కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అసంభవమని తలంచిన శిష్యుడు

అసంభవమని తలంచిన శిష్యుడు

అధ్యాయము 45

అసంభవమని తలంచిన శిష్యుడు

యేసు తీరము చేరుకునేసరికి ఎంతటి భయంకరమైన దృశ్యం! సమీపమున ఉన్న సమాధులలోనుండి ఇద్దరువ్యక్తులు అసాధారణమైన ఉగ్రరూపముతో పరుగెత్తుకొంటూ ఆయనయొద్దకు వచ్చెదరు. వారు దయ్యము పట్టినవారు. వారిలో ఒకడు మరొకని కంటె ఎక్కువక్రూరంగా ఉన్నందునను, దయ్యంయొక్క ఆధీనములో ఎక్కువకాలం బాధింపబడినందున అందరి దృష్టిని ఆకర్షిస్తాడు.

దీనస్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఎంతోకాలంనుండి సమాధుల మధ్య నగ్నంగా జీవిస్తున్నాడు. దివారాత్రులు ఎడతెరిపిలేకుండా అతడు కేకలువేయుచు రాళ్లతో తన్నుతానే కొట్టుకొనుచుండును. ఎవ్వరూ అతడున్న మార్గమున వెళ్లడానికి ధైర్యంచేయజాలనంత క్రూరంగా అతడున్నాడు. అతనిని బంధించడానికి ప్రయత్నాలు జరిగినవి, కాని అతడు సంకెళ్లను విరగగొట్టి అతని కాళ్లకున్న ఇనుపసంకెళ్లను తుత్తునియలుగా చేయును. అతనిని లోపరచుకొనుటకు ఎవనికి శక్తిలేదు.

అతడు యేసును సమీపించి, ఆయన పాదములపైపడును, అతనిలోని దయ్యములు అతనిచే యిలా కేకలు వేయించును: “యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవునిపేరట నీకు ఆనబెట్టుచున్నాను.”

“అపవిత్రాత్మ, ఈ మనుష్యుని విడిచిపొమ్ము,” అని ఎడతెగక చెప్పును. అటుపిమ్మట యేసు: “నీపేరు ఏమిటి?” అని అడుగును.

“నా పేరు సేన, యేలయనగా మేము అనేకులము” అని అతడు సమాధానమిచ్చును. తాము ఆవరించియున్నవారి బాధలనుచూచి, ఆ దయ్యములు ఉల్లసించుచు, వారిపై పిరికితనముతో మూకుమ్మడి దాడిచేయుట మూలంగా బహు సంతోషమును పొందుదురు. కాని యేసును ఎదుర్కొని, అగాధములోనికి తమ్మును పంపివేయవద్దని వారు వేడుకుంటారు. కౄరమైన దయ్యములనుకూడ జయించగల గొప్పశక్తిని యేసు కల్గియుండుటను మనము మరల చూడగలము. తమనాయకుడైన అపవాదియగు సాతానుతో పాటు తమ్మును కూడ అగాధములో పడవేయుట దేవుని అంతిమతీర్పు అని ఆ దయ్యములు ఎరిగియున్నట్లు యిది బయలుపరచుచున్నది.

సమీపమున కొండమీద యించుమించు 2,000 పందులున్న మందయొకటి మేయుచున్నది. “ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపుము,” అని దయ్యములు అడుగును. భౌతికప్రాణుల శరీరములపై దాడి చేయునప్పుడు దయ్యములు ఒకవిధమైన అసాధారణ పైశాచిక ఆనందమును పొందుచున్నట్లు కన్పించుచున్నది. ఆ పందులలోనికి ప్రవేశించుటకు యేసు వారిని అనుమతించినప్పుడు, ఆ 2,000 పందులు కొండచరియ నుండి సముద్రములోపడి మునిగిపోవును.

ఆ పందులను కాయుచున్నవాళ్లు దీనినిచూచి, ఈ వార్తను తెలియజేయుటకు పట్టణములోనికి, గ్రామములోనికి పరుగెత్తి పోవుదురు. అంతట సంభవించినదేమిటో చూడడానికి జనులు వచ్చుదురు. వారువచ్చేసరికి, అదిగో, దయ్యములు విడిచిన వ్యక్తి, బట్టలు వేసికొని, మనస్సు కుదుటపడినవాడై యేసు పాదముల చెంత కూర్చున్నాడు!.

ఆ మనుష్యుడు ఎలా బాగుచేయబడెనో చూచిన ప్రత్యక్షసాక్షులు ఆ ప్రజలకు వివరిస్తారు. పందులు ఎంత భయంకరంగా చచ్చినవోకూడ వారు తెలియజేయుదురు. అది విన్నప్పుడు, గొప్పభయము వారిని ఆవరించును. తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లి పొమ్మని వారు యేసును బతిమిలాడుదురు. కావున ఆయన దానికి అంగీకరించి పడవ ఎక్కి కూర్చొనును. తనను కూడా రానియ్యుమని దయ్యము విడిచిన వ్యక్తి యేసును వేడుకొనును. కాని యేసు అతనితో యిలా చెప్పును: “నీవు నీ యింటి వారియొద్దకు వెళ్లి, యెహోవా నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము.”

సర్వసాధారణంగా యేసు తాను స్వస్థపర్చిన వారితో, ఈ సంగతులను గూర్చి ఎవనితోను చెప్పవద్దని ఉపదేశించేవాడు, ఎందుకంటే అట్టి భావోద్రేకసంబంధమైన వార్తల మూలంగా ప్రజలు ఒక ముగింపు కొచ్చుట ఆయనకు యిష్టములేదు. కాని యిచ్చట అనుమతించడం సహేతుకమే, ఎందుకంటే యేసు బహుశ ఇప్పుడు ఈ ప్రాంతములో తాను చేరుటకు అవకాశము లేని ప్రజలకు దయ్యము విడిచిన ఈ వ్యక్తి సాక్ష్యమిచ్చును. అంతేకాదు పందులు నాశనమయ్యినందున ఎటువంటి ప్రతికూలమైన సమాచారము వ్యాపించకుండ యేసుయొక్క శక్తి మంచిని చేకూర్చునదేయని సాక్ష్యమిచ్చుటకు ఆ వ్యక్తి అచ్చట ఉండుట అవసరమే.

యేసు ఉపదేశానుసారంగా, దయ్యము విడిచిన వ్యక్తి వెళ్లును. యేసు తనకు చేసినదంతయు అతడు దెకపొలి యందంతట ప్రకటించుటకు ఆరంభించును. ప్రజలు అది విని ఎంతో విస్మయమొందుదురు. మత్తయి 8:28-34; మార్కు 5:1-20; లూకా 8:26-39; ప్రకటన 20:1-3.

▪ ఇద్దరు దయ్యము పట్టినవారుండగా, బహుశ ఒకనిపైనే అవధానము ఎందుకు నిలుపబడింది?

▪ భవిష్యత్తులో అగాధమందు పడవేయబడుదుమని దయ్యములకు తెలిసినట్లు ఏది చూపుచున్నది?

▪ మనుష్యులను, జంతువులను ఆవరించుటకు దయ్యములు ఎందుకు కోరుచున్నవి?

▪ దయ్యములు విడిచిన వానితో తాను అతనికి చేసిన దాని నంతటిని యితరులకు తెలియజెప్పుమని యేసు ఎందుకు అనుమతినిచ్చును?