, 24; 15:4-9

అంధకారంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయనలా ఖండించాడు. మత్త 15:14

సత్యం యేసు శిష్యులను స్వతంత్రులను చేసింది. యోహా 8:31, 32

 సి. అది తప్పని నిరూపించబడితే, ఒకరు మతం మార్చుకోవడం చాలా ప్రాముఖ్యం

సత్యం స్వతంత్రులను చేస్తుంది; అనేకులు తప్పుచేస్తున్నారని నిరూపిస్తుంది. యోహా 8:31, 32

ఇశ్రాయేలీయులు, ఇతరులు తమ గత ఆరాధనను విడిచిపెట్టారు. యెహో 24:15; 2 రాజు 5:17

తొలి క్రైస్తవులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. గల 1:13, 14; అపొ 3:17, 20

పౌలు తన మతాన్ని మార్చుకున్నాడు. అపొ 26:4-6

లోకమంతా మోసగించబడింది; మనస్సు మార్చుకోవడం అవసరం. ప్రక 12:9; రోమా 12:2

 డి. “అన్ని మతాల్లో మంచి” ఉన్నా అందువల్ల దేవుని అనుగ్రహం లభిస్తుందనే హామీలేదు

ఆరాధన కోసం దేవుడే ప్రమాణాలు నియమించాడు. యోహా 4:23, 24; యాకో 1:27

దేవుని చిత్త ప్రకారం లేనట్లయితే అది మేలైనది కాదు. రోమా 10:2, 3

“సత్కార్యాలు” అనబడేవి తిరస్కరించబడవచ్చు. మత్త 7:21-23

ఫలాల వలన గుర్తించవచ్చు. మత్త 7:20

27. మరణం

  ఎ. మరణానికి కారణం

మానవునికి శాశ్వతకాలం జీవించే అవకాశంతో పరిపూర్ణ ఆరంభం ఇవ్వబడింది. ఆది 1:28, 31

అవిధేయత మరణశిక్షను తెచ్చింది. ఆది 2:16, 17; 3:17, 19

పాపమరణాలు ఆదాము సంతతి వారందరికీ సంక్రమించాయి. రోమా 5:12

 బి. మరణించిన వారి స్థితి

ఆదాము ఒక జీవాత్మగా చేయబడ్డాడు, అంతేకానీ ఆయనకు ఒక ఆత్మ ఇవ్వబడలేదు. ఆది 2:7; 1 కొరిం 15:45

ఆత్మ అయిన నరుడే మరణిస్తాడు. యెహె 18:4; యెష 53:12; యోబు 11:20

మృతులకు స్పృహ ఉండదు వారికేమీ తెలియదు. ప్రసం 9:5, 10; కీర్త 146:3, 4

మృతులు నిద్రావస్థలో ఉండి పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నారు. యోహా 11:11-15, 23-26; అపొ 7:60

 సి. మృతులతో మాట్లాడడం అసాధ్యం

మృతులు ఆత్మలుగా దేవునితో నివసించరు. కీర్త 115:17; యెష 38:18

మృతులతో మాట్లాడడానికి ప్రయత్నించకూడదని హెచ్చరించబడింది. యెష 8:19; లేవీ 19:31

అభిచార మధ్యవర్తులు, భవిష్యత్తు చెప్పేవారు ఖండించబడ్డారు. ద్వితీ 18:10-12; గల 5:19-21

