కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంకను ఇవ్వబడిన దిద్దుబాటు హెచ్చరిక

ఇంకను ఇవ్వబడిన దిద్దుబాటు హెచ్చరిక

అధ్యాయము 63

ఇంకను ఇవ్వబడిన దిద్దుబాటు హెచ్చరిక

యేసు ఆయన అపొస్తలులు ఇంకను కపెర్నహూముగృహములోనే ఉండగా, ఎవరు గొప్ప అని అపొస్తలులు వాదించుకొనిన అంశముతోపాటు మరొకటికూడా చర్చించబడును. ఇదికూడా వారు కపెర్నహూముకు తిరిగివచ్చుచుండగా, యేసు వారిమధ్యలేని సమయములో జరిగియుండవచ్చును. అపొస్తలుడైన యెహాను దానిని ఇట్లు చెప్పును: “బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచుటకు” ప్రయత్నించితిమి.

యోహాను కేవలము అపొస్తలులు మాత్రమే స్వస్థపరచు బృందమని ఖచ్ఛితముగా అనుకుంటాడు. కాబట్టి ఆ మనుష్యుడు తమలోనివాడు కానందున ఆ రీతిలో సూచక క్రియలుచేయుట భావ్యంకాదని ఆయన భావించును.

అయితే, యేసువారికి ఇలా ఉపదేశించును: “వానిని ఆటంకపరచకుడి; నా పేరట ఆద్భుతముచేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

యేసు పక్షముగా నుండుటకు ఈ మనుష్యుడు ఆయనతో కూడవుండి ఆయనను వెంబడించనవసరము లేదు. క్రైస్తవ సంఘము ఇంకను ఏర్పడలేదు గనుక, వారితోకూడ ఉండకపోవుట అతడు సంఘమునుండి వేరుగా ఉన్నాడని భావము కాదు. ఆ మనుష్యుడు నిజముగా యేసు నామమందు విశ్వాసముంచి ఆ విధముగా దయ్యములను వెళ్లగొట్టగలిగెను. ఫలము పొందనర్హుడని యేసుచెప్పినదానికి అనుగ్రహపూర్వకముగా పోల్చదగిన క్రియనే అతడు చేయుచుండెను. దీనిని చేసినందుకు, అతడు తన ఫలమును పోగొట్టుకొనడని యేసు చూపించును.

అయితే ఆ మనుష్యుడు అపొస్తలుల మాటలకు, చర్యలకు అభ్యంతరపడితే అప్పుడేమి? ఇది ఎంతో గంభీరమై యుండును! యేసు ఇట్లనును: “నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు గాడిద తిప్పునంత పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.”—NW.

తమకు అభ్యంతరము కలుగజేయు చెయ్యి, పాదము, లేక కన్నువంటి తమకు ప్రియమైన దేనినైనను తమ జీవితములలోనుండి తీసివేయవలెనని యేసు తన అనుచరులకు చెప్పును. వీటిని మనస్సులో కలిగివుండి, నిత్యనాశనమునకు సూచనగాయున్న, గెహెన్నాలో (యెరూషలేముకు సమీపములో కాలుచుండు కసువుదొడ్డి) పడవేయబడుటకంటె అవి లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.

యేసు ఇంకను ఇట్లు హెచ్చరించును: “ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.” ఆ పిమ్మట నూరు గొర్రెలు కలిగియుండి అందు ఒకటి తప్పిపోయిన ఒక మనుష్యుని ఉపమానము చెప్పుచు ఆయన ఈ “చిన్నవారి” అమూల్యతను ఉదహరించును. ఆ మనుష్యుడు తప్పిపోయిన ఒక్క దానికొరకు ఈ 99 గొర్రెలను వదిలిపెట్టును గానీ దానిని కనుగొనినప్పుడు అతడు ఈ 99 గొర్రెలకంటే అధికంగా దీనినిగూర్చి సంతోషించునని యేసు వివరించును. “ఆలాగుననే, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు,” అని యేసు తనమాటలను ముగించును.

తన అపొస్తలుల మధ్యయున్న వాదమును బహుశ మనస్సు నందుంచుకొని, యేసు వారికిట్లు ఉద్బోధించును: “మీలోమీరు ఉప్పుసారము గలవారైయుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడి.” రుచిలేని ఆహారపదార్థములు ఉప్పుచే మరింత రుచికరము చేయబడును. ఆ విధముగా, సూచనార్థమైన ఉప్పు వేరొకరు చెప్పినదానిని సులభముగా అంగీకరించునట్లు చేయును. అటువంటి ఉప్పు కలిగివుండుట సమాధానము నిలుచుటకు తోడ్పడును.

అయితే మానవ అసంపూర్ణత కారణముగా, కొన్నిసార్లు గంభీరమైన వివాదములు కలుగును. అట్టి వివాదమును తీర్చుకొను మార్గదర్శక సూత్రాలనుకూడ యేసు ఇస్తున్నాడు. “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి,” అని యేసు చెప్పును. అతడు విననట్లయిన, యేసు ఇచ్చిన సలహా ఏమనగా, “ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతిమాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము.”

అతడింకను విననొల్లనియెడల చివరి ప్రయత్నముగా, ఆ విషయమును “సంఘమునకు” అనగా సంఘములోని బాధ్యతగల విచారణకర్తలుగా అతనికి న్యాయవిచారణ చేయగల వారికి “తెలియచేయుమని” యేసు చెప్పును. ఆ పాపి వారి నిర్ణయాన్ని విననియెడల, “అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము” అని యేసు ముగించును.

అటువంటి నిర్ణయము చేయునప్పుడు, విచారణకర్తలు యెహోవా వాక్యమందలి ఉపదేశములకు హత్తుకొనియుండవలెను. ఆ విధముగా, తనలో దోషము కనుగొనబడి ఒకడు శిక్షకుపాత్రుడైనట్లయిన, తీర్పు ‘పరలోకమందు అప్పటికే బంధింపబడియుండును.’ వారు దానిని “భూమిమీద విప్పినప్పుడు,” అనగా వారు అతని నిర్దోషియని కనుగొనినప్పుడు, అది అప్పటికే “పరలోకమందును విప్పబడును.” అటువంటి న్యాయనిర్ణయ పరిశీలనలలో, “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని” యేసు చెప్పును. మత్తయి 18:6-20; మార్కు 9:38-50; లూకా 9:49, 50.

యేసు దినములలో ఆయన వెన్నంటివుండుట ఎందుకు అవసరము లేకుండెను?

చిన్నవారిని అభ్యంతరపరచుట ఎంత గంభీరమైయున్నది, అటువంటి చిన్నవారి ప్రాముఖ్యతనుగూర్చి యేసు ఎట్లు దృష్టాంతపరచును?

అపొస్తలులు తమలోతాము ఉప్పు కలిగియుండవలెనని వారిని ప్రోత్సహించునట్లు యేసును బహుశ ఏది పురికొల్పును?

‘బంధింపబడుటకు’ మరియు ‘విప్పుటకు’ ఏ ప్రాముఖ్యత కలదు?