కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంత్యదినముల యొక్క సూచన

అంత్యదినముల యొక్క సూచన

అధ్యాయము 111

అంత్యదినముల యొక్క సూచన

అది మంగళవారం మధ్యాహ్న సమయం. యేసు ఒలీవల కొండమీద కూర్చుండి క్రిందగల దేవాలయమును చూచుచుండగా, పేతురు అంద్రెయ యాకోబు యోహాను ఏకాంతముగా ఆయనయొద్దకు వత్తురు. యేసు ఇంతకుముందే రాతిమీద రాయి యొకటియైన నిలువదని ప్రవచించినందున, వారు ఆలయమును గూర్చి చింతగలవారై యున్నారు.

అయితే వారు యేసును సమీపించుచుండగా, నిజానికి వారు దానికంటే ఎక్కువనే తమ మనస్సులలో కలిగియున్నారు. కొన్ని వారముల క్రితము, ఆయన “మనుష్యకుమారుడు బయల్పరచబడిన” కాలమందలి తన “ప్రత్యక్షతను” (NW) గూర్చి మాట్లాడెను. మరియు అంతకుముందు ఒక సందర్భములో, ఆయన “యుగసమాప్తిని” గూర్చి వారికి చెప్పెను. కావున ఎక్కువ తెలిసికొను ఆసక్తి అపొస్తలులు ఇప్పుడు కలిగియున్నారు.

“ఇవి ఎప్పుడు జరుగును [యెరూషలేము, దానియందలి దేవాలయపు నాశనము], నీ ప్రత్యక్షతకు, (NW) ఈ యుగసమాప్తికి సూచనలేవి?” అని వారడుగుదురు. నిజానికి, వారిది మూడు-భాగముల ప్రశ్న. మొదట, వారు యెరూషలేము, దానియందలి దేవాలయపు నాశనమునుగూర్చి, తరువాత రాజ్యాధికారమందు యేసు ప్రత్యక్షతనుగూర్చి, చివరగా సమస్త విధానముయొక్క అంతమునుగూర్చి తెలిసికొనగోరుదురు.

తన సుదీర్ఘ ప్రత్యుత్తరమందు, యేసు ప్రశ్నయొక్క మూడు భాగములకు సమాధానమిచ్చును. యూదా విధానము అంతమగుటను గుర్తించు సూచనను ఆయన చెప్పును; అయితే ఆయన మరెన్నో విషయములనుకూడ వారికి తెల్పును. భవిష్యత్తులో తన శిష్యులు, తన ప్రత్యక్షత కాలమున మరియు విధానాంతమునకు సమీపమున జీవించుచున్నామని తెలిసికొనులాగున వారిని మేల్కొలుపు సూచననుకూడ ఆయన చెప్పును.

సంవత్సరములు గడచుచుండగా, అపొస్తలులు యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పును చూశారు. అవును, ఆయన చెప్పిన ఆ సంగతులే వారి కాలములో జరుగుటకు మొదలగును. ఆ విధముగా 37 సంవత్సరముల తర్వాత అనగా సా.శ. 70లో జీవించు క్రైస్తవులు, యూదా విధానము దాని ఆలయముయొక్క నాశనమందు తెలియని విధముగా పట్టుబడరు.

అయితే, క్రీస్తు ప్రత్యక్షత మరియు విధానాంతము సా.శ. 70లో సంభవించదు. రాజ్యాధికారమందలి ఆయన ప్రత్యక్షత చాలాకాలము తరువాత కలుగును. అయితే ఎప్పుడు? యేసు ప్రవచనమును విచారించుట దీనిని బయల్పరచును.

“యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు” నివేదికలుండునని యేసు ప్రవచించును. “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచునని,” కరవులు, భూకంపములు తెగుళ్లు సంభవించునని ఆయన చెప్పును. ఆయన శిష్యులు ద్వేషింపబడి చంపబడుదురు. అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసగింతురు. అక్రమము విస్తరించును, అనేకుల ప్రేమ చల్లారును. అదే సమయములో దేవునిరాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటింపబడును.

యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పు సా.శ. 70లో యెరూషలేము నాశనమునకు ముందు పరిమితముగా ఉన్నను, పెద్దయెత్తున అది ఆయన ప్రత్యక్షతయందు, విధానాంతమున నెరవేరును. 1914 నుండి జరిగిన సంఘటనలను జాగ్రత్తగా సమీక్షించినట్లయిన యేసు చెప్పిన మహత్వపూర్ణ ప్రవచనము ఆ సంవత్సరమునుండి పెద్దయెత్తున నెరవేరుచున్నదని వెల్లడియగుచున్నది.

సూచనలో యేసు చెప్పిన మరొక భాగము ఏమనగా, “నాశనకరమైన హేయవస్తువు” కన్పించుట. సా.శ. 66లో ఈ హేయవస్తువు యెరూషలేమును చుట్టుముట్టి దేవాలయ ప్రాకారములను పెళ్లగించిన రోమా “దండ్ల” రూపమున కన్పించును. ఈ “హేయవస్తువు” నిలువగూడని స్థలములో నిలిచియున్నది.

సూచనయొక్క పెద్ద నెరవేర్పునందు, ఈ హేయవస్తువు నానాజాతి సమితి, దానితరువాత వచ్చిన ఐక్యరాజ్య సమితియై యున్నది. క్రీస్తుమత సామ్రాజ్యము ప్రపంచ శాంతికి ఈ సంస్థను దేవుని రాజ్యమునకు ప్రత్యామ్నాయముగా దృష్టించుచున్నది. ఎంత హేయకరము! కావున తగిన కాలమున, ఐ.రా.స.తో సహవసించు రాజకీయ శక్తులు (యెరూషలేముకు దృష్టాంతముగాయున్న) క్రీస్తుమత సామ్రాజ్యమునకు వ్యతిరేకముగా తిరిగి దానిని నాశనము చేయుదురు.

యేసు ఈ విధముగా ప్రవచించెను. “అప్పుడు మహాశ్రమ కలుగును . . . లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” పదిలక్షలమంది కంటే ఎక్కువమంది చంపబడిన సా.శ. 70లోని యెరూషలేము నాశనము నిజముగా ఒక మహాశ్రమయైయుంది. యేసు ప్రవచనములోని ఈ భాగముయొక్క పెద్ద నెరవేర్పు మిక్కిలి గొప్పగా ఉంటుంది.

చివరి దినములలో దృఢనమ్మకం

మంగళవారం నీసాను 11 ముగియుచుండగా, యేసు తన అపొస్తలులతో రాజ్యాధికారమందు తన ప్రత్యక్షతను, విధానాంతమును గూర్చిన సూచనను ఇంకను చర్చించుచున్నాడు. అబద్ధ క్రీస్తులను వెంబడించుటను గూర్చి ఆయన వారిని హెచ్చరించును. “సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు” ప్రయత్నములు జరుగునని ఆయన చెప్పుచున్నాడు. అయితే, దూరపు చూపుగల గద్దలవలె, ఈ ఏర్పరచబడినవారు నిజమైన ఆత్మీయాహారము ఎక్కడ కనుగొనబడునో అక్కడ సమకూడుదురు, అనగా ఆయన అదృశ్య ప్రత్యక్షతయందు నిజమైన క్రీస్తుతో ఉందురు. వారు మోసగింపబడి అబద్ధ క్రీస్తునొద్దకు సమకూర్చబడరు.

