కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపవాసమును గూర్చి ప్రశ్నింపబడుట

ఉపవాసమును గూర్చి ప్రశ్నింపబడుట

అధ్యాయము 28

ఉపవాసమును గూర్చి ప్రశ్నింపబడుట

సా.శ. 30లో పస్కాపండుగకు యేసు హాజరైన దగ్గరనుండి, దాదాపు ఒక సంవత్సరము గడిచిపోయినది. అప్పటికే గత కొన్నినెలలుగా స్నానికుడైన యోహాను చెరసాలలో ఉన్నాడు. ఆయన తన శిష్యులు క్రీస్తు అనుచరులు కావలెనని కోరినను, అందరు అలా కాలేదు.

చెరసాలలో వేయబడిన యోహాను శిష్యులు కొంతమంది ఇప్పుడు యేసునొద్దకు వచ్చి, “పరిసయ్యులును మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడిగిరి.” పరిసయ్యులు తమ మతాచారముగా వారమునకు రెండుమార్లు ఉపవాసము చేయుదురు. యోహాను శిష్యులును బహుశ అటువంటి వాడుకనే అనుసరించుచుండవచ్చును. అంతేకాకుండ యోహాను చెరసాలలో వేయబడినందుకు దుఃఖముతో వారు ఉపవాసముండవచ్చును, అయితే ఈ దుఃఖమందు తమతో యేసు శిష్యులు ఎందుకు చేరలేదోయనికూడ వారు ఆలోచించుచుండిరి.

దానికి జవాబుగా యేసు వారికి ఇలా వివరించును: “పెండ్లికుమారుడు తమతోకూడ ఉండు కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు.”

యేసును పెండ్లికుమారునిగా యోహాను మాట్లాడుటను యోహాను శిష్యులు జ్ఞాపకము తెచ్చుకొనవలెను. కాబట్టి యేసు ఇచ్చట ఉండగా, ఉపవాసముండుటను యోహాను సరియైన చర్యగా తలంచడు, ఆలాగే యేసు శిష్యులును తలంచరు. ఆ తర్వాత, యేసు చనిపోయినప్పుడు, ఆయన శిష్యులు దుఃఖపడుదురు, మరియు ఉపవాసముందురు. అయితే ఆయన పునరుత్థానుడై పరలోకమునకు ఆరోహణమైనప్పుడు మాత్రము దుఃఖించుచు ఉపవాసముండుటకు వారికి ఏ కారణము ఉండదు.

అటు తర్వాత, యేసు వారికి ఈ ఉపమానములు చెప్పును: “ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసికవేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండును.” ఉపవాసముండుటకు ఈ ఉపమానములకు ఏమి సంబంధము?

ఆచారముగా ఉపవాసముండుటవంటి, యూదామత పాత అభ్యాసముల కనుగుణ్యముగా తన శిష్యులు మారవలెనని ఎవరును ఎదురుచూడకూడదను సంగతిని గుణగ్రహించుటకు యేసు, స్నానికుడైన యోహాను శిష్యులకు సహాయము చేయుచుండెను. అప్పటికే తృణీకరింపబడుటకు సిద్ధముగాయుండి పాతదై చీకిపోయిన ఆరాధనా విధానములకు అతుకువేసి కొనసాగించవలెనని ఆయన రాలేదు. మనుష్య ఆచారములతో ఆనాటి యూదామత విధానమునకు సరిపడునట్లు క్రైస్తవత్వము తయారుచేయబడదు. లేదు, అది పాతబట్టకు క్రొత్త మాసికగా, లేక పాతతిత్తిలో క్రొత్త ద్రాక్షారసముగా ఉండదు. మత్తయి 9:14-17; మార్కు 2:18-22; లూకా 5:33-39; యోహాను 3:27-29.

ఎవరు ఉపవాసముండిరి, మరియు ఏ సంకల్పముతో?

ఆయన వారితో ఉండగా యేసు శిష్యులు ఎందుకు ఉపవాసముండరు, మరియు ఆ తర్వాత త్వరలోనే ఉపవాస కారణము ఎలా అదృశ్యమగును?

ఏ ఉపమానములను యేసు వివరించెను, వాటి భావమేమి?