28. మరియ ఆరాధన

  ఎ. మరియ యేసు తల్లి, “దేవుని తల్లి” కాదు

దేవునికి ఆది లేదు. కీర్త 90:2; 1 తిమో 1:17

దేవుని కుమారుడు భూమిపై ఉన్నప్పుడు మరియ ఆయనకు తల్లిగా ఉంది. లూకా 1:35

 బి. మరియ “నిత్య కన్యక” కాదు

ఆమె యోసేపును వివాహం చేసుకుంది. మత్త 1:19, 20, 24, 25

యేసుతోపాటు ఆమెకు ఇతర పిల్లలూ ఉన్నారు. మత్త 13:55, 56; లూకా 8:19-21

అప్పటికి వారు ఆయనకు “ఆధ్యాత్మిక సహోదరులు” కారు. యోహా 7:3, 5

29. మిశ్రమ విశ్వాసం

  ఎ. ఇతర మతాలతో మిళితం కావడం దేవుని మార్గం కాదు

ఒకటే మార్గం ఉంది, అది ఇరుకైనది, దానిని కొందరే కనుగొంటారు. ఎఫె 4:4-6; మత్త 7:13, 14

అబద్ధ సిద్ధాంతం కలుషితం చేస్తుందని హెచ్చరించబడింది. మత్త 16:6, 12; గల 5:9

వేరుగా ఉండాలని మనకు ఆజ్ఞాపించబడింది. 2 తిమో 3:5; 2 కొరిం 6:14-18; ప్రక 18:4

 బి. “అన్ని మతాలలో మంచి ఉందనడం” సత్యం కాదు

కొందరికి ఆసక్తి ఉంది కానీ అది దేవుని జ్ఞానానుసారంగా లేదు. రోమా 10:2, 3

చెడుతనం మంచిని పాడుచేస్తుంది. 1 కొరిం 5:6; మత్త 7:15-17

అబద్ధ బోధకులు నాశనం కలుగజేస్తారు. 2 పేతు 2:1; మత్త 12:30; 15:14

పరిశుద్ధ ఆరాధన సంపూర్ణ భక్తిని కోరుతుంది. ద్వితీ 6:5, 14, 15

30. యెహోవా, దేవుడు

  ఎ. దేవుని పేరు

“దేవుడు” అనేమాట అనిశ్చిత పదము; మన ప్రభువుకు వ్యక్తిగతంగా ఒక పేరు ఉంది. 1 కొరిం 8:5, 6

మనం ఆయన పేరు పరిశుద్ధపరచబడాలని ప్రార్థిస్తాం. మత్త 6:9, 10

దేవుని పేరు యెహోవా. కీర్త 83:18; నిర్గ 6:2, 3; 3:15; యెష 42:8

ఆ పేరు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో నిర్గ. 6:3లో (డుయే వర్షన్‌ అధఃసూచిలో) ఉంది. కీర్త 83:18; యెష 12:2; 26:4

యేసు ఆ పేరును తెలియజేశాడు. యోహా 17:6, 26; 5:43; 12:12, 13, 28

 బి. దేవుని ఉనికి

దేవుణ్ణి చూసి ప్రాణాలతో ఉండడం అసాధ్యం. నిర్గ 33:20; యోహా 1:18; 1 యోహా 4:12

దేవుణ్ణి విశ్వసించడానికి ఆయనను చూడనవసరం లేదు. హెబ్రీ 11:1; రోమా 8:24, 25; 10:17

దేవుని సృష్టికార్యాలను బట్టి ఆయనను తెలుసుకోవచ్చు. రోమా 1:20; కీర్త 19:1, 2

ప్రవచన నెరవేర్పు దేవుని ఉనికిని రుజువుచేస్తోంది. యెష 46:8-11

 సి. దేవుని లక్షణాలు

దేవుడు ప్రేమాస్వరూపి. 1 యోహా 4:8, 16; నిర్గ 34:6; 2 కొరిం 13:11; మీకా 7:18

ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. యోబు 12:13; రోమా 11:33; 1 కొరిం 2:7

ఆయన న్యాయవంతుడు, న్యాయపాలన చేస్తాడు. ద్వితీ 32:4; కీర్త 37:28

సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. యోబు 37:23; ప్రక 7:11-12; 4:10-11