అబద్ధ క్రీస్తులు కేవలము దృశ్యముగా మాత్రమే కన్పించగలరు. కాని దానికి భిన్నముగా, యేసు ప్రత్యక్షత అదృశ్యముగా ఉండును. మహాశ్రమలు ఆరంభమైన తర్వాత “చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు,” అని యేసు చెబుతున్నాడు. అవును, ఇది మానవజాతి ఉనికియందంతటిలో బహు అంధకారముగల కాలమైయుండును. అంటే అది దినసమయమున సూర్యుడు చీకటి కమ్మినట్లుగాను, రాత్రి సమయమున చంద్రుడు కాంతినియ్యనట్లుగాను ఉండును.

యేసు ఇంకను ఇట్లనును: “ఆకాశమందలి శక్తులు కదలింపబడును.” ఆ విధముగా ఆయన భౌతిక ఆకాశములు విపత్సూచికముగా కన్పించునని సూచించును. మానవజాతి చరిత్రలో క్రితమెన్నడు లేనంత రీతిలో భయము బలాత్కారము ఉండును.

తత్ఫలితముగా, “సముద్ర తరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. . . . గనుక లోకముమీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు” అని యేసు చెప్పును. నిజమే, మానవ ఉనికియందలి ఈ బహు అంధకార కాలము దాని అంతమునకు సమీపిస్తుండగా, “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. . . . అప్పుడు భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.”

అయితే, ‘ఈ దుష్టవిధానమును నాశనము చేయుటకు మనుష్యకుమారుడు అధికారమునకు’ వచ్చినప్పుడు, అందరు రొమ్ము కొట్టుకొనుచు విలపించరు. పరలోక రాజ్యమందు క్రీస్తుతో పాలుపంచుకొను “ఏర్పరచబడిన,” 144,000 మంది విలపించరు. ఆలాగే యేసు అంతకుముందు “వేరేగొర్రెలని” పిలిచిన వారి సహవాసులును విలపించరు. మానవజాతి చరిత్రలో బహు అంధకార సమయములో జీవించుచున్నను, వీరు యేసు ఇచ్చిన ఈ ప్రోత్సాహమునకు ప్రతిస్పందింతురు: “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”

అంత్యదినములలో జీవించు తన శిష్యులు అంతము సమీపమైనదని తీర్మానించ గలుగునట్లు, యేసు ఈ ఉపమానమును చెప్పును: “అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగిరించుటచూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా? అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”

ఆ విధముగా, సూచనలోని అనేక వివిధ అంశములు నెరవేరుటను ఆయన శిష్యులు చూచినప్పుడు, ఈ విధానాంతము సమీపమైనదని, దేవుని రాజ్యము త్వరలోనే సమస్త దుష్టత్వమును తుడిచివేయునని గ్రహించవలెను. వాస్తవానికి, యేసు చెప్పిన అన్నిసంగతుల నెరవేర్పును చూచు ప్రజల జీవితకాలములోనే అంతము సంభవించును. ఆ ప్రాముఖ్యమైన అంత్యదినములలో జీవించియుండు తన శిష్యులను హెచ్చరించుచు, యేసు ఇట్లు చెప్పుచున్నాడు:

“మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్లు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.”

బుద్ధిగల మరియు బుద్ధిలేని కన్యకలు

తను రాజ్యాధికారమందు వచ్చుటనుగూర్చి అపొస్తలులు చేసిన వినతికి యేసు జవాబిచ్చుచున్నాడు. సూచనలోని మరిన్ని అంశములను ఆయనిప్పుడు మూడు ఉపమానములు లేక దృష్టాంతముల ద్వారా చెప్పుచున్నాడు.

ప్రతి ఉపమానముయొక్క నెరవేర్పు ఆయన ప్రత్యక్షత కాలములో జీవించువారు చూతురు. ఈ మాటలతో ఆయన మొదటి దానిని పరిచయము చేయుచున్నాడు: “పరలోక రాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేనివారు, అయిదుగురు బుద్ధిగలవారు.”

