కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కపెర్నహూములో మరిన్ని అద్భుతములు

కపెర్నహూములో మరిన్ని అద్భుతములు

అధ్యాయము 23

కపెర్నహూములో మరిన్ని అద్భుతములు

తన మొదటి నలుగురు శిష్యులైన—పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను పిలిచిన తర్వాత విశ్రాంతి దినమున, వారందరు కపెర్నహూములోని స్థానిక సమాజమందిరమునకు వెళ్లుదురు. యేసు అచ్చట బోధింపమొదలుపెట్టి, శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడుదురు.

ఈ విశ్రాంతి దినమున దయ్యముపట్టిన ఒకవ్యక్తి అచ్చట ఉండును. కొంచెముసేపైన తర్వాత అతడు పెద్దస్వరముతో, “నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలువేసెను.”

ఆ మనుష్యుని తన ఆధీనములో ఉంచుకొనిన దయ్యము వాస్తవానికి సాతాను దూతలలో ఒకడైయున్నాడు. ఈ దయ్యమును గద్దించుచు యేసు ఇట్లనును: “ఊరకుండుము, అతనిని విడిచిపోమ్ము!”

అప్పుడా దయ్యము అతని విలవిలలాడించి గట్టిగా అరిచేటట్లు చేసి, అతనికి హానిచేయక విడిచిపోవును. ప్రతివారు విభ్రాంతినొంది, “ఇదేమిటి? . . . ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని” ఒకనితోనొకడు చెప్పుకొందురు. దీనినిగూర్చిన సమాచారము ఆ చుట్టుప్రక్కల అన్ని ప్రాంతములకు వ్యాపించును.

సమాజమందిరమును విడిచి, యేసు ఆయన శిష్యులు సీమోను లేక పేతురు ఇంటికి వెళ్లుదురు. అక్కడ పేతురు అత్త తీవ్రమైన జ్వరముతో రోగియైయుండును. ‘దయచేసి ఆమెకు సహాయము చేయుము’ అని వారు అభ్యర్థించగా, యేసు అక్కడికి వెళ్లి, చేయిపట్టుకొని ఆమెను లేవనెత్తెను. వెంటనే ఆమె స్వస్థతపొంది వారికి భోజనము సిద్ధముచేయుటకు మొదలుపెట్టెను.

ఆ తర్వాత, సూర్యుడస్తమించినప్పుడు, అన్ని ప్రాంతములనుండి ప్రజలు తమ రోగులను తీసికొని పేతురు ఇంటికి రావడం మొదలుపెట్టారు. త్వరలోనే ఆ పట్టణపు వారంత ఆ గుమ్మముయొద్ద గుమికూడుదురు. వారి రోగములు ఎట్టివైనను, యేసు ఆ రోగులనందరిని బాగుచేస్తాడు. దయ్యము పట్టినవారిని సహితము ఆయన బాగుచేస్తాడు. ఆయన వెళ్లగొట్టుచున్న దయ్యములు, విడిచిపోవుటకుముందు, “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా అరుచుట జరిగేది. అయితే యేసు వాటిని గద్దించి మాట్లాడనీయలేదు ఎందుకంటే ఆయన క్రీస్తను సంగతి వాటికి తెలియును. మార్కు 1:21-34; లూకా 4:31-41; మత్తయి 8:14-17.

యేసు తన నలుగురు శిష్యులను పిలిచిన తరువాతి విశ్రాంతి దినమున సమాజమందిరములో ఏమి జరుగును?

సమాజమందిరమును విడిచి యేసు ఎచ్చటికి వెళ్లును, అక్కడ ఆయన ఏ అద్భుతము చేయును?

ఆ పిమ్మట అదే సాయంకాలము ఏమి జరుగును?