 డి. అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించడం లేదు

మంచిగా కనిపించే మార్గము అన్ని సందర్భాల్లో సరైనది కాదు. సామె 16:25; మత్త 7:21

రెండు మార్గాలున్నాయి; ఒకటి మాత్రమే జీవానికి తీసుకెళ్తుంది. మత్త 7:13, 14; ద్వితీ 30:19

దేవతలు అనబడినవారు అనేకులున్నారు, కానీ సత్యదేవుడు మాత్రం ఒక్కడే. 1 కొరిం 8:5, 6; కీర్త 82:1

నిత్యజీవం కోసం సత్యదేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. యోహా 17:3; 1 యోహా 5:20

31. యెహోవాసాక్షులు

  ఎ. యెహోవాసాక్షుల ఆరంభం

యెహోవా తన సాక్షులను గుర్తిస్తాడు. యెష 43:10-12; యిర్మీ 15:16

నమ్మకమైన సాక్షుల క్రమము హేబెలుతో ఆరంభమయింది. హెబ్రీ 11:4, 39,40; 12:1-2

యేసు నమ్మకమైన సత్య సాక్షిగా ఉన్నాడు. యోహా 18:37-38; ప్రక 1:5; 3:14

32. యేసు

  ఎ. యేసు దేవుని కుమారుడు, నియమించబడిన రాజు

దేవుని సృష్టికి ఆదిసంభూతుడు, మిగతా వాటన్నిటిని సృష్టించడానికి ఉపయోగించబడ్డాడు. ప్రక 3:14; కొలొ 1:15-17

స్త్రీకి జన్మించిన నరునిగా, దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. గల 4:4-5; హెబ్రీ 2:9

పరలోకపు భవితవ్యంతో దేవుని ఆత్మతో జన్మించాడు. మత్త 3:16, 17

మానవ పూర్వపు స్థానం కన్నా మరింత ఉన్నత స్థానంలోకి హెచ్చించబడ్డాడు. ఫిలి 2:9, 10

 బి. రక్షణకు యేసుక్రీస్తుపై నమ్మకం చాలా ప్రాముఖ్యం

క్రీస్తు అబ్రాహాము వాగ్దాన సంతానం. ఆది 22:18; గల 3:16

యేసు మాత్రమే ప్రధాన యాజకుడు, విమోచన క్రయధనం చెల్లించినవాడు. 1 యోహా 2:1, 2; హెబ్రీ 7:25, 26; మత్త 20:28

దేవుణ్ణి, యేసుక్రీస్తును తెలుసుకోవడం వల్ల, విధేయత చూపించడం వల్ల జీవం లభిస్తుంది. యోహా 17:3; అపొ 4:12

 సి. క్రీస్తుపై విశ్వాసం మాత్రమే సరిపోదు

విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. యాకో 2:17-26; 1:22-25

ఆజ్ఞలకు లోబడాలి, ఆయన చేసిన పనిచేయాలి. యోహా 14:12, 15; 1 యోహా 2:3

ప్రభువు పేరును ఉపయోగించే వారందరూ రాజ్యములోకి ప్రవేశించరు. మత్త 7:21-23

33. రక్తం

  ఎ. రక్తమార్పిడులు రక్తపవిత్రతను పాడుచేస్తాయి

రక్తం పవిత్రమైనదని, ప్రాణమని నోవహుకు తెలుపబడింది. ఆది 9:4, 16

రక్తం తినడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది. లేవీ 17:14; 7:26, 27

ఆ నిషేధము క్రైస్తవులకు కూడా అనువర్తించబడింది. అపొ 15:28-29; 21:25

 బి. ప్రాణ రక్షణకు దేవుని నియమాన్ని ఉల్లంఘించడం సమర్థనీయం కాదు

బలి ఇవ్వడం కంటే విధేయత గొప్పది. 1 సమూ 15:22; మార్కు 12:33

దేవుని నియమము కంటే తన ప్రాణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం నాశనకరం. మార్కు 8:35, 36