“పరలోక రాజ్యము . . . పదిమంది కన్యకలను పోలియున్నది” అని చెప్పినప్పుడు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొను వారిలో సగముమంది బుద్ధిలేని వారని సగముమంది బుద్ధిగలవారని యేసు భావము కాదు! కాదు, అయితే పరలోక రాజ్యము సంబంధముగా, అటువంటి ఇరువిధముల అంశము ఉండును, లేక రాజ్యము సంబంధముగా అటువంటి మరియు ఆ విధమైన విషయము ఉండునని ఆయన భావమైయున్నది.

పరలోక రాజ్యము కొరకైన వరుసలో ఉన్నటువంటి లేక చెప్పుకొనునటువంటి క్రైస్తవులందరికి ఈ పదిమంది కన్యకలు సూచనగా యున్నారు. సా.శ. 33 పెంతెకొస్తునాడు, పునరుత్థానుడైన, మహిమపరచబడిన పెండ్లికుమారుడగు యేసుక్రీస్తుతో వివాహమునకు క్రైస్తవ సంఘము వాగ్దానము చేయబడెను. అయితే ప్రత్యేకించి చెప్పబడని భవిష్యత్‌ కాలములో ఈ వివాహము పరలోకమందు జరుగవలసియున్నది.

ఉపమానములో పదిమంది కన్యకలు పెండ్లికుమారుని స్వాగతించుటకు, పెండ్లివారితో కలిసివెళ్లు ఉద్దేశ్యముతో బయలుదేరుదురు. ఆయన వచ్చినప్పుడు, పెండ్లివారువెళ్లు దారిని వెలుగుతోనింపుటకు వారు తమ దీపములను వెలిగింతురు, ఆ విధముగా ఆయన పెండ్లికుమార్తె కొరకు సిద్ధపరచిన గృహమునకు ఆమెను తీసికొనివచ్చుచుండగా ఆయనను గౌరవింతురు. అయితే, యేసు ఇట్లు వివరించును: “బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలోనూనె తీసికొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి.”

పెండ్లికుమారుడు ఆలస్యము చేయుట, పరిపాలించు రాజుగా క్రీస్తుయొక్క ప్రత్యక్షత భవిష్యత్తులో చాలాకాలము తర్వాత కలుగునని సూచించుచున్నది. ఆయన చివరికి 1914లో సింహాసనాసీనుడగును. అంతకుముందు చాలాసేపున్న రాత్రియందు, కన్యకలందరు నిద్రలోనికి జారిపోవుదురు. అయితే ఇందువిషయమై వారు ఖండింపబడలేదు. బుద్ధిలేని కన్యకలు తమతో సిద్దెలలో నూనె తీసికొనివెళ్లనందుకు ఖండింపబడిరి. పెండ్లికుమారుడు రాకముందు కన్యకలు ఎట్లు మేల్కొనిరో యేసు వివరించుచున్నాడు: “అర్ధరాత్రివేళ ‘ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి’ అను కేక వినబడెను. అప్పుడు కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు, ‘మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని’ బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, ‘మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని’ చెప్పిరి.”

నిజమైన క్రైస్తవులు ఎడతెగక జ్యోతులవలె ప్రకాశించుటను ఆ నూనె సూచించుచున్నది. ఇది దేవుని ప్రేరేపిత వాక్యమైయున్నది, ఆ వాక్యమును అర్థము చేసికొనుటకు సహాయముచేయు పరిశుద్ధాత్మతోకూడ క్రైస్తవులు దీనిని గట్టిగా పట్టుకొనియుందురు. పెండ్లికుమారుడు వివాహపు విందుకువెళ్లు సమయమున ఆయనను స్వాగతించుటలో వెలుగును విరజిమ్ముటకు ఈ ఆత్మీయ నూనె బుద్ధిగల కన్యలకు శక్తినిచ్చును. అయితే బుద్ధిలేని కన్యకల తరగతి తమలోతాము, తమ సిద్దెలలో కావలసిన ఈ ఆత్మీయ నూనెను కలిగిలేరు. కావున ఏమి జరిగెనో యేసు ఇట్లు వివరించుచున్నాడు:

“వారు [బుద్ధిలేని కన్యకలు నూనెను] కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడియున్న వారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ‘అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని’ అడుగగా అతడు, ‘మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’ అనెను.”

