జహన్నమ్ దైవిక నీతిలో ఒక భాగమా?
జహన్నమ్ దైవిక నీతిలో ఒక భాగమా?
ఎప్పుడైనా ఎవరైనా చిత్రవధ చేయబడడం మీరు చూశారా? బహుశా మీరు చూసి ఉండరు. కావాలని హింసించడం చాలా అసహ్యకరమైనది, అనిష్టమైనది కూడా. అయితే, ఖుదా (దేవుడు) చిత్రవధ చేసే విషయమేమిటి? అలాంటి విషయాన్ని మీరు ఊహించగలరా? అయితే, అనేక మతాల్లో ఆధికారిక సిద్ధాంతమైన జహన్నమ్ (నరకాగ్ని) బోధ ఖచ్చితంగా దీన్నే సూచిస్తుంది.
ఉదాహరణకు, ఒక్క నిమిషం భయంకరమైన ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఒక వేడి ఇనుప పెనం మీద ఒక వ్యక్తి వేయించబడుతున్నాడు. ఎంతో బాధతో అతడు కరుణించమని కేకలు వేస్తున్నాడు. కానీ ఎవరూ వినిపించుకోవడం లేదు. ఆ చిత్రవధ అలాగే కొనసాగుతుంది, ఒక్కో గంట గడిచిపోతోంది, ఒక్కో రోజు గడిచిపోతోంది—నిర్విరామంగా అలాగే కొనసాగుతుంది!
ఆ బాధితుడు చేసినది ఎలాంటి నేరమైనప్పటికీ, మీరు అతని మీద జాలిపడరా? అలా చిత్రవధ చేయమని ఆజ్ఞాపించిన వ్యక్తి విషయమేమిటి? ఆయన నిజంగానే ప్రేమామయుడైన వ్యక్తయ్యుంటాడా? అయ్యుండడు! ప్రేమ కరుణభరితమైనది, అది జాలి చూపుతుంది. ప్రేమగల ఒక తండ్రి తన పిల్లలను దండించవచ్చు కానీ, చిత్రవధ చేయడు!
అయినప్పటికీ, ఖుదా, పాపులను నిత్యమైన జహన్నమ్‌లో (నరకాగ్నిలో) హింసిస్తాడని చాలా మతాలు బోధిస్తాయి. అది దైవిక న్యాయం అని వాదించబడుతుంది. అదే నిజమైతే, ఆ భయంకరమైన నిత్యదండన స్థలాన్ని ఎవరు సృష్టించారు? అక్కడ తీవ్రమైన వేదనలు కలిగించబడుతుండడానికి ఎవరు బాధ్యులు? జవాబులను కనుక్కోవడం చాలా సులభం. అలాంటి స్థలం నిజంగానే ఉనికిలో ఉన్నట్లయితే, దేవుడే దాని సృష్టికర్త అయ్యుంటాడు, అక్కడ జరిగేదానికి ఆయనే బాధ్యుడౌతాడు.
మీరు దాన్ని అంగీకరించగలరా? “దేవుడు (ఖుదా) ప్రేమాస్వరూపి” అని కితాబే ముకద్దస్ (బైబిలు) * చెబుతుంది. (1 యోహాను 4:8) కాస్త గౌరవం గల మానవులు సహితం అసహ్యించుకునే హింసను ప్రేమాస్వరూపియైన ఖుదా తలపెడతాడా? లేదు!
హేతుబద్ధంకాని బోధ
దుష్టులు జహన్నమ్‌కు వెళ్తారనీ, సదాకాలం హింసించబడతారనీ ఇప్పటికీ అనేకులు నమ్ముతున్నారు. ఈ బోధ తర్కబద్ధమైనదేనా? మానవ ఆయుష్షు 70 లేదా 80 ఏళ్ళకు పరిమితమై ఉంది. ఒకరు తన జీవితకాలమంతటిలోను విపరీతంగా దుష్టంగా ప్రవర్తించినప్పటికీ, శాశ్వతకాల హింసను విధించడం న్యాయసమ్మతమైన శిక్ష అవుతుందా? లేదు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన పరిమితమైన పాపాలకు శిక్షగా శాశ్వతకాలం హింసించడం చాలా అన్యాయం.
మనం మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేదాన్ని గురించిన నిజం ఎవరికి తెలుసు? కేవలం ఖుదా మాత్రమే దీన్ని వెల్లడి చేయగలడు, పైన పేర్కొన్న, తన కలామ్‌లో, కితాబే ముకద్దస్‌లో ఆయన దాన్ని వెల్లడిచేశాడు కూడా. కితాబే ముకద్దస్ చెబుతున్నది, “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; . . . సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును” అనే. (ప్రసంగి 3:19, 20) ఇక్కడ జహన్నమ్ గురించి ఏమీ పేర్కొనబడలేదు. మానవులు చనిపోయినప్పుడు మంటికి తిరిగి చేరుతారు—ఉనికిలో లేకుండా పోతారు.