34. రక్షణ

  ఎ. రక్షణ, యేసు విమోచన క్రయధన బలి ద్వారా దేవుని నుండి వస్తుంది

జీవం, దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చిన బహుమానం. 1 యోహా 4:9, 14; రోమా 6:23

యేసు బలి ద్వారా మాత్రమే రక్షణ సాధ్యం. అపొ 4:12

“మరణశయ్యపై చూపే పశ్చాత్తాపం” క్రియల్లేని విశ్వాసమే అవుతుంది. యాకో 2:14, 26

రక్షణ కోసం తీవ్రంగా కష్టపడాలి. లూకా 13:23, 24; 1 తిమో 4:10

 బి. “ఒక్కసారి రక్షింపబడితే ఇక రక్షింపబడినట్లే” అనే మాట లేఖనాధారం కాదు

పరిశుద్ధాత్మలో పాలివారైనవారు పడిపోవచ్చు. హెబ్రీ 6:4-6; 1 కొరిం 9:27

ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి రక్షింపబడినా వారిలో అనేకమంది నాశనం చేయబడ్డారు. యూదా 5

రక్షణ తక్షణమే దొరికేది కాదు. ఫిలి 2:12; 3:12-14; మత్త 10:22

వెనుదిరిగే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుంది. 2 పేతు 2:20, 21

 సి. “సర్వజన రక్షణ” లేఖనాధారం కాదు

పశ్చాత్తాపం కొందరికి అసాధ్యం. హెబ్రీ 6:4-6

దుష్టుల మరణం వల్ల దేవుడు సంతోషించడు. యెహె 33:11; 18:32

అయితే ప్రేమ అవినీతిని మన్నించదు. హెబ్రీ 1:9

దుష్టులు నాశనం చేయబడతారు. హెబ్రీ 10:26-29; ప్రక 20:7-15

35. రాజ్యం

  ఎ. దేవుని రాజ్యం మానవులకు ఏమిచేస్తుంది

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. మత్త 6:9, 10; కీర్త 45:6; ప్రక 4:10-11

రాజు, నియమాలు ఉన్న ప్రభుత్వం. యెష 9:6, 7; 2:3; కీర్త 72:1, 8

దుష్టత్వాన్ని నాశనం చేసి భూమి అంతటిపై రాజ్యపాలన చేస్తుంది. దాని 2:44; కీర్త 72:8

మానవజాతిని, పరదైసును పునరుద్ధరించడానికి 1,000 సంవత్సరాల పరిపాలన. ప్రక 21:2-4; 20:6

 బి. క్రీస్తు విరోధులు ఇంకా ఉండగానే పరిపాలన ఆరంభమవుతుంది

క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత చాలాకాలం వేచి ఉంటాడు. కీర్త 110:1; హెబ్రీ 10:12, 13

ఆ తర్వాత అధికారంలోకి వచ్చి, సాతానుతో యుద్ధం చేస్తాడు. కీర్త 110:2; ప్రక 12:7-9; లూకా 10:18