క్రీస్తు తన పరలోక రాజ్యమందు వచ్చిన తరువాత, పెండ్లికుమారుడు వచ్చుటను స్తుతించుటయందు ఈ అంధకారలోకములో తమ ఆధిక్యతల వెలుగును విరజిమ్ము విషయములో నిజమైన అభిషక్త క్రైస్తవుల బుద్ధిగల కన్యకల తరగతివారు మెలకువగా ఉండిరి. అయితే బుద్ధిలేని కన్యకలద్వారా చిత్రీకరింపబడిన వారు స్వాగతించు ఈ స్తుతిని సమకూర్చుటకు సిద్ధముగా లేరు. కావున సమయము వచ్చినప్పుడు, క్రీస్తు పరలోక వివాహపు విందుకు వారికి తలుపు తీయడు. బయట అక్రమముచేయు ఇతరులతోపాటు నాశనమగుటకు ఆయన వారిని లోకముయొక్క గాఢాంధకారమున వదిలివేయును. “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి” అని యేసు ముగించును.

తలాంతులను గూర్చి ఉపమానము

ఒలీవల కొండమీద తన శిష్యులకు మూడు ఉపమానముల వరుసలో రెండవ ఉపమానమును చెప్పుచు యేసు తన చర్చను కొనసాగించును. కొన్ని రోజులు క్రితము, యెరికోలో ఉన్న సమయములో ఆయన రాజ్యము భవిష్యత్తులో ఇంకను చాలాదూరమందున్నదని చూపించుటకు మినాలనుగూర్చిన ఉపమానము చెప్పెను. ఆయన ఇప్పుడు చెప్పుచున్న ఉపమానము అటువంటి విషయములనే అనేకము కలిగియున్నను, క్రీస్తు రాజ్యాధికారమందు ప్రత్యక్షమైన కాలములో నెరవేరు దాని కార్యములను వర్ణించుచున్నది. తాము ఇంకను భూమిపై యుండగానే ఆయన “ఆస్తిని” వృద్ధిచేయుటకు ఆయన శిష్యుల పనిచేయవలెనని అది ఉదహరించుచున్నది.

యేసు ఇట్లు ఆరంభించును: “[రాజ్యమునకు సంబంధించిన పరిస్థితులు] ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును.” పరలోకమను దేశాంతరమునకు వెళ్లుటకు ముందు తన దాసులకు—పరలోక రాజ్యము కొరకైన వరుసలోగల శిష్యులకు—ఆస్తిని అప్పగించిన మనుష్యుడు యేసుయైయున్నాడు. అవి భౌతిక సంబంధమైన ఆస్తులు కాదుగాని, అవి మరెంతోమంది శిష్యులను తీసికొనివచ్చుటకు ఆయన సాగుచేసి చేవను పెంచిన క్షేత్రమును సూచించుచున్నవి.

పరలోకమునకు ఎక్కిపోవుటకు కొంచెము ముందు యేసు తన ఆస్తిని తన దాసులకు అప్పగించును. ఆయన దీనినెట్లు చేయును? భూదిగంతముల వరకు రాజ్యవర్తమానమును ప్రకటించుటద్వారా సాగుచేయబడిన క్షేత్రమందు ఎడతెగక పనిచేయుమని వారికి ఉపదేశించుటద్వారా. యేసు చెప్పునట్లుగా: “అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.”