ఒక వ్యక్తి హింసించబడాలంటే, అతడు స్పృహలో ఉండాలి. మృతులకు స్పృహ ఉంటుందా? లేదు. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” (ప్రసంగి 9:5) మృతులు “ఏమియు ఎరుగరు” గనుక, జహన్నమ్‌లో యాతనలను అనుభవించడమనేది అసాధ్యమైన విషయం.
హానికరమైన సిద్ధాంతం
జహన్నమ్ (నరకాగ్ని) బోధ సత్యమైనా, కాకపోయినా, అది ఉపయోగకరమైనది అని కొందరు అనుకుంటారు. ఎందుకని? అది తప్పిదం చేయకుండా అడ్డు నిలబడుతుంది అని వాళ్ళు చెబుతారు. అది నిజమా? సరే, నేరాల రేటు, జహన్నమ్ ఉందని విశ్వసించే ప్రాంతాల్లో అలా విశ్వసించని మిగతా ప్రాంతాల్లో కన్నా తక్కువగా ఉందా? అలా ఎంత మాత్రమూ లేదు! వాస్తవానికి, జహన్నమ్ సిద్ధాంతం చాలా హానికరమైనది. ఖుదా ప్రజలను హింసిస్తాడు అని నమ్మే ప్రజలు, హింసను ద్వేషించవలసిన విషయంగా దృష్టిస్తారా? వాళ్ళు ఎందుకలా దృష్టించాలి? దుష్టుడైన దేవుడ్ని విశ్వసించేవాళ్ళు తరచూ తమ దేవుడిలాగే దుష్టులుగా మారుతారు.
సహేతుకతగల ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఎలా చూసినప్పటికీ, అతడు యాతనలతో కూడిన జహన్నమ్ (నరకం) ఉనికిలో ఉన్నట్లు అంగీకరించలేడు. ఈ బోధ తర్కవిరుద్ధమైనది. ఈ సిద్ధాంతం మానవ స్వభావాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా ముఖ్యంగా, అలాంటి స్థలం ఉనికిలో ఉందని దేవుని వాక్యం చెప్పడం లేదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ‘ఆయన ప్రాణము వెడలిపోవును ఆయన మంటిపాలగును ఆయన సంకల్పములు నాడే నశించును.’—కీర్తన 146:4.
పాపానికి ఏమిటి శిక్ష?
మన పాపాలకు మనం శిక్షించబడమనా దాని భావం? కాదు, అలాగనేమీ కాదు. మన పరిశుద్ధ ఖుదా పాపులను శిక్షిస్తాడు, కానీ ఆయన వారిని పీడించడు. పాపులు పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన వారిని క్షమిస్తాడు. పాపానికి శిక్ష ఏమిటి? దానికి బైబిలు సూటైన జవాబును ఇస్తుంది: “పాపమువలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 6:23) జీవం దేవుడి నుండి వచ్చే బహుమానం. మనం పాపం చేసినప్పుడు, మనమిక ఆ బహుమానానికి అర్హులం కాము, మనం మరణిస్తాం.
‘అదెలా న్యాయమౌతుంది? మరి, అందరూ చనిపోతారు కదా!’ అని మీరు అడగవచ్చు. అది నిజమే. ఎందుకంటే మనమందరం పాపులమే. వాస్తవానికి, ఎవరూ జీవానికి అర్హులు కారు. “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
అలా, ‘మనమందరమూ పాపం చేస్తాం గనుక, మనమందరం చనిపోయేటట్లయితే, మనం నీతిగా ఉండేందుకు ఎందుకు ప్రయత్నించాలి? ఖుదాను సేవించేందుకు రోమీయులు 12:2) ఈ సత్యాలు అద్భుతమైన నిరీక్షణకు ఆధారాలు.
ప్రయత్నించే వ్యక్తితో ఎలా వ్యవహరించబడుతుందో, దుష్టుడైన వ్యక్తితో కూడా అలాగే వ్యవహరించబడుతున్నట్లుంది’ అని మీరు అనుకుంటుండవచ్చు. కానీ అది అలా కాదు. మనమందరమూ పాపులమే అయినప్పటికీ, యథార్థంగా పశ్చాత్తాపపడి, తమ మార్గాలను మార్చుకునేందుకు ప్రయత్నించేవారిని ఖుదా క్షమిస్తాడు. మనం మన ‘మనస్సును మార్చుకుని,’ మంచి చేయడానికి మనం చేసే ప్రయత్నాలకు ఆయన ప్రతిఫలాన్నిస్తాడు. (మంచి చేసేవారికి ఒక ప్రతిఫలం
మనం చనిపోయినప్పుడు ఉనికిలో ఉండకుండా పోతాం. దానర్థం అంతా అయిపోయిందని కాదు. తను చనిపోయినప్పుడు తను సమాధికి (షియోల్‌కి) వెళ్తాడని నమ్మకస్థుడైన మనిషియైన యోబుకు తెలుసు. కానీ, ఆయన ఖుదాకు ఎలా ప్రార్థించాడో వినండి. “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? . . . నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను” అని ఆయన ప్రార్థించాడు.—యోబు 14:13-15.