రాజ్యం స్థాపించబడుతుంది, భూమిపై శ్రమలు మొదలవుతాయి. ప్రక 12:10, 12

ఇప్పుడు శ్రమలు ఉన్నాయంటే, ఇది రాజ్యం వైపు నిలబడే సమయమని అర్థం. ప్రక 11:15-18

 సి. ‘హృదయాలలో’ లేదు, మానవ ప్రయత్నాలతో రాదు

రాజ్యం పరలోకంలో ఉంది, భూమ్మీద కాదు. 2 తిమో 4:18; 1 కొరిం 15:50; కీర్త 11:4

‘హృదయాలలో’ లేదు; యేసు పరిసయ్యులను సంబోధిస్తూ మాట్లాడాడు. లూకా 17:20, 21

అది ఈ లోకసంబంధమైనది కాదు. యోహా 18:36; లూకా 4:5-8; దాని 2:44

ప్రభుత్వాలు లోక ప్రమాణాలు మార్చబడతాయి. దాని 2:44

36. విధిరాత

  ఎ. మానవుని విధి లిఖించబడలేదు

దేవుని సంకల్పం నిశ్చయం. యెష 55:11; ఆది 1:28

దేవుణ్ణి సేవించడమనేది వ్యక్తిగత నిర్ణయం. యోహా 3:16; ఫిలి 2:12

37. విమోచన క్రయధనం

  ఎ. యేసు మానవ ప్రాణం “అందరి కోసం విమోచన క్రయధనంగా” చెల్లించబడింది

యేసు తన ప్రాణమును విమోచన క్రయధనంగా ఇచ్చాడు. మత్త 20:28

చిందించబడిన రక్తం యొక్క విలువ పాపవిమోచనను కలిగిస్తుంది. హెబ్రీ 9:14, 22

ఒక్కమారు బలి అర్పించడం సరిపోతుంది. రోమా 6:10; హెబ్రీ 9:26

ప్రయోజనాలు యాంత్రికంగా రావు; ఆయన బలిని అంగీకరించాలి. యోహా 3:16

 బి. అది సరిసమానమైన మూల్యం

ఆదాము పరిపూర్ణంగా సృష్టించబడ్డాడు. ద్వితీ 32:4; ప్రసం 7:29; ఆది 1:31

పాపం వల్ల ఆయనా, ఆయన సంతానం పరిపూర్ణతను పోగొట్టుకొన్నారు. రోమా 5:12, 18

పిల్లలు నిస్సహాయులు; సరిగ్గా ఆదాముకు సమానమైనవారు కావాలి. కీర్త 49:7; ద్వితీ 19:21

యేసు పరిపూర్ణ మానవ ప్రాణము విమోచన క్రయధనంగా ఇవ్వబడింది. 1 తిమో 2:5, 6; 1 పేతు 1:18, 19

38. వివాహం

  ఎ. వివాహ బంధాన్ని ఘనమైనదిగా ఎంచాలి

క్రీస్తుతోనూ ఆయన పెండ్లికుమార్తెతోనూ పోల్చబడింది. ఎఫె 5:22, 23

పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. హెబ్రీ 13:4

దంపతులు వేరుకాకూడదని ఉపదేశించబడ్డారు. 1 కొరిం 7:10-16

పోర్నియా మాత్రమే విడాకులకు లేఖనాధారం. మత్త 19:9

 బి. శిరస్సత్వ సూత్రాన్ని క్రైస్తవులు గౌరవించాలి

కుటుంబ శిరస్సుగా భర్త కుటుంబాన్ని ప్రేమించాలి, శ్రద్ధ వహించాలి. ఎఫె 5:23-31

భార్య, భర్తను ప్రేమించాలి, లోబడి ఉండాలి. 1 పేతు 3:1-7; ఎఫె 5:22

పిల్లలు విధేయులుగా ఉండాలి. ఎఫె 6:1-3; కొలొ 3:20

 సి. పిల్లల విషయంలో క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత

ప్రేమ, శ్రద్ధ చూపుతూ, వారితో సమయం గడపాలి. తీతు 2:3-5

వారిని విసిగించకూడదు. కొలొ 3:21

పోషించడంతోపాటు ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీర్చాలి. 2 కొరిం 12:14; 1 తిమో 5:8

జీవము కోసం వారికి శిక్షణ ఇవ్వాలి. ఎఫె 6:4; సామె 22:6, 15; 23:13, 14

 డి. క్రైస్తవులు కేవలం క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి

“ప్రభువు నందు మాత్రమే” వివాహం చేసుకోవాలి. 1 కొరిం 7:39; ద్వితీ 7:3, 4; నెహె 13:26