ఎనిమిది తలాంతులు—క్రీస్తుయొక్క ఆస్తి—ఆ విధముగా వారివారి సామర్థ్యముల చొప్పున, లేక ఆత్మీయ సాధ్యతల చొప్పున దాసులకు పంచిపెట్టబడును. దాసులు శిష్యుల తరగతులను సూచించుచున్నారు. మొదటి శతాబ్దములో, అయిదు తలాంతులు పొందిన తరగతిలో నిదర్శనాధారముగా అపొస్తలులు చేరియున్నారు. అయిదు, రెండు తలాంతులు పొందిన దాసులు వీరిద్దరు తమ రాజ్యప్రచారము మరియు శిష్యులను చేయుటద్వారా వాటిని రెండింతలు చేసిరని యేసు వివరించును. అయితే ఒక తలాంతు పొందిన దాసుడు దానిని భూమిలో దాచిపెట్టును.

“బహు కాలమైన తరువాత, దాసుల యజమానుడువచ్చి వారియొద్ద లెక్కచూచుకొనెను” అని యేసు చెప్పును. 20వ శతాబ్దము వరకు, అనగా దాదాపు 1,900 సంవత్సరముల తరువాతగాని లెక్కలు చూచుటకు క్రీస్తు తిరిగి రాలేదు, కావున అది నిజముగా “బహు కాలము.” ఆ పిమ్మట ఆయనిట్లు వివరించును:

“అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని’ చెప్పెను. అతని యజమానుడు, ‘భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని’ అతనితో చెప్పెను.” ఆలాగే రెండు తలాంతులు యివ్వబడిన దాసుడును వాటిని రెండింతలుగా చేసెను, కాగా అతనుకూడ అదే మెప్పుకోలును, ప్రతిఫలమును పొందును.

అయితే, ఈ ఇద్దరు నమ్మకమైన దాసులు యజమానుని సంతోషములో ఎట్లు పాలుపంచుకొందురు? యజమానుడైన యేసుక్రీస్తు సంతోషము ఏదనగా, పరలోకమందలి తన తండ్రియొద్దకు దేశాంతరము వెళ్లినప్పుడు ఆయన రాజ్యము పొందుటయై యున్నది. ఆధునిక కాలములలోని ఆయన నమ్మకమైన దాసుల విషయానికొస్తే, తమకు మరిన్ని రాజ్య బాధ్యతలు అప్పగింపబడుటయందు వారు గొప్ప ఆనందమును కలిగియున్నారు, కాగా వారు తమ భూజీవితమును చాలించిన వెంటనే పరలోక రాజ్యమునకు పునరుత్థానము చేయబడుటద్వారా పూర్తి సంతోషమును కలిగియుందురు. అయితే మూడవ దాసుని సంగతి ఏమి?

“అయ్యా, నీవు . . . కఠినుడవని నేనెరుగుదును, గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని” ఈ దాసుడు ఫిర్యాదుచేయును. ప్రకటించుచు శిష్యులను చేయుటద్వారా సాగుచేయబడిన క్షేత్రములో పనిచేయుటకు ఈ దాసుడు ఉద్దేశ్యపూర్వకముగా నిరాకరించును. కావున యజమానుడు అతని, “సోమరివైన చెడ్డదాసుడా” అని పిలిచి అతనికి ఈ తీర్పుతీర్చును: “ఆ తలాంతును వానియొద్దనుండి తీసివేసి, . . . పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును.” ఈ చెడ్డదాసుని తరగతి వారు, బయటకు నెట్టివేయబడినవారిగా ఎటువంటి ఆత్మీయ ఆనందము లేకుండా చేయబడుదురు.

క్రీస్తు అనుచరులమని చెప్పుకొను వారందరికి ఇది ఒక గంభీరమైన పాఠమును కలిగియున్నది. ఆయన మెప్పుకోలును, ప్రతిఫలమును పొందుటకు మరియు బయటకు అంధకారములోనికి త్రోసివేయబడి చివరకు నాశనము చేయబడుటను తప్పించుకొనుటకు వారు ప్రకటించు పనిలో పూర్తి భాగమును కలిగియుండుటద్వారా తమ పరలోక యజమానుని ఆస్తిని వృద్ధిచేయుటకు తప్పక పనిచేయవలెను. ఈ విషయములో నీవు పట్టుదలతో ఉన్నావా?

