కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక సైనికాధికారియొక్క గొప్ప విశ్వాసము

ఒక సైనికాధికారియొక్క గొప్ప విశ్వాసము

అధ్యాయము 36

ఒక సైనికాధికారియొక్క గొప్ప విశ్వాసము

యేసు తన కొండమీది ప్రసంగము నిచ్చునాటికి, ఆయన పరిచర్యకాలములో దాదాపు సగభాగము అయిపోయినది. అనగా ఆయన భూమిమీద తన పనిని పూర్తిచేయుటకు ఆయనకు ఇంకా కేవలము ఒక సంవత్సరము తొమ్మిది నెలలు లేక ఇంకాకొద్ది కాలము మాత్రమే మిగిలియున్నది.

తన కార్యక్రమములకు ఒక విధమైన గృహస్థావరముగా ఉన్న కపెర్నహూము పట్టణములోనికి యేసు ఇప్పుడు ప్రవేశించును. ఇక్కడ యూదులలోని పెద్దలు ఆయనతో ఒక విన్నపము చేయుటకు వచ్చారు. వారు యూదుల మతమునకు వేరుగా మరొక జాతివాడును, రోమా సైన్యములో అధికారిగా పనిచేయుచున్న అన్యునిచే పంపబడిరి.

ఆ సైనికాధికారికి ప్రియమైన దాసుడొకడు బహురోగియై చావసిద్ధముగా యున్నందున, యేసు వచ్చి తన దాసుని బాగుచేయవలెనని అతడు కోరెను. ఆ అధికారి పక్షముగా యూదులు యేసునొద్దకు వచ్చి, “నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి.”

కావున తడవుచేయకుండ, యేసు వారితోకూడ వెళ్లును. అయితే వారు, సమీపించుచుండగా, ఆ సైనికాధికారి తన స్నేహితులను ఆయనయొద్దకు పంపి ఆయనతో ఇట్లు చెప్పుమనెను: “ప్రభువా, శ్రమపుచ్చుకొనవద్దు; నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు.”

ఇతరులను ఆజ్ఞాపించుటకు అలవాటుపడిన ఒక అధికారి ఎంత వినయముతో మాట్లాడెను! ఆయన బహుశ యేసు విషయమై ఆలోచించుచుండవచ్చును, యూదులు, యూదులుకాని వారితో సామాజిక సంబంధములు పెట్టుకొనుటను వారి ఆచారము నిషేధించునని అతడు గ్రహించెను. పేతురు సహితము ఇట్లు చెప్పెను: “అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియును.”

ఈ ఆచారమును భంగపరచుట వలన కలుగు పరిణామములనుబట్టి యేసు బాధపడకూడదని కోరుటవలన బహుశ, ఆ అధికారి తన స్నేహితులద్వారా ఇట్లు విన్నపము చేయును: “అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని ‘పొమ్మంటె’ పోవును, ఒకని ‘రమ్మంటె’ వచ్చును, నా దాసుని ‘చేయుమంటే’ ఇది చేయును.”

యేసు ఈ మాటలువిని ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో నైనను ఇంతగొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను.” ఆ అధికారి దాసుని బాగుచేసిన తర్వాత, యేసు ఆ సందర్భమును పురస్కరించుకొని, విశ్వాసములేని యూదులు నిరాకరించిన ఆశీర్వాదములతో విశ్వాసము చూపిన యూదులుకాని వారు ఎట్లు ఆదరింపబడుదురో వివరించును.

“అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయు నుండునని,” అయన చెప్పును.

“వెలుపటి చీకటిలోనికి త్రోయబడు . . . రాజ్యసంబంధులు” ఎవరనగా, క్రీస్తుతో పరిపాలకులుగా ఉండుటకు మొదట ఇవ్వబడిన అవకాశమును తృణీకరించిన సహజ యూదులైయున్నారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుని రాజ్య ఏర్పాటుకు ప్రాతినిధ్యమైయున్నారు. ఆ విధముగా యేసు అన్యులు పరలోక బల్లయొద్ద, అనగా “పరలోకరాజ్యమందు” కూర్చుండుటకు ఎట్లు ఆహ్వానింపబడుదురో వివరించుచున్నాడు. లూకా 7:1-10; మత్తయి 8:5-13; అపొ.కార్యములు 10:28.

ఒక అన్యుడైన సైనికాధికారి పక్షముగా యూదులు ఎందుకు విన్నపము చేయుదురు?

ఆ అధికారి యేసును తన ఇంటిలోనికి ఎందుకు ఆహ్వానించలేదో ఏది వివరించగలదు?

యేసుయొక్క ముగింపు మాటల భావమేమైయున్నది?