 ఇ. బహుభార్యత్వము లేఖనాధారం కాదు

ఆదిలో పురుషునికి ఒకే భార్య ఇవ్వబడింది. ఆది 2:18, 22-25

యేసు అదే ప్రమాణాన్ని క్రైస్తవులకు పునఃస్థాపించాడు. మత్త 19:3-9

తొలి క్రైస్తవులు బహుభార్యత్వాన్ని పాటించలేదు. 1 కొరిం 7:2, 12-16; ఎఫె 5:28-31

39. విశ్రాంతిదినము (సబ్బాతు)

  ఎ. క్రైస్తవులు సబ్బాతును ఆచరించనవసరం లేదు

యేసు మరణం ఆధారంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఎఫె 2:14

క్రైస్తవులు సబ్బాతును ఆచరించక్కర్లేదు. కొలొ 2:16, 17; రోమా 14:5, 10

సబ్బాతు, తదితర దినాలు ఆచరించే విషయంలో మందలించబడ్డారు. గల 4:9-11; రోమా 10:2-4

విధేయత, విశ్వాసం ద్వారా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు. హెబ్రీ 4:9-11

 బి. సబ్బాతు ఆచరణ కేవలం ప్రాచీన ఇశ్రాయేలుకు మాత్రమే

నిర్గమనం తర్వాత మొదటి సబ్బాతు ఆచరించబడింది. నిర్గ 16:26, 27, 29, 30

సహజ ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడింది. నిర్గ 31:16, 17; కీర్త 147:19, 20

సబ్బాతు సంవత్సరాలు కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించాలి. నిర్గ 23:10, 11; లేవీ 25:3, 4

క్రైస్తవులకు సబ్బాతు అవసరం లేదు. రోమా 14:5, 10; గల 4:9-11

 సి. దేవుని విశ్రాంతి (సృష్టి “వారం”లోని ఏడవదినం)

భూసంబంధ సృష్టి ముగింపుతో ఆరంభమయింది. ఆది 2:2, 3; హెబ్రీ 4:3-5

యేసు భూమిపై జీవించిన కాలంలో కూడా కొనసాగింది. హెబ్రీ 4:6-8; కీర్త 95:7-9, 11

క్రైస్తవులు తమ స్వీయాసక్తి క్రియల నుండి విశ్రమిస్తారు. హెబ్రీ 4:9, 10

రాజ్యం భూసంబంధమైన పనులను పూర్తి చేయడంతో ముగుస్తుంది. 1 కొరిం 15:24, 28

40. వ్యతిరేకత, హింస

  ఎ. క్రైస్తవుల పట్ల వ్యతిరేకతకు కారణం

యేసు ద్వేషించబడ్డాడు, వ్యతిరేకత ఉంటుందని ముందే చెప్పాడు. యోహా 15:18-20; మత్త 10:22

సరైన సూత్రాలకు హత్తుకోవడాన్ని లోకం నిందిస్తుంది. 1 పేతు 4:1, 4, 12, 13

యుగసంబంధ దేవతయైన సాతాను, రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు. 2 కొరిం 4:4; 1 పేతు 5:8

క్రైస్తవుడు భయపడడు, దేవుడు శక్తిని ఇస్తాడు. రోమా 8:38-39; యాకో 4:8

 బి. భర్త తనను దేవుని నుండి వేరుచేయడానికి భార్య ఒప్పుకోకూడదు

ముందే హెచ్చరించబడింది; ఇతరులు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశముంది. మత్త 10:34-38; అపొ 28:22