రాజ్యాధికారమందు క్రీస్తు వచ్చినప్పుడు

యేసు తన శిష్యులతో ఇంకను ఒలీవల కొండమీదనే యున్నాడు. తన ప్రత్యక్షత మరియు విధానాంతముయొక్క సూచన కొరకు వారుచేసిన వినతికి జవాబిచ్చుచు, ఆయనిప్పుడు మూడు ఉపమానముల వరుసలోని చివరి దానిని వారికి చెప్పుచున్నాడు. “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును” అని ఆయన ఆరంభించును.

పరలోక మహిమయందలి దేవదూతలను మానవులు చూడలేరు. కాబట్టి మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు తన దూతలతోకూడ వచ్చుట మానవ నేత్రములకు అదృశ్యమైయుండును. ఈ విధముగా వచ్చుట 1914లో జరుగును. అయితే ఏ సంకల్పముతో? యేసు ఇట్లు వివరించుచున్నాడు: “అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.”

అనుగ్రహింపబడు వారి పక్షమునకు చేర్చబడిన వారికి ఏమి సంభవించునో వర్ణించుచు యేసు ఇట్లనును: “తన కుడివైపున ఉన్నవారిని చూచి, ‘నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.’” ఈ ఉపమానములోని గొర్రెలు క్రీస్తుతోపాటు పరలోకములో పరిపాలించరు అయితే వారు రాజ్యమును స్వతంత్రించుకొనుట అనగా దాని ప్రజలుగా ఉందురని దాని భావము. మానవజాతిని విడిపించుటకు దేవుడుచేసిన ఏర్పాటునుండి ప్రయోజనము పొందగల పిల్లలను ఆదాము హవ్వలు మొదట కనినప్పుడు “లోకము పుట్టుట” అనునది ఆరంభమాయెను.

అయితే వేరుచేయబడిన గొర్రెలు రాజుయొక్క అనుగ్రహముగల కుడివైపునకు ఎందుకు చేర్చబడిరి? దానికి రాజు ఇలా జవాబు చెప్పుచున్నాడు: “నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి; పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరి.”

గొర్రెలు భూమిపై యున్నారు గనుక, వారు అటువంటి శ్రేష్ఠమైన కార్యములను తమ పరలోక రాజుయెడల ఎట్లు చేయగలిగితిమని తెలిసికొనగోరుదురు. “ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగియై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని” వారడుగుదురు.

“మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని” రాజు వారికి జవాబిచ్చును. భూమిపై మిగిలియున్న క్రీస్తు సహోదరులు ఎవరనగా పరలోకములో ఆయనతోపాటు పరిపాలించు 1,44,000 మందియైయున్నారు. వారియెడల మేలుచేయుట, తనయెడల మేలు చేసినట్లే అని యేసు చెప్పుచున్నాడు.

ఆ పిమ్మట రాజు మేకలనుద్దేశించి ఇట్లనును: “శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు.”

అయితే మేకలు ఇట్లు ఫిర్యాదుచేయును: “ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొని యుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమి?” గొర్రెలు దేని ఆధారముగా మేలుకొరకు తీర్పుతీర్చబడుదురో దాని ఆధారముగానే మేకలు తీవ్రముగా తీర్పుతీర్చబడుదురు. “మిక్కిలి అల్పులైన వీరిలో [నా సహోదరులలో] ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని” యేసు జవాబిచ్చును.