తను మరణం వరకూ నమ్మకస్థుడిగా ఉన్నట్లయితే, ఖుదా తనను గుర్తుంచుకుంటాడనీ, తనను పునరుత్థానం చేస్తాడనీ యోబు నమ్మాడు. ప్రాచీన కాలాల్లోని దేవుని సేవకులందరూ అలాగే నమ్మారు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [ఖుదా] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అని చెప్పినప్పుడు యేసే స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించాడు.—యోహాను 5:28, 29.
పునరుత్థానం ఎప్పుడు ప్రారంభమౌతుంది? బైబిలు చెబుతున్నదాని ప్రకారం, అతి త్వరలోనే, ఈ లోకం 1914లో “అంత్యదినములలో”కి ప్రవేశించిందని బైబిలు ప్రవచనం సూచిస్తుంది. (2 తిమోతి 3:1) ఖుదా చాలా త్వరలోనే, అనేకులు అంటున్న ‘లోకాంతంలో’ దుష్టత్వాన్ని పూర్తిగా తొలగించేసి, పరలోక పరిపాలన క్రింద క్రొత్త లోకాన్ని స్థాపిస్తాడు.—మత్తయి 24వ అధ్యాయం; మార్కు 13వ అధ్యాయం; లూకా 21వ అధ్యాయం; ప్రకటన 16:14.
దాని ఫలితం ఏమై ఉంటుందంటే, భూమ్యంతటా ఒక ఫిర్దౌస్ (పరదైసు) కీర్తన 37:10, 11 లో మనం చదువుతాం.
వ్యాపించి ఉంటుంది, ఖుదాను సేవించాలని యథార్థంగా ప్రయత్నించినవాళ్ళు అక్కడ నివసిస్తారు. దుష్టులైన ప్రజలు జహన్నమ్‌లో కాల్చబడరు కానీ, రానున్న ఫిర్దౌస్‌లో వాళ్ళకు చోటు ఉండదు. “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అనిఇదంతా కేవలం స్వప్నమేనా? కాదు, ఇది ఖుదా వాగ్దానం. “ఇదిగో దేవుని (ఖుదా) నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు (ఖుదా) తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని” అని కితాబే ముకద్దస్‌లో మనం చదువుతాం.—ప్రకటన 21:3, 4.
ఈ మాటలను నమ్ముతారా? నమ్మాలి. ఖుదాకా కలామ్ (దేవుని వాక్యం) ఎల్లవేళలా నిజమని నిరూపించబడుతుంది. (యెషయా 55:11) మానవజాతి కొరకైన దేవుని ఉద్దేశాలు ఏమిటి అనే దాన్ని గురించి మరెక్కువగా తెలుసుకోమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు ఆనందిస్తారు. మీకు వారి సహాయం కావాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన చిరునామాల్లో ఒక దానికి వ్రాయమని ఆహ్వానిస్తున్నాం.
[అధస్సూచీలు]
^ పేరా 6 ముస్లిమ్ ప్రపంచంలో, తోరా, జబూర్ (కీర్తనలు), ఇంజీల్ (సువార్తలు) అనే పుస్తకాలు కలిసినదే కితాబే ముకద్దస్ (బైబిలు). ఖురాన్‌లోని కనీసం 64 వచనాలు, ఈ పుస్తకాలను ఖుదాకా కలామ్ (దేవుని వాక్యం) అని అంటున్నాయి. ఆ వచనాలు, వాటిని చదవవలసిన అవసరాన్ని, వాటి ఆజ్ఞలను పాటించవలసిన అవసరాన్ని నొక్కిచెబుతాయి. తోరా, జబూర్, ఇంజీల్ మార్చివేయబడ్డాయని కొందరు ప్రజలు నొక్కి చెబుతారు. ఈ విధంగా వాదించేవాళ్ళు చెబుతున్నది, ఖుదా తన సొంత కలామ్‌ను (వాక్యాన్ని) కాపాడలేడనే.
బైబిలు ఉటంకణలన్నీ పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకోబడ్డాయి.