ఆమె దేవునిపైన, క్రీస్తుపైన ఆధారపడాలి. యోహా 6:68; 17:3

నమ్మకంగా ఉండడం వల్ల ఆయన రాబట్టబడవచ్చు. 1 కొరిం 7:16; 1 పేతు 3:1-6

భర్త శిరస్సే అయినా, ఆయన ఆరాధనా విధానాన్ని శాసించకూడదు. 1 కొరిం 11:3; అపొ 5:29

 సి. దేవుణ్ణి సేవించకుండా భార్య తనను అడ్డగించడాన్ని భర్త అనుమతించకూడదు

భార్యను, కుటుంబాన్ని ప్రేమించాలి, వారికి జీవం లభించాలని కోరుకోవాలి. 1 కొరిం 7:16

నిర్ణయాలు తీసుకొనే, పోషించే బాధ్యత ఆయనదే. 1 కొరిం 11:3; 1 తిమో 5:8

సత్యం కోసం నిలిచే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు. యాకో 1:12; 5:10, 11

శాంతి కోసం రాజీపడేవారు దేవుని అనుగ్రహం కోల్పోతారు. హెబ్రీ 10:38

కుటుంబాన్ని సంతోషభరితమైన నూతనలోకంలోకి నడిపిస్తాడు. ప్రక 21:3, 4

41. సాక్ష్యమివ్వడం

  ఎ. క్రైస్తవులందరూ సాక్ష్యమివ్వాలి, సువార్తను ప్రకటించాలి

అంగీకారం పొందడానికి మనుష్యుల ఎదుట యేసును ఒప్పుకోవాలి. మత్త 10:32

వాక్యానుసారంగా ప్రవర్తించాలి, విశ్వాసాన్ని ప్రదర్శించాలి. యాకో 1:22-24; 2:24

కొత్తవారు కూడా బోధకులవ్వాలి. మత్త 28:19, 20

బహిరంగ ప్రకటన రక్షణను కలిగిస్తుంది. రోమా 10:10

 బి. పలుమార్లు సందర్శించాలి, సాక్ష్యమివ్వడం కొనసాగించాలి

అంతం గురించి హెచ్చరించాలి. మత్త 24:14

యిర్మీయా యెరూషలేం నాశనం గురించి కొన్ని ఏండ్లపాటు ప్రకటించాడు. యిర్మీ 25:3

తొలి క్రైస్తవుల్లాగే మనం కూడా ప్రకటించాలి. అపొ 4:18-20; 5:28, 29

 సి. రక్తాపరాధం లేకుండా ఉండడానికి సాక్ష్యమివ్వాలి

సమీపిస్తున్న అంతం గురించి తప్పక హెచ్చరించాలి. యెహె 33:7; మత్త 24:14

అలా చేయనట్లయితే మన మీదకు రక్తాపరాధం వస్తుంది. యెహె 33:8, 9; 3:18, 19

పౌలు రక్తాపరాధం లేనివాడయ్యాడు; సత్యాన్ని పూర్తిగా ప్రకటించాడు. అపొ 20:26, 27; 1 కొరిం 9:16

అది వినేవారినే కాకుండా సాక్ష్యం ఇచ్చేవారిని కూడా రక్షిస్తుంది. 1 తిమో 4:16; 1 కొరిం 9:22

42. సిలువ

  ఎ. యేసు నిందాస్పదముగా ఒక హింసాకొయ్యపై వేలాడదీయబడ్డాడు

యేసు ఒక హింసాకొయ్యపై లేక మ్రానుపై వేలాడదీయబడ్డాడు. అపొ 5:30; 10:39; గల 3:13,14

క్రైస్తవులు హింసాకొయ్యను నిందాస్పదమైనదిగా దృష్టించాలి. మత్త 10:38; లూకా 9:23

 బి. దానిని ఆరాధించకూడదు

యేసు సిలువ లేదా హింసాకొయ్య అవమానాన్ని సూచిస్తోంది. హెబ్రీ 6:5-6; మత్త 27:41, 42

ఆరాధనలో సిలువను ఉపయోగించడం విగ్రహారాధన అవుతుంది. నిర్గ 20:4, 5; యిర్మీ 10:3-5

యేసు ఆత్మసంబంధ వ్యక్తిగా ఉన్నాడు, ఆయన ఇంకా హింసాకొయ్య మీదే లేడు. 1 తిమో 3:16; 1 పేతు 3:18