కావున మహాశ్రమలయందు ఈ దుష్టవిధానాంతమునకు ముందుండు క్రీస్తు రాజ్యాధికార ప్రత్యక్షతా కాలము ఈ తీర్పు కాలమైయుండును. మేకలు “నిత్యశిక్షకును నీతిమంతులు [గొర్రెలు] నిత్యజీవమునకును పోవుదురు మత్తయి 24:2–25:46; 13:40, 49; మార్కు 13:3-37; లూకా 21:7-36; 19:43, 44; 17:20-30; 2 తిమోతి 3:1-5; యోహాను 10:16; ప్రకటన 14:1-3.

అపొస్తలులు ప్రశ్నించుటకు వారిని ఏది పురికొల్పును, అయితే మరింకే విషయములనుకూడ నిజముగా వారు తమ మనస్సులలో కలిగియుందురు?

యేసు ప్రవచనమందలి ఏ భాగము సా.శ. 70లో నెరవేరును, అయితే అప్పుడు ఏమి జరుగలేదు?

యేసు ప్రవచనముయొక్క మొదటి నెరవేర్పు ఎప్పుడు జరుగును, అయితే దాని పెద్దయెత్తు నెరవేర్పు ఎప్పుడు జరుగును?

మొదట మరియు చివరి నెరవేర్పులో హేయవస్తువు ఏమైయున్నది?

యెరూషలేము నాశనముతో మహాశ్రమలు వాటి చివరి నెరవేర్పును ఎందుకు కలిగియుండలేదు?

క్రీస్తు ప్రత్యక్షతను ఏ లోక సంఘటనలు గుర్తించును?

ఎప్పుడు ‘భూమిమీదనున్న సకల గోత్రములవారు విలపించుచు రొమ్ము కొట్టుకొందురు’, అయితే క్రీస్తు అనుచరులు ఏమి చేయుచుందురు?

భవిష్యత్తులోని తన శిష్యులు అంతము సమీపమగుటను వివేచించుటకు సహాయపడు ఏ ఉపమానమును యేసు చెప్పెను?

అంత్యదినములలో జీవించు తన శిష్యులకు యేసు ఎటువంటి హెచ్చరిక చేసెను?

పదిమంది కన్యకలు ఎవరిని సూచించుచున్నారు?

క్రైస్తవ సంఘము ఎప్పుడు పెండ్లికుమారునితో వివాహము కొరకు వాగ్దానము చేయబడును, అయితే పెండ్లికుమారుడు తన పెండ్లికుమార్తెను వివాహపు విందునకు తీసికొను వెళ్లుటకు ఎప్పుడు వచ్చును?

నూనే దేనిని సూచించుచున్నది, దానిని కలిగియుండుట బుద్ధిగల కన్యకలు ఏమిచేయుటకు వారిని శక్తిమంతులను చేయును?

వివాహపు విందు ఎక్కడ జరుగును?

బుద్ధిలేని కన్యకలు ఎటువంటి దివ్య ప్రతిఫలమును పోగొట్టుకొందురు, వారికి ఏమిజరుగును?

తలాంతుల ఉపమానము ఏ పాఠమును నేర్పించుచున్నది?

దాసులు ఎవరు, వారికప్పగించబడిన ఆస్తి ఏమి?

లెక్కచూచుటకు యజమానుడు ఎప్పుడు వచ్చును, ఆయన ఏమి కనుగొనును?

నమ్మకమైన దాసులు పాలుపంచుకొను సంతోషము ఏమి, మూడవ వాడైన చెడ్డదాసునికి ఏమి సంభవించును?

క్రీస్తు ప్రత్యక్షత ఎందుకు అదృశ్యమై యుండవలెను, ఆ సమయములో ఆయన ఏ పని చేయును?

ఏ భావమందు గొర్రెలు రాజ్యమును స్వతంత్రించుకొందురు?

“లోకము పుట్టుట” ఎప్పుడు జరుగును?

దేని ఆధారముగా ప్రజలు గొర్రెలుగా లేక మేకలుగా తీర్పు తీర్చబడుదురు?