43. సృష్టి

  ఎ. నిరూపిత విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తుంది; పరిణామ సిద్ధాంతంతో విభేదిస్తుంది

సృష్టి క్రమమును విజ్ఞానశాస్త్రము అంగీకరిస్తుంది. ఆది 1:11, 12, 21, 24, 25

“జాతుల”కు సంబంధించిన దేవుని నియమం సత్యం. ఆది 1:11, 12; యాకో 3:12

 బి. సృష్టిదినాలు 24 గంటల దినాలు కావు

“దినము” ఒక కాల వ్యవధిని సూచించవచ్చు. ఆది 2:4

దేవుని దృష్టిలో దినము దీర్ఘకాల వ్యవధిని సూచించవచ్చు. కీర్త 90:4; 2 పేతు 3:8

44. సెలవులు, జన్మదినాలు

  ఎ. తొలిక్రైస్తవులు జన్మదినాలను, క్రిస్‌మస్‌ను ఆచరించలేదు

సత్యారాధికులు కానివారే ఆచరించారు. ఆది 40:20; మత్త 14:6

యేసు మరణదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకా 22:19, 20; 1 కొరిం 11:25, 26

ఆచరణలో అల్లరితో కూడిన ఆటపాటలు సరైనవి కాదు. రోమా 13:13; గల 5:21; 1 పేతు 4:3

45. స్వస్థత, భాషలు

  ఎ. ఆధ్యాత్మిక స్వస్థతకు శాశ్వత ప్రయోజనాలు ఉన్నాయి

ఆధ్యాత్మిక అస్వస్థత నాశనకరం. యెష 1:4-6; 6:10; హోషే 4:6

ఆధ్యాత్మిక స్వస్థతే ప్రాథమికంగా ఆజ్ఞాపించబడింది. యోహా 6:63; లూకా 4:18

పాపాలను తీసివేస్తుంది; సంతోషమును, జీవమును ఇస్తుంది. యాకో 5:19, 20; ప్రక 7:14-17

 బి. దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతలను తెస్తుంది

యేసు వ్యాధులు బాగుచేశాడు, రాజ్య ఆశీర్వాదాలను ప్రకటించాడు. మత్త 4:23

శాశ్వత స్వస్థత చేకూర్చే మాధ్యమంగా రాజ్యం వాగ్దానం చేయబడింది. మత్త 6:9, 10; యెష 9:7

మరణం కూడా తీసివేయబడుతుంది. 1 కొరిం 15:25, 26; ప్రక 21:4; 20:14

 సి. ఆధునిక కాలంలోని విశ్వాస స్వస్థతలకు దేవుని అంగీకారమున్న రుజువు లేదు.

శిష్యులు తమనుతాము అద్భుతంగా స్వస్థపరచుకోలేదు. 2 కొరిం 12:7-9; 1 తిమో 5:23

అపొస్తలుల కాలంతో అద్భుత వరాలు ఆగిపోయాయి. 1 కొరిం 13:8-11

స్వస్థతలు దేవుని అనుగ్రహానికి ఖచ్చితమైన రుజువు కాదు. మత్త 7:22, 23; 2 థెస్స 2:9-12

 డి. భాషలలో మాట్లాడడం కేవలం తాత్కాలిక ఏర్పాటు

అది సూచన; శ్రేష్ఠమైన వరాలను అపేక్షించాలి. 1 కొరిం 14:22; 12:30, 31

అద్భుతకరమైన ఆత్మవరాలు నిలిచిపోతాయని ముందుగానే చెప్పబడింది. 1 కొరిం 13:8-10

అద్భుత క్రియలు దేవుని అనుగ్రహానికి ఖచ్చితమైన రుజువు కాదు. మత్త 7:22, 23